ఫ్యామిలీ సెలూన్‌ ముసుగులో.. | Prostitution Scandal Reveals in AIG Family Saloon Hyderabad | Sakshi
Sakshi News home page

సెలూన్‌ ముసుగులో వ్యభిచారం

Published Mon, Feb 24 2020 9:49 AM | Last Updated on Mon, Feb 24 2020 9:57 AM

Prostitution Scandal Reveals in AIG Family Saloon Hyderabad - Sakshi

ఏఐజీ ఫ్యామిలీ సెలూన్‌ ఇదే

రసూల్‌పురా: ఫ్యామిలీ సెలూన్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సం ఘటన కార్ఖాన పీఎస్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.  కార్ఖాన సీఐ మధుకర్‌స్వామి కథనం మేరకు కార్ఖాన ప్రధాన రోడ్డులో అశోక్‌ అనే వ్యక్తి గత కొన్ని నెలలుగా ఏఐజీ ఫ్యామిలీ సెలూన్‌ నిర్వహిస్తున్నాడు. సెలూన్‌కు వచ్చే వారి బలహీనతలు తెలుసుకుని వారి అవసరాల కోసం  ఇతర ప్రాంతాల నుంచి యువతులను  రప్పించి భవనంలోని రెండు, మూడు అంతస్తుల్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నాడు. ఇందుకుగాను ఆకాష్‌కుమార్‌ జైస్వాల్, మరో మహిళ అతడికి సహకరిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో దాడులు నిర్వహించిన కార్ఖాన పోలీసులు  ఆకాష్‌కుమార్‌ జైస్వాల్‌ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మహిళతో పాటు నిర్వాహకుడు అశోక్‌ కోసం గాలిస్తున్నారు.  ఇద్దరు యువతులను విముక్తి కలిగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement