Prostitution scandal
-
వ్యభిచారగృహం నిర్వహిస్తున్న సినీ నటుడి అరెస్ట్
సాక్షి, బెంగళూరు: వ్యభిచార గృహం నిర్వహిస్తున్న కన్నడ నటుడు మంజునాథ్ అలియాజ్ సంజును బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాది క్రితం విడుదలైన న్యూరాన్ సినిమాలో మంజునాథ్ నటించారు. వేశ్యవాటిక నిర్వహిస్తూ యాప్ ద్వారా విటులను రప్పించేవాడు. పోలీసులు దాడి చేసి మంజునాథ్‌ను అరెస్ట్ చేశారు. చదవండి: (Tamannaah: ఆ సన్నివేశాల్లో హీరోయిన్ల కంటే హీరోలకే వణుకు) -
Hyderabad: స్పా ముసుగులో వ్యభిచారం, ఐదుగురి అరెస్టు
హస్తినాపురం: సెలూన్, స్పా ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మాంగళ్య షాపింగ్‌మాల్‌కు ఎదురుగా ఉన్న యూనిసెక్స్ సెలూన్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం అందింది. ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు సెలూన్ స్పాపై గురువారం దాడి చేసి ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4 సెల్ఫోన్లు, రూ.2,100ను స్వాధీనం చేసుకుని వారిని వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేచుకుని వారిని రిమాండ్‌కు తరలించారు. చదవండి: (Hyderabad: ఎవరికైనా చెబితే చంపేస్తా.!) -
సెల్ఫీ వీడియో తీసుకుని వ్యక్తి బలవన్మరణం
గుణదల (విజయవాడ తూర్పు): మసాజ్ పేరుతో వ్యభిచార రొంపిలోకి దింపి, అసభ్యకరంగా ఉన్న ఫొటోలను బయట పెడతామంటూ వేధింపులకు గురి చేస్తున్న ముఠా కారణంగా ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విజయవాడలోని ఓ హోటల్లో మంగళవారం జరిగింది. మాచవరం పోలీసులు తెలిపిన వివరాలు.. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన బెరవలి శ్రీకాంత్‌రెడ్డి (30) ప్రైవేటు ఉద్యోగి. రెండేళ్ల క్రితం శ్రీలత అనే యువతితో అతడికి వివాహమైంది. శ్రీకాంత్‌రెడ్డి ఉద్యోగ విధుల్లో భాగంగా కొంతకాలంగా విజయవాడ వచ్చిపోతున్నాడు. ఈ క్రమంలో చైతన్య, సత్యకుమార్, సునిల్ అనే ముగ్గురు వ్యక్తులు పరిచయమయ్యారు. వీరు శ్రీకాంత్‌రెడ్డిని ఇటీవల ఓ మసాజ్ సెంటర్‌కు తీసుకెళ్లి ఓ మహిళతో చనువుగా ఉండేలా చేశారు. అదే సమయంలో సెల్ఫోన్లో వారి ఫొటోలు చిత్రీకరించిన ఆ ముగ్గురూ.. ఫొటోలు తొలగించాలంటే తమకు భారీగా నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడికి గురైన శ్రీకాంత్‌రెడ్డి మంగళవారం బెంజి సర్కిల్లోని ఓ హోటల్లో గది తీసుకుని తన ఆవేదనంతా చెప్పుకుంటూ ఓ సెల్ఫీ వీడియో తీశాడు. అనంతరం హోటల్ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, నిందితులు ముగ్గుర్నీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
వ్యభిచార గృహంపై దాడి.. ఒక మహిళ.. మరో ఇద్దరు యువతులను..
సాక్షి, మైసూరు: వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తున్న మహిళను మైసూరు నగర పోలీసులు అరెస్టు చేశారు. ఈ మహిళ చెరలో ఉన్న మరో ఇద్దరు యువతులను రక్షించారు. విజయనగర నాల్గో ఫేజ్‌లోని ఒక ఇంటిపై సోదాలు జరిపి మహిళను అరెస్టు చేసి రూ. 31,500 నగదు, ఒక మొబైల్ ఫోన్, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. విజయనగర పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. చదవండి: (ప్రేమ వివాహం: ఐదు నెలల తర్వాత గ్రామానికి వచ్చి.. ఊరు శివార్లలో..) -
బంజారాహిల్స్: కన్న కూతురితో భిక్షాటన.. ఆపై వ్యభిచారం చేయాలని..
బంజారాహిల్స్ (హైదరాబాద్): కన్న కూతురితో భిక్షాటన చేయించడమే కాకుండా బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న తల్లిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నం. 2లోని ఇందిరానగర్‌లో నివసించే తల్లి తన కూతురు(16)తో కొంత కాలంగా భిక్షాటన చేయిస్తున్నది. (చదవండి: మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. ఎన్నిసార్లు చెప్పినా..) అమీర్‌పేట్‌లోని సాయిబాబా టెంపుల్ సమీపంలో 16 ఏళ్ల బాలిక భిక్షాటన చేయిస్తున్నదని చైల్డ్‌లైన్ 1098కు సమాచారం ఇచ్చారు. చైల్డ్‌లైన్ కో–ఆర్డినేటర్ వేదాల సాల్మన్‌రాజు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా ఆమెకు కనిపించలేదు. ఈ నెల 6వ తేదీన ఖమ్మంలో కూడా 16 ఏళ్ల బాలిక భిక్షాటన చేస్తున్నట్లుగా 1098కు మరోసారి సమాచారం సంబంధిత సిబ్బంది అక్కడికి వెళ్లి ఆమెను రెస్క్యూ చేశారు. విచారించగా తన తల్లి బలవంతంగా భిక్షాటనతో పాటు వ్యభిచారం కూడా చేయిస్తున్నదని బాలిక వెల్లడించింది. దీంతో పోలీసులు బాలికను పునరావాస కేంద్రానికి తరలించి తల్లిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. (చదవండి: ‘174 మంది బాలికలకు ఒకటే’.. సాక్షి కథనానికి విశేష స్పందన) -
మీర్పేట్లో వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్
సాక్షి, మీర్‌పేట: వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. అంబర్‌పేట పటేల్‌నగర్‌కు చెందిన నస్రీన్‌బేగం(35) కేటరింగ్ నిర్వహిస్తోంది. ఈమె టీకేఆర్ కమాన్ సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు గురువారం సాయంత్రం దాడి చేశారు. నిర్వాహకురాలు నస్రీన్బేగంతో పాటు మరో ఇద్దరు యువతులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: (14 ఏళ్ల మేనల్లుడితో శారీరక వాంఛలు.. వీడియో రికార్డ్ చేసి..) -
నిత్య పెళ్లికొడుకు :పెళ్లి పేరుతో 9 మంది మహిళలకు వల
-
నిత్య పెళ్లికొడుకు: ఒకరిద్దరు కాదు.. ఏకంగా 9 మంది..
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 9 మంది మహిళల్ని మోసగించిన నయవంచకుడి కథ విశాఖలో వెలుగులోకి వచ్చింది. గంజాయి రవాణా చేస్తూ, మహిళలను లోబరచుకుని.. వారిని వ్యభిచారం చేయాలని బెదిరిస్తున్న మోసగాడు అరుణ్‌కుమార్ ఉదంతమిది. ఏ అండా లేని మహిళలను తోడుగా ఉంటానని కొందరిని, పెళ్లి చేసుకుంటానని చెప్పి కొందరిని లోబరచుకున్నాడు. కొందరిని పెళ్లి చేసుకున్నాడు. గంజాయి రవాణా కేసులో, మహిళల్ని మోసగించిన కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. అతడి అరాచకాలను తట్టుకోలేని బాధిత మహిళలు పోలీసుల్ని ఆశ్రయించారు. మహిళా చేతన కార్యదర్శి కె.పద్మ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అతడి బండారం బట్టబయలైంది. పోలీసుల విచారణలో అరుణ్‌కుమార్ అరాచకాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు, బాధితులు చెప్పిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన ధనాల అరుణ్‌కుమార్ (33) చిన్నతనంలోనే విశాఖలో అమ్మమ్మ ఇంటికి వచ్చేశాడు. గంజాయి రవాణా చేయసాగాడు. మహిళలను ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి లోబరచుకునేవాడు. తాను పెద్ద వ్యాపారినని చెప్పి కొందరిని మోసం చేశాడు. తను చెప్పినట్లు వినకపోతే కత్తితో చంపేస్తానని బెదిరించేవాడు. ఇప్పటివరకు 9 మంది మహిళలను పెళ్లి పేరుతో మోసం చేసి.. వ్యభిచారం రొంపిలోకి దించే ప్రయత్నం చేశాడు. గతంలో అనకాపల్లికి చెందిన ఓ యువతిని పెళ్లి పేరుతో మోసం చేసి ఒకసారి, గంజాయి రవాణా కేసులో రెండుసార్లు జైలుకి వెళ్లాడు. గతంలో మహిళల అక్రమ రవాణా కేసులో కూడా నిందితుడు. అరుణ్‌కుమార్‌పై కేసు నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై డీజీపీ గౌతం సవాంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత సిబ్బందిపై ఆయన దర్యాప్తునకు ఆదేశించారు. బాధితులు వీరే.. నర్సీపట్నంలో ఇద్దరు పిల్లలున్న 40 ఏళ్ల మహిళకు గంజాయి వ్యాపారం అలవాటు చేసి భర్త నుంచి దూరం చేశాడు. వ్యాపారంలో వాటా ఇస్తానని నమ్మించి మోసం చేశాడు. చింతపల్లి సమీప గ్రామంలో 18 ఏళ్ల యువతిని వేరే ప్రాంతానికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. డబ్బు సంపాదించమంటూ ఒత్తిడి తెచ్చిన అతడిని దూరం పెట్టేందుకు ప్రయత్నించిన ఆమెను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. కొబ్బరితోట ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల మహిళతో వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు అందింది. యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. వ్యభిచారం చేయకపోతే చంపేస్తానని బెదిరిస్తుండడంతో ఆమె మహిళా సంఘాలను ఆశ్రయించింది. మృతిచెందిన తన స్నేహితుడి భార్యను లొంగదీసుకున్నాడు. వ్యభిచారం చేయకపోతే చంపేస్తాననడంతో ఆమె కూడా మహిళా సంఘాలకు తన కష్టాన్ని తెలిపింది. వీరే కాకుండా మరో నలుగురు మహిళలను పెళ్లి చేసుకుని, వ్యభిచారం చేయమని వేధిస్తున్నాడు. బాధిత మహిళలతో కలిసి బుధవారం విశాఖలో విలేకరులతో మాట్లాడిన మహిళా చేతన కార్యదర్శి కె.పద్మ.. నిత్య పెళ్లికొడుకు అరుణ్‌కుమార్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకాధికారితో విచారణ మార్చి 18న వాట్సాప్ ద్వారా సీపీ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు వచ్చింది. కంట్రోల్ రూమ్ నుంచి కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌కి కేసు పంపించారు. కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నెం.207/2021 నమోదు చేశారు. దిశా పోలీస్‌స్టేషన్‌లో ఫిబ్రవరి 18న అరుణ్‌కుమార్‌పై ఓ మహిళ ఫిర్యాదు చేశారు. వ్యభిచారం, గంజాయి రవాణా కేసులో అరుణ్‌కుమార్‌ను 2020 జూలైలో అనకాపల్లి టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి, నర్సీపట్నంలో అమ్మాయిలను మోసం చేసిన కేసులో అరెస్టయి.. ఈ ఏడాది ఫిబ్రవరి 17న బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ కేసు విచారణకు ప్రత్యేక అధికారిగా డీసీపీ–1 ఐశ్వర్య రస్తోగిని నియమించాం. – మనీష్‌కుమార్ సిన్హా, విశాఖ సీపీ -
ఈజీ మనీ కోసం జూనియర్ ఆర్టిస్ట్‌లతో..
సాక్షి, హైదరాబాద్ : ఈజీ మనీ కోసం లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టయింది. లాడ్జి నిర్వాహకుడితో పాటు మరో ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంత కాలంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి, శాపూర్ నగర్‌లోని రాఘవేంద్ర లాడ్జిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతోందనే పక్కా సమాచారంతో నిఘా వేసిన జీడిమెట్ల పోలీసులు మంగళవారం రాత్రి లాడ్జిపై దాడులు నిర్వహించారు. నాలుగు గదులలోని నలుగురు కస్టమర్లు 1) దనం సంపత్, 2) ఒగ్గు ఓబిలాష్, 3) మేరుగు సురేష్, 4) నర్రా రాజ్ కుమార్‌లతో పాటు నిర్వాహకుడు సత్యనారాయణ ఎలియాస్ రాజేష్‌ను.. మరో నలుగురు మహిళలు 1) శ్రీమతి యెడిగంటి అమన్, 2) మహాతో రాధా, 3) షేక్ సానియా, 4) షేక్ షభానాలను అదుపులోకి తీసుకున్నారు. ( సీక్రెట్ రూంలో సెక్స్ రాకెట్) పట్టుబడ్డ మహిళల్లో షేక్ హసీనా, షేక్ షభానాలు సినీ జూనియర్ ఆర్టిస్టులు కాగా, కస్టమర్ నర్రా రాజ్ కుమార్ వీఆర్ఓగా పని చేస్తున్నాడు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని జీడిమెట్ల పీఎస్ సీఐ బాల రాజు తెలిపారు. కరోనా ఉన్నందున లాడ్జ్ నడవక పోవడంతో డబ్బుల కోసం లాడ్జిలో వ్యభిచారం చేయిస్తున్నానని నిర్వాహకుడు సత్యనారాయణ ఎలియాస్ రాజేష్ తెలిపాడు. -
ఉద్యోగమిస్తామని ఊబిలోకి నెట్టారు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగం కోసం ఎక్కడినుంచో నగరానికి వచ్చిన ఓ యువతికి మాయమాటలు చెప్పి రాష్ట్రాలు దాటించి వ్యభిచార ఊబిలోకి నెట్టింది ఓ జంట. భాషకాని భాష, ప్రాంతం కాని ప్రాంతంలో ధైర్యాన్ని కూడదీసుకుని పోలీసులకు సమాచారమిచ్చి ఆ వ్యభిచార ఊబి నుంచి బయటపడింది ఓ యువతి. వివరాలిలా ఉన్నాయి. అసోంలోని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేసే ఓ యువతి కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ ప్రభావాలతో బతుకుదెరువు కోల్పోయింది. దీంతో ఉద్యోగం కోసం అసోంకు చెందిన ఓ యువతి అక్కడ్నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. లాక్డౌన్ సడలింపుల తర్వాత వచ్చిన ఆమె ఇక్కడి ఓ లాడ్జిలో బస చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేసింది. ప్రస్తుతం నగరంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఆమెకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి వచ్చి నగరంలో నివసిస్తున్న భార్యాభర్తలు సుమన్ ఖురేషీ, సోను ఖురేషీలతో పరిచయమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఉద్యోగం దొరకడం కష్టమని చెప్పి తమతో గుజరాత్‌కు వస్తే అహ్మదాబాద్ నగరంలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ యువతితో నమ్మబలికారు. వీరి మాటలు నమ్మిన ఆ యువతి వారితో వెళ్లేందు కు అంగీకరించింది. గత నెల మొదటి వారం లో యువతిని అహ్మదాబాద్ తీసుకువెళ్లిన సుమన్, సోనులు అక్కడి వత్వా ప్రాంతంలో ని ఓ లాడ్జిలో ఉంచి సదరు భార్యాభర్తలు తమకు పరిచయస్తుల్ని విటులుగా తీసుకొచ్చేవారు. ఆ పని చేయడానికి యువతి నిరాకరించడంతో బెదిరింపులకు దిగారు. ఆ యువతి మొబైల్ లాక్కుని స్విచ్ఛాప్ చేసేశారు. ఈ క్రమంలో గత శనివారం రాత్రి ధైర్యం చేసి తన ఫోన్ చేజిక్కించుని పోలీసులకు సమాచారమందించింది. దీంతో వత్వా పోలీసులు రంగంలోకి దిగి యువతిని రక్షించారు. బాధితురాలు చెప్పిన వివరాల ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేసుకు న్నారు. బాధితురాలు అస్సామీ తప్ప మరో భాష మాట్లాడలేకపోవడంతో ఓ దుబాసీని ఏర్పాటు చేసి బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశారు. కాగా నిందితుల్లో ఒకరైన సోను ఖురేషీ తప్పించుకునే ప్రయత్నంలో ఖోఖ్రా ప్రాంతంలో పోలీసులకు చిక్కాడు. నిందితురాలు సుమన్ ఖురేషీ కోసం పోలీసు లు గాలిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఓ బృందాన్ని హైదరాబాద్ పంపడానికి వత్వా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నిందితులంతా కలసి సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు అహ్మదాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు. వత్వాలో నిందితులకు సహకరించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. -
‘ప్రేమ్’నగర్లో పోలీసుల దాడి
సిరిసిల్లక్రైం: బాలికలను వేరే ప్రాంతాల నుంచి తీసుకువచ్చి వేశ్యవృత్తిలోకి దింపుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు సిరిసిల్లలోని ప్రేమ్‌నగర్‌లో సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఆరేళ్ల క్రితం ఓ యువతికి విద్యాబుద్ధులు నేర్పిస్తామని నమ్మబలికి వ్యభిచార వృత్తిలోకి దింపడం.. ఈ విషయమై సదరు యువతి తన కుటుంబీకులకు సమాచారం ఇవ్వడం ఆదివారం రాత్రి జరిగింది. దీంతో ‘సాక్షి’లో ‘యువతికి విముక్తి’ శీర్షికన సోమవారం కథనం ప్రచురితమైంది. ఇదే సమాచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు సిరిసిల్లలోని వేశ్యగృహాలపై దాడులు నిర్వహించారు. ఆ గృహాల్లో ఉన్నవారి నివాస ధ్రువీకరణ పత్రాలు విధిగా ఇవ్వాలని పోలీస్ అధికారి ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మైనర్లతో ఇలాంటి పనులు చేయిస్తే చట్టపరిధిలో చర్యలకు వెళ్తామని, బతుకుదెరువు కోసం ఇతర వృత్తుల్లో నైపుణ్యం పెంచుకోవాలని, సమాజంలో మంచి వ్యక్తులుగా తయారవ్వాలని, సదరు కాలనీవాసులపై నిఘా ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. సమాజంలో గౌరవంగా బతకాలి : రూరల్ సీఐ సర్వర్ తంగళ్లపల్లి(సిరిసిల్ల): పడుపు వృత్తిని నిర్వహిస్తూ అందరిచే చీత్కారాలకు గురై సమాజంలో చీడపురుగుల మారకుండా.. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని అందరూ మెచ్చుకునే విధంగా గౌరవంగా బతకాలని రూరల్ సీఐ సర్వర్ అన్నారు. బుధవారం మండల కేంద్రలోని మానేరువాగు సమీపంలో గల వేశ్యగృహాలపై రూరల్ సీఐ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన మహిళలు, యువతులు, చిన్నారులు ఎవరైనా ఉన్నారా అని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ప్రతీ ఇంట్లో ఎంత మంది ఉంటున్నారో అడిగి, వారి ఆధార్‌కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు పరిశీలించారు. పడుపు వృత్తిని వీడనాడాలని కొత్త జీవితాలను ప్రారంభించాలని వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి మహిళలు, యువతులు, చిన్నారులను తీసుకురావాడం, పడుపు వృత్తిని నిర్వహించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని గౌరవంగా బతకాలని సూచించారు. పోలీస్ ఆకస్మిక తనిఖీలు ఇకపై ఎప్పుడూ కొనసాగుతాయని, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో తంగళ్లపల్లి ఎస్సై అభిలాష్, హెడ్ కానిస్టేబుల్ బుచ్చినాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. చైల్డ్వెల్ఫేర్ ఆధ్వర్యంలో తనిఖీ.. ఇతర ప్రాంతాల నుంచి యువతులు, చిన్నారులను తీసుకవచ్చి బలవంతంగా వారిచే పడుపు వృత్తి నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు బుధవారం సాయంత్రం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు తంగళ్లపల్లి వేశ్యావాటికలను సందర్శించి తనిఖీలు నిర్వహించారు. వారి నుంచి సమాచారం సేకరించారు. -
ఉద్యోగాలు ఇప్పిస్తామని..
కీసర: సామాజిక మాధ్యమాల ద్వారా అందమైన యువతుల ఫొటోలు చూపుతూ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను కీసర పోలీసులు, మాల్కాజ్‌గిరి ఎస్ఓటీ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కీసర సీఐ నరేందర్‌గౌడ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన వంశీరెడ్డి, విజయవాడకు చెందిన అంజలీ, చిన్నలతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఈ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను నగరానికి రప్పించి బల్కంపేటలోని ఓ ఇంట్లో నిర్భందించి, వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో సదరు యువతల ఫొటోలను పంపి విటులను ఆకర్షించేవారు. అనంతరం విటుల నుంచి ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకుని అమ్మాయిలను సరఫరా చేసేవారన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం వంశీరెడ్డి నలుగురు యువతులను తీసుకొని నాగారం రాంపల్లిచౌరస్తాకు వచ్చినట్లు సమాచారం అందడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాచేతిలో బంధీలుగా ఉన్న పశ్చిమబెంగాల్‌కు చెందిన ముగ్గురు, విజయవాడకు చెందిన ఒక యువతిని కాపాడి పునరావాస కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. ముఠా నిర్వాహకురాలు అంజలి, ఆమె సహాయకుడు చిన్న పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలో పట్టుకుంటామని సీఐ తెలిపారు. రాచకొండ సీపీ మహేష్‌భగవత్ పర్యవేక్షణలో అడిషనల్ డిప్యూటి కమిషనర్ సురేందర్‌రెడ్డి, ఆధ్వర్యంలో మల్కాజ్గిరి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ నవీన్‌కుమార్, కీసర సీఐ నరేందర్‌గౌడ్ , ఎస్సై శ్రీకాంత్ దాడుల్లో పాల్గొన్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
మైనర్‌ను వ్యభిచారంలోకి..
ప్రకాశం ,కందుకూరు:కందుకూరు ప్రాంతంలో రహస్యంగా వ్యభించారం నిర్వహిస్తూ బాలికతో బలవంతంగా వ్యభించారం చేయిస్తున్న ఓ ముఠాను అరెస్టు చేసినట్లు దిశ పోలీసుస్టేషన్ డీఎస్పీ ధనుంజయులు మంగళవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కందుకూరు పోలీసులతో కలిసి విచారణ చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మరికొంత మందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు. డీఎస్పీ కథనం ప్రకారం.. కావలి సమీపంలోని ముసునూరు ప్రాంతానికి చెందిన ఓ బాలిక తల్లిదండ్రుల మధ్య వివాదం కారణంగా తన అన్న, వదినల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఆమె వదిన జ్యోతి బాలికను సింగరాయకొండకు చెందిన కె. మాధవి అనే వ్యవభిచార నిర్వాహకురాలికి రూ.27 వేలకు అమ్మేసింది. మాధవి కందుకూరు శివారు ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని రహస్యంగా వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బాలికతో కూడా బలవంతంగా వ్యభిచారం చేయిస్తోంది. ఎలాగోలా బాలిక 100 కాల్ చేసి తన గోడు వెళ్లబోసుకుంది. ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు కందుకూరు పోలీసులు రెండు రోజుల క్రితం ఆ ఇంటిపై దాడి చేసి బాలికను రక్షించారు. స్థానిక ఏరియా వైద్యశాలలో బాధితురాలికి చికిత్స అందించారు. అనంతరం ఈ కేసును దిశ చట్టం కింద డీఎస్పీ ధనుంజయులుకు అప్పగించారు. ఆయన మంగళవారం విచారణ చేపట్టారు. బాలిక నుంచి వివరాలు తెలుసుకోవడంతో పాటు ఈ వ్యభిచార కూపంలో ఎవరెవరు ఉన్నారు? బాలికతో వ్యభిచారం చేయించిన మాధవితో పాటు, ఆమె వదిన జ్యోతిని మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార ముఠాతో ఇంకా ఎంతమందికి సంబంధం ఉంది, ఇంకెవరెరు ఈ ముఠాలో ఉన్నారనే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. -
యాంకర్లు బస చేసిన హోటల్స్‌పై దృష్టి
సాక్షి, మచిలీపట్నం: ‘బందరులో హైటెక్ వ్యభిచారం’ అనే శీర్షకన సాక్షిలో ప్రచురితమైన కథనం చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఈ తరహా విష సంస్కృతి విస్తరిస్తుందన్న కథనం రాజకీయ, పోలీస్ వర్గాల్లో కలకలం రేపింది. ఈ వ్యవహారాన్ని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు సీరియస్‌గా తీసుకున్నారు. లోతైన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని బందరు డివిజన్ పోలీస్ అధికారులను ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన చిలకలపూడి పోలీసులు నగరంలోని లాడ్జీల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. యాంకర్లు బస చేసినట్టుగా ఆరోపణలు వచ్చిన హోటల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎంత కాలం క్రితం వచ్చారు. ఎందుకొచ్చారు. ఎన్ని రోజులున్నారో ఆరా తీశారు. మరొక వైపు పట్టణ, పరిసర ప్రాంతాల్లో ఉన్న అపార్టుమెంట్లలో కూడా సోదాలు నిర్వహించారు. విచారణ జరుపుతున్నాం: రవీంద్రనాథ్‌బాబు, జిల్లా ఎస్పీ ప్రశాంతమైన బందరు నగరంలో హైటెక్ వ్యభిచారం జరిగే అవకాశాలు లేవు. సాక్షిలో వచ్చిన కథనంపై సమగ్ర విచారణ జరపుతున్నాం. ప్రత్యేక బృందాలతో నగరంలోని లాడ్జీలు, అపార్టుమెంట్లు సోదాలు చేస్తున్నారు. -
యాంకర్లతో రాసలీలలు?
సాక్షి, మచిలీపట్నం: జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో హైటెక్ వ్యభిచారం చాపకింద నీరులా విస్తరిస్తోంది. హోటల్స్, అపార్టుమెంట్లు, నగర శివారుల్లోని ఇండిపెండెంట్ హౌస్‌లలో ఈ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. వాట్సప్‌లలో అమ్మాయిల ఫొటోలు పంపడం.. నచ్చితే కోరుకున్న సమయానికి కోరుకున్న చోటకు వార్ని పంపిస్తూ రెండు చేతూలా ఆర్జిస్తున్నారు. గంటలు.. రోజుల తరబడి కూడా బుకింగ్‌లు జరుగుతున్నాయంటే ఏ స్థాయిలో ఇక్కడ వ్యభిచారం సాగుతుందో అర్థం చేసుకో వచ్చు. కొన్ని హోటల్స్ అందుకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ముఖ్యంగా నగరం నడిబొడ్డులోని ఓ ప్రముఖ హోటల్లో దర్జాగా ఈ వ్యాపారం సాగుతోంది. అందుకోసం ఈ హోటల్లో కొన్ని రూమ్‌లను రిజిస్ట్రర్ చేయకుండా అన్‌రిజిస్ట్రర్ కోటాలో వదిలివేస్తారు. ఈ హోటల్లో ఐదారుగురు అమ్మాయిలు ఎప్పుడూ ఉంటారని, వారిని బుక్ చేసుకుంటే హోటల్లో రూమ్ కూడా ఫ్రీగా ఇస్తుంటారని వినికిడి. (జూబ్లీహిల్స్ వ్యభిచార గృహంపై దాడి) గంటకు రూ.3వేలు నుంచి.. గంటకు రూ.3వేల నుంచి 5వేలు, ఒక రాత్రికి రూ.5 నుంచి 10 వేల వరకు బుకింగ్‌లు జరుగుతున్నాయని సమాచారం. ఇక హౌసింగ్ బోర్డు కాలనీ, భాస్కరపురం తదితర ప్రాంతాల్లో కొన్ని అపార్టుమెంట్లలో అద్దెకు తీసుకున్న ప్లాట్లలో కూడా ఈ తరహా వ్యభిచారం సాగుతోందని చెబుతున్నారు. ఇక నగర శివారుల్లో ఇండిపెండెంట్ హౌసుల్లో కూడా ఈ తరహా వ్యభిచారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోందని తెలుస్తోంది. ఎక్కువగా 18 నుంచి 25 ఏళ్ల లోపు యువతులను విజయవాడ, గుడివాడ తదితర పట్టణాల నుంచి ఇక్కడకు తీసుకొచ్చి నగరంలో రుచిమరిగిన విటులకు వారి ఫొటోలను పంపి వారి కోరికలు తీరుస్తున్నారు. నగరంలో యువతనే టార్గెట్ చేస్తూ ఈ వ్యాపారం సాగిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు కంటే ఇప్పుడు ఎక్కువైందని చెబుతున్నారు. ఈ మధ్య ఓ చానల్లో పనిచేసే సిబ్బంది ఒకరు తన ఇంట్లోనే వ్యభిచారం చేయిస్తూ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. యాంకర్లతో రాసలీలలు? టీవీల్లో చిన్న చితకా పాత్రల్లో నటించిన నటులు, యాంకర్లను బుక్ చేసుకుని నగరానికి తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. స్థానిక హోటల్స్‌లో వీరికి బస ఏర్పాటు చేసి తమకు కావాల్సినప్పుడు తమకు కావాల్సిన చోటకు తీసుకెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన బీచ్ ఫెస్టివల్స్‌లో నిర్వహించిన ఈవెంట్స్‌లో పాల్గొన్న యాంకర్లలో ఒకర్ని సంబరాల రాంబాబు ఇటీవలే నగరానికి తీసుకొచ్చి బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో నాలుగురోజుల పాటు ఉంచి ఎంజాయి చేశారని విశ్వసనీయ సమాచారం. ఆ యాంకర్ ఉన్న మాట వాస్తవమేనని, రోజు ఎవరో కారులో వచ్చి ఆమెను తీసుకెళ్లే వారని వారెవరని తమకు తెలియదని ఆ హోటల్లో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. నగరంలో జరిగే ఈ హైటెక్ వ్యభిచారం కోసం స్థానిక పోలీస్ స్టేషన్లలో సమాచారం ఉన్న వారు తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
వ్యభిచార రొంపిలోకి బాలిక
నెల్లూరు(క్రైమ్): ఓ బాలిక(మైనర్) ఆర్థిక ఇబ్బందులతో ఉందని గ్రహించిన ఓ ముఠా నగదును ఆశగా చూపి ఆమెను వ్యభిచార రొంపిలోకి దించారు. సుమారు ఆరు నెలలుగా బాలికను విటుల వద్దకు పంపుతూ సొమ్ముచేసుకోవడంతోపాటు ఆమెను ఇబ్బందులకు గురిచేయసాగారు. దీంతో బాధిత బాలిక ముఠా కళ్లుగప్పి పరారై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ముఠాలోని నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి మూలాపేటలోని నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ డీఎస్పీ వై.హరినాథ్‌రెడ్డి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం నిజమాబాద్ జిల్లా కేంద్రంలో ఓ బాలిక కుటుంబం నివాసం ఉంటోంది. తండ్రి కుటుంబాన్ని వదిలి మహారాష్ట్రకు వెళ్లిపోవడంతో ఆమె కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోసాగింది. పూట గడవడం కష్టంగా మారింది. దీంతో సదరు బాలిక సుమారు ఆరు నెలల క్రితం విజయవాడలోని తన పిన్ని ఇంటికి వచ్చి ఉండసాగింది. అక్కడ రామకృష్ణ అలియాస్ కృష్ణ అతని భార్య ఆమెకు పరిచయం అయ్యారు. ఆమె తన ఆర్థిక పరిస్థితిని వివరించి పని చూపించమని వారిని కోరింది. అయితే వారు తాము చెప్పినట్లు వింటే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని నమ్మించి బాలికను వ్యభిచార కూపంలోకి దించారు. విజయవాడలో కొంతకాలం ఉంచి అనంతరం లాక్డౌన్ ముందుగా బాలికను నెల్లూరులోని హరనాథపురంలో ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఓ మహిళ వద్ద ఉంచారు. కృష్ణ దంపతులు, మహిళ, ఆమె తమ్ముడు పృథ్వీరాజ్, మరిది వినయ్‌కుమార్ తమకు తెలిసిన వారి వద్దకు బాలికను పంపి సొమ్ము చేసుకోసాగారు. బాలికకు డబ్బులు కూడా ఇచ్చే వారు కాదు. బాలిక తన తల్లి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా వారు అడ్డుకోసాగారు. ఈ క్రమంలో ఈ నెల 29వ తేదీన బాలికను నిర్వాహకులు కారులో ఎక్కించుకుని మైపాడు వద్ద వదిలిపెట్టారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న కె.శ్రీనాథ్ (తలారి) ఆమెను బైక్‌పై ఎక్కించుకుని వెళ్లి తన శారీరక వాంఛ తీర్చుకున్నాడు. శ్రీనాథ్ అర్ధరాత్రి అయిన తర్వాత తిరిగి ఆమెను నిర్వాహకుల వద్ద వదిలివెళ్లాడు. వారు కారులో ఎక్కించుకుని నెల్లూరుకు బయలుదేరారు. ఇందుకూరుపేట మండల పరిధిలోని మొత్తలు వద్ద వారు కారు ఆపి మూత్రవిసర్జనకు వెళ్లగా బాలిక తప్పించుకుంది. ఈ మేరకు బాధిత బాలిక ఈ నెల 30వ తేదీ ఇందుకూరుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు జరిగిన విషయాన్ని ఎస్పీ భాస్కర్‌భూషణ్ దృష్టికి తీసుకెళ్లి ఆయన సూచనల మేరకు కేసు నమోదు చేశారు. రూరల్ డీఎస్పీ వై.హరినాథ్‌రెడ్డి నేతృత్వంలో నెల్లూరు రూరల్ సీఐ కె.రామకృష్ణ, ఇందుకూరుపేట ఎస్ఐ పి.నరేష్, మహిళా ఎస్ఐ ఆదిలక్ష్మి, సిబ్బంది నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాన నిందితులు రామకృష్ణ, అతని భార్య పరారు కాగా మిగిలిన వారు 31వ తేదీ సాయంత్రం కొరుటూరు వద్ద ఉండగా వారిని అరెస్ట్ చేశామని డీఎస్పీ తెలిపారు. సూత్రదారుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ వెల్లడించారు. కేసును త్వరితగతిన చేధించిన సీఐ కె.రామకృష్ణ, ఇందుకూరుపేట ఎస్ఐ పి.నరేష్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. పూర్తిస్థాయి విచారణ ఈ వ్యవహారంలో జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి పాత్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని విలేకరులు డీఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. పోలీసు అధికారి పాత్రపై ఆరోపణలు వచ్చిన మాట మాత్రం వాస్తవమేనని, అయితే ప్రాథమిక విచారణలో అతని ప్రమేయం లేదని డీఎస్పీ తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని, విచారణలో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తప్పవని డీఎస్పీ స్పష్టం చేశారు. -
ఉద్యోగం పేరుతో వ్యభిచార రొంపిలోకి..
అనంతపురం క్రైం: ఉద్యోగం పేరుతో అమాయకురాలిని వ్యభిచార రొంపిలోకి దింపేందుకు ప్రయత్నించిన మహిళపై అనంతపురం త్రీటౌన్ పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారు. సీఐ రెడ్డప్ప తెలిపిన వివరాలివీ.. అనంతపురం రూరల్ పరిధిలోని ఒక ప్రాంతంలో రెండు నెలల కిందట పద్మావతి అలియాస్ దస్తగిరమ్మ అనే మహిళ నివాసముంటోంది. తన ఇంటి సమీపంలో ఉంటున్న ఓ అమ్మాయి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుండటం గమనించింది. తనకు ప్రొద్దుటూరులో తెలిసిన వారున్నారని, అక్కడికొస్తే ఉద్యోగం ఇప్పిస్తానని, భవిష్యత్తు బాగుంటుందని తెలపడంతో ఆ అమ్మాయి నమ్మింది. ఇంట్లోఎవరికీ చెప్పకుండా పద్మావతి వెంట ప్రొద్దుటూరుకు వెళ్లింది. విషయం తెలియకపోవడంతో అమ్మాయి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రొద్దుటూరులో ఉద్యోగం చూపిస్తానని తీసుకెళ్లిన పద్మావతి వ్యభిచార వృత్తి చేసుకుంటే కావలసినంత సంపాదన వస్తుందని అమ్మాయికి ఆశ చూపింది. తాను అలాంటి పని చేయనని చెప్పినా ఎలాగైనా ఆ రొంపిలోకి దించేందుకు శతవిధాలా ప్రయత్నించింది. ఎలాగోలా ఆమె నుంచి అమ్మాయి తప్పించుకుంది. అప్పటికే లాక్డౌన్ అమలులో ఉండటంతో ప్రొద్దుటూరులోనే ఇరుక్కుపోయింది. అమ్మాయి ఆచూకీ తెలుసుకున్న త్రీటౌన్ సీఐ రెడ్డప్ప తన బృందంతో వెళ్లి అనంతపురం తీసుకొచ్చారు. పద్మావతిపై ఉమెన్ ట్రాఫికింగ్ (అమ్మాయిల తరలింపు) కేసు నమోదు చేశారు. -
వ్యభిచార ముఠా గుట్టు రట్టు
తూర్పుగోదావరి, కాకినాడ రూరల్: నగర శివారు తిమ్మాపురం గ్రామ పంచాయతీ అవంతి నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో గుట్టుగా సాగుతున్న వ్యభిచార దందాను తిమ్మాపురం పోలీసులు రట్టు చేశారు. తిమ్మాపురం పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కాకినాడ డీఎస్పీ భీమారావు, కాకినాడ రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ ఈ వివరాలు వెల్లడించారు. దుర్గాడకు చెందిన కొటికలపూడి రాజు, చీడిగ గ్రామానికి చెందిన వాసంశెట్టి ఇందిరా ప్రియదర్శిని కలిసి ఫ్యామిలీ పేరుతో అవంతి నగర్లో అద్దెకు ఇల్లు తీసుకున్నారు. గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన అప్పాజీ, బెంగళూరుకు చెందిన ఏజెంట్ రాజేష్‌ల ద్వారా అమ్మాయిలను రప్పించి గుట్టుగా వ్యభిచార దందా సాగిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందే బెంగళూరు నుంచి రప్పించిన ఇద్దరు అమ్మాయిలను అడ్డం పెట్టుకుని కాకినాడ చుట్టుపక్కల వ్యక్తులను ఫోన్ల ద్వారా రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో సీఐ మురళీకృష్ణ, ఎస్సై విజయ్‌కుమార్, సిబ్బంది దాడి చేసి నిర్వాహకులను పట్టుకున్నారు. మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. ఇద్దరు బెంగళూరు అమ్మాయిలకు విముక్తి కల్పించారు. నిందితుల్లో ఏజెంట్ రాజేష్, కొటికలపూడి రాజు, ప్రియదర్శిని, గుర్తేడుకు చెందిన సతీష్, కొత్తపల్లికి చెందిన అప్పాజీ, కరపకు చెందిన పెంకే శ్రీనుబాబు, విటులు పంపన రాముడు, దబరిక సూరిబాబు ఉన్నారు. వీరిలో ఐదుగురిని అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు రాజేష్‌తో పాటు సతీష్, అప్పాజీలు పరారీలో ఉన్నారు. అరెస్టు అయిన వారిని కోర్టులో హాజరు పరుస్తామని, బెంగళూరుకు చెందిన ఇద్దరు అమ్మాయిలను బాధితులుగా గుర్తించి నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పరిచారు. వారి ఉత్తర్వుల ప్రకారం ఆ అమ్మాయిలను ప్రొటెక్షన్ హోమ్‌కు పంపుతామని డీఎస్పీ తెలిపారు. వ్యభిచార రాకెట్ గుట్టు రట్టు చేసిన సీఐ, ఎస్సైలతో పాటు సిబ్బంది శ్రీనివాసరావు, సూర్యచంద్ర, మొహిద్దీన్, శిరీష, ఐడీ పార్టీ సిబ్బంది సత్యనారాయణ, ప్రసాద్‌బాబు, రవికుమార్, నారాయణరెడ్డిలను డీఎస్పీ అభినందించారు. -
ఫ్యామిలీ సెలూన్ ముసుగులో..
రసూల్‌పురా: ఫ్యామిలీ సెలూన్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సం ఘటన కార్ఖాన పీఎస్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. కార్ఖాన సీఐ మధుకర్‌స్వామి కథనం మేరకు కార్ఖాన ప్రధాన రోడ్డులో అశోక్ అనే వ్యక్తి గత కొన్ని నెలలుగా ఏఐజీ ఫ్యామిలీ సెలూన్ నిర్వహిస్తున్నాడు. సెలూన్‌కు వచ్చే వారి బలహీనతలు తెలుసుకుని వారి అవసరాల కోసం ఇతర ప్రాంతాల నుంచి యువతులను రప్పించి భవనంలోని రెండు, మూడు అంతస్తుల్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నాడు. ఇందుకుగాను ఆకాష్‌కుమార్ జైస్వాల్, మరో మహిళ అతడికి సహకరిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో దాడులు నిర్వహించిన కార్ఖాన పోలీసులు ఆకాష్‌కుమార్ జైస్వాల్‌ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మహిళతో పాటు నిర్వాహకుడు అశోక్ కోసం గాలిస్తున్నారు. ఇద్దరు యువతులను విముక్తి కలిగించారు. -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
ఘట్కేసర్: గుట్టుచప్పుడు కాకుండా ఓ అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న విషయం తెలుసుకుని పోలీసులు దాడులు నిర్వహించి ముగ్గురు బంగ్లాదేశ్ యువతులకు విముక్తి కలిగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చౌదరిగూడలోని సాయినగర్‌కాలనీలో సురేందర్ మూర్తి, రాజేశ్వరి దంపతులు గత కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారని గురువారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందింది. మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి ఘట్కేసర్ పోలీస్ సిబ్బందితో కలిసి ఇంటి పరిసరాలను పరిశీలించారు. ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ విటుడిగా పరిచయం చేసుకుని ఇంట్లోకి ప్రవేశించడంతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అతని సమాచారం మేరకు పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న సురేందర్ మూర్తి(37), రాజేశ్వరి(34) దంపతులను, బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. సురేందర్ మూర్తి, రాజేశ్వరి దంపతులను విచారించగా బంగ్లాదేశ్‌కు చెందిన అభిజిత్,ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహేశ్‌లకు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాడుల్లో భాగంగా ఒక సెల్‌ఫోన్, రూ.5100 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అభిజిత్, మహేశ్‌లను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. దంపతులతో పాటు బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు యువతులను స్టేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉందని తెలిపారు. -
స్పా ముసుగులో వ్యభిచారం
కేపీహెచ్‌బీకాలనీ: కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో స్పా, సెలూన్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో కేపీహెచ్‌బీ పోలీసులు ఆకస్మికంగా దాడిచేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 9 సెల్ఫోన్లు, లక్షకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీకాలనీ 6వ ఫేజ్‌లో వెంపటి సతీష్ గ్లో వెల్ ఫ్యామిలీ స్పా అండ్ సెలూన్‌ను నిర్వహిస్తున్నాడు. ఇందులో ఓ మహిళా రిసెప్షనిస్ట్‌ను నియమించి స్పా ముసుగులో ఇతర ప్రాంతాలకు చెందిన మహిళలను రప్పించి వ్యభిచార కేంద్రాన్ని నడుపుతున్నాడు. విశ్వసనీయంగా అందిన సమాచారంతో కేపీహెచ్‌బీ పోలీసులు శనివారం రాత్రి స్పాపై ఆకస్మికంగా దాడి నిర్వహించి నిందితుడు వెంపటి వెంకటేశ్‌తో పాటు పలువురు విటులను, ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. -
కాటేసిన కాసుల వల
గుంటూరు:భర్తకు దూరమై ఒంటరిగా బతుకుతున్న ఆ మహిళ తన కొడుకును ఉన్నతంగా తీర్చిదిద్దాలని భావించింది. కానీ ఆ తల్లి ఆర్థిక పరిస్థితులు అందుకు సహకరించవని నిర్ధారించుకుంది. అప్పుల బాధలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సమయంలో ఓ వ్యభిచార గృహ నిర్వాహకురాలి ఉచ్చులో పడింది. తాను పుండైనప్పటికీ కుమారుడికి పండంటి జీవితాన్ని ఇవ్వాలని ఆకాంక్షించింది. కాసుల కోసం చీకటి గదిలో కన్నీటిని దిగమింగింది. కానీ ఆ చిల్లర డబ్బుల కోసం తానే చితిపైకి చేరుతుందని ఊహించలేకపోయింది. డబ్బులు అడిగిన నేరానికి నమ్మకంగా వ్యభిచారవృత్తిలోకి దించిన మహిళ, ఆమె భర్త, మరో వ్యక్తి కలిసి ఆమెను మట్టుబెట్టారు. కొడుకును ఉన్నతంగా చూసుకోకుండానే కాటికి పంపించారు. హతమార్చిందిలా ... విశ్వసనీయ సమాచారం ప్రకారం... పిడుగురాళ్లకు చెందిన ఓ వివాహిత మూడేళ్ల క్రితం భర్తతో ఏర్పడిన వివాదాలతో ఎనిమిదేళ్ల కుమారుడితో కలసి వేరుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. అయినా కుమారుడ్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని భావించింది. ఏ పని చేసినా కుటుంబం గడవడానికే సరిపోవడం లేదు. ఈ క్రమంలో నరసరావుపేటలో వ్యభిచార గృహ ఓ నిర్వాహకురాలు పరిచయమైంది. ఆమె వద్దకు వెళ్లగా మూడు రోజులపాటు నరసరావుపేటలోనే ఉంచింది. ముందుగా ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వాలని సదరు మహిళ కోరింది. వ్యభిచార నిర్వాహకురాలు చెప్పినంత డబ్బులు చెల్లించకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నిర్వహకురాలి భర్త కూడా వివాహితను దుర్భాషలాడారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వివాహిత హెచ్చరించింది. పోలీసుల వద్దకు వెళితే సమస్య వస్తుందని నిర్వాహకురాలు భయపడింది. దీంతో ఆమెను మట్టుబెట్టాలని పథకం రచించారు. ఈ ఏడాది జనవరి రెండో వారంలో డబ్బు ఇస్తామని నమ్మించి వివాహితను నరసరావుపేట పిలిపించారు. పార్టీ చేసుకుందామని నమ్మించి వ్యభిచార నిర్వాహకురాలు, ఆమె భర్త, ఓ విటుడు, వివాహితను గుత్తికొండ పరిసర ప్రాంతంలోని సాగర్ కాలువ వద్దకు తీసుకెళ్లారు. కాలువ గట్టున అందరూ మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న వివాహితను నిర్ధాక్షిణ్యంగా వ్యభిచార నిర్వాహకురాలు, ఆమె భర్త కాలువలోకి నెట్టేశారు. వివాహిత మృతి చెంది నీటిలో కొట్టుకుపోయిందని నిర్ధారించుకున్న అనంతరం అక్కడ నుంచి వెళ్లారు. గతంలోను ఇదే తరహాలో.. సుమారు పదేళ్ల కిరతం చిలకలూరిపేటలో వ్యభిచార వృత్తి నిర్వహించడానికి వచ్చిన ఓ యువతిని సదరు నిర్వాహకురాలు హత్య చేసినట్టు గుర్తించారు. చిలకలూరిపేట రూరల్ స్టేషన్లో ఈమెపై హత్య కేసు నమోదైనట్టు పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. వెలుగు చూసిందిలా... తమ కుమార్తె నరసరావుపేటకు వచ్చి ఆచూకీ లేకుండా పోయిందని జనవరి 21న మృతురాలి తల్లి, బంధువులు నరసరావుపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అప్పటికే నకరికల్లు వద్ద గుంటూరు బ్రాంచ్ కెనాల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని అక్కడ పోలీసులు గుర్తించారు. దీంతో మిస్సింగ్ మిస్టరీ వీడింది. దీంతో మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు కూపీ లాగారు. వ్యభిచార గృహ నిర్వాహకురాలు, ఆమె భర్తను అదుపులోకి తీసుకొని విచారించారు. వివాహితను తామే హతమార్చినట్లు వారు అంగీకరించారు. -
స్పా పేరుతో వేశ్యావాటిక
కర్ణాటక, బనశంకరి: మసాజ్ పార్లర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రంపై సీసీబీ పోలీసులు దాడిచేసి ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి ఐదు మంది యువతులను కాపాడారు. కోరమంగల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ భవనంలో స్పా మసాజ్ హ్యాపీ వెడ్డింగ్ అనే మసాజ్ పార్లర్లో వేశ్యవాటిక నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దీంతో దాడిచేసి ఇన్వెంట్ క్రిస్టి సునీల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి ఐదుమంది యువతులను కాపాడారు. సులభంగా డబ్బు సంపాదించే ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి బయటి రాష్ట్రాలకు చెందిన యువతులను రప్పించుకుని వారితో పడుపువృత్తి చేస్తున్నాడని విచారణలో తేలింది. రాజేశ్, మోసిస్ట్ అనే ఇద్దరి సూత్రధారులు పరారీలో ఉన్నారు. -
హైటెక్ వ్యభిచారం బట్టబయలు
సాక్షి, చిత్తూరు అర్బన్: చిత్తూరులో హైటెక్ వ్యభిచార ముఠాగుట్టును పోలీసులు బట్టబయలు చేశారు. ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు వచ్చిన సమాచారంతో పోలీసులు పక్కాప్లాన్ చేసి ఈ ముఠాను పట్టుకున్నారు. ఆదివారం నగరంలోని మురకంబట్టులో నిర్వహించిన దాడుల్లో నలుగురు యువతులను, ఓ విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మురకంబట్టు కేంద్రంగా చిత్తూరు, తిరుపతి నగరాలకు చెందిన పలువురు యువతులను వ్యభిచారంలోకి దింపిన ఓ మహిళ వీళ్లను ఇతర రాష్ట్రాలకు పంపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అందమైన యువతుల ఫొటోలను వాట్సప్ గ్రూపుల్లో పోస్టు చేసి, వీళ్ల రేట్లను సైతం అందులో ఉంచుతూ వచ్చింది. ఒక్కొక్కరికి రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు ధరలు నిర్ణయించేది. యువతుల వ్యవహారం చూసే స్థానికులకు వీళ్లు కళాశాల విద్యార్థులుగా భావించేవారు. ఇక్కడున్న ఓ వ్యక్తి అసలు విషయాన్ని గుర్తించి నేరుగా ఎస్పీకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విటులుగా మగ పోలీసులను పంపించి, మఫ్టీలో ఆడ పోలీసులతో నిఘా ఉంచి చాకచక్యంగా వ్యభిచార వ్యవహారాన్ని పట్టుకున్నారు. ఈ మొత్తం ఘటనలో మురకంబట్టుకు చెందిన ఓ మహిళ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇందులో ఎంతటి వాళ్లున్నా వదిలే ప్రసక్తేలేదని పోలీసులు చెబుతున్నారు. నిర్వాహకురాలిని సైతం అదుపులోకి తీసుకున్నారు. యువతులను మాత్రం వారి సొంత ఊర్లకు పంపడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. -
స్నేహం పేరుతో వ్యభిచార కూపంలోకి
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): స్నేహం పేరుతో మైనర్ బాలికను వ్యభిచార కూపంలోకి దింపిన దారున ఘటన ఓ తల్లి ఫిర్యాదుతో బయటపడింది. ప్రధాన నిందితుడిని కంచరపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంచరపాలెం సీఐ కృష్ణారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కంచరపాలెం బర్మాక్యాంపు ప్రాంతానికి చెందిన మైనర్ బాలికతో స్థానికంగా ఉన్న ముగ్గురు వ్యక్తులు పరిచయం పెంచుకున్నారు. ఆమె చేత అరుకు వంటి పలు పర్యాటక ప్రాంతాల్లో వ్యభిచారం చేయించారు. నిందితులు ఆ బాలికను వారి సొంత అవసరాలకు వాడుకున్నారు. దీని ద్వారా వచ్చిన సొమ్ము కూడా వారే తీసుకున్నారు. కుమార్తె ప్రవర్తనను గుర్తించిన తల్లి కంచరపాలెం పోలీసులను ఆశ్రయించింది. దీంతో నాని అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై అట్రాసిటీ కేసు, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. ఏసీపీకి ఈ కేసును బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకునేందుకు గాలింపు చేపడుతున్నామని సీఐ పేర్కొన్నారు.