జర్నలిస్ట్, న్యూస్ పేపర్ పై కేసు వేస్తా: శ్వేతాబసు
జర్నలిస్ట్, న్యూస్ పేపర్ పై కేసు వేస్తా: శ్వేతాబసు
Published Mon, Nov 3 2014 12:11 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
ముంబై: ఓ మీడియా సంస్థకు చెందిన జర్నలిస్ట్ పై టాలీవుడ్ నటి శ్వేతాబసు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవై రోజుల తర్వాత శుక్రవారం రెస్కూ హోమ్ నుంచి విడుదలైన శ్వేతాబసు ముంబై చేరుకుని ఓ మీడియా సంస్థకిచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో పలు విషయాలను వెల్లడించారు. తాను చెప్పని విషయాన్ని ఓ జర్నలిస్ట్ ప్రచురించడంపై సీరియస్ అయ్యారు.
మీడియాతో మాట్లాడలేదు...
నేను కస్టడీలో ఉన్నాను. రెస్క్యూ హోమ్ లో కనీసం నా తల్లి, తండ్రి ఎవరితోనూ కూడా మాట్లాడనివ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో మీడియాతో ఎలా మాట్లాడుతాను. శేతాబసు సినీ కెరీర్ ముగిసినట్టే అంటూ నా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వార్తను ప్రచురించారు. సంపాదన కోసం వేశ్య వృత్తిని ప్రజలు ప్రోత్సహించారు అంటూ కథనంలో అవాస్తవాలను ప్రచురించారు. అవాస్తవాల్ని ప్రచురించిన జర్నలిస్ట్ ను, న్యూస్ పేపర్ గురించి వివరాలు సేకరిస్తున్నాం. అందుకు బాధ్యులైన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం అని శ్వేతాబసు అన్నారు.
నా కుటుంబ నేపథ్యం గురించి తెలుసా?
తన కుటుంబ నేపథ్యం గురించి వారికేమైనా తెలుసా అంటూ ప్రశ్నించారు. అరెస్ట్ సమయంలో కొన్ని సినీ ఆఫర్లు కూడా తన చేతిలో ఉన్నాయి. సినీ పరిశ్రమతో మంచి సంబంధాలున్నాయని, ఎంతో మంది స్నేహితులు తనకు ఉన్నారని, వారంతా కష్టం సమయంలో వెన్నంటి ఉన్నారని శ్వేతాబసు తెలిపింది.
అవార్డు ఫంక్షన్ కోసం వెళ్లా..
నేను ఓ అవార్డు ఫంక్షన్ కోసం అక్కడి వెళ్లాను. ఆ కార్యక్రమ నిర్వాహకులు నాకు టికెట్లు, హోటల్ గదిని కేటాయించారు. ఇప్పటికి నావద్ద టికెట్లు ఉన్నాయి. కాని దురదృష్టం వెంటాడింది. ఆ సమయంలో పోలీసు దాడి చేశారు. ఓ ఏజెంట్ ను అరెస్ట్ చేశామని, కేసును విచారిస్తున్నామని నాకు తెలిపారు. కాని ఆ కేసులో బాధితురాలిగా మారాను. అసలు విషయాలు బయటకు రాకుండా చేశారు. వ్యభిచారానికి పాల్పడిన టాలీవుడ్ తారల పేర్లను చెప్పమంటూ పోలీసులు అడిగారని, అయితే తానేందుకు ఇతరులపై కామెంట్ చేయాలి అంటూ శ్వేతాబసు తెలిపారు.
పిల్లలకు హిందీ, ఇంగ్లీష్, మ్యూజిక్ నేర్పించా..
అక్రమ మానవ రవాణాలో పట్టుపడిన పిల్లలలతో కలిసి రెస్కూ హోంలో ఉన్నాను. అక్కడ పిల్లలకు టీచర్ సేవలందించాను. పిల్లలకు హిందీ, ఇంగ్లీష్, హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ నేర్పించాను. ఆ రెండు నెలల కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నానని శ్వేతాబసు వెల్లడించారు.
Advertisement
Advertisement