Shweta Basu
-
ప్లీజ్.. నాపై సానుభూతి వద్దు..
తనపై ఎవరు జాలి పడాల్సిన అవసరం లేదని టాలీవుడ్ హీరోయిన్ శ్వేతబసు ప్రసాద్ స్పష్టం చేసింది. రెస్య్యూ హోమ్ నుంచి విడుదలైన తర్వాత తాను మానసికంగా మరింత బలపడ్డానని తెలిపింది. కాగా వివాదాల్లో చిక్కుకున్న శ్వేత... ఇప్పుడిప్పుడే తన కెరీర్‌పై దృష్టి సారించింది. ప్రస్తుతం ఆమె 'రూట్స్' అనే ఓ క్లాసికల్ మ్యూజిక్కు సంబంధించిన డాక్యుమెంటరిపై పని చేస్తున్నానని చెబుతున్న శ్వేతబసును ఓ ప్రయివేట్ చానల్ ఇంటర్వ్యూ చేసింది. *నేను చాలా బాగున్నాను. బలహీనపడాల్సిన పనేముంది. ఏం జరిగింది ... ఏ జరగలేదు. జీవితంలో కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి. మనం వాటిని దాటేయాలి. కాలం ఎలాంటి గాయాన్ని అయినా మరిపిస్తుంది. మీరు నమ్మండి జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. *ఎప్పుడైతే మీరు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందో ... అప్పుడే మీకు నిజమైన పరీక్ష. అప్పుడే మీకు అర్ధమవుతుంది జీవితం ఎంత కష్టమైందో. ఒక్కసారి ఆ పరిస్థితి నుంచి మీరు గట్టెక్కితే... ఇక మీరు ఎలాంటి స్థితినైనా ఎదుర్కోగలరు. నేను అలాంటి కష్టాలను దాటి వచ్చానని గర్వంగా చెబుతున్నాను. ఇప్పుడు నేను ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలను. *ప్రతీ ఒక్కరు నాపై విపరీతమైన సానుభూతిని ఒలకబోస్తున్నారు. నాపై అత్యాచారం జరగలేదు. నేను రేప్ విక్టిమ్‌ను కాదు. ప్లీజ్ నాపై ఇంతగా సానుభూతిని చూపకండి. నాకు తెలుసు జరిగిన సంఘటన మంచిది కాదని... అది సాధారణమైన విషయం కాదని కూడా తెలుసు. కాని నాకు అదో ఎక్స్పీరియన్స్... నేను జీవితంలో నేర్చుకున్న అతిపెద్ద గుణపాఠం. ఈ సంఘటనకు సంబంధించి ఎవరిపైనా నేను కోపం పెంచుకోలేదు. *సినిమా ఇండస్ట్రీ చెడ్డదేం కాదు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు సంతోషంగా పలకరిస్తారు. నాతో స్నేహంగా ఉంటారు. *ఇప్పుడు హన్సిల్ మెహతా ప్రాజెక్టు గురించి నేనేం మాట్లాడను. ఎందుకంటే ఆయన నాకు ఇచ్చిన సినిమా ఆఫర్‌కు సంబంధించి ఇంకా ఏదీ అఫిషియల్ కాలేదు. హన్సిల్ మెహతా ప్రాజెక్టు కావచ్చు లేక మరేదైనా... నేను ఆడిషన్స్‌కు హాజరవుతాను. నా సొంత టాలెంట్‌పైనే సినిమా అవకాశాలు సాధించుకుంటాను. *నసీరుద్దిన్ షా నాకు ఓ సారి మెసేజ్ చేశారు. కోల్‌కతాలో ఆయన చేస్తున్న ఐన్‌స్టీన్ అనే షో చూడటానికి రమ్మన్నారు. ఆయన దగ్గర నా ఫ్రెండ్ పని చేస్తుంది. నేను సాధారణంగా అందరితో మరోసారి కలుపుగోలుగా ఉండాలని ఆయన సూచించారట. నేను కూడా ఇప్పుడిప్పుడే అందరితో కలుస్తున్నాను. *రూట్స్ అనే డాక్యుమెంటరీపై పని చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్టు కోసం చాలామంది పెద్ద వ్యక్తులు ఒకే వేదికపైకి వచ్చారు. *స్వేచ్ఛగా ఎగిరిపోతాను. నాకు రెక్కలున్న సంగతి వారికి తెలియదు. అందుకే నాలో నేను సంతోషపడుతుంటాను. నాపై ఏడిచే వారిపై జాలిపడతాను. -
సినీనటి శ్వేతాబసు ప్రసాద్‌కు క్లీన్ చిట్
హైదరాబాద్ : సినీనటి శ్వేతాబసు ప్రసాద్ కు ఊరట లభించింది. నాంపల్లి కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. శ్వేతాబసు ప్రసాద్‌పై అభియోగాలను కోర్టు కొట్టేసింది. ఎర్రమంజిల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆమె నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని శ్వేతాబసు ప్రసాద్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కావాలనే పోలీసులు తనను ఇరికించారని ఆమె కోర్టు ముందు వాదనలు వినిపించారు. ఓ ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆ హోటల్‌కు వెళ్లినట్లు శ్వేతాబసు ప్రసాద్ న్యాయస్థానం ముందు విన్నవించారు. దాంతో ఆమె వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు, కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా కోర్టు తీర్పుపై శ్వేతాబసు ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు కోసమే ఇన్నిరోజులుగా వేచి చూస్తున్నానని..ఆమె తెలిపారు. చాలా రోజుల తర్వాత తన కుటుంబ సభ్యుల మొహాల్లో నవ్వు కనిపిస్తుందని పేర్కొన్నారు. వ్యభిచారం ఆరోపణలపై అరెస్టై, కోర్టు ఆదేశాలపై ఇటీవలే రెస్క్యూ హోం నుంచి శ్వేతాబసు ప్రసాద్ విడుదలైన విషయం తెలిసిందే. -
ఆ బాధ జీవితాంతం దహిస్తూనే ఉంటుంది : శ్వేతాబసు ప్రసాద్
వ్యభిచారం ఆరోపణలపై అరెస్టై, కోర్టు ఆదేశాలపై ఇటీవలే ‘సంరక్షణాలయం’ నుంచి బయటకొచ్చిన సినీ నటి శ్వేతాబసు ప్రసాద్ తొలిసారిగా పెదవి విప్పారు. ముంబయ్‌లోని ఇంటికి చేరుకొన్న 23 ఏళ్ల ఈ యువ నటి ‘డి.ఎన్.ఎ’ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ అసలేం జరిగిందీ వివరించారు. ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు... ఇంటికి ఎప్పుడొచ్చారు? శుక్రవారం ఇంటికి వచ్చా. జరిగిన ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి మీదా ఫిర్యాదులు లేవు. కాకపోతే, నేనేమీ మాట్లాడకుండానే ఆ సంక్షోభ సమయంలో ‘అన్ని దారులూ మూసుకుపోవడం వల్లే ఈ పనికి పాల్పడ్డా. డబ్బు సంపాదించడం కోసం వ్యభిచారంలోకి దిగాల్సిందిగా కొందరు నన్ను ప్రోత్సహించారు’ అంటూ నా పేరు మీద ఓ జర్నలిస్టు తప్పుడు ప్రకటన జారీ చేశారు. రెండు నెలలు పత్రికలు అందుబాటులో లేవు. దాని గురించి నాకు ఇప్పుడే తెలిసింది. అంటే, ఆ ప్రకటన మీరు చేయలేదంటారు! లేదు. కస్టడీలో అమ్మానాన్నలతో మాట్లాడడానికి కూడా నాకు అనుమతినివ్వనప్పుడు, మీడియాతో మాత్రం నేనెలా మాట్లాడగలను? నా పరువు ప్రతిష్ఠలను దెబ్బతీశారు. అసత్య ప్రకటనలు ఏ జర్నలిస్టు వద్ద నుంచి, ఏ పత్రిక ద్వారా పుట్టాయన్నది ఆరా తీస్తున్నా. చట్టపరంగా చర్యలు చేపడుతున్నా. అనని మాటలు అన్నట్లు రాసేవారు ఏ రకం వారంటారు? ఎవరైనా కష్టాల పాలై, ఇబ్బందులు పడుతుంటే అది చూసి ఆనందించడం మన జాతి లక్షణం. మనం శాడిస్టులం. నా పేరు మీద తప్పుడు ప్రకటన ప్రచారంలో పెట్టిన ఆ జర్నలిస్టును అడగదలుచుకున్నది ఒక్కటే - ‘మీకు నా గురించి, నా కుటుంబం గురించి ఏం తెలుసు? ఇది (ఈ అరెస్టు) జరిగినప్పుడు కూడా రకరకాల పాత్రల కోసం నేను ఆడిషన్లలో పాల్గొంటున్నాను. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంపై ఒక డాక్యుమెంటరీ రూపకల్పన కోసం మూడున్నరేళ్ళ జీవితాన్ని వినియోగించా. మళ్ళీ నటన మీద దృష్టిపెట్టాలనుకుంటున్నా. ఎక్కువ భాగం మీడియా మీకండగా నిలిచిందే! అవును. అందుకే, ఇంటికి తిరిగిరాగలిగా. జరిగిందేమిటన్న దానిపై లోతుల్లోకి వెళ్ళాలని అనుకోవడం లేదు. అది కోర్టులో ఉన్న విషయం. దేనికైనా పశ్చాత్తాపపడుతున్నారా? నేను తప్పు చేశానా, లేదా అన్న విషయంలో ఒక నిర్ధారణకు వచ్చే ముందు.... మీడియా నేను బయటకు వచ్చేదాకా ఆగాల్సింది. నన్ను నేను రక్షించుకొనే హక్కు ఇవ్వాల్సింది. అక్కడ ఉండగా టీవీ చూడడానికీ, పేపర్లు చదవడానికీ నన్ను అనుమతించలేదు. తీరా ఇప్పుడు బయటకు వచ్చాక చూస్తే, జీవితం ఎంతటి మీడియా సర్కస్‌గా మారిందో తెలిసింది. అసలు ఈ పరిస్థితుల్లోకి మీరెలా చిక్కుకున్నారు? (ఒక్క క్షణం ఆగి..., నిట్టూరుస్తూ...) వ్యభిచారం కోసమంటూ నన్ను ఏ ఏజెంటూ హైదరాబాద్‌కు పిలవలేదు. అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనడానికి నేను అక్కడకు వెళ్ళాను. నా తలరాత అనండి, మరొకటి అనండి - వెనక్కి తిరిగి వచ్చే ఉదయం విమానం నేను మిస్సయ్యాను. ఆ అవార్డుల ఉత్సవం నిర్వాహకులే విమానం టికెట్, బస ఏర్పాట్లు చేశారు. ఆ టికెట్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఏజెంట్ అరె స్టయ్యాడని నాకు చెప్పారు. ఈ కేసు ఇప్పుడు విచారణలో ఉంది. ఈ వ్యవహారంలో బలిపశువునయ్యా. ఆ సమయంలో పోలీసు దాడి జరిగింది.... ఆ సంఘటనను తోసిపుచ్చడం లేదు. కానీ, బయటకు వారు చెప్పినవన్నీ నిజాలు కావు. మిమ్మల్ని పోలీసులు కఠినంగా ప్రశ్నించారా? లేదు. అయితే, విచారణ నిమిత్తం నన్ను నిర్బంధంలోకి తీసుకున్నప్పుడు పోలీసులు (వ్యభిచార రాకెట్లలో ప్రమేయమున్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న) తెలుగు సినీ తారల పేర్లడిగారు. చాలామంది పేర్లయినా నాకు తెలియవు. అయినా, ఇతర తారలపై నేనెందుకు వ్యాఖ్యానించాలి? అరెస్ట్ తర్వాత... రెస్క్యూ హోమ్‌లో ఉన్నాను. మనుషుల అక్రమ రవాణా, వగైరా వ్యవహారాల్లో బాధితులైన పిల్లలకు సంబంధించిన హాస్టల్ అది. అక్కడ నేను స్వచ్ఛందంగా టీచర్‌గా పనిచేశా. పిల్లలకు హిందీ, ఇంగ్లీషు, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం నేర్పించా. నేనేమీ మానసికంగా కుంగిపోలేదు. అలా ఎందుకు కుంగిపోవాలి? నిజానిజాలు నాకు తెలుసు. నా జీవితాన్ని సినిమాకూ, నటనకూ అంకితం చేశా. ఏదో ఒక సంఘటనతో నా జీవితాన్ని నాశనం కానివ్వను. మీ అమ్మానాన్న ఏమనుకున్నారు? నేను రెస్క్యూ హోమ్‌లో ఉండగా మా తాతగారు చనిపో యారు. ఆ బాధ జీవితాంతం నన్ను వెంటాడుతుంది. ఆయన అంత్యక్రియలకైనా హాజరు కాలేకపోయా. జీవితాంతం ఆ బాధ నన్ను దహిస్తూనే ఉంటుంది. మీడియాలో వార్తల పుణ్యమా అని ఆ ప్రకటనలన్నీ నేనే చేశాననుకొంటూనే మా తాత గారు కన్నుమూశారు. దర్శకుడు హన్సల్ మీతో పనిచేస్తానంటున్నారు. ఆయన నుంచి నాకు ఇంకా ఫోన్ రాలేదు. హన్సల్ మెహతా చిత్రానికి ఆడిషన్లో పాల్గొని, ఆ పాత్రకు నేను సరిపోతేనే చేద్దామనుకుంటున్నాను. అంతేతప్ప, ఏదో సానుభూతి చూపుతూ ఇచ్చే పాత్ర వద్దు. వివాదాన్ని అడ్డుపెట్టుకొని సొమ్ముచేసుకుంటున్నానని జనం అనుకోవడం నాకిష్టం లేదు. పదేళ్ళకే జాతీయ అవార్డొచ్చిన మీ ప్రతిభపై అనుమానాల్లేవు.. కానీ, జనం అవన్నీ సులభంగా మర్చిపోతారు. నన్నడిగితే, కష్టకాలంలోనే అసలైన స్నేహితులెవరన్నది తెలుస్తుంది. తెలిసినవాళ్ళు ముఖం చాటేశారు. స్నేహితులైతే, మా అమ్మ ఫోన్ చేస్తే ఎత్తేవాళ్ళు కాదు. మా అమ్మానాన్నకు ఏదైనా జరగరానిది జరిగి ఉంటే, దానికి బాధ్యులెవరు? ఈ సమయంలో మాకు అండగా నిలిచినవారికి కృతజ్ఞతలు. ఇక, మాకు అండగా నిలబడనివాళ్ళ గురించి కూడా ఏమీ అనను. జీవితమంటే ఇంతే! ఇలాగే ఉంటుంది! -
జర్నలిస్ట్, న్యూస్ పేపర్ పై కేసు వేస్తా: శ్వేతాబసు
ముంబై: ఓ మీడియా సంస్థకు చెందిన జర్నలిస్ట్ పై టాలీవుడ్ నటి శ్వేతాబసు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవై రోజుల తర్వాత శుక్రవారం రెస్కూ హోమ్ నుంచి విడుదలైన శ్వేతాబసు ముంబై చేరుకుని ఓ మీడియా సంస్థకిచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో పలు విషయాలను వెల్లడించారు. తాను చెప్పని విషయాన్ని ఓ జర్నలిస్ట్ ప్రచురించడంపై సీరియస్ అయ్యారు. మీడియాతో మాట్లాడలేదు... నేను కస్టడీలో ఉన్నాను. రెస్క్యూ హోమ్ లో కనీసం నా తల్లి, తండ్రి ఎవరితోనూ కూడా మాట్లాడనివ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో మీడియాతో ఎలా మాట్లాడుతాను. శేతాబసు సినీ కెరీర్ ముగిసినట్టే అంటూ నా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వార్తను ప్రచురించారు. సంపాదన కోసం వేశ్య వృత్తిని ప్రజలు ప్రోత్సహించారు అంటూ కథనంలో అవాస్తవాలను ప్రచురించారు. అవాస్తవాల్ని ప్రచురించిన జర్నలిస్ట్ ను, న్యూస్ పేపర్ గురించి వివరాలు సేకరిస్తున్నాం. అందుకు బాధ్యులైన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం అని శ్వేతాబసు అన్నారు. నా కుటుంబ నేపథ్యం గురించి తెలుసా? తన కుటుంబ నేపథ్యం గురించి వారికేమైనా తెలుసా అంటూ ప్రశ్నించారు. అరెస్ట్ సమయంలో కొన్ని సినీ ఆఫర్లు కూడా తన చేతిలో ఉన్నాయి. సినీ పరిశ్రమతో మంచి సంబంధాలున్నాయని, ఎంతో మంది స్నేహితులు తనకు ఉన్నారని, వారంతా కష్టం సమయంలో వెన్నంటి ఉన్నారని శ్వేతాబసు తెలిపింది. అవార్డు ఫంక్షన్ కోసం వెళ్లా.. నేను ఓ అవార్డు ఫంక్షన్ కోసం అక్కడి వెళ్లాను. ఆ కార్యక్రమ నిర్వాహకులు నాకు టికెట్లు, హోటల్ గదిని కేటాయించారు. ఇప్పటికి నావద్ద టికెట్లు ఉన్నాయి. కాని దురదృష్టం వెంటాడింది. ఆ సమయంలో పోలీసు దాడి చేశారు. ఓ ఏజెంట్ ను అరెస్ట్ చేశామని, కేసును విచారిస్తున్నామని నాకు తెలిపారు. కాని ఆ కేసులో బాధితురాలిగా మారాను. అసలు విషయాలు బయటకు రాకుండా చేశారు. వ్యభిచారానికి పాల్పడిన టాలీవుడ్ తారల పేర్లను చెప్పమంటూ పోలీసులు అడిగారని, అయితే తానేందుకు ఇతరులపై కామెంట్ చేయాలి అంటూ శ్వేతాబసు తెలిపారు. పిల్లలకు హిందీ, ఇంగ్లీష్, మ్యూజిక్ నేర్పించా.. అక్రమ మానవ రవాణాలో పట్టుపడిన పిల్లలలతో కలిసి రెస్కూ హోంలో ఉన్నాను. అక్కడ పిల్లలకు టీచర్ సేవలందించాను. పిల్లలకు హిందీ, ఇంగ్లీష్, హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ నేర్పించాను. ఆ రెండు నెలల కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నానని శ్వేతాబసు వెల్లడించారు. Follow @sakshinews -
శ్వేతాబసు వాంగ్మూలాన్ని సేకరించిన మేజిస్ట్రేట్
హైదరాబాద్: ఓ కేసులో ఇరుక్కుని రెస్కూ హోమ్ లో ఉంటున్న తన కూతురిని అప్పగించాలని శ్వేతాబసు తల్లి పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆమెను బంజారాహిల్స్ పోలీసులు బుధవారం ఎర్రమంజిల్ కోర్టులో హాజరుపర్చారు. గత వారం వ్యభిచారం కేసులో పట్టుబడి రెస్కూ హోమ్ లో ఉంటున్న ఆమె వద్ద మెజిస్ట్రేట్ వాంగ్మూలం స్వీకరించారు. తన కూతుర్ని అప్పగించాలని ఆమె తల్లి ఇటీవల వేసిన పిటిషన్ మేరకు సినీనటిని కోర్టులో హాజరుపర్చాలని మెజిస్ట్రేట్ ఆదేశించిన విషయం తెలిసిందే. తల్లి వేసిన పిటిషన్ మరియు వాంగ్మూలం వివరాలను కోర్టుకు హాజరైన సినీనటికి కోర్టు సిబ్బంది వివరించారు. తల్లి వద్దకు వెళ్లాలా లేదా అనే విషయం తెలుసుకునేందుకు ఆమె అభిప్రాయాన్ని మెజిస్ట్రేట్ కోరడంతో ఆమె వాంగ్మూలం ఇచ్చింది. ఇటు తల్లి వాంగ్మూలం, అటు ఆమె కూతురు వాంగ్మూలం సేకరించిన మెజిస్ట్రేట్ ప్రస్తుతం తీర్పును రిజర్వులో పెట్టారు. సినీనటిని తిరిగి రెస్కూ హోమ్‌కు తరలించారు. అందిన రిపోర్టులను పరిశీలించిన అనంతరం సినీనటిని ఆమె తల్లికి అప్పగించాలా లేదా అనేది మెజిస్ట్రేట్ స్పష్టం చేసే అవకాశాలు ఉన్నాయి. -
శ్వేతాబసుకు ఏదైనా.. జరిగితే బాధ్యులెవరూ?
సినీతార శ్వేతాబసు ఉదంతంపై మీడియా కథనాలు, సోషల్ మీడియాలో కామెంట్స్ పై అనేక వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శ్వేతాబసు అంశం మీడియాలో వస్తున్న కథనాలపై తాజాగా టెలివిజన్ సీరియల్ కహానీ ఘర్ ఘర్ కి లో ఆమెకు తల్లిగా నటించిన సాక్షి తన్వర్ ఘాటుగా స్పందించింది. ఈ వ్యవహారంలో శ్వేతాబసును ఒక్కరినే బలి పశువును చేశారని, ఆ క్షణంలో పట్టుబడ్డ బిజినెస్ మెన్ వదిలి వేయడంపై అనేక సందేహాల్ని, అనుమానాల్ని తన్వర్ వ్యక్తం చేశారు. ఈ కేసులో వదిలివేయబడిన బిజినెస్ మెన్ ఎవరో తెలుసుకోవాలని తనకు ఆసక్తి లేదని.. అయితే ఆ వ్యాపారికి సంబంధించిన కుటుంబాలు, తల్లి, కూతుర్లు, సోదరి, భార్య, స్నేహితులకు ఆయన నిజస్వరూపం తెలిసే అవకాశం ఉండేదని సాక్షి తన్వర్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఎంతో సున్నితమైన అంశాన్ని మీడియా హ్యాండిల్ చేసిన తీరుపై తన్వర్ అసంతృప్తిని వెల్లగక్కారు. ఇలాంటి సెన్సెషనల్ అంశంపై సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా అభిప్రాయం చెప్పిన వారు శ్వేతాబసు కోణంలో ఎందుకు చూడటం లేదని ఆమె ప్రశ్నించారు. రిమాండ్ హోమ్ కస్టడీలో ఉన్న తాను ఎందుకు చేయాల్సి వచ్చిందో వెల్లడించిన తీరును ధైర్యంగా మెచ్చుకోవాల్సిందే. టెలివిజన్ సీరియల్ లో తల్లిగా తనకు శ్వేతాబసుతో ఓ ప్రత్యేక అనుబంధమున్న కారణంగా ఆమెతో మాట్లాడాటానికి... కలువడానికి ప్రయత్నించాను. అయితే అది కుదరలేదు. దాంతో శ్వేతాబసు తల్లితో మాట్లాడాను. అయితే రిమాండ్ హౌజ్ లో శ్వేతాబసును సొంత తల్లినే కలువడానికి నిరాకరించారని ఎంత మందికి తెలుసు? రిమాండ్ హౌజ్ లో ఉన్న యువతులు, మహిళలకు ఎన్నో విషయాలపై అవగాహన కల్పించే పనిలో శ్వేతాబసు నిమగ్నమయ్యారనే విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో శ్వేతాబసు తల్లి పడుతున్న ఆవేదన ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇలాంటి కేసులో పేర్లను గోప్యంగా ఉంచాలనే నిబంధనల్ని ఉల్లంఘించడం ఎంత వరకు సబబు? తన కూతురు క్రిమినల్ కాదు.. మీడియా కథనాలకు మనస్తాపం చెంది తన కూతురు ఎలాంటి అఘాయిత్యానికైనా పాల్పడితే దానికి ఎవరూ బాధ్యత వహిస్తారు? అని ఓ తల్లి లేవనెత్తే ప్రశ్నకు ఎవరు జవాబిస్తారు. శ్వేతాబసు ఉదంతంపై లెక్కలేనన్ని కథనాల్ని వెల్లడించిన మీడియా.. పట్టుబడ్డ వ్యాపారి ఎవరో పోలీసులు ఎందుకు బయటపెట్టలేదు? శ్వేతాబసుపై లేని సానుభూతి ఆ వ్యాపారిపైనే ఎందుకని సాక్షి తన్వర్ ప్రశ్నించారు. ఓ నటి, సెలబ్రిటీ అనే ఒక్క కారణంతో నానా రకాలుగా కథనాల్ని అల్లడం భావ్యమా? బాధ్యాతయుతమైన మన పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారు? తమ పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు రేపిస్టులకు, హంతకులకు స్వేచ్చ కల్పిస్తున్న మనదేశంలో..కేవలం శ్వేతాబసు విషయంలో ఎందుకు నిబంధనల్ని తుంగలో తొక్కారు? చాలా సెన్సిటివ్ విషయాన్ని బజారుకీడ్చారు? అనే ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారని సాక్షి తన్వర్ ప్రశ్నల రూపంలో ఆవేదన వ్యక్తం చేసింది. సాక్షి తన్వర్ సంధించిన ప్రశ్నలకు మనవద్ద సమాధానం ఉందా అని దర్శకుడు రాజమౌళి కూడా ట్విటర్ లో ఓ వ్యాసాన్ని ట్వీట్ చేశారు. -
శ్వేతాబసు జీవితంలో మరో కోణం...
చిన్న వయస్సులోనే జాతీయ అవార్డును అందుకున్న శ్వేతాబసు ప్రసాద్ జీవితంలో మరో కోణం కూడా దాగి ఉంది. బాల నటిగా, హీరోయిన్ గా రాణించిన శ్వేతాబసు మంచి ఫోటోగ్రాఫర్ కూడా. ప్రసిద్ద కవి రూమీ అభిమాని కూడా. మనం చనిపోయాక భూమిలోని సమాధిలో కాకుండా జనం గుండెల్లో నిలువాలని సుప్రసిద్ద సూఫీ కవి రూమీ ఫిలాసఫికి శ్వేతాబసు ఆకర్షితులయ్యారు. జలాలుద్దీన్ మహమ్మద్ రూమీ ఓ పర్షియన్ కవి. ఆయన రచనలు పలు బాషల్లోకి అనువాదమయ్యాయి. అమెరికాలో ఇప్పటికి సాహితీ ప్రేమికులు రూమీ పాపులర్ రచయితగా భావిస్తారు. రూమీ రచనలు బెస్ట్ సెల్లర్ గా ఉన్నాయి. పేదరికం, ప్రకృతి, సమాజానికి కనిపించని అంశాలను తన కెమెరాలో బంధించి రూమీ జన్మదినోత్సవం రోజున ఓ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. మంచి ఆశయం, సిద్దాంతాలను అనుసరించే శ్వేతాబసుకు సినిమా ప్రపంచం చేదు అనుభవాన్ని మిగిల్చింది. రంగుల ప్రపంచంలో ప్రతిభతో ప్రశంసలందుకోవాల్సిన శ్వేతాబసు.. మురికి కంపులో కూరుకుపోయి.. ఫలితాన్ని మరో విధంగా అనుభవిస్తోంది. అవకాశాలు లేకపోవడంతో దిక్కు తోచని, తప్పని పరిస్థితుల్లో తప్పుదారి పట్టిన వ్యవహారంలో శ్వేతాబసుకు అనేక వర్గాల నుంచి సానుభూతి, సానుకూలత వ్యక్తమవుతోంది. ఈ కేసులో శ్వేతాబసునే బలిపీఠం మీదకు ఎక్కించడంపై నిరసన వ్యక్తమవుతోంది. ఈ కేసులో పట్టుబడిన వ్యక్తులను మీడియా ముందుకు ప్రవేశపెట్లలేదనే అంశంపై చర్చ కొనసాగుతోంది. -
నేనే కాదు.. వ్యభిచారంలో చాలామంది హీరోయిన్లు: శ్వేతాబసు
హైదరాబాద్: సినిమా అవకాశాలు రాక డబ్బులు లేకపోవడం, కుటుంబాన్ని ఆదుకునేందుకు మరో మార్గం లేకపోవడంతో వ్యభిచార వృత్తిలోకి దిగానని టాలీవుడ్ నటి శ్వేతా బసు ప్రసాద్ చెప్పింది. తానొక్కదాన్నే కాదని, ఇంకా చాలామంది హీరోయిన్లు ఇలాగే వ్యభిచారంలో ఉన్నారని ఆమె వెల్లడించింది. అయితే వాళ్ల పేర్లు మాత్రం ఆమె చెప్పలేదు. కాగా తన కెరీర్లో తప్పుడు మార్గం ఎన్నుకున్నానని అంగీకరించింది. వ్యభిచారం కేసులో ఆదివారం అరెస్టయిన శ్వేతను రెస్క్యూ హోంకు తరలించిన సంగతి తెలిసిందే. ఒకప్పడు జాతీయ అవార్డు అందుకున్న శ్వేత తన జీవితంలో ఎదురైన సంఘటనల గురించి పోలీసులకు వివరించింది. ఓ జాతీయ వార్త సంస్థ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. 'చేతిలో డబ్బులు అయిపోయాయి. కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. అయితే డబ్బులు సంపాదించడానికి ఏ మార్గం కనిపించిలేదు. నిస్సాహాయ స్థితిలో ఉన్ననేను తప్పనిసరి పరిస్థితుల్లో కొందరి ప్రోత్సాహంతో వ్యభిచార వృత్తిలోకి దిగా' అని శ్వేత చెప్పింది. తనలాగే మరికొందరు నటులు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకున్నారని తెలిపింది. శ్వేత మూడు నెలల పాటు రెస్క్యూ హోంలో ఉండే అవకాశముంది.