సినీనటి శ్వేతాబసు ప్రసాద్కు క్లీన్ చిట్ | Shweta Basu Prasad gets clean chit from Nampally Court | Sakshi
Sakshi News home page

సినీనటి శ్వేతాబసు ప్రసాద్కు క్లీన్ చిట్

Published Sat, Dec 6 2014 2:15 PM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM

సినీనటి శ్వేతాబసు ప్రసాద్కు క్లీన్ చిట్ - Sakshi

సినీనటి శ్వేతాబసు ప్రసాద్కు క్లీన్ చిట్

హైదరాబాద్ : సినీనటి శ్వేతాబసు ప్రసాద్ కు ఊరట లభించింది.  నాంపల్లి కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. శ్వేతాబసు ప్రసాద్పై అభియోగాలను కోర్టు కొట్టేసింది. ఎర్రమంజిల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆమె నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని శ్వేతాబసు ప్రసాద్ తన పిటిషన్లో పేర్కొన్నారు.

కావాలనే పోలీసులు తనను ఇరికించారని ఆమె కోర్టు ముందు వాదనలు వినిపించారు. ఓ ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆ హోటల్కు వెళ్లినట్లు శ్వేతాబసు ప్రసాద్ న్యాయస్థానం ముందు విన్నవించారు. దాంతో ఆమె వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు, కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

కాగా  కోర్టు తీర్పుపై శ్వేతాబసు ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు కోసమే ఇన్నిరోజులుగా వేచి చూస్తున్నానని..ఆమె తెలిపారు. చాలా రోజుల తర్వాత తన కుటుంబ సభ్యుల మొహాల్లో నవ్వు కనిపిస్తుందని పేర్కొన్నారు. వ్యభిచారం ఆరోపణలపై అరెస్టై, కోర్టు ఆదేశాలపై ఇటీవలే రెస్క్యూ హోం నుంచి శ్వేతాబసు ప్రసాద్ విడుదలైన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement