శ్వేతా బసు.. మళ్లీ వస్తోంది!
సంచలనాల హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ మళ్లీ సినీ పరిశ్రమలోకి వచ్చేశారు. ఓ హోటల్లో దొరికిన ఆమెపై పోలీసులు వ్యభిచారం కేసు పెట్టి రెస్క్యూహోంకు పంపడం, కోర్టు జోక్యం చేసుకుని ఆమెను బెయిల్పై విడుదల చేయాలని ఆదేశించడం తెలిసిందే. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని, తాను ఎలాంటి తప్పు చేయలేదని అప్పట్లోనే శ్వేతాబసు చెప్పింది.
మొత్తానికి చాలా కాలం తర్వాత మళ్లీ ఆమె ముఖానికి మేకప్ వేసుకుని ఓ డాక్యుమెంటరీతో కెమెరా ముందుకు వెళ్తోంది. జాతీయ అవార్డు విజేత హన్సల్ మెహతా తన స్వీయ దర్శకత్వంలో ఈ డాక్యుమెంటరీ తీస్తున్నారు. ఇందులో శ్వేతాబసుకు చాలా కీలకపాత్ర ఇచ్చినట్లు తెలుస్తోంది. వెంటనే దాన్ని అంగీకరించిన ఆమె.. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభిస్తారని సమాచారం. రెస్క్యూహోం నుంచి విడుదలై బయటకు వచ్చినప్పుడే, తాను మళ్లీ సినిమాల్లో నటిస్తానని శ్వేతాబసు తెలిపింది. మెహతా సినిమాతో ఇప్పుడది నిజమైంది.