శ్వేతాబసు వాంగ్మూలాన్ని సేకరించిన మేజిస్ట్రేట్
శ్వేతాబసు వాంగ్మూలాన్ని సేకరించిన మేజిస్ట్రేట్
Published Wed, Sep 10 2014 7:58 PM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM
హైదరాబాద్: ఓ కేసులో ఇరుక్కుని రెస్కూ హోమ్ లో ఉంటున్న తన కూతురిని అప్పగించాలని శ్వేతాబసు తల్లి పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆమెను బంజారాహిల్స్ పోలీసులు బుధవారం ఎర్రమంజిల్ కోర్టులో హాజరుపర్చారు. గత వారం వ్యభిచారం కేసులో పట్టుబడి రెస్కూ హోమ్ లో ఉంటున్న ఆమె వద్ద మెజిస్ట్రేట్ వాంగ్మూలం స్వీకరించారు. తన కూతుర్ని అప్పగించాలని ఆమె తల్లి ఇటీవల వేసిన పిటిషన్ మేరకు సినీనటిని కోర్టులో హాజరుపర్చాలని మెజిస్ట్రేట్ ఆదేశించిన విషయం తెలిసిందే. తల్లి వేసిన పిటిషన్ మరియు వాంగ్మూలం వివరాలను కోర్టుకు హాజరైన సినీనటికి కోర్టు సిబ్బంది వివరించారు.
తల్లి వద్దకు వెళ్లాలా లేదా అనే విషయం తెలుసుకునేందుకు ఆమె అభిప్రాయాన్ని మెజిస్ట్రేట్ కోరడంతో ఆమె వాంగ్మూలం ఇచ్చింది. ఇటు తల్లి వాంగ్మూలం, అటు ఆమె కూతురు వాంగ్మూలం సేకరించిన మెజిస్ట్రేట్ ప్రస్తుతం తీర్పును రిజర్వులో పెట్టారు. సినీనటిని తిరిగి రెస్కూ హోమ్‌కు తరలించారు. అందిన రిపోర్టులను పరిశీలించిన అనంతరం సినీనటిని ఆమె తల్లికి అప్పగించాలా లేదా అనేది మెజిస్ట్రేట్ స్పష్టం చేసే అవకాశాలు ఉన్నాయి.
Advertisement
Advertisement