శ్వేతాబసు జీవితంలో మరో కోణం...
శ్వేతాబసు జీవితంలో మరో కోణం...
Published Mon, Sep 8 2014 8:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM
చిన్న వయస్సులోనే జాతీయ అవార్డును అందుకున్న శ్వేతాబసు ప్రసాద్ జీవితంలో మరో కోణం కూడా దాగి ఉంది. బాల నటిగా, హీరోయిన్ గా రాణించిన శ్వేతాబసు మంచి ఫోటోగ్రాఫర్ కూడా. ప్రసిద్ద కవి రూమీ అభిమాని కూడా. మనం చనిపోయాక భూమిలోని సమాధిలో కాకుండా జనం గుండెల్లో నిలువాలని సుప్రసిద్ద సూఫీ కవి రూమీ ఫిలాసఫికి శ్వేతాబసు ఆకర్షితులయ్యారు.
జలాలుద్దీన్ మహమ్మద్ రూమీ ఓ పర్షియన్ కవి. ఆయన రచనలు పలు బాషల్లోకి అనువాదమయ్యాయి. అమెరికాలో ఇప్పటికి సాహితీ ప్రేమికులు రూమీ పాపులర్ రచయితగా భావిస్తారు. రూమీ రచనలు బెస్ట్ సెల్లర్ గా ఉన్నాయి. పేదరికం, ప్రకృతి, సమాజానికి కనిపించని అంశాలను తన కెమెరాలో బంధించి రూమీ జన్మదినోత్సవం రోజున ఓ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. మంచి ఆశయం, సిద్దాంతాలను అనుసరించే శ్వేతాబసుకు సినిమా ప్రపంచం చేదు అనుభవాన్ని మిగిల్చింది. రంగుల ప్రపంచంలో ప్రతిభతో ప్రశంసలందుకోవాల్సిన శ్వేతాబసు.. మురికి కంపులో కూరుకుపోయి.. ఫలితాన్ని మరో విధంగా అనుభవిస్తోంది.
అవకాశాలు లేకపోవడంతో దిక్కు తోచని, తప్పని పరిస్థితుల్లో తప్పుదారి పట్టిన వ్యవహారంలో శ్వేతాబసుకు అనేక వర్గాల నుంచి సానుభూతి, సానుకూలత వ్యక్తమవుతోంది. ఈ కేసులో శ్వేతాబసునే బలిపీఠం మీదకు ఎక్కించడంపై నిరసన వ్యక్తమవుతోంది. ఈ కేసులో పట్టుబడిన వ్యక్తులను మీడియా ముందుకు ప్రవేశపెట్లలేదనే అంశంపై చర్చ కొనసాగుతోంది.
Advertisement
Advertisement