photo exhibition
-
హార్ట్ ఆఫ్ ఆదివాసి..
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా నగరంలోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వేదికగా ప్రారంభించిన ఫొటో ఎగ్జిబిషన్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ సతీష్ లాల్ దాదాపు 14 ఏళ్లు దేశంలోని 20 రాష్ట్రాల్లో తిరిగి 40కి పైగా ఆదివాసి తెగలపై తీసిన అద్భుత డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నారు.ఆదివాసి సంస్కృతులు, వారి జీవన విధానం, వేషధారణ, పండుగలు, మేళాలు తదితర అంశాలపై తీసిన పరిశోధనాత్మక ఫొటోల సమాహారమని సతీష్ లాల్ తెలిపారు. ఈ డాక్యుమెంటరీకి గత సంవత్సరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ప్రశంసలు అందుకున్నానని గుర్తు చేశారు. తను తీసిన 65 ఆదివాసి ఫొటోలు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఆదివాసి ఆర్ట్ మ్యూజియంలో శాశ్వతంగా కొలువుదీరాయని అన్నారు. -
ప్రజాభవన్ లో వైఎస్ఆర్ ఫోటో ఎగ్జిబిషన్
-
ఈ ఛాయాచిత్రాలు...కన్నీటి కథలు...పోరాట రూపాలు
వన్య్రన ప్రాణులపై ఆసక్తితో సరదాగా కెమెరాను చేతపట్టింది నాన్కీ సింగ్.అయితే ఇప్పుడు ఆమె దృష్ణి కోణం మారింది.తన కెమెరా ఇప్పుడు బాధితుల చేతిలో ఆయుధం. వారి పోరాట పటిమకు నిదర్శనం. సరదాగా ‘రీల్స్’ చేసే వయసులో సామాజిక విషయాలపై దృష్టి పెట్టింది 22 సంవత్సరాల నాన్కీ సింగ్.దిల్లీకి చెందిన నాన్కీ సింగ్ యాసిడ్–ఎటాక్ సర్వైవర్ల జీవితాలను ‘ఏ జర్నీ టు ది మిర్రర్’ పేరుతో డాక్యుమెంటేషన్ చేసింది.ఈ ఛాయాచిత్ర ప్రదర్శన దిల్లీలోని స్టెయిన్లెస్ గ్యాలరీలో జరుగుతోంది.అమ్మాయిపై యాసిడ్ దాడి జరిగింది... అనే వార్త చదివి ‘అయ్యో’ అనుకుంటాం. దాడి చేసిన దుర్మార్గుడిని తిట్టుకుంటాం. వాడిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటాం.ఎవరి పనుల్లో వారు బిజీ కావడం వల్ల, ఎవరి లోకంలో వారు ఉండిపోవడం వల్ల ‘ఘటన తరువాత యాసిడ్ బాధితురాలి పరిస్థితి ఏమిటి?’ అనేదానిపై దృష్టి మళ్లదు.‘సర్వైవర్’ అన్న సానుకూల మాటేగానీ యాసిడ్–సర్వైవర్లలో చాలామంది జీవితాలు నరక్రపాయంగా ఉంటాయి. సానుభూతికే పరిమితమైనవారు సహాయానికి ముందుకు రాకపోవచ్చు. అంతకుముందు వరకు ఆత్మీయులుగా ఉన్నవారు అందనంత దూరం జరగవచ్చు.‘బతికాను సరే, ఎలా బతకాలి’ అనేది వారికి ప్రధాన సమస్య అవుతుంది. ఉద్యోగం చేయడం నుంచి సొంతంగా చిన్నపాటి వ్యాపారం మొదలు పెట్టడం వరకు ఏదీ సులభం కాదు.యాసిడ్ దాడి బాధితుల గురించి ఎన్నో ఆర్టికల్స్ చదివిన నాన్కీసింగ్ తన కాలేజి అసైన్‌మెంట్‌లో భాగంగా వారి కష్టాలు, కన్నీళ్లు, పోరాటాలను ప్రపంచానికి చూపించాలనుకుంది. అలా ‘ఏ జర్నీ టు ది మిర్రర్’ప్రాజెక్ట్ పట్టాలకెక్కింది. ఈ ప్రాజెక్ట్ కోసం నోయిడాలోని చాన్వ్ అనే ఫౌండేషన్ ప్రతినిధులను సంప్రదించింది. యాసిడ్ దాడి బాధితులకు వైద్య, ఆర్థిక సహాయాలు అందించడంతో పాటు పునరావాసం కలిగించే సంస్థ ఇది.నాన్కీ ఎంతోమంది సర్వైవర్స్‌తో మాట్లాడింది. మొదట్లో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు.అయితే పరిచయం స్నేహంగా మారిన తరువాత మనసు విపారు ఒక్కొక్కరిది ఒక్కోకథ.కన్నీళ్లు తెప్పించే కథ.చుట్టూ చీకటి కమ్ముకున్న క్లిష్ట సమయంలోనూ వెలుగు దారుల వైపు అడుగులు వేసిన కథ.సబ్జెక్ట్‌తో ఫొటోగ్రాఫర్ మమేకం అయినప్పుడు చిత్రం ప్రేక్షకుల దగ్గరికి వేగంగా వెళుతుంది. తాను ఎంచుకున్న సబ్జెక్ట్‌కు అనుగుణంగా సాంకేతిక జ్ఞానాన్ని వాడుకుంది నాన్కీ.ఉద్దేశపూర్వకంగానే బ్లాక్ అండ్ వైట్‌లో ఫొటోలు తీసింది. దీనికి కారణం కలర్ ఫొటోలు సబ్జెక్ట్‌కు అతీతంగా వేరే అంశాలపై దృష్టి మళ్లిస్తాయి.బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు మాత్రం నేరుగా సబ్జెక్ట్‌పై దృష్టి పడేలా చేస్తాయి.‘అద్దంలో నా ముఖం చూసుకోవాలంటే అంతకుమించిన నరకం లేదు అని చాలామంది అమ్మాయిలు నాతో పదేపదే చెప్పారు’ అంటుంది నాన్కీ సింగ్.అలాంటి వారిలో ధైర్యం నింపింది నాన్కీ. ‘మీరేమీ తప్పు చేయలేదు. కష్టాలను తట్టుకొని మీరు చేస్తున్న జీవన పోరాటం సాధారణమైనదేమీ కాదు’ అని చెప్పింది.కాలేజి ప్రాజెక్ట్‌లో భాగంగా యాసిడ్ దాడి బాధితుల దగ్గరికి వచ్చిన నాన్కీ వారితో కలిసి ప్రయాణం చేస్తోంది. వారి కష్టాలను పంచుకుంటోంది.‘ఫొటోగ్రాఫర్లు, డాక్యుమెంటరీ ఫిల్మ్మేకర్లు వారి దగ్గర రావడం కొత్తేమీ కాదు. అయితే నేను మాత్రం ప్రాజెక్ట్‌కు అతీతంగా వారితో అనుబంధం పెంచుకోవాలనుకున్నాను. వారికి ఏది నచ్చుతుందో, నచ్చదో తెలుసుకోవాలనుకున్నాను. వారిని కేవలం బాధితులుగా చూడడం నాకు ఇష్టం లేదు’ అంటుంది నాన్కీ సింగ్.తనకు ఎప్పుడు వీలైతే అప్పుడు వారి దగ్గరకు వెళ్లి మాట్లాడి వస్తుంది. వారి బర్త్‌డేకు కేక్ కట్ చేయించి ఫొటోలు దిగుతుంది.తన ఫొటో ఎగ్జిబిషన్ల ద్వారా యాసిడ్ దాడి బాధితుల కోసం నిధుల సేకరణ చేస్తోంది.వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా తన ప్రయాణం మొదలు పెట్టింది నాన్కీ. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికాకు వెళ్లింది. అక్కడినుంచి తిరిగి వచ్చిన తరువాత దిల్లీలోని చాందిని చౌక్లాంటి ప్రాంతాల్లో స్ట్రీట్ ఫొటోగ్రఫీ చేసింది. ఫొటోగ్రఫీలోని సాంకేతిక విషయాలపై పట్టుకోసం న్యూయార్క్‌లోని ‘స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్’లో చేరింది.నాన్కీ సింగ్ ఇప్పుడు సామాజిక విషయాలపై దృష్టి పెట్టింది. మహిళల హక్కుల నుంచి వారిపై జరుగుతున్న హింస వరకు ఎన్నో అంశాలపై ఫోటో ప్రాజెక్ట్‌లు చేస్తోంది.వారి కుటుంబంలో భాగం అయింది...‘ఎ జర్నీ టు ది మిర్రర్’ప్రాజెక్ట్ పూర్తికాగానే ‘ఇక సెలవు’ అనే మాట నాన్కీసింగ్ నోట వినిపించలేదు.‘మళ్లీ మళ్లీ కలుస్తుంటాను’ అన్నది నాన్కీ. అనడమే కాదు తనకు సమయం దొరికినప్పుడల్లా యాసిడ్ దాడి బాధితుల దగ్గరికి వెళుతుంది. వారితో సరదాగా కబుర్లు చెబుతుంది. వారి కష్టసుఖాల్లో భాగం పంచుకుంటుంది.‘నాన్కీతో మాట్లాడుతుంటే కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లుగానే ఉంటుంది. ఆమెతో మాట్లాడితే సంతోషమే కాదు ఆత్మస్థైర్యం కూడా వస్తుంది’ అంటారు యాసిడ్ దాడి బాధితులు. -
టీఎస్ఆర్టీసీ వినూత్న కార్యక్రమం.. దేశంలోనే తొలిసారిగా..
సాక్షి, హైదరాబాద్: పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఫొటోగ్రఫీ ద్వారా జీవ వైవిధ్యంలో పులుల ప్రాముఖ్యతను వివరించేందుకు దేశంలోనే తొలిసారిగా 'హైదరాబాద్ ఆన్ వీల్స్' బస్సులో టైగర్ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. పులుల సంరక్షణ, తగ్గిపోతున్న పులుల సంఖ్య పెంచేందుకు ప్రారంభించిన 'ప్రాజెక్ట్ టైగర్' 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక బాధ్యతగా ఈ టైగర్ ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలు, పార్కులు, తదితర ప్రాంతాలకు వెళ్లి పర్యావరణ పరిరక్షణలో పులుల పాత్రను ప్రజలకు వివరించనుంది. ఈ ఎగ్జిబిషన్లో ఐసీబీఎం-స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్స్‌లెన్స్ డీన్(అకడమిక్స్), వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ప్రొఫెసర్ జితేందర్ గొవిందాని తీసిన పులుల ఫొటోలను టీఎస్ఆర్టీసీ ప్రదర్శిస్తోంది. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ ప్రాంగణంలో శుక్రవారం 'హైదరాబాద్ ఆన్ వీల్స్' బస్సులో టైగర్ ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్(పీసీసీఎఫ్) రాకేశ్ మోహన్ డోబ్రియాల్, ఐఎఫ్ఎస్, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ప్రారంభించారు. అనంతరం ఇండియన్ ఫోటో ఫెస్టివల్(ఐపీఎఫ్), ఐసీబీఎం-స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్స్‌లెన్స్ సహకారంతో టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ ఎగ్జిబిషన్‌లోని పులుల ఫొటోలు అద్బుతంగా ఉన్నాయని కొనియాడారు. రాకేశ్ మోహన్ డోబ్రియాల్ మాట్లాడుతూ.. పులుల సంరక్షణకు ప్రజల్లో అవగాహన కల్పించడానికి టీఎస్ఆర్టీసీ బస్సులో టైగర్ ఫొటో ఎగ్జిబిషన్‌ను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణ అటవీ శాఖ కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోని పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటోందని అన్నారు. రెండు టైగర్ రిజర్వ్ లలో దాదాపు 30 పులులు ఉన్నాయని చెప్పారు. పులులు అడవుల్లో ఉండటం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని, పులుల ఆవాసాలు ఉన్న చోట మంచి వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. తమ ఆధీన ప్రాంతంలో ఉండే అన్ని జీవరాశుల మనుగడకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అవి తోడ్పాడుతాయని వివరించారు. పులులను కాపాడటమంటే అడవులను, వాటిలోని జీవరాశిని, జీవవైవిద్యాన్ని రక్షించడమేనని పేర్కొన్నారు. హైదరాబాద్ ఆన్ వీల్స్ బస్సులో ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో భాగం కావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. పులులను సంరక్షిస్తే పర్యావరణాన్ని సంరక్షించినట్లే అని ఆయన చెప్పారు. పులులను సంరక్షణపై ప్రజలల్లో అవగాహన కల్పించడంతో పాటు వారిని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇండియన్ ఫోటో ఫెస్టివల్ ఆర్గనైజేషన్ తో కలిసి టీఎస్ఆర్టీసీ 'హైదరాబాద్ ఆన్ వీల్స్' అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని వివరించారు. ఫోటోగ్రఫీ చాలా ప్రభావవంతమైన మీడియా అని.. ఫోటోస్, విజువల్స్ ద్వారా సమాజం ప్రభావితం అయిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పారు. మాటల ద్వారా వ్యక్తికరించలేని భావాలను ఫోటోలు చెప్తాయని వివరించారు. ఈ ఫొటో గ్రఫీ ప్రాముఖ్యతను వివరించేందుకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసిన దేశంలోనే మొదటి ప్రజా రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ అని తెలిపారు. 'ప్రాజెక్ట్ టైగర్' 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక బాధ్యతగా 'హైదరాబాద్ ఆన్ వీల్స్'లో టైగర్ ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించామని చెప్పారు. అడవుల్లోకి వెళ్లలేని వారు ఈ ఎగ్జిబిషన్ లోని పులుల ఫోటోలను చూసి మంచి అనుభూతుని పొందవచ్చని అన్నారు. హైదరాబాద్ లోని జనసమర్థ ప్రాంతాల్లో హైదరాబాద్ ఆన్ వీల్స్ బస్సు తిరుగుతుందని, ప్రజలందరూ ఈ ఫోటోలను వీక్షించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సహకరించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తోన్న ఈ వినూత్న ప్రయత్నాన్ని ప్రజలందరూ ఆదరించాలని కోరారు. పర్యవరణహితం కోసం టీఎస్ఆర్టీసీ ఎన్నో కార్యక్రమాలను చేపడుతోందని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్ లో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు నడిపేలా సంస్ట ప్లాన్ చేస్తోందని వివరించారు. హైదరాబాద్ ఆన్ వీల్స్ బస్సులో టైగర్ ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఐపీఎఫ్ వ్యవస్థాపకుడు ఆక్విన్ మాథ్యూస్ అన్నారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఎంతో కష్టంతో కూడుకున్నదని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పులులపై అవగాహన కల్పించాలని నిర్ణయించిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారిని ఈ సందర్భంగా అభినందించారు. చదవండి: తెలంగాణ బీజేపీలో కోవర్టుల కలకలం.. మళ్లీ తెరపైకి పంచాయితీ దాదాపు 13 ఏళ్లుగా ఎంతో కష్టపడి తీసిన తన ఫొటోలను హైదరాబాద్ ఆన్ వీల్స్ బస్సులో ప్రదర్శించడం సంతోషంగా ఉందని ఐసీబీఎం-స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్స్‌లెన్స్ డీన్(అకడమిక్స్), వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ప్రొఫెసర్ జితేందర్ గొవిందాని అన్నారు. అడవుల్లో ఒక్కో పులి ఫొటో తీయడానికి రెండు మూడు నెలలు కష్టపడాల్సి వచ్చిందని వివరించారు. యువతకు పులుల సంరక్షణపై అవగాహన లేదని, వారికి పులుల ప్రాముఖ్యతను వివరించేందుకు ఈ ఎగ్జిబిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సీసీఎఫ్ సైదులు, ఐపీఎఫ్ ప్రతినిధురాలు తరుషా సక్సేనా, తదితరులు పాల్గొన్నారు. -
పోలవరం చేరుకున్న సీఎం వైఎస్ జగన్
-
Ketaki Sheth: ఫొటోస్టూడియో ఆటోబయోగ్రఫీ
ఒకసారి కళ్లు మూసుకొని స్మార్ట్‌ఫోన్ కెమెరాలు లేని ఫొటోస్టూడియోల కాలంలోకి వెళ్లండి. దీపావళి పండగరోజు అక్కయ్య, అన్నయ్యలతో కలిసి దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫొటో గుర్తుందా? ‘రెడీ... అనగానే అలా కళ్లు మూయవద్దు తల్లీ’ అని సుతిమెత్తగా మందలించిన మీ ఊరిలోని ఫొటోగ్రాఫర్ గుర్తున్నాడా? ఫిల్టర్లు, మొబైల్ ఫోన్ అప్లికేషన్లు లేని ఆ కాలంలో స్టూడియోలలోని అద్భుతమైన బ్యాక్‌డ్రాప్ పెయింటింగ్స్ గుర్తుకొస్తున్నాయా? కేతకి సేథ్ తన ‘ఫొటోస్టూడియో’ ప్రాజెక్ట్‌తో ఆ కాలంలోకి తీసుకువెళుతుంది. పదండి ఒకసారి... సెల్‌ఫోన్ కెమెరాలు వచ్చిన తరువాత ‘ఫొటో స్టూడియో’లు తగ్గిపోయాయి. ఉన్నవి ఆనాటి వెలుగును కోల్పోయాయి. ఎన్నో కుటుంబాలతో అనుబంధాలు పెనవేసుకున్న అలనాటి ఫొటోస్టూడియోల గత వైభవాన్ని ‘ఫొటోస్టూడియో’ ప్రాజెక్ట్‌తో మన కళ్ల ముందుకు తీసుకువస్తుంది ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ కేతకి సేథ్. 2014లో నార్త్ ముంబైలోని ‘జగదీష్ ఫొటోస్టూడియో’లోకి కేతకి అడుగుపెట్టినప్పుడు అది ఫొటో స్టూడియోలా లేదు. గతకాల వైభవంలోకి వెళ్లినట్లుగా అనిపించింది. ఇక అది మొదలు 2018 వరకు దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న 67 పాత ఫొటోస్టూడియోలను సందర్శించింది. ఆ జ్ఞాపకాలను రికార్డ్ చేసింది. దిల్లీలోని ‘ఫొటోఇంక్’ గ్యాలరీలో తొలిసారిగా ‘ఫొటోస్టూడియో’ పేరుతో ఫొటోఎగ్జిబిషన్ నిర్వహించింది. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. కేతకి ప్రాజెక్ట్‌పై ‘ఫొటోస్టూడియో’ పేరుతో నాణ్యమైన పుస్తకం కూడా వచ్చింది. తాజాగా... పాతతరానికి సంబంధించిన కొత్త ఫొటోలతో ముంబైలో చెమౌల్డ్ ప్రిస్కాట్ రోడ్లో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది కేతకి. ఈ ఫొటోలలో వంద సంవత్సరాల చరిత్ర ఉన్న ఫొటోస్టూడియోలు ఉండడం విశేషం. అప్పట్లో ఇమేజ్–క్రేజ్ బాగా ఉండేది. స్క్రీన్‌కి అవతలి ప్రపంచాన్ని ఊహించేవారు కాదు. అందమైన ప్రకృతి దృశ్యాల నుంచి అభిమాన తారల వరకు ఎన్నో బ్యాక్‌డ్రాప్ పెయింటింగ్స్ స్టూడియోలలో కనిపించేవి. ఆ దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు ఈ ఎగ్జిబిషన్లో కనిపించి కనువిందు చేస్తాయి. కేతకి తన ప్రయాణంలో నాటి ఫొటోగ్రాఫర్లతో మాత్రమే కాదు, ఫొటోస్టూడియోలలో బ్యాక్‌గ్రౌండ్ పెయింటింగ్స్ గీసే ఆర్టిస్ట్‌లతో కూడా మాట్లాడింది. అలనాటి ఫొటోస్టూడియో యజమానులతో మాట్లాడుతున్నప్పుడు వారు మాట్లాడుతున్నట్లుగా అనిపించలేదు. ఫొటోస్టూడియోలు తమ ఆటోబయోగ్రఫీని చెప్పుకుంటున్నట్లుగా ఉంది! ‘గతంలో ఎన్నో ఫొటో ఎగ్జిబిషన్లకు వెళ్లాను. కాని వాటన్నిటికంటే ఈ ఎగ్జిబిషన్ నాకు బాగా దగ్గరైంది. నా కాలంలోకి, సొంత ఇంట్లోకి అడుగుపెట్టినట్లుగా ఉంది. ఒక్కో ఫొటో చూస్తూ వెళుతున్నప్పుడు ఎన్నో జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి. గ్యాలరీ నుంచి బయటికి వచ్చినా ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రావడానికి మాత్రం చాలా సమయం పట్టింది’ అంటుంది ఫొటో ఎగ్జిబిషన్‌కు వెళ్లివచ్చిన అరవై అయిదు సంవత్సరాల పూర్ణ. ‘ఫొటోస్టూడియో’ ప్రాజెక్ట్ సూపర్‌హిట్ అయిందని చెప్పడానికి ఇంతకుమించి ఉదాహరణ ఏముంటుంది! -
రవీంద్రభారతిలో ఘనంగా ఫొటో ఎగ్జిబిషన్ (ఫొటోలు)
-
మహనీయుల స్ఫూర్తి.. భావితరాలకు దీప్తి
నరసరావుపేట ఈస్ట్: దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి పోరాడిన మహనీయుల జీవిత చరిత్రలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాదు, జంగా కృష్ణమూర్తి తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలలో భాగంగా శనివారం శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్‌తో కలసి ప్రారంభించారు. జాతిపిత మహాత్మా గాం«ధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులనుద్దేశించి వారు మాట్లాడారు. 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవాన్ని నూతన పల్నాడు జిల్లాలో జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. స్వాతంత్య్రం కోసం ప్రాణార్పణ చేసి దేశానికి దిశ, దశ మార్గాన్ని చూపి నవభారత నిర్మాణంలో భాగస్వాములైన మహనీయుల స్ఫూర్తిని నేటి తరానికి అందించాలని తెలిపారు. మహాత్మాగాంధీ పల్నాడు ప్రాంతంలో పర్యటించి ప్రజలలో చైతన్యం నింపారని తెలిపారు. గాంధీ నడిచిన అహింస బాటలో ఎందరో విదేశీయులు నడిచి తమతమ దేశాలకు స్వేచ్ఛా వాయువు అందించారన్నారు. పుల్లరి ఉద్యమంలో కన్నెగంటి హనుమంతు నాటి బ్రిటిష్ పాలకులను ఎదిరించి స్ఫూర్తి నింపారని తెలిపారు. ఉన్నవ లక్ష్మీనారాయణ, గుర్రం జాషువ వంటి కవులు సమసమాజ స్థాపనకు తమ రచనలు సాగించారని వివరించారు. అటువంటి మహనీయులను మననం చేసుకుంటూ వారి బాటలో పయనించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ, నేటి తరం చిన్నారులు దేశ ఔన్నత్యం తెలుసుకునేందుకు ఆజాదీ కా అమృతోత్సవ్ దోహదపడుతుందన్నారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులతోపాటు ఆర్టికల్ 51 (ఏ)లోని పదకొండు ప్రాథమిక విధులను సైతం గుర్తుంచుకోవాలన్నారు. భారత పౌరునిగా జాతీయ పతాకం, గీతాన్ని గౌరవించటం, స్వాతంత్య్ర సముపార్జనకు కృషిచేసిన మహనీయులను గుర్తు చేసుకోవటం మన విధి అని తెలిపారు. మహనీయుల త్యాగాలు అందరికీ అర్థమయ్యేలా, చిన్నారులు, యువతలో స్ఫూర్తి నింపేలా ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలో ఆదివారం మూడు కిలోమీటర్ల స్వాతంత్య్ర వేడుకల పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ రవిశంకర్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఓబుల్ నాయుడు, విద్యాశాఖాధికారి వెంకటప్పయ్య, సమాచార, పౌర సంబందాల అధికారిణి సుభాష్దీప్తి తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న ఫొటో ఎగ్జిబిషన్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశ ఔన్నత్యం, స్వాతంత్య్ర పోరాట దృశ్యాలు, దేశ నాయకులతో ఏర్పా టు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. యూరోపియన్ల రాక మొదలుకొని బ్రిటిష్ కాలనీల ఏర్పాటు, స్వాతంత్య్ర పోరాటం, స్వాతంత్య్ర సముపార్జన, స్వాతంత్య్రానంతర సంఘటనలు తదితర చిత్రాలు వివరణాత్మక సందేశంతో చిత్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 1498 సంవత్సరం నుండి 1885 సంవత్సరం వరకు, 1885 నుండి 1947 స్వాతంత్య్రం సముపార్జన వరకు ఫొటోలను ప్రదర్శించారు. అలాగే జాతిపిత మహాత్మా గాం«ధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితచరిత్ర చిత్రాలను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణతో చిన్నారులు అలరించారు. -
20 రోజులపాటు వేడుకలు
న్యూఢిల్లీ: ఈ నెల 17న ప్రధాని మోదీ పుట్టిన రోజును పురస్కరించుకొని బీజేపీ భారీ కార్యక్రమాలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ‘సేవ సమర్పణ అభియాన్’ పేరుతో 20 రోజుల వేడుకలకు కార్యాచరణ రూపొందించింది. ప్రధాని మోదీ ప్రజా సేవలో అడుగు పెట్టి 20 ఏళ్లు అయిన సందర్భంగా 20 రోజుల పాటు వేడుకలు సాగించనున్నట్లు తెలిపింది. 5 కోట్ల పోస్టు కార్డులు.. 20 రోజుల వేడుకల్లో భాగంగా దేశ వ్యాప్తంగా భారీగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. దీంతో పాటు పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ చీఫ్ జేపీ నడ్డా రాష్ట్ర విభాగాలు అన్నింటికీ సూచనలు పంపించారు. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ బూత్‌ల నుంచి అయిదు కోట్ల పోస్ట్ కార్డులను ప్రధాని మోదీకి పంపనున్నారు. ప్రజాజీవితానికి అంకిత మైన మోదీలా పార్టీ సభ్యులు కూడా అంకితమవుతామంటూ ఆ కార్డుల్లో రాసి మోదీకి పంపనున్నారు. ఉచితంగా పప్పుధాన్యాలు, వ్యాక్సిన్లు అందిస్తున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ హోర్డింగ్‌లు నిర్మించనున్నారు. ఎగ్జిబిషన్ కూడా.. ప్రధాని మోదీ జీవితాన్ని సూచించే ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను తయారు చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది. వర్చువల్‌గా రూపొందించనున్న ఈ ఎగ్జిబిషన్‌ను ప్రజలు నమో యాప్ ద్వారా వీక్షించవచ్చని వెల్లడించింది. గంగా నది శుద్ధి.. వచ్చే ఏడాది మొదట్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీ కార్యక్రమా లను చేపట్టనుంది. వేడుకల్లో భాగంగా గంగానదిని 71 ప్రదేశాల్లో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించను న్నారు. మోదీ జీవితం, ఆయన విజయాలపై నిర్వహించనున్న ప్రత్యేక ఈవెంట్లకు çవివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించ నున్నారు. 2001 అక్టోబర్ 7న మోదీ గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అందుకే అక్టోబర్ వరకు 20 రోజుల పాటు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపింది. -
చేనేత మహిళ.. కలల నేతకు అద్దిన కళ
‘‘ఎన్నో చీరలు మగ్గం మీద నేస్తుంటాం. కానీ, ఒక్క చీర కూడా మేం కట్టుకోలేం. బయట దొరికే వందా, రెండు వందల రూపాయల సిల్క్ చీరలు కొనుక్కుంటాం. మా చేతుల్లో రూపుదిద్దుకున్న చీరల డిజైన్లు ఎంత అందంగా ఉన్నాయో కదా, అని ఒకటికి పదిసార్లు చూసుకుంటాం. కానీ, మేం కట్టుకునే చీరల అందం గురించి ఎన్నడూ పట్టించుకోం. అలాంటిది సిరి మేడమ్ మా చీర మాకే కొనిచ్చారు, మేం కట్టుకునేదాకా ఊరుకోలేదు’’ అంటూ విప్పారిన ముఖాలతో తెలిపారు నారాయణపేట్ చేనేత మహిళలు. ‘‘నెల రోజుల క్రితం తెలంగాణలోని నారాయణ్‌పేట్ చేనేత మహిళలను కలిసి, వారి చీరలు వారే కట్టుకున్నప్పుడు ఆ ఆనందాన్ని ఫొటోలుగా తీయాలనిపించింది. అలా తీసుకున్నాను కూడా. వీరికే ఇంకాస్త కట్టూ బొట్టూ మార్చితే మోడల్స్‌కి ఏ మాత్రం తీసిపోరు అనిపించింది. దాంతో ఈ ఆలోచనను సినిమాటోగ్రాఫర్ రఘు మందాటిని కలిసి, ఈ షూట్ ప్లాన్ చేశాను’’ అని వివరించారు ఫ్యాషన్ డిజైనర్ హేమంత్ సిరి. హ్యాండ్లూమ్ డే సందర్భంగా నిన్న హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘తాశ్రిక’ పేరుతో చేనేత మహిళల ఫొటో ప్రదర్శన, డాక్యుమెంటరీ ప్రదర్శించారు. ఈ సందర్భంగా చేనేతల పట్ల తనకున్న మక్కువను ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘పుట్టి పెరిగింది అనంతపూర్ జిల్లాలోని హిందూపూర్‌లో. కళల లేపాక్షి మాకు దగ్గరే. హైదరాబాద్ నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. పదహారు ఏళ్లుగా హ్యాండ్లూమ్స్‌తో డిజైన్స్ చేస్తున్నాను. చేనేతలతో యువతరం మెచ్చేలా మోడ్రన్ డ్రెస్సులను రూపొందించి, షోస్ కూడా ఏర్పాటు చేశాను. ఎప్పుడూ చేనేతలతో మమేకమై ఉంటాను కాబట్టి, వారి జీవితాలు నాకు బాగా పరిచయమే. ఆనందమే ముఖ్యం రోజుల తరబడి దారం పోగులను పేర్చుతూ ఒక్కో చీరను మగ్గం మీద నేస్తారు. ఒక్కో చీర 1200 రూపాయల నుంచి ధర ఉంటుంది. కానీ, అవి అంత సులువుగా అమ్ముడుపోవు. కుటుంబ పోషణ, పిల్లల చదువులకు వారి చేతి వృత్తే ఆధారం. చీర ఖరీదైనదని, వారెన్నడూ వాటిని కలలో కూడా కట్టుకోవాలనుకోరు. సాధారణ రోజుల్లోనే వారి కుటుంబ పరిస్థితులు ఎంత గడ్డుగా ఉంటాయో కళ్లారా చూశాను. అలాంటిది కరోనా సమయంలో చేనేత కుటుంబాల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఉపాధి లేక వారంతా ఎలా ఉన్నారో, వారి నేత చీరలన్నీ అలాగే మిగిలిపోయి ఉంటాయనుకొని ఒకసారి కలిసి వద్దామని వెళ్లాను. అక్కడి వారి పరిస్థితులన్నీ స్వయంగా చూశాక, ఆ మహిళల ముఖాల్లో కొంచెమైనా ఆనందం చూడాలనిపించింది. అలాగే, నాదైన కంటితో వారిని ఇంకాస్త కళగా చూపాలనుకున్నాను. నా స్నేహితుల్లో ఉన్న మేకప్, హెయిర్ స్టైలిస్ట్‌లతో మాట్లాడాను. ఈ క్రమంలో వారానికి ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్లడం, అక్కడి మహిళలతో మాట్లాడటం, వాళ్ల కుటుంబ సభ్యుల్లో నేనూ ఒకదాన్నయిపోయాను. ఫొటో షూట్‌కి అనువైన ప్లేస్ కోసం ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించాం. ఒక ప్రాచీన దేవాలయం కనిపించింది. అక్కడే ఫొటో షూట్‌కి ప్లాన్ చేసుకున్నాం. పదిమంది చేనేత మహిళలను తీసుకొని ఉదయం 5 గంటలకే ఆ దేవాలయానికి చేరుకున్నాం. ముందే అనుకున్నట్టు డిజైనర్ బ్లౌజులు, ఆభరణాలు, మేకప్ సామగ్రి అంతా సిద్ధం చేసుకున్నాం. రెండు కళ్లూ సరిపోలేదు ముస్తాబు పూర్తయ్యాక ఆ చేనేత మహిళల ‘కళ’ చూస్తుంటే నాకే రెండు కళ్లు సరిపోలేదు. వారు చూపించిన ఎక్స్ప్రెషన్స్ అద్భుతం అనిపించింది. జాతీయస్థాయి మోడల్స్‌కి వీరేమాత్రం తీసిపోరు అనిపించారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫొటో, వీడియో షూట్ చేశాం. వారి అనుభవాలతో కలిపి డాక్యుమెంటరీ రూపొందించాం. ఈ గ్యాలరీలో ప్రదర్శించిన ఈ మహిళల ఫొటోలతో ఉన్న ఫ్రేమ్‌లు వారి వారి ఇళ్లలో ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఈ ఫొటోషూట్, డాక్యుమెంటరీ అంతా స్వచ్ఛందంగా పూర్తిచేశాం. నా స్నేహితులు కూడా ఈ పనిలో ఆనందంగా పాలుపంచుకున్నారు. ఈ రంగంలో ఉన్నందుకు చేనేతకు నా వంతుగా ఏదైనా సాయం చేయాలనిపించింది. ఈ మహిళల ముఖాల్లో కనిపించిన కళ వీరి జీవితాల్లోనూ కనిపించాలి. చేనేతలను ఈ తరం మరింతగా తమ జీవనంలో భాగం చేసుకోవాలన్నదే నా ప్రయ త్నం’’ అని వివరించారు డిజైనర్ హేమంత్ సిరి. గ్యాలరీకి వచ్చినవారంతా అబ్బురంగా చేనేత మహిళల ఫొటోలు, డాక్యుమెంటరీని తిలకించడం, అక్కడే ఉన్న చేనేత మహిళలను ఆప్యాయంగా పలకరించడం, కొందరు చీరలు కొనుక్కోవడం, మరికొందరు మీ నుంచి మేమూ చీరల ఆర్డర్స్ తీసుకుంటాం అంటూ ఫోన్ నెంబర్లు అడిగి తీసుకొని వెళ్లడం.. అక్కడ ఉన్నంతసేపూ కళ్లకు కట్టింది. లేపాక్షి దేవాలయ కళను నారాయణ్‌పేట్ కాటన్ చీరల మీద డిజిటల్ ప్రింట్ చేయించి, డిజైన్ చేసిన ప్రత్యేకమైన చీరలు ఇవి. వీటితోనే డాక్యుమెంటరీ, ఫొటో షూట్ చేశాం. ఇందులో 30 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలు పాల్గొన్నారు. వచ్చిన ఆలోచనలను వెంటనే అమల్లో పెట్టడం, అందుకు తగినట్టుగా నారాయణ్‌పేట్ మహిళలు ఆనందంగా సహకరించిన విధానం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సీఎస్‌తో కేంద్ర బృందం భేటీ.. వరద నష్టంపై సమీక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాల కారణంగా సంభవించిన నష్టాలపై సమీక్షించేందుకు గాను రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర బృందం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో సమావేశమయ్యింది. వివిధ శాఖల వారీగా అధికారులు జరిగిన నష్టంపై కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భారీ వరదల కారణంగా రాష్ట్రంలో 6,368 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అధికారులు కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చారు. ఈ సందర్భంగా నీలం సాహ్ని మాట్లాడుతూ.. ‘2లక్షల 12వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 24వేల 515 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయి. రాష్ట్రంలో 5వేల 583 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. తాత్కాలిక పునరుద్ధరణ చర్యలకు గాను తక్షణమే 840 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. శాశ్వత పునరుద్ధరణ చర్యలకు రూ.4,439 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. తడిసిన, రంగు మారిన ధాన్యం కొనుగోలుకు కేంద్రం సడలింపులు ఇవ్వాలి. దెబ్బతిన్న వేరుశెనగ పంటకు కూడా నిబంధనలు సడలించాలి. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఉపశమనం కల్పించాం. ప్రభుత్వం తక్షణ చర్యలతో ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించాం’ అని తెలిపారు. (చదవండి: సంక్షోభం నుంచి సంక్షేమంలోకి..) వరద నష్టం ఫోటో ఎగ్జిబిషన్ సందర్శన సాక్షి,విజయవాడ: నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోవరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ని సౌరవ్ రే నేతృత్వంలోని కేంద్ర బృందం సందర్శించింది. జిల్లాలో సంభవించిన నష్టంపై కలెక్టర్ ఇంతియాజ్ కేంద్ర బృందానికి వివరించారు. వరదనష్టంపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాధమికంగా అగ్రికల్చర్లో 17000 హెక్టార్లు, హార్టీ కల్చర్‌లో 8,000 హెక్టార్ల పంటనష్టం జరిగిందని తెలిపారు. దెబ్బతిన్న ఆర్ అండ్ బీ, పంచాయితీ రాజ్ రోడ్ల అంచనాలను కూడా వివరించారు. జిల్లాలోని మూడు మండలాల్లో కేంద్రకమిటీ పంట నష్టాన్ని పరిశీలించనుందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. -
రాంచరణ్ నివాసంలో ఫొటో ఎగ్జిబిషన్
-
ప్రజల సహకారంతో మెరుగైన సేవలు
హైదరాబాద్: ప్రభుత్వంతోపాటు అన్ని వర్గాల ప్రజల సహకారంతోనే హైదరాబాద్‌లో అమెరికా దౌత్య కార్యాలయం ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని యూఎస్ కాన్సులేట్ జనరల్ కేథరీన్ హడ్డా అన్నారు. నగరంలో దౌత్య కార్యాలయం ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా అమీర్ పేట మెట్రోరైలు స్టేషన్లో బుధవారం ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో కలసి ఆమె ప్రదర్శనను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి రాష్ట్రంలో పర్యటించిన ఫొటోలు ప్రదర్శనలో ఆకర్షణగా నిలిచాయని అన్నారు. ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. 2006 సంవత్సరంలో నగర పర్యటనకు వచ్చిన జార్జిబుష్ హైదరాబాద్‌లో దౌత్య కార్యాలయ ఏర్పాటుకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ఫొటో ప్రదర్శన రెండు రోజుల పాటు ఉంటుందని తెలిపారు. -
‘ఫొటో’ అదుర్స్
మాదాపూర్: రఫీక్ వివిధ సందర్భాల్లో తీసిన ఫొటోలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకటోంది. చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఈ ఎగ్జిబిషన్ మే 12వ తేదీ వరకు కొనసాగుందని నిర్వాహకులు తెలిపారు. ఎంతో లోతైన భావాలను చెబుతున్నట్టున్న 19 ఫొటోలను ఇందులో ఉంచారు. -
హైదరాబాదీ ఫొటోలకు గిరిజనుల ఫిదా
ముంచంగిపుట్టు(అరకులోయ): ఆంధ్రఒడిశా సరిహద్దు ప్రాంతమైనా ఒనకఢిల్లీ వారపు సంతలో హైదరాబాద్‌కు చెందిన సతీష్‌లాల్ అనే ఫొటో గ్రాఫర్ గురువారం ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. సరిహద్దులోగల బొండా జాతి గిరి మహిళలు జీవన శైలిని ప్రతిబింబించే 120 ఫొటోలతో ఈ ప్రదర్శన నిర్వహించారు. రెండు సంవత్సరాల క్రితం ఆయన ఒనకఢిల్లీని సందర్శించినపుడు తీసిన చిత్రాలతో అదే గ్రామంలో సొంతంగా ప్రదర్శన నిర్వహించారు. మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం ఎస్ఈ డి.గోపాలకృష్ణమూర్తి, డీఈలు భాస్కర్,ఉదయ్‌కుమార్,సర్పంచ్ జగన్నాథం వంతాల్ గురువారం ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. సంతకు వచ్చిన సరిహద్దు గిరిజనులు,విదేశీయులు ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. బొండజాతి మహిళలుసైతం తమ ఫొటోలను తిలకిస్తూ ఎంతో సంబరపడ్డారు. కొందరు బొండాజాతి మహిళలకు వారి ఫొటోలను సతీష్‌లాల్ ఉచితంగా అందజేశారు. -
హీరో.. స్మైల్ ప్లీజ్
చిత్రకళా పరిషత్‌లో ఏర్పాటు చేసిన ఓ ఫొటో ఎగ్జిబిషన్లో హీరో యశ్‌ను సరదాగా ఫొటో తీస్తున్న హోం మంత్రి రామలింగారెడ్డి జయనగర: చిత్రకళా పరిషత్‌లో ఫొటో జర్నలిస్టŠస్ అసోసియేషన్ ఆఫ్ బెంగళూరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ సందర్శకులను కనువిందు చేస్తోంది. ఫొటో జర్నలిస్టŠస్ ఆఫ్ బెంగళూరు అసోసియేషన్ సభ్యులు తీసిన ఛాయాచిత్రాలు నిత్యం జీవితంలో జరిగే సంఘటనలకు అద్దం పడుతోంది. టీవీలో నుంచి శునకం బయటకు వస్తుండటం, నీటి కోసం జింక, బెంగళూరులో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై ట్రాఫిక్ కానిస్టేబుల్ బైక్‌పై వెళ్తూ కిందపడటం తదితర చిత్రాలో ఎంతో సజీవంగా ఉన్నాయి. ఫోటోగ్రాఫర్ల సునిశిత దృశ్యానికి ఈ చిత్రాలే నిదర్శనం. ఇక ఓ ఫ్యాషన్‌లో దివంగత మైసూరు మహరాజు శ్రీకంఠదత్త వడియార్, ఆహారం కోసం గద్ద, తమిళనాడు జల్లికట్టులో ఎద్దును లొంగతీసుకుంటున్న చిత్రం, బరువును మోయలేక చతికిలబడిన వృషభం, భారీ వర్షాల కారణంగా నగరంలో ఏర్పడిన గుంతల వద్ద జలకన్య రూపంలో నిరసన వ్యక్తం చేసే చిత్రం తదితర చిత్రాలు చూపుతిప్పుకోలేకుండా చేస్తున్నాయి. ప్రదర్శన ఈనెల 24 వరకు నిర్వహిస్తారు. -
నిజాం మ్యూజియంలో ఫొటో ఎగ్జిబిషన్
యాకుత్‌పురా: ఏడో నిజాం హెచ్‌ఈహెచ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 50వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం పురానీహవేలిలోని నిజాం మ్యూజియంలో ఆయన అంత్యక్రియలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1967 ఫిబ్రవరి 24న దివంగతులయా్యరని నిజాం మ్యూజియం క్యూరేటర్ భాస్కర్ రావు తెలిపారు. మ్యూజియంలో ఉస్మాన్ అలీ ఖాన్ ధరించిన బట్టలు, వస్తువులు, ఆభరణాలతో పాటు ఇప్పటికే సిటీ మ్యూజియం కొనసాగుతుందన్నారు. ఆయన అంత్యక్రియల్లో 10 లక్షల మంది ప్రజలు హజరయా్యరన్నారు. అంత్యక్రియల సందర్భంగా తీసిన ఫోటోలను ప్రత్యేకంగా ప్రదర్శనలో ఉంచారు. ఈ నెల 28వ తేదీ వరకు ఈ ఫోటో ప్రదర్శన కొనసాగనుంది. -
రూ.2,740 కోట్లు ఇవ్వండి
కేంద్ర బృందాన్ని కోరిన రాష్ట్రం సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో వాటిల్లిన నష్టం నుంచి తెలంగాణను ఆదుకునేందుకు రూ.2,740 కోట్ల సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని కోరింది. అకాల వర్షాలతో ఊహించని విధంగా నష్టం జరిగిం దని, పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు ఇతోధిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బృందాన్ని కోరారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటిం చి వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లు, పంట నష్టాన్ని పరిశీలించారు. ఆదివారం హైదరా బాద్‌కు వచ్చిన బృందం వివిధ శాఖల ఉన్న తాధికారులతో భేటీ అయింది. ఈ సందర్భం గా అకాల వర్షాలతో వాటిల్లిన నష్టాన్ని సీఎస్ రాజీవ్‌శర్మ శాఖలవారీగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. భారీ వర్షాలతో రాష్ట్రంలో జరిగిన నష్టానికి తాత్కాలిక ఉపశమనంగా వీలైనంత ఎక్కువ మొత్తాన్ని మంజూరు చేయాలని కేంద్రానికి సిఫారసు చేస్తామని బృందానికి సారథ్యం వహించిన హోంశాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్‌కుమార్ వెల్లడించారు. అనంతరం కేంద్రం బృందం కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, సిద్ధిపేట జిల్లాల్లో పర్యటించింది. కేంద్ర బృందం సంగారెడ్డి జిల్లా అధికారులతో సమా వేశమైంది. పంట నష్టం జరిగిన తీరుపై కలెక్టరేట్ ఆవరణలో ఫొటో ప్రదర్శనను వారు తిలకించారు. అక్కడి నుంచి నేరుగా బృందం సభ్యులు క్షేత్ర పర్యటనకు వెళ్లారు. ఝరాసంగం మండలం జీర్లపల్లిలో వర్షాలకు కొట్టుకుపోయిన పంచాయతీరాజ్ రోడ్డు బ్రిడ్జిని పరిశీలించారు. రాయికోడ్ మండలం జంబ్గి (కె)లో పత్తి, సోయా పంటలను పరిశీలించి.. నష్టం జరిగిన తీరుపై రైతుల నుంచి వివరాలు సేకరించారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో 31,618 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, జొన్న తదితర పంటలకు రూ.22.18 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు నివేదిక సమర్పించారు. కామారెడ్డి జిల్లాలోని పిట్లం, బిచ్కుంద మండలాల్లో కేంద్ర బృందం పర్యటించింది. పిట్లంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి, పంట నష్టాన్ని చూసి చలించిపోయింది. రెండో రోజైన సోమవారం హైదరాబాద్‌లో ముంపునకు గురైన వివిధ ప్రాంతాలు, దెబ్బతిన్న రోడ్లను కేంద్ర బృందం పరిశీలించనుంది. -
అణుపార్కు వినాశనంపై ఫొటో ఎగ్జిబిషన్
రణస్థలం : కొవ్వాడ అణుపార్కుతో ఉత్తరాంధ్ర జిల్లాలకు జరగనున్న వినాశనంపై కోటపాలేం గ్రామంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆదివారం ఏర్పాటు చేశారు. దీన్ని స్థానిక సర్పంచ్ సుంకర ధనుంజయ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు, సంజీవిని పర్యావరణ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కూన రాము, సిటు నేతలు ఎన్వీ రమణ, పి.తేజేశ్వరరావు మాట్లాడారు. కొవ్వాడ అణుపార్కు ఉత్తరాంధ్రకు మరణ శాసనమేనని ఆవేదన వ్యక్తం చేశారు. అణు విద్యుత్ వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఏ చిన్న ప్రమాదం జరిగినా ఈ ప్రాంత ప్రజలు జీవితాలు సర్వ నాశనం అవుతాయని ప్రభుత్వం నిర్లక్ష్యంతో సొంత ప్రయోజనాల కోసం ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటుందని విమర్శించారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఇటు ఒడిశాలోని ఛత్రపూర్ నుంచి అటు కాకినాడ వరకు సమస్త జీవకోటి నాశనం అవుతుందని పేర్కొన్నారు. కొవ్వాడ భూకంపాల జోన్లో ఉందని ఇటువంటి చోట అణు పార్కు ఏర్పాటు చేయడం ఎంత మాత్రం సరికాదని అన్నారు. గుజరాత్‌లోని మితివర్ధిలో ప్రజలు వ్యతిరేకిస్తే ఆ ప్లాంట్‌ను గుజరాత్ నుంచి కొవ్వాడకు తరలించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో బీజేపీ, టీడీపీలు అణుపార్కును వ్యతిరేకించి ఇప్పుడు అధికారంలోకి రాగానే తమ ధోరణిని మార్చడం ఎంత వరకు సరైనదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయుకులు పి.తేజేశ్వరరావు, సీహెచ్ అమ్మన్నాయుడు, ఎన్వీ రమణ, యు.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన కేశినేని నాని
విజయవాడ: సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఎంపీ కేశినేని నాని సోమవారం ప్రారంభించారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 70 ఏళ్ల స్వాతంత్ర్యం - త్యాగాలను స్మరిద్దాం పేరుతో చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటుచేసిన స్వాతంత్య్ర సమరం నాటి ఫొటోలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. -
వారిలో దేశభక్తి రగిలించడమే ధ్యేయం
► ‘సాక్షి’తో డీఏవీపీ అదనపు డైరెక్టర్ జనరల్ వేణుధర్ రెడ్డి సాక్షి, సిటీబ్యూరో: ‘సుదీర్ఘంగా సాగిన స్వాతంత్య్రోద్యమం గురించి నేటి తరాలకు పెద్దగా అవగాహన లేదు. ఒకవేళ తెలిసినా... మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు ఇలా కొందరి పోరాట యోధుల పేర్లే స్మరిస్తుంటాం. వీరితో పాటు వేల సంఖ్యలో స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాడారు. అందరి ధన, మాన, ప్రాణ త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుతున్నాం. ఈ ఘట్టంలో అనేక ఉద్యమాలు, ప్రతిఘటనలు, పాదయాత్రలు, జాతిని ఏకం చేసే సమావేశాలు, ప్రసంగాలు, వీర మరణాలు.. ఇలా ఎన్నో రూపాలు ఆవిష్కృతమయ్యాయి. ఈ పరిణామ సంఘటనలను నేటి తరానికి సజీవంగా అందించి వారిలో జాతీయోద్యమ స్ఫూర్తిని, దేశభక్తిని రగిలించాలన్నదే మా ఉద్దేశం. స్వేచ్ఛా ఫలాల ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. జాతి నిర్మాణానికి పునరంకితమయ్యే దిశగా యువతరానికి ప్రేరణ కలిగించడమే అంతిమ లక్ష్యం’ అని అడ్వరై్టజింగ్, విజువల్ పబ్లిసిటీ డైరెక్టరేట్ (డీఏవీపీ) అదనపు డైరెక్టర్ జనరల్ ఎన్.వేణుధర్ రెడ్డి పేర్కొన్నారు. డీఏవీపీ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ‘70 ఏళ్ల స్వాతంత్య్రం– త్యాగాలను స్మరిద్దాం’ పేరిట ఈ నెల 19న ఫొటో ప్రదర్శన ప్రారంభించారు. పబ్లికేషన్ విభాగం ఆధ్వర్యంలో అపూర్వ పుస్తకాలు ప్రదర్శిస్తున్నారు. ఈనెల 23 వరకు కొనసాగే ఎగ్జిబిషన్ ప్రాధాన్యం, విశేషాలపై వేణుధర్ రెడ్డితో ‘సాక్షి’ ముచ్చటించింది. పుస్తకాలూ అపూర్వమైనవే... స్వాతంత్య్రోద్యమంలో కీలక భూమిక పోషించిన మహోన్నతుల విజయగాథలు, జీవిత చరిత్రలు, ప్రసంగాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని పబ్లికేషన్స్ డివిజన్ బిజినెస్ మేనేజర్ నాగేశ్వరరావు తెలిపారు. వీటిని డిస్కౌంట్ ధరలకు సందర్శకులకు విక్రయిస్తున్నామని చెప్పారు. అంతేగాక అరుదైన చిత్రాలతో కూడిన పుస్తకాలు కూడా విక్రయానికి ఉంచామన్నారు. మొత్తం 132 టైటిళ్ల పుస్తకాలు తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషలలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. -
డిస్కౌంట్ ధరలో అపూర్వ చిత్రాలు
సాక్షి, సిటీబ్యూరో: పీపుల్స్‌ప్లాజాలో ఏర్పాటు చేసిన ‘70 ఏళ్ల స్వాతంత్య్రం – త్యాగాలను స్మరిద్దాం’ ఫొటో ఎగ్జిబిషన్ అరుదైన దృశ్యాల వేదికగా నిలుస్తోంది. దేశమంతా ఏకమై బానిస సంకెళ్లు తెంచిన ఘట్టాల చిత్రాలు అందరిలో స్ఫూర్తిని రగిలిస్తున్నాయి.1857 నుంచి మొదలైన స్వాతంత్య్ర సంగ్రామం మొదలుకొని స్వేచ్ఛా వాయువులు లభించిన 1947 ఆగస్టు 15 వరకు, తదనంతరం దేశంలో చోటుచేసుకున్న పరిణామాల దృశ్యమాలిక అందరినీ కట్టిపడేస్తోంది. కేవలం అరుదైన ఫొటోలే కాకుండా.. అపూర్వమైన పుస్తకాలూ కొలువు దీరాయి. మహనీయులు, స్వాతంత్య్ర సమరయోధుల విజయగాథలు, జీవితచరిత్ర తదితర పుస్తకాలు అందుబాటులో ఉంచారు. వీటిని డిస్కౌంట్ ధరకు సృదర్శకులకు విక్రయిస్తున్నారు. శుక్రవారం ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ ఈనెల 23వ తేదీ వరకు కొనసాగుతుంది. ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శకులు వెళ్లొచ్చు. ఆనాటి స్వాతంత్య్ర సంగ్రామ ఘట్టాల్లో భాగంగా 1857 సెప్టెంబర్ 14న కమాండర్ కేంపీబెల్ సేనల దాడిలో ఛిద్రమైన కాశ్మీర్ గేటుతోపాటు స్వాతంత్య్ర తొలి వేడుకలు, సైనికులు కవాలు, విద్యుత్ వెలుగుల్లో ఢిల్లీ గేట్, తొలి కేబినెట్ భేటీ, తొలి రాష్ట్రపతిగా, ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మహోన్నతులు, కార్గిల్ యుద్ధ చిత్రాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ముద్ర, సంస్థానాల విలీనం, దేశానికి రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానులుగా పనిచేసినవారి ఫొటోలు ప్రదర్శనలో ఉంచారు. -
వచ్చేసింది సైన్స్ ఎక్స్‌ప్రెస్
విజ్ఞానాన్ని, వినోదాన్ని మేళవిస్తూ కదిలే ‘సైన్స్ ఎక్స్‌ప్రెస్’ జహీరాబాద్‌కు చేరుకుంది. పన్నెండు బోగీలతో కూడిన ఈ రైలు విద్యార్థులను విశేషంగా అలరిస్తోంది. జహీరాబాద్: వాతావరణ పరిస్థితుల్లో కలుగుతున్న మార్పుల పర్యావరణానికి ఏ మేరకు ముప్పు వాటిల్లుతోందనే విషయాన్ని సైన్స్ రైలు చాటి చెప్పింది. శనివారం స్థానిక రైల్వే స్టేషన్లో 12 బోగీలతో వచ్చిన సైన్స్ రైలు ఎగ్జిబిషన్‌ను అధికారులు ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే ఏడీఆర్ఎం పీసీ టంటా, సైన్స్ అండ్ టెక్నాలజీ జీఎం కల్యాణ్‌చక్రవర్తి సైన్స్ రైలు ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. బోగీల్లో ఫొటో ప్రదర్శన సైన్స్ రైలులో ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రదర్శించేందుకు వీలుగా శాశ్వత ఫొటో ప్రదర్శనతో మొబైల్ రైలును రూపొందించారు. భారీగా తరలి వచ్చిన విద్యార్థులు సైన్స్ రైలు ప్రదర్శన మొదటి రోజు కావడంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్‌కు తరలి వచ్చారు. సాయంత్రం కొంత రద్దీ తక్కువగా ఉండడంతో విద్యార్థులు ఆసక్తితో వాటిని చూడగలిగారు. పలు అంశాలను తెలుసుకున్నా.. వాతావరణంలో వస్తున్న మార్పులు, భవిష్యత్తుపై ఏ మేరకు ప్రభావం పడుతుందనే విషయాన్ని ప్రదర్శన ద్వారా తెలుసుకున్నా. సైన్స్ ైరె లు మూలంగా అనేక విషయాల గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. -శిరీష, బ్రిలియంట్ స్కూల్ అన్ని విషయాలపై అవగాహన ఏర్పడింది సైన్స్ రైలులో ఏర్పాటు చేసిన ప్రదర్శనలన్నీ బాగున్నాయి. అన్ని విషయాలపై అవగాహన కలిగేందుకు ఉపయోగపడింది. -మహేశ్వరి, బాలికల ఉన్నత పాఠశాల పర్యావరణంతోనే మానవ మనుగడ పర్యావరణ పరిరక్షణతోనే జీవరాసుల మనుగడ ముడిపడి ఉంది. ప్రకృతికి కలుగుతున్న అనర్థాలకు గల కారణాలను ఎగ్జిబిట్ల ద్వారా తెలుసుకున్నా. నీటి సంరక్షణ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల ఉపయోగాలు, ప్లాస్టిక్ వాడకంతో కలుగుతున్న అనర్థాల గురించిన ప్రదర్శన బాగుంది. -రేణుక, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఒక్కో బోగీలో ఒక్కో ప్రదర్శన * ఒకటో బోగీలో వాతావరణం, హరిత గృహ ప్రభావం, ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులను పొందుపర్చారు. మార్పులు ఎందుకు చోటుచేసుకుంటున్నాయో వివరించారు. * రెండో బోగీలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తీరు, వర్ష రుతువులో వచ్చిన మార్పులు, సముద్రంలో నీటి పెరుగుదల గుర్తించడం వంటివి ప్రదర్శించారు. నీరు, వ్యవసాయం, అడవులు, జీవ వైవిధ్యం, ఆరోగ్యం, ప్రకృతి వైపరీత్యాలపై ప్రదర్శనలు ఉన్నాయి. * 3,4వ బోగీల్లో దైనందిన జీవితంలో మానవుడు అనుసరించాల్సిన విధానాల గురించి వివరించారు. * 5,6 బోగీల్లో దేశం చేపడుతున్న పలు విధానాలు, ఇంకుడుగుంతల నిర్మాణం, టెక్నాలజీని ఉపయోగించి ఉద్గారాలను తగ్గించడం, కార్బన్‌ను తగ్గించే విధానం తదితర వాటిని ప్రదర్శించారు. * 7వ బోగీలో వాతావరణ మార్పులపై అంతర్జాతీయ ఒప్పందాలు, లక్ష్యాలపై ప్రదర్శన ఏర్పాటు చేశారు. * 8వ బోగీలో హ్యాండ్ ప్రింట్ గురించి వివరించారు. స్కూల్, రోడ్డు, ఆఫీసులలో ప్రతి వ్యక్తి ఏఏ అంశాలు చేయవచ్చో వివరించారు. * 9,10వ బోగీలో బయో టెక్నాలజీ గురించి ప్రదర్శించారు. జీవ సంపద కోసం బయో టెక్నాలజీ, ప్రకృతి సంరక్షణ, రసాయన ఎకొలజీ, భారత పరిశోధన-బయో టెక్నాలజీ విభాగం అభివృద్ధికి చేపట్టిన అంశాలను వివరించారు. * 11వ బోగీలో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ద్వారా గుర్తించిన ఆవిష్కరణలు ప్రదర్శనలో ఉంచారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఆవిష్కరణలు, సైన్స ఎడ్యుకేషన్, డీఎస్టీ స్కాలర్షిప్లు, పథకాలు, టెక్నాలజీ కెరీర్ గురించి ప్రదర్శనలు ఉన్నాయి. * 12వ బోగీలో 4వ తరగతి లోపు ఉండే విద్యార్థుల కోసం ఆహ్లాదకరమైన కార్యాలు, విజ్ఞాన శాస్త్రం, లెక్కలు, పర్యావరణానికి సంబంధించిన ఆటలు, పజిల్స్, కిడ్స్ జోన్ ఏర్పాటు చేశారు. -
సాలార్జంగ్ మ్యూజియంలో ఫోటోల ప్రదర్శన
సాలార్జంగ్ మ్యూజియం వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్‌ను మ్యూజియం డెరైక్టర్ డాక్టర్ ఎ. నాగేందర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. దివాన్‌దేవిడిలో ఉన్న సాలార్జంగ్ మ్యూజియం విశేషాలను, కట్టడాలను చిత్రాల రూపంలో ఈ ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్‌కు మ్యూజియంలో పని చేసిన పదవీ విరమణ చేసిన వారిని ముఖ్య అతిథులుగా ఆహ్వనించారు. మ్యూజియం సంరక్షణకు అప్పట్లో వారు తీసుకున్న చర్యలు, సూచనలు, సలహాలు, వారి పాత జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మ్యూజియం కీపర్ డాక్టర్ కేధారేశ్వరి అప్పటి కళాఖండాల విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్. నాయక్, డాక్టర్ కుసుంతో పాటు మ్యూజియం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్
హైదరాబాద్: జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఫోటో ఎగ్జిబిషన్ జరుగనుంది. వైవిద్యం గల పంటల ఫోటో ఎగ్జిబిషన్ గా దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.