న్యూఢిల్లీ: ఈ నెల 17న ప్రధాని మోదీ పుట్టిన రోజును పురస్కరించుకొని బీజేపీ భారీ కార్యక్రమాలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ‘సేవ సమర్పణ అభియాన్’ పేరుతో 20 రోజుల వేడుకలకు కార్యాచరణ రూపొందించింది. ప్రధాని మోదీ ప్రజా సేవలో అడుగు పెట్టి 20 ఏళ్లు అయిన సందర్భంగా 20 రోజుల పాటు వేడుకలు సాగించనున్నట్లు తెలిపింది.
5 కోట్ల పోస్టు కార్డులు..
20 రోజుల వేడుకల్లో భాగంగా దేశ వ్యాప్తంగా భారీగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. దీంతో పాటు పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ చీఫ్ జేపీ నడ్డా రాష్ట్ర విభాగాలు అన్నింటికీ సూచనలు పంపించారు. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ బూత్‌ల నుంచి అయిదు కోట్ల పోస్ట్ కార్డులను ప్రధాని మోదీకి పంపనున్నారు. ప్రజాజీవితానికి అంకిత మైన మోదీలా పార్టీ సభ్యులు కూడా అంకితమవుతామంటూ ఆ కార్డుల్లో రాసి మోదీకి పంపనున్నారు. ఉచితంగా పప్పుధాన్యాలు, వ్యాక్సిన్లు అందిస్తున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ హోర్డింగ్‌లు నిర్మించనున్నారు.
ఎగ్జిబిషన్ కూడా..
ప్రధాని మోదీ జీవితాన్ని సూచించే ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను తయారు చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది. వర్చువల్‌గా రూపొందించనున్న ఈ ఎగ్జిబిషన్‌ను ప్రజలు నమో యాప్ ద్వారా వీక్షించవచ్చని వెల్లడించింది.
గంగా నది శుద్ధి..
వచ్చే ఏడాది మొదట్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీ కార్యక్రమా లను చేపట్టనుంది. వేడుకల్లో భాగంగా గంగానదిని 71 ప్రదేశాల్లో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించను న్నారు. మోదీ జీవితం, ఆయన విజయాలపై నిర్వహించనున్న ప్రత్యేక ఈవెంట్లకు çవివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించ నున్నారు. 2001 అక్టోబర్ 7న మోదీ గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అందుకే అక్టోబర్ వరకు 20 రోజుల పాటు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపింది.
20 రోజులపాటు వేడుకలు
Published Sun, Sep 5 2021 5:12 AM | Last Updated on Sun, Sep 5 2021 5:12 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment