Special events
-
15 రోజుల ముందే అనుమతి తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరం సందర్భంగా ఈ నెల 31న రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ప్రత్యేక ఈవెంట్స్ నిర్వహించే 3 నక్షత్రాల హోటళ్లు, బార్లు, క్లబ్బులు, పబ్‌లు తప్పని సరిగా 15 రోజుల ముందే అనుమతులు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ఈవెంట్ నిర్వహించే ప్రాంతాల్లో తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ(మెజర్స్) ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ 2013 కింద తప్పని సరిగా ఎంట్రీ, ఎగ్జిట్‌తో పాటు ప్రాంగణమంతా కవరయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని. తగిన సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బందిని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సరైన ఏర్పాట్లు చేసుకోవాలని, అశ్లీలతకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఔట్‌డోర్‌లో ఉండే సౌండ్ సిస్టమ్స్ రాత్రి 10 గంటలకల్లా బంద్ చేయాలని, ఇండోర్‌లో ఒంటి గంట వరకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. సామరŠాధ్యనికి మించి టిక్కెట్లు జారీ చేయడం వల్ల పలు రకాల ఇబ్బందులతో పాటు శాంతి భద్రతల సమస్యలు కూడా తలెత్తుతాయన్నారు. ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ వాడకూడదని, ఈ విషయంలో నిర్వాహకులు పార్కింగ్, ఇతర ప్రాంతాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎక్సైజ్ శాఖ నిబంధనల మేరకు నిరీ్ణత సమయం వరకే మద్యం ఉపయోగించాలని, ఈవెంట్‌కు వచ్చే కస్టమర్లు తిరిగి వెళ్లే సమయంలో డ్రైవర్లు, క్యాబ్స్ అందుబాటులో ఉంచాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు కస్టమర్లను దూరంగా ఉంచాలన్నారు. ఆ రోజు రాత్రి విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని సీపీ తెలిపారు. అగ్నమాపక శాఖ ఆదేశాల మేరకు ఫైర్ వర్క్స్‌ను ఉపయోగించరాదని సూచించారు. -
జోస్ ఆలుక్కాస్ శుభ మాంగళ్యం బ్రైడల్ కలెక్షన్స్–2023
చెన్నై: పెళ్లిళ్ల సీజన్‌కు మరింత శోభను చేకూర్చేందుకు జోస్ ఆలుక్కాస్ ‘‘శుభ మాంగళ్యం బ్రైడల్ కలెక్షన్ – 2023 ఫెస్టివ్ ఎడిషన్’’ ను ఆవిష్కరించింది. చెన్నైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆభరణాల కలెక్షన్‌ను సినీ నటులు కీర్తి సురేశ్, అనార్కలి మారికర్లు ప్రారంభించారు. ఇందులోని ప్రతి ఆభరణాన్ని భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రూపొందించామని సంస్థ చైర్మన్ జోస్ ఆలుక్కాస్ తెలిపారు. స్వచ్ఛమైన బంగారు ఆభరణాలపై 4.99% తరుగు చార్జీలు ఆఫర్ చేస్తుంది. వజ్రాభరణాలపై 20%, ప్లాటినం వస్తువులపై 7% డిస్కౌంట్ అందిస్తుంది. ఎస్బీఐ కార్డు, పెళ్లి కోసం బంగారం కొనుగోలుపై 5% ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. ఇప్పటికే ఆభరణాల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కలెక్షన్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు వర్గీస్ ఆలుక్కా, పాల్ జె ఆలుక్కా, జాన్ ఆలుక్కాలు పాల్గొన్నారు -
మన సంగతి సరే.. విదేశాల్లో ఇలా కూడా చేస్తారా?
అందరూ న్యూఇయర్‌కు వెల్కం చెప్పేశాం.. ఒక్కొక్కరూ ఒక్కో టైపులో... చాలామందికి కొత్త సంవత్సరం తొలిరోజున ఫలానా పని చేస్తే.. ఆ ఏడాదంతా కలిసి వస్తుందని నమ్మకాలు ఉంటాయి. అందులో భాగంగానే చాలామంది ఆలయాలకు వెళ్తుంటారు. మన సంగతి సరే.. మరి విదేశాల్లోని సంగతేంటి? వాళ్ల సంప్రదాయాలు ఏంటి? సెంటిమెంట్లు ఏంటి? తెలుసుకుందామా.. ఆ 12 ద్రాక్షలు.. ‘నోచె వీజా’.. అంటే స్పానిష్ భాషలో పాత రాత్రి అని అర్థం. స్పెయిన్‌లో ఏటా న్యూఇయర్ సందర్భంగా ప్రజలు ఇంటిపట్టునే ఉంటూ సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు కాగానే కొత్త ఏడాది తమకు అదృష్టం తెచ్చిపెట్టాలని కాంక్షిస్తూ 12 ద్రాక్షపండ్లను తినడం ఆనవాయితీ. లక్‌ను తెచ్చే లోదుస్తులు.. బ్రెజిల్ పౌరులది మరీ విచిత్రమైన సంప్రదాయం.. కొత్త సంవత్సరం తమకు అదృష్టాన్ని, శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటూ ప్రజలు రంగురంగుల లోదుస్తులు ధరించారు. ఒక్కో లోదుస్తుల రంగు ప్రేమ, వాత్సల్యం, ఆరోగ్యం మొదలైన వాటికి చిహ్నంగా నిలుస్తాయని వారి నమ్మకం. ఆలూ ఏం చెబుతోంది.. కొలంబియన్లు కొత్త ఏడాది సందర్భంగా తమ దిండ్ల కింద పూర్తిగా చెక్కు తీసిన, సగం చెక్కు తీసిన, చెక్కు తీయని మూడు ఆలుగడ్డలను పెట్టుకున్నారు. ఒక్కో ఆలుగడ్డను ఆర్థిక సమస్యలు, సమృద్ధి, శ్రేయస్సు–నిరాశకు మధ్య సమతూక సంకేతంగా పరిగణించారు. న్యూఇయర్ రాత్రి దిండ్ల కింద పెట్టిన మూడు ఆలుగడ్డల్లోంచి ఒకదాన్ని కళ్లు మూసుకొని తీశారు. ఒక్కో వ్యక్తి తీసుకొనే ఆలుగడ్డ ఆ సంవత్సరమంతా అతని లేదా ఆమె తలరాతను సూచిస్తుందని భావిస్తున్నారు. ఉల్లి చేసే మేలు.. గ్రీస్‌లో న్యూఇయర్‌ను పురస్కరించుకొని ప్రజలు ‘వసిలోపిటా’ అనే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. కేక్‌ను శిలువ ఆకారంలో మూడుసార్లు కోసి సెయింట్ బేసిల్ అనే తొలినాళ్లకు చెందిన బిషప్కు అంకితమిచ్చారు. అలాగే ఏడాదంతా తమకు అదృష్టం తెచ్చిపెట్టాలని ఇళ్ల తలుపులకు కొన్ని ఉల్లిగడ్డలను వేలాడదీశారు. ఉల్లిని నిరంతర వృద్ధి, ఎదుగుదలకు చిహ్నంగా భావిస్తూ ఇలా చేశారు. 108 సార్లు వాయిస్తే.. కొత్త ఏడాది నూతన ప్రారంభానికి సూచికగా జపనీయులు గుళ్లలో 108సార్లు గంటలను మోగించారు. మనిషిలోని కోరికలు, ఆందోళనలను పరిశుద్ధం చేసుకొనేందుకు సంకేతంగా 108సార్లు గంటలు వాయిస్తారు. ఉప్పుతో స్వాగతం... టర్కీవాసులు సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఇంటి తలుపులపై ఉప్పును చల్లుతూ కొత్త ఏడాదంతా తమకు శాంతి, శ్రేయస్సును తీసుకురావాలని కోరుకున్నారు. గోడకేసి కొట్టేద్దాం.. ఐర్లాండ్‌లో కొందరు ప్రజలు దుష్టశక్తులు, దురదృష్టాన్ని పారద్రోలేందుకు క్రిస్మస్ బ్రెడ్‌ను తమ ఇళ్ల గోడలపై విసిరి కొట్టారు. తద్వారా వారు కొత్త ఏడాదిని స్వచ్ఛంగా ప్రారంభిస్తున్నట్లు భావిస్తారు. గిన్నెలు, గ్లాసులు బద్దలుకొట్టి... డెన్మార్క్ ప్రజలు న్యూఇయర్‌ను పురస్కరించుకొని తమ పాత ప్లేట్లు, గ్లాసులను ఇరుగుపొరుగు, స్నేహితులు, కుటుంబ సభ్యుల ఇళ్ల తలుపులకేసి పగలగొట్టారు. తలుపుల వద్ద ఎన్ని పగిలిన ముక్కలు పడితే కొత్త ఏడాదంతా తమకు అంత బాగుంటుందని వారు విశ్వసిస్తారు. రంగురంగులతో కొత్త కళ... మెక్సికోవాసులు కొత్త ఏడాది రాక సందర్భంగా తమ ఇళ్లను సరికొత్త రంగులతో తీర్చిదిద్దారు. ప్రేమ కోసం పరితపించే వారికి ఎరుపు, కొత్త ఉద్యోగాన్వేషణ చేసే వారికి పసుపు.. ఇలా వివిధ రంగులు ప్రత్యేక సందేశాలను చాటుతాయని వారు భావిస్తారు. -
సర్వజ్ఞాని కోసమే వేడుకలు ఎత్తేశారు
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం రోజున పార్లమెంట్ సెంట్రల్ హాల్లో తప్పక నిర్వహించాల్సిన ప్రత్యేక కార్యక్రమాలను మోదీ సర్కార్ ఉద్దేశ్యపూర్వకంగా రద్దుచేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ‘సెంట్రల్ హాల్ వేడుకలు అంతర్థానమవుతున్నాయి. సర్వజ్ఞాని కీర్తి ప్రతిష్టలు పెంచడం పైనే దృష్టిపెట్టారు. ఇదంతా ఆ సర్వజ్ఞాని పుణ్యమే’ అంటూ ప్రధాని మోదీని పరోక్షంగా ఉద్దేశిస్తూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ‘గతంలో 25వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు సెంట్రల్ హాల్లో ప్రత్యేకంగా జరిగాయి. అలాగే 50వ, 60వ వేడుకలూ కొనసాగాయి. దురదృష్టంకొద్దీ ఈ సారి బీజేపీ సర్కార్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను హాల్లో రద్దుచేసింది. సర్వజ్ఞానికే పేరొచ్చేలా వ్యవహరిస్తోంది. ఆ జ్ఞాని ఎవరో అందరికీ తెలుసు’ అంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర వేడుకల నిర్వహణ విధానంపై కాంగ్రెస్, బీజేపీ పరస్పర విమర్శలు చేసుకోవడం కొనసాగుతోంది. చీకటి కోణాన్ని దాచేందుకే.. : అఖిలేశ్ బీజేపీ తనలోని చీకటి కోణాన్ని కప్పిపుచ్చేందుకే ఇలా హర్ ఘర్ తిరంగా అని నినదిస్తోందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ‘ స్వాతంత్య్రం సిద్ధించాకా జాతీయ జెండాను, భారత రాజ్యాంగాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అంగీకరించలేదు. బ్రిటిష్‌వారికి అనుకూలంగా వ్యవహరించారు. అలాంటి ఆర్ఎస్ఎస్–బీజేపీ తమ చరిత్రలోని చీకటి అధ్యాయాలను వెనుక వైపు దాచేస్తూ ముందువైపు త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తున్నాయి’ అని అఖిలేశ్ అన్నారు. -
20 రోజులపాటు వేడుకలు
న్యూఢిల్లీ: ఈ నెల 17న ప్రధాని మోదీ పుట్టిన రోజును పురస్కరించుకొని బీజేపీ భారీ కార్యక్రమాలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ‘సేవ సమర్పణ అభియాన్’ పేరుతో 20 రోజుల వేడుకలకు కార్యాచరణ రూపొందించింది. ప్రధాని మోదీ ప్రజా సేవలో అడుగు పెట్టి 20 ఏళ్లు అయిన సందర్భంగా 20 రోజుల పాటు వేడుకలు సాగించనున్నట్లు తెలిపింది. 5 కోట్ల పోస్టు కార్డులు.. 20 రోజుల వేడుకల్లో భాగంగా దేశ వ్యాప్తంగా భారీగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. దీంతో పాటు పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ చీఫ్ జేపీ నడ్డా రాష్ట్ర విభాగాలు అన్నింటికీ సూచనలు పంపించారు. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ బూత్‌ల నుంచి అయిదు కోట్ల పోస్ట్ కార్డులను ప్రధాని మోదీకి పంపనున్నారు. ప్రజాజీవితానికి అంకిత మైన మోదీలా పార్టీ సభ్యులు కూడా అంకితమవుతామంటూ ఆ కార్డుల్లో రాసి మోదీకి పంపనున్నారు. ఉచితంగా పప్పుధాన్యాలు, వ్యాక్సిన్లు అందిస్తున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ హోర్డింగ్‌లు నిర్మించనున్నారు. ఎగ్జిబిషన్ కూడా.. ప్రధాని మోదీ జీవితాన్ని సూచించే ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను తయారు చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది. వర్చువల్‌గా రూపొందించనున్న ఈ ఎగ్జిబిషన్‌ను ప్రజలు నమో యాప్ ద్వారా వీక్షించవచ్చని వెల్లడించింది. గంగా నది శుద్ధి.. వచ్చే ఏడాది మొదట్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీ కార్యక్రమా లను చేపట్టనుంది. వేడుకల్లో భాగంగా గంగానదిని 71 ప్రదేశాల్లో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించను న్నారు. మోదీ జీవితం, ఆయన విజయాలపై నిర్వహించనున్న ప్రత్యేక ఈవెంట్లకు çవివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించ నున్నారు. 2001 అక్టోబర్ 7న మోదీ గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అందుకే అక్టోబర్ వరకు 20 రోజుల పాటు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపింది. -
‘ఈడెన్ మెరుపులు’
►‘పింక్ టెస్టు’ సందర్భంగా బీసీసీఐ–బెంగాల్ క్రికెట్ సంఘం కలిసి ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిసి ఈడెన్ గార్డెన్స్‌లో గంటను మోగించి మ్యాచ్ ఆరంభానికి తెర తీశారు. భారత కెప్టెన్ కోహ్లిని బంగ్లా ప్రధానికి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పరిచయం చేయగా... ఆ తర్వాత టీమిండియా ఇతర సభ్యులతో ఆమె కరచాలనం చేశారు. ►మ్యాచ్ మధ్యలో మాజీ కెప్టెన్లతో పాటు పలువురు భారత క్రికెట్ దిగ్గజాలు ప్రత్యేక వాహనాల్లో ప్రేక్షకులకు అభివాదం చేస్తూ స్టేడియమంతా కలియదిరిగారు. కపిల్ దేవ్, సచిన్, అజహర్, గుండప్ప విశ్వనాథ్, వెంగ్‌సర్కార్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. 2000 సంవత్సరంలో బంగ్లాదేశ్ ఆడిన తొలి టెస్టులో పాల్గొన్న భారత, బంగ్లాదేశ్ ఆటగాళ్లంతా కూడా శుక్రవారం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గంగూలీకి కెపె్టన్‌గా అది తొలి టెస్టు మ్యాచ్. ►క్రికెటేతర ఆటగాళ్లు అభినవ్ బింద్రా (షూటింగ్), పుల్లెల గోపీచంద్ (బ్యాడ్మింటన్), పీవీ సింధు (బ్యాడ్మింటన్), సానియా మీర్జా (టెన్నిస్), మేరీకోమ్ (బాక్సింగ్) కూడా ప్రత్యేక అతిథులుగా మ్యాచ్‌కు వచ్చారు. ►లంచ్ విరామం సమయంలో ఈడెన్ గార్డెన్స్ వేదికకు సంబంధించి నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మాజీ ఆటగాళ్లు ఈ మైదానంతో తమ జ్ఞాపకాలు పంచుకున్నారు. 1993 హీరో కప్ ఫైనల్ గురించి కుంబ్లే చెప్పగా... ఆ్రస్టేలియాతో 2001 చారిత్రాత్మక టెస్టులో భాగమైన లక్ష్మణ్, ద్రవిడ్, సచిన్, హర్భజన్ నాటి ముచ్చట్లు చెప్పారు. అంతకుముందు టాస్ సమయంలో ఆర్మీ పారా ట్రూపర్లు గాల్లో చక్కర్లు కొడుతూ మైదానంలోకి వచ్చి ఇద్దరు కెపె్టన్లకు గులాబీ బంతులను అందించాలని ముందుగా అనుకున్నా... భద్రతా పరమైన కారణాలతో దానిని చివరి నిమిషంలో రద్దు చేశారు. -
బాష్...ఫ్రమ్ బాలీవుడ్; ఇది పండగ కల్చర్
దీపావళి గ్రాండ్ ఫెస్టివల్. గోల్డ్ ఫెస్టివల్. హంగు..ఆర్భాటాలతో సాగుతుంది. అందుకే ఇది పార్టీ ప్రియులకు ఇష్టమైన పండుగ. సిటీలో పార్టీలందు పండుగ పార్టీలు వేరయా.... మరీ ముఖ్యంగా దీపావళి పండుగ అంటే చాలు సిటీ పార్టీ సర్కిల్‌కి ఎక్కడ లేని ఉత్సాహమొస్తుంది. ఒక పార్టీకి ఉండాల్సిన హంగులన్నీ ఉంటాయి. దీపావళి బాష్ పేరిట బాష్...ఫ్రమ్ బాలీవుడ్... బాలీవుడ్ నుంచి సినిమాలు ఫ్యాషన్లు మాత్రమే కాదు అక్కడి పార్టీలు కూడా సిటీకి ట్రెండీగా మారతాయి ఈ దివాళి భాష్లు ఒక ఉదాహరణ. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ప్రతి ఏడాదీ దివాళి పార్టీ ఇస్తారు. అలాగే షారూఖ్‌ఖాన్ నివాసం మన్నత్ దివాళి బాష్ సందడితో వెలిగిపోతుంది. వీరితో పాటు అనిల్‌కపూర్, శిల్పాశెట్టి, కరణ్ జోహార్, ఏక్తాకపూర్, అర్పితా శర్మ వంటి బాలీవుడ్ ప్రముఖులు నిర్వహించే దివాళి బాష్ కోసం బాలీవుడ్ ఏడాదంతా వేచి చూస్తుంది. య«థా సెలబ్రిటీ తథా సిటీ అన్నట్టుగా... నగరంలోని రిచ్ పీపుల్ కూడా ఎవరికి వారు తమ అతిథులను మెప్పించడానికి దివాళి బాష్‌ను ఎంచుకున్నారు. – సాక్షి,సిటీబ్యూరో సంప్రదాయ దుస్తుల డిజైన్లలో ఇంత వెరైటీనా? క్రాకర్స్‌లో ఇంతగా వింత మెరుపులు మెరిపించేవీ ఉంటాయా? అన్ని స్వీట్స్ తినేసింది నేనేనా?... ఇలాంటి ఆశ్చర్యానందాలకు లోనవుతోంది పార్టీ సర్కిల్. దీపావళి పండుగ సందర్భంగా వెల్లువెత్తుతున్న ..దీవాళి బాష్ పేరిట సాగే పార్టీలతో ‘రిచ్’ సిటీ హోరెత్తుతోంది. పండుగ అనుభూతులను రెట్టింపు చేస్తూ పేజ్ త్రీ సర్కిల్ శభాష్ అనే అభినందనలు అందుకుంటోంది. కలర్‌ఫుల్... క్లిక్స్ గోల్డ్ కలర్ దీపావళ పండుగకు థీమ్ కలర్‌గా చెబుతారు. అందుకే ఇంట్లో అమర్చే వంట పాత్రలతో సహా గోల్డ్, కాపర్, సిల్వర్ లోహాలతో కళ్ల ముందు మెరుస్తాయి. ప్లాస్టిక్ అలంకరణ వస్తువులకు ఈ రంగులు పూయడం లేదా సింపుల్‌గా ఒక పార్టీ షాప్‌కి వెళ్లి గోల్డ్/సిల్వర్ కలర్డ్ ప్లాస్టిక్ కట్లరీని కొనుగోలు చేయడం చేస్తారు. కొన్ని ఫొటోలైనా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకపోతే నువ్వు పార్టీకి అసలు వెళ్లినట్టు ఏంటి ఆధారం? అందుకే ఈ బాష్లలో సెల్ఫీ కార్నర్స్, ఫొటో బూత్స్ తప్పనిసరిగా మారాయి. దీనిలో క్యాప్స్, హ్యాట్స్, సన్‌గ్లాసెస్, ఫన్నీ మెసేజెస్‌తో హెడ్ బ్యాండ్స్, సెల్ఫీ స్టిక్స్ తదితర యాక్సెసరీస్ అమరుస్తున్నారు. వావ్ అనిపించే డిజైన్డ్ పార్టీస్... సమయం సరిపోక వెళ్లడం కుదరదు గానీ లేకపోతే ఇన్వైట్ చేసిన దివాళీ బాష్‌లు అన్నింటికీ వెళ్లాలనిపిస్తుంది. అంత బాగా డిజైన్ చేస్తారవి. రెండ్రోజుల క్రితం ఒక పార్టీకి వెళ్లాను. ఎత్నిక్ డ్రెస్సింగ్స్, లైవ్ బ్యాండ్స్, క్రాకర్స్, డ్యాన్స్‌లు.. ఆ రిచ్‌నెస్..ఓహ్ అద్భుతంగా అనిపించింది. వేరే లోకంలో ఉన్నామన్నట్లు ఉంది. ఇవి ఏడాదిలో దీపావళికి మాత్రమే జరిగినా ఏడాది మొత్తం టాక్ ఆఫ్ ద టవున్ అవుతాయి. ...హేమంత్‌సిరి, ఫ్యాషన్ డిజైనర్ పార్టీకి రెడీ... దివాళి బాష్ ఎప్పుడూ మాకు స్పెషల్. మేమిచ్చే పార్టీస్, మేం అటెండయ్యే పార్టీస్‌తో ఈ వారమంతా సందడిగా గడచిపోతుంది. వ్యక్తిగతంగా కాకుండా ఫ్యామిలీస్‌తో కలిసిపోయే సందర్భం కావడంతో దీవాళి బాస్ మర్చిపోలేని అనుభూతిని అందిస్తుంది ... సుశీలా బొకాడియా, పేజ్‌త్రీ సెలబ్రిటీ హోమ్...థీమ్ పార్టీ... పండుగకు వారం రోజుల ముందుగానే సిటీలో ఈ బాష్ ఊపందుకుంటుంది. ఫ్యామిలీ గెట్ టు గెదర్‌కు అత్యంత అనువైన పండుగ కావడం, దీనికి తోడు ఇది ఎవరి నివాసంలో వారు ఆతిథ్యమివ్వడతో సంపూర్ణమైన హోమ్లీ పార్టీగా జరుగుతుంది. ఈ పార్టీలకు డెకార్ చాలా కీలకం. క్లాసిక్ ఫ్లవర్ లైట్ డెకార్ నుంచి, ద్వార బంధాలకు పూల దండలు తగిలించడం ఇంట్లో నలుమూలలా దీపాలు అమర్చడం, దీపపు ఆకారంలో ఉండే క్యాండిల్స్ పార్టీకి వింతశోభను అద్దుతాయి. వంటి అలంకరణలతో ఇంటింటా ఫెస్టివల్ శోభ పురివిప్పుతుంది. మ్యాజిక్ స్వీట్స్... మ్యూజిక్ హిట్స్ స్వీట్స్ లేని పండుగ ఉండదు. అసలు దీపావళి అంటేనే మిఠాయిల పండుగ.. విభిన్న రకాల రుచులు ఈ పండుగ పార్టీస్‌లో వండి వడ్డిస్తారు. కండెన్స్డ్ మిల్క్, కోకోనట్ లాడూస్, షాహి తుక్డా, ఖీర్ వంటివి చవులూరిస్తుంటాయి. మొత్తం కుటుంబాన్ని, బంధుమిత్రులను ఒక దరికి చేర్చే పార్టీలో సహజంగానే రకరకాల వినోద భరిత కార్యక్రమాలు ఉంటాయి. అం త్యాక్షరి, పాస్ ఇన్ ది పార్సిల్ వంటి ఆటలు పాపులరై ఇప్పటికీ పార్టీలకు ఊపునిస్తున్నాయి. -
గండికోట ఉత్సవాలకు సర్వం సిద్ధం
జమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్: గండికోట వారసత్వ ఉత్సవాలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈనెల 21వతేదీ ఆదివారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పనులను వేగవంతంగా పూర్తి చేయించారు. గత మూడు రోజులుగా ఇన్చార్జి కలెక్టర్ శ్వేత అధికారులతో కలిసి పనులు పర్యవేక్షించడంతోపాటు నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేస్తూ వచ్చారు. గండికోట ఉత్సవాలలో జరిగే కార్యక్రమాలను సుమారు మూడు వేల మంది వీక్షించేలా ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. వేదికను జుమ్మా మసీదు ముందు భాగం ఆకారంలో తీర్చి దిద్దారు. రాష్ట్రం నలుమూలలా తయారైన వివిధ రకాల వస్తువుల ప్రదర్శన కోసం ఎగ్జిబిషన్ స్టాల్స్, వివిధ శాఖలకు సంబంధించిన స్టాల్స్‌తో పాటు, పుస్తకాల ప్రదర్శన, ఫుడ్‌స్టాల్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. రహదారి వెంబడి అలంకరణ పనులు పూర్తి చేశారు. నేడు పట్టణంలో ర్యాలీ.. గండికోట ఉత్సవాల సందర్భంగా జమ్మలమడుగు పట్టణంలో ఆదివారం ఉదయం ఆర్డీఓ వి.నాగన్న ఆధ్వర్యంలోకళాకారులు, స్థానిక అధికారులు, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం గండికోటలో కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఉత్సవాల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. గండికోట ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద నుంచి ప్రతి 20 నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేసినట్లు కడప డిప్యూటీ చీఫ్ మేనేజర్ కిశోర్‌కుమార్ పేర్కొన్నారు. మూడు రోజులపాటు సాగే ఈ ఉత్సవాలలో పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జమ్మలమడుగు నుంచి గండికోటకు ఒక్కొక్కరికి రూ.13 చొప్పున టిక్కెట్ ధర నిర్ణయించామన్నారు. రానుపోను టిక్కెట్ కూడ ఇస్తామని ఆయన తెలిపారు. ప్రొద్దుటూరు నుంచి 2, మిగతా ఆరు డిపోల నుంచి ఒక్కొక్క బస్సును గండికోటకు నడుపుతామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
తెలుగు మహాసభల్లో వెల్లివిరిసిన సాహిత్యోత్సాహం
-
వెల్లివిరిసిన సాహితీ సౌరభం
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభల్లో సాహిత్యోత్సాహం వెల్లివిరిసింది. భాషా సాంస్కృతిక వైభవం కనువిందు చేసింది. వేలాది మంది భాషా, సాహితీ ప్రియులు తెలుగు తల్లి ఒడిలో సేదతీరారు. అమ్మ భాషతో మమేకమై తన్మయులయ్యారు. ప్రపంచ తెలుగు మహాసభల రెండో రోజు శనివారం హైదరాబాద్‌లోని సభా వేదికలన్నీ ప్రభం‘జనాలై’ భాసిల్లాయి. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంతోపాటు తెలంగాణ సారస్వత పరిషత్తు, తెలుగు విశ్వవిద్యాలయం, రవీంద్రభారతి వరకు వేలాది మంది వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాహిత్య సభ లాల్ బహదూర్ క్రీడా మైదానంలోని పాల్కురికి సోమనాథ ప్రాంగణంలో బమ్మెర పోతన వేదికపై ‘తెలంగాణలో తెలుగు భాషా వికాసం’పై సాహిత్య సభ జరిగింది. వేల ఏళ్లుగా తెలుగు భాష పరిణామం చెందిన తీరుపై భాషా నిపుణులు మాట్లాడారు. కార్యక్రమానికి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షులుగా వ్యవహరించారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొని తెలుగు భాష గొప్పతనం గురించి వివరించారు. గౌరవ అతిథిగా హాజరైన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, రవ్వా శ్రీహరి, ముదిగంటి సుజాతారెడ్డి, ఎస్వీ సత్యనారాయణలు తెలంగాణలో తెలుగు భాషా వికాసాన్ని వివరించారు. అనంతరం జరిగిన హైదరాబాద్ సోదరుల ‘శతగళ సంకీర్తన’ సాంస్కృతిక కార్యక్రమం సభికులను ఆనందోత్సాహాల్లో ముంచెత్తింది. భక్త రామదాసు కీర్తనల ఆలాపనతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్పీకర్ మధుసూదనాచారి, గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ అయాచితం శ్రీధర్, సినీనటుడు తనికెళ్ల భరణి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఇక అలేఖ్య బృందం నృత్య ప్రదర్శన, వింజమూరి రాగసుధ నృత్యం, షిర్నికాంత్ కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఎల్బీ స్టేడియంలో సాంస్కృతికోత్సాహం వెల్లువెత్తింది. వెల్లువై జాలువారిన అవధానం.. తెలంగాణ సారస్వత పరిషత్తులోని మరిగంటి సింగనాచార్యుల ప్రాంగణంలో శతావ«ధాని కోరుట్ల కృష్ణమాచార్య వేదికపై ‘శతావధానం’ సాహిత్య వెల్లువై జాలువా రింది. గౌరీభట్ల మెట్టురామశర్మ శతావధా నం అందరినీ ఆకట్టుకుంది. మరే భాషలో నూ లేని ఈ అద్భుత సాహిత్య ప్రక్రియకు ఆయన పట్టం కట్టారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచ తెలుగు మహాసభలను ఒక డాక్యుమెంటరీగా రూ పొందించనున్నట్లు ఆయన ఈ సంద ర్భంగా వెల్లడించారు. ఇక రవీంద్రభారతి లోని పైడి జయరాజ్ థియేటర్లో యువ జనోత్సవాలు ఆకట్టుకున్నాయి. ఈ సంద ర్భంగా పలు చిత్రాలను ప్రదర్శించారు. వికసించిన సాహితీ సౌరభాలు తెలుగు విశ్వవిద్యాలయం బిరుదురాజు రామరాజు ప్రాంగణంలో సామల సదాశివ వేదికపై పద్యకవితా సౌరభాలు వెల్లివిరిశాయి. ‘తెలంగాణ పద్య కవితా సౌరభం’పై ఆచార్య అనుమాండ్ల భూమయ్య అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో మంత్రి జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంగనభట్ల నర్సయ్య, తూర్పు మల్లారెడ్డి, గురిజాల రామశేషయ్య తదితరులు పద్య కవితా వైభవంపై ప్రసంగించారు. మధ్యాహ్నం ‘తెలంగాణ వచన కవితా వికాసం’పై నిర్వహించిన సదస్సుకు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాదిరాజు రంగారావు, కూరెళ్ల విఠలాచార్య, జూలూరి గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. వచన కవిత్వంపై సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పెన్నా శివరామకృష్ణ మాట్లాడారు. హాస్యావధానం ఆనందభరితం.. రవీంద్రభారతి మినీ ఆడిటోరియంలోని గుమ్మనగారి లక్ష్మీనరసింహ శర్మ ప్రాంగణంలో డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి వేదికపై నిర్వహించిన హాస్యావధానం నవ్వులు పూయించింది. ఆబాల గోపాలం ఆనంద పరవ శులయ్యారు. అష్టావధానంలో డాక్టర్ మలుగ అంజయ్య తన సాహిత్య సాధికారతను సమున్నతంగా ఆవిష్కరించారు. హాస్యావధానంలో శంకర నారాయణ ఆహూతులను కడుపుబ్బా నవ్వించారు. మంత్రి లక్ష్మారెడ్డి, రాపాక ఏకాంబరాచారి, తనికెళ్ల భరణి తదితరులు ఈ అవధానంలో పాల్గొన్నారు. అనంతరం పద్య కవి సమ్మేళనం జరిగింది. ఆకట్టుకున్న కవి సమ్మేళనం.. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం బృహత్ కవి సమ్మేళనంలో ఎందరో భాషా పండితులు, యువ కవులు, కవయిత్రులు తమ సృజనా త్మకతను ఆవిష్కరించారు. శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్ర మానికి దామెర రాములు అధ్యక్షత వహిం చారు. ఇక రవీంద్రభారతిలోని డాక్టర్ యశోదారెడ్డి ప్రాంగణంలో బండారు అచ్చమాంబ వేదిక ‘బాలసాహిత్యం’తో కొలువుదీరింది. రచయితలు పత్తిపాక మోహన్, చొక్కాపు వెంకటరమణ, వాసాల నరసయ్య, ఐతా చంద్రయ్య తదితరులు బాలసాహిత్యం గురించి ప్రసంగించారు. వెల్లివిరిసిన సాహితీ సౌరభం -
ఒకే వేదికపై రామ్‌చరణ్, ప్రభాస్
సినిమా అభిమానులకు తీపివార్త. మరోసారి తెలుగు అగ్రతారలు ఒకే వేదికపై కలువనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు సొంత భవనం లేని తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కోసం ఏకం కానున్నారు. ఇప్పటి వరకూ 'మా' కు సొంత భవనం లేదు. దీనికోసం పలు సార్లు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. నిధుల కొరతతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే దీనికి ఎట్టకేలకు మోక్షం అభించనుంది. ఈ మేరకు స్వంత భవన నిర్మాణం త్వరలోనే చేపట్టనున్నామని, ఇందుకోసం ముమ్మర ప్రయత్నాలు చేపట్టినట్లు మా జనరల్ సెక్రటరీ అయిన సీనియర్ నటుడు నరేష్ ప్రకటించారు. సొంత కార్యాలయం నిర్మాణానికి నిధులు కావాలని, వాటికోసం భారీ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీనికి ఈ నెల 10వ తేదీన కర్టెన్ రైజర్ కార్యక్రమం జరగబోతోంది. పలువురితో ప్రత్యేక ప్రదర్శనలు.. సీనియర్ నటులకు సన్మానాలతో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇప్పటికే ఈకార్యక్రమానికి పలువురు అలనాటి స్టార్స్ కృష్ణ, కృష్ణంరాజులు మద్దతు పలుకుతున్నారు. సీనియర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు సైతం వంతు సహాయం అందిస్తామన్నట్లు నరేష్ తెలిపారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు కూడా తమ వంతు సపోర్ట్ ఇస్తామని చెప్పారట. రామ్ చరణ్, ప్రభాస్ ఈ కార్యక్రమంలో భాగం అవుతారని నరేష్ తెలిపారు. ఏదేమైనా 'మా' సొంత భవనం నిర్మాణానికి తెలుగు సినీ రంగం అంతా మళ్లీ ఒకే వేదికపైకి రానుండటంతో సినీ అభిమానులకు పండుగనే చెప్పాలి. -
ప్రైవేటు జోరు.. సర్కారు బేజారు
నిజామాబాద్‌అర్బన్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరించక పోవడం,నాణ్యత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడం ప్రధానంగా మారింది. స్థానికంగా ప్రజాప్రతినిధుల చొరవ కూడా కరువైంది. వెరసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. ఇదీ పరిస్థితి..... విద్యాసంవత్సరం ప్రారంభంలో ప్రవేశాల పెంపునకు ప్రభుత్వ పాఠశాలల్లో 15 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలు మొక్కుబడిగా కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రైవేట్ పాఠశాలలు వేసవి సెలవులలోనే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టి ముగుస్తున్నాయి. ఇది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలకు ఆటంకంగా మారింది. నిబంధనల ప్రకారం అన్ని పాఠశాలల్లో ప్రవేశాలు ఒకేసారి జరిగాలి. ఇది సక్రమంగా అమలు కావడం లేదు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సెలవులలో ఊరూర తిరుగుతూ విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించుకుంటున్నారు. తక్కువ ఫీజులు, నాణ్యమైన విద్య, ఇతర సౌకర్యాల పేరిట విద్యార్థుల తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల కోసం అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలు నిర్వహించడం లేదు. మొక్కుబడిగా కొనసాగుతున్నాయి. జిల్లాలో 2162 ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం కోట్లాది రూపాయలను పాఠశాలలకు కేటాయిస్తోంది. కాని పాఠశాలల్లో ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం, ఉన్న చోట సక్రమంగా విద్య అందకపోవడంతో ప్రభుత్వ ఆశయానికి గండికొడుతోంది. పేద, మధ్యతరగతి విద్యార్థులకు శాపంగా మారింది. ప్రజాప్రతినిధులు మేలుకొనాలి స్థానికంగా ప్రజాప్రతినిధులు మేలుకొని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే కార్యక్రమం చేపట్టాలి. గత ఏడాది భీంగల్ మండలం చేంగల్ ప్రభుత్వ పాఠశాలలో 12 మంది విద్యార్థులు ఉన్న పాఠశాల 150 మంది విద్యార్థులకు చేరింది. స్థానిక గ్రామ కమిటీ, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలనే సంకల్పంతో ఇది సాధ్యమైంది. ప్రతి చోట ఈ విధానం అమలు అయితే ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడతాయి. కాగా చాలాచోట్ల స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యవైఖరి కొనసాగుతోంది. పాఠశాలల్లో విద్యార్థుల పెంపునకు పట్టింపులేకపోవడం, పాఠశాల విద్యాబోధనకు సంబంధించి టీచర్లు సమయపాలన పాటించకపోవడం రుగ్మతగా మారాయి. మధ్యాహ్నం భోజనం సైతం పట్టించుకునేవారే కరువయ్యారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వ పాఠశాలలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతోంది. మండల, జిల్లా ప్రజాపరిషత్ పాఠశాలలవైపు స్థానిక ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడటం లేదు. ప్రైవేట్ పాఠశాలలకు ముకుతాడు వేయాలి. ఒక వైపు ప్రైవేట్ పాఠశాలల జోరుకు జిల్లా విద్యాశాఖ నిర్లక్ష్యం కూడా ప్రధాన కారణం. ప్రైవేట్ పాఠశాలలు నెలకొల్పాలంటే జీవో నం.1 ప్రకారం నియమ నిబంధనల పాటించిన వాటికే అనుమతి ఇవ్వాలి. కానీ చాలాచోట్ల అమలు కావడం లేదు. ఆటస్థలం, సౌకర్యాలు లేని ప్రైవేట్ పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. వీటిని సైతం అధికారులు తనిఖీలు చేసిన సందర్భాలు లేవు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వేసవి కాలం సెలవుల్లోనే ఆడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. వీటిని నియంత్రిస్తేనే ప్రభుత్వ పాఠశాలలకు మేలు జరుగుతుంది. స్థానికంగా ప్రజాప్రతినిధులు తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించలేకపోతున్నారు. పాఠశాల విద్యాబోధనకు సంబంధించి పరిశీలన చేపట్టడం లేదు. టీచర్ల సమయ పాలనను ప్రశ్నించడం లేదు. ఇలాగైతే ఎలా ? ప్రభుత్వ పాఠశాలలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలలను నియంత్రించాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో స్థానిక ప్రజాప్రతినిధులు విద్యార్థులను చేర్పించే బాధ్యత చేపట్టాలి. - జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులను ఉద్దేశించి కలెక్టర్ యోగితారాణా వ్యాఖ్యలు -
ఉత్సవం అదిరేలా..
ఘనంగా విశాఖ ఉత్సవ్ నిర్వహణకు ఏర్పాట్లు నగరానికి సరికొత్త సొబగులు 23, 24, 25 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు విశాఖ ఉత్సవ్-2015ను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బీచ్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. బీచ్ రోడ్డులో ఉన్న ప్రముఖుల విగ్రహాలకు మెరుగులు దిద్దుతున్నారు. ట్రాఫిక్ ఐలాండ్లున్న చోట విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. హోటల్స్, షాపింగ్ మాల్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా తీర్చిదిద్దాలని ఆయా యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్నం సిటీ: విశాఖ ఉత్సవ్‌ను ఈ నెల 23, 24, 25 తేదీల్లో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్రేతర ప్రాంతాల్లోనూ విశాఖ అందాలకు ప్రచారం కల్పిస్తున్నారు. అందుకు ప్రత్యేక బృందాలను తరలించి ఆయా ప్రాంతాల పర్యాటకులను ఆకర్షించేలా రాయితీల ప్రకటిస్తున్నారు. ఆ మూడు రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రధాన వేదికలపై కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దాదాపు వెయ్యి మంది కళాకారులను సమీకరించి వారితో ప్రత్యేక ర్యాలీని చేపట్టి పర్యాటకుల్లో జోష్ పెంచాలనుకుంటున్నారు. బీచ్‌లో భారీ వేదికలను సిద్ధం చేస్తున్నారు. అధునాతన లైటింగ్, సినీ కళాకారులతో డ్యాన్స్‌లు, చిన్న చిన్న నాటికలతో యువతను అలరించే కార్యక్రమాలను నిర్వహించనున్నారు. నగరంలో ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపించేలా పెయింటింగ్స్ వేస్తున్నారు. 21వ తేదీన 3 వేల మంది మహిళలతో ఏయూ గ్రౌండ్స్‌లో ముగ్గుల పోటీలు 22వ తేదీన నోవాటెల్ హోటల్ ఎదురుగా బీచ్ రోడ్డులో కైట్ ఫెస్టివల్ ఆరేడు క్రీడాంశాల్లో ప్రత్యేకమైన క్రీడా పోటీలు పిల్లల కోసం అన్ని పాఠశాలల్లోనూ వ్యాసరచన, వ్యక్తత్వ, పెయింటింగ్, స్లోగన్స్ పోటీలు 25వ తేదీన బీచ్ తీరంలో 100కు పైగా విద్యుత్ దీపాలతో అలంకరించిన బోట్లతో ప్రదర్శనలు నేవీ బ్యాండ్ ప్రదర్శన, 100 మీటర్ల ఎతై ్తన టవర్‌పై విద్యుత్ ప్రభలు, సినీ నటి శోభన డ్యాన్స్‌లు ప్రత్యేక ఆకర్షణలుగా నిలువనున్నాయి. పరిమళ: వుడా పార్కు కేంద్రంగా పరిమళ పేరుతో ఫ్లవర్ షోను ఏర్పాటు చేశారు. ఆ మూడు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకూ ఈ ప్రదర్శన ఉంటుంది. ఆ మూడు రోజుల పాటు మ్యూజిక్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కళ: సిరిపురం గురజాడ కళా క్షేత్రం వేదికగా ఆ మూడు రోజుల్లో రోజూ సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జాతర: కళా గ్రామం పేరిట మధురవాడ జాతర వద్ద ఆ మూడు రోజుల్లో రోజూ సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గిరిజనుల థింసా నత్యం, గరగల నృత్యం తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉత్సవ్ వేదిక: విశాఖ ఉత్సవ్-2015 ప్రధాన వేదికను ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేశారు. ఈ వేదిక కేంద్రంగా రోజూ సాయంత్రం 5 నుంచి సాయంత్రం 10 గంటల వరకు పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఉత్సవ్‌ను విజయవంతం చేయండి విశాఖ ఉత్సవ్‌ను విజయవంతం చేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. సర్క్యూట్ హౌస్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ, విదేశాల్లో విశాఖను ఆవిష్కరించే ప్రయత్నమే ఈ విశాఖ ఉత్సవ్-2015 అని తెలిపారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ప్రధానంగా మూడు వేదికల్లో నిరంతరం కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ మూడు రోజులు పర్యాటక ప్రదేశాలను తిలకించేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 150 ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశామని, అందులో రాయితీలతో కూడిన ఆహారం అందించేందుకు హోటల్ యజమానులు ముందుకొచ్చారని గుర్తు చేశారు. ఎవరి నుంచి బలవంతంగా ఉత్సవాల కోసం విరాళాలు కోరడం లేదని, ఇచ్చిన వారి నుంచి మాత్రమే తీసుకుంటున్నామని చెప్పారు. ఉత్సవాలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఖర్చులు, వచ్చిన నిధుల వివరాలను వేదికలపై ప్రకటిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
గ్రాండ్ వెల్కమ్
నూతన సంవత్సరం 2015కు బుధవారం రాత్రి నగరవాసులు ఘనంగా స్వాగతం పలికారు. స్వాగత సంరంభంలో భాగంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో ఉత్సాహం ఉరకలేసింది. నగరంలోని రహదారులపై కుర్రకారు కేరింతలు కొట్టారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమాలు అలరించాయి. కొత్త సంవత్సరానికి నగర ప్రజలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అర్ధరాత్రి 12 గంటలు కాగానే కేక్‌లు కట్‌చేసి, బాణసంచాపేల్చి సందడి చేశారు. బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. యువకులు రోడ్లపై సందడిచేశారు. నగరంలోని పలు హోటళ్లలో 2014కు వీడ్కోలు, 2015కు స్వాగతం పలుకుతూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యుత్ దీపాల వెలుగుల మధ్య వెండితెర, బుల్లితెర తారలు నృత్యాలతో అలరించారు. ఫార్చ్యూన్లో అంబరాన్నంటిన సంబరాలు మిరుమిట్లుగొలిపే విద్యుత్ దీపాల వెలుగులు... హై ఓల్టేజీ మ్యూజిక్.. దుమ్మురేపే డిస్కో.. హోరెత్తించిన డీజేల నడుమ నూతన సంవత్సర ఆగమన సంబరాలు జరిగాయి. మహాత్మాగాంధీ రోడ్డులోని హోటల్ ఫార్చ్యూన్ మురళీపార్క్‌లో కౌంట్‌డౌన్ 2015 పేరిట నిర్వహించిన ఈ సంబరాలు అంబరాన్నంటాయి. వయోభేదం లేకుండా చిన్న, పెద్దా అంతా కలిసి చిందులతో సందడిచేశారు. బోల్ బేబీ బోల్ ఫేమ్ మానస ఆచార్య, పాప్‌సింగర్ సిద్దూ లేటెస్ట్ సాంగ్స్‌తో హుషారె త్తించగా, సురేష్ మిమిక్రీ కడుపుబ్బా నవ్వించింది. వేడుకల మధ్యలో ఫన్నీ గేమ్స్‌లో దంపతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈవెంట్స్ మధ్యలో లక్కీడిప్‌లు నిర్వహించి చిరు బహుమతులు అందిస్తూ యాంకర్లు ఉత్సాహపరి చారు. తాజ్ గేట్‌వే హోటల్లోనూ నూతన సంవత్సరం వేడుకలు జోరుగా సాగాయి. నగరంలో ఎక్కడ చూసినా న్యూ ఇయర్ జోష్ కనిపించింది. నగరంలో కేక్‌లు, స్వీట్లు, ఫ్లవర్ బొకేల విక్రయాలు జోరుగా సాగాయి. - లబ్బీపేట ఫన్‌టైమ్ క్లబ్లో సందడే సందడి సినిమా, సీరియల్ ఆర్టిస్టుల నృత్యాలు, మోడరన్ ఈవెంట్లు యువతలో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ఈ వేడుకలకు భారతి యాంకరింగ్ చేయగా నిరుపమ్, మంజుల, రవికృష్ణ, చందన బ్లాస్టింగ్, థ్రిల్లింగ్ డ్యాన్స్‌లతో అలరించారు. అనంతరం జరిగిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. సభ్యులకు తంబోలా, లక్కీడిప్, లక్కీ మేల్, లక్కీ ఫీమేల్, లక్కీ కిడ్, లక్కీ కపుల్ విభాగాల్లో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. క్లబ్ సొసైటీ కార్యదర్శి అజిత్‌బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గాంధీ, ప్రతినిధి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. - పటమట -
నేటినుంచి ప్రత్యేక కార్యక్రమాలు
* వికలాంగుల దినోత్సవం సందర్భంగా.. మండల, జిల్లాస్థాయిలో పోటీలు * ప్రత్యేక అవసరాలుగల పిల్లలు, వారి తల్లిదండ్రులకు * సాధారణ పిల్లలతోపాటు ఉపాధ్యాయులకు కూడా.. చిలుకూరు : ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో మండల, జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రతి యేటా ప్రపంచ వికలాంగుల దినోత్పవం సందర్భంగా ప్రత్యేక అవసరాల పిల్లలకు మాత్రమే ఒక్క రోజు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసేవారు. కానీ ఈ ఏడాది నుంచి కార్యక్రమాల నిర్వహణలో మార్పులు చేశారు. వారం రోజుల పాటు ప్రత్యేక అవసరాలు గల పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు అలాగే సాధారణ పిల్లలు, ఉపాధ్యాయులకు కూడా మండల జిల్లా స్థాయిలో వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. నేడు ఉపాధ్యాయులకు.. మండల స్థాయిలో ఉపాధ్యాయులకు శుక్రవారం వివిధ అంశాలలో పోటీలు నిర్వహిస్తారు. ఉపాధ్యాయులకు ‘ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాలు’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు, సహిత విద్యలో ఉపాధ్యాయుల పాత్ర అనే అంశంపై వకృ్తత్వ పోటీలు , ప్రత్యేక అవసరాల పిల్లల స్థితిగతులపై క్రియేటివ్ ఆర్ట్ పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలలో గెలుపొందిన ఉపాధ్యాయులు వచ్చే నెల ఒకటవ తేదీన జిల్లా స్థాయిలో నల్లగొండలోని సర్వశిక్ష అభయాన్‌లో నిర్వహించే పోటీలలో పాల్గొనాలి. డిసెంబర్ 2వ తేదీన పిల్లలకు పోటీలు * వచ్చే నెల 2వ తేదీన ప్రత్యేక అవసరాలు గల పిల్లలతో పాటు సాధారణ పిల్లలను కలిపి ఆటల పోటీలు నిర్వహిస్తారు. * త్రోబాల్, రింగ్స్ వేయడం, బోర్డు గేమ్, బ్యాలెన్స్ వాక్, రంగోలి, డ్రాయింగ్, పెయింటింగ్, పాటల పోటీలు నిర్వహిస్తారు. బుట్టలో బంతి వేయడం, సరళమైన ఆటలు నిర్వహిస్తారు. 3న తల్లిదండ్రులకు కూడా.. వచ్చే నెల 3వ తేదీన ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులకు కూడా పలు రకాల ఆటలు పోటీలు నిర్వహిస్తారు . రన్నింగ్, రంగోలి, పాటలు, డ్యాన్స్‌ల పోటీలు నిర్వహిస్తారు. కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించేందుకు మండలానికి ప్రత్యేకంగా రూ. 10 వేల చొప్పున కేటాయించారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని ఎంఈఓలకు పూర్తి స్థాయిలో సమాచారం అందించారు. -
పర్యాటక రంగానికి ప్రోత్సాహం
25 నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు కూచిపూడి, మంగినపూడి, భవానీద్వీపంలలో ప్రదర్శనలు సబ్ కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడి విజయవాడ : పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు జిల్లా వ్యాప్తంగా మూడురోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సబ్ కలెక్టర్, జిల్లా పర్యాటక శాఖ అధికారిణి ఎస్.నాగలక్ష్మి తెలిపారు. ఆమె శుక్రవారం తన కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 25 నుంచి మూడురోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 25న మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలో ప్రఖ్యాతి గాంచిన కూచిపూడి నాట్య ప్రదర్శనలు, జిల్లాలోని అన్ని పర్యాటక కేంద్రాల్లో పర్యాటక రంగంపై అవగాహన కల్పించే ప్రచార బ్యానర్లు, బెలూన్ల ప్రదర్శనలు, మంగినపూడి బీచ్‌లో పర్యాటకుల కోసం కనీస సౌకర్యాలు కల్పించి భవన ప్రారంభోత్సవం, కోలాట మహోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 26న ఇబ్రహీంపట్నం, కొండపల్లి బొమ్మల తయారీ కాలనీలో కొండపల్లి బొమ్మల తయారీ ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. విజయవాడ, మచిలీపట్నంలలో పోస్టర్ పెయింటింగ్ పోటీలు, భవానీ ద్వీపం, మంగినపూడి బీచ్‌లలో ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. 27న భవానీ ద్వీపంలో డప్పుల విన్యాసం, సాంస్కృతిక ప్రదర్శనలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, హరిదాసుల సాంస్కృతిక కార్యక్రమాలు, గంగిరెద్దుల విన్యాసాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు విజయవాడ బందరు రోడ్డులోని హోటల్ డీవీ మేనర్ వద్ద నుంచి హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులతో పర్యాటక నడక, పరుగు ఉంటాయన్నారు. అనంతరం ముగింపు కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేస్తామని సబ్ కలెక్టర్ తెలిపారు. సమావేశంలో డీపీఆర్వో కె.సదారావు, డివిజనల్ టూరిజం మేనేజర్ బాపూజీ, డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ టీఎస్ బాబు, సహాయ టూరిజం అధికారి జి.రామలక్ష్మణరావు, హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పట్టాభి పాల్గొన్నారు. -
నేటినుంచి ‘బడి పండగ’
16 నుంచి 21 వరకు వివిధ కార్యక్రమాలు నల్లగొండ అర్బన్/చిలుకూరు: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ విద్యార్థుల నమోదును పెంచాలనే ఉద్దేశంతో జి ల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం నుంచి 21వ తేదీ వరకు బడి పండగ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేశారు. 15 రోజులు ఆలస్యంగా.. గత విద్యాసంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాడి బడి పండగ కార్యక్రమాన్ని ఆలస్యంగా చేపట్టారు. ప్రతి ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభంలోనే చదువుల పండగ, పాఠశాల సంబురాలు తదితర పేర్లతో జూన్ 1వ తేదీన నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఈ ఏడాది 15 రోజులు ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. విద్యార్థులు కూడా దాదాపు పాఠశాలల్లో చేరిపోయారు. ఈ క్రమంలో ఆర్భాటంగా బడి పండగ నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమిటని ఉపాధ్యాయులు పేర్కొంటు న్నారు. బడి పండగను జయప్రదం చేయాలి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు బడి పండుగ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించాలని డీఈఓ ఎస్.విశ్వనాథరావు, ఆర్వీఎం ప్రాజెక్టు అధికారి సిహెచ్.శ్రీనివాసులు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస ్ఠ్థలు, ప్రజా సంఘాలు, పాఠశాల యాజ మాన్య కమిటీలు కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. బడిపండగ షెడ్యూల్ - 16వ తేదీన ఎస్ఎంసీ సమావేశాలు. - 17వ తేదీన విద్యార్థులతో ర్యాలీ - 18వ తేదీన నూతన విద్యార్థులతో అక్షరాభ్యాసం, ఉపాధ్యాయులు, సీఆర్పీలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం. - 19వ తేదీన విద్యాహక్కుచట్టంపై అవగాహన సదస్సులు. - 20వ తేదీన బాలికా విద్యాదినోత్సవం/ నాణ్యమైన విద్యా దినోత్సవం/మొక్కలు నాటే కార్యక్రమం. - 21వ తేదీన మధ్యాహ్న భోజన దినోత్సవం