న్యూ ఇయర్ వేడుకల నిర్వాహకులకు కమిషనర్ సూచనలు
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరం సందర్భంగా ఈ నెల 31న రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ప్రత్యేక ఈవెంట్స్ నిర్వహించే 3 నక్షత్రాల హోటళ్లు, బార్లు, క్లబ్బులు, పబ్‌లు తప్పని సరిగా 15 రోజుల ముందే అనుమతులు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ఈవెంట్ నిర్వహించే ప్రాంతాల్లో తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ(మెజర్స్) ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్ట్ 2013 కింద తప్పని సరిగా ఎంట్రీ, ఎగ్జిట్‌తో పాటు ప్రాంగణమంతా కవరయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని. తగిన సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బందిని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సరైన ఏర్పాట్లు చేసుకోవాలని, అశ్లీలతకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఔట్‌డోర్‌లో ఉండే సౌండ్ సిస్టమ్స్ రాత్రి 10 గంటలకల్లా బంద్ చేయాలని, ఇండోర్‌లో ఒంటి గంట వరకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. సామరŠాధ్యనికి మించి టిక్కెట్లు జారీ చేయడం వల్ల పలు రకాల ఇబ్బందులతో పాటు శాంతి భద్రతల సమస్యలు కూడా తలెత్తుతాయన్నారు. ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ వాడకూడదని, ఈ విషయంలో నిర్వాహకులు పార్కింగ్, ఇతర ప్రాంతాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఎక్సైజ్ శాఖ నిబంధనల మేరకు నిరీ్ణత సమయం వరకే మద్యం ఉపయోగించాలని, ఈవెంట్‌కు వచ్చే కస్టమర్లు తిరిగి వెళ్లే సమయంలో డ్రైవర్లు, క్యాబ్స్ అందుబాటులో ఉంచాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు కస్టమర్లను దూరంగా ఉంచాలన్నారు. ఆ రోజు రాత్రి విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని సీపీ తెలిపారు. అగ్నమాపక శాఖ ఆదేశాల మేరకు ఫైర్ వర్క్స్‌ను ఉపయోగించరాదని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment