Police Commissionerate
-
సమాజమే నీ సేవకు సలాం
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన చిత్రం ‘కానిస్టేబుల్’. ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా మధులిక వారణాసి హీరోయిన్గా పరిచయమవుతున్నారు. జాగృతి మూవీ మేకర్స్‌పై బలగం జగదీష్ నిర్మించారు. సుభాష్ ఆనంద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘కానిస్టేబుల్..’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చేతులమీదుగా విడుదల చేశారు.‘కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా సమాజమే నీ సేవకు సలాం అంటుందన్న... కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా ఎగిరే జెండా నిన్నే చూసి మురిసిపోతుందన్నా....’ అంటూ ఈ పాట సాగుతుంది. శ్రీనివాస్ తేజ సాహిత్యం అందించిన ఈ పాటని నల్గొండ గద్దర్ నర్సన్న ఆలపించారు.ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ– ‘‘మా కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ల మీద వచ్చిన ఈ పాటని నేను ఆవిష్కరించినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి పోలీస్ ఈ సాంగ్ వింటారు’’ అన్నారు. ‘‘కానిస్టేబుల్..’ పాటని సీవీ ఆనంద్‌గారు విడుదల చేయడం మా సినిమాకు గర్వకారణం’’ అని వరుణ్ సందేశ్ చెప్పారు. ‘‘కానిస్టేబుల్ కావడం నా చిన్ననాటి కల. అది నెరవేరకపోవడంతో ఈ సినిమా నిర్మించాను’’ అని బలగం జగదీష్ తెలిపారు. ‘‘ఈ సినిమాలో సందర్భానుసారంగా వచ్చే టైటిల్ సాంగ్ అందర్నీ స్పందింపజేస్తుంది’’ అన్నారు ఆర్యన్ సుభాన్ ఎస్కే. -
15 రోజుల ముందే అనుమతి తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరం సందర్భంగా ఈ నెల 31న రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ప్రత్యేక ఈవెంట్స్ నిర్వహించే 3 నక్షత్రాల హోటళ్లు, బార్లు, క్లబ్బులు, పబ్‌లు తప్పని సరిగా 15 రోజుల ముందే అనుమతులు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ఈవెంట్ నిర్వహించే ప్రాంతాల్లో తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ(మెజర్స్) ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ 2013 కింద తప్పని సరిగా ఎంట్రీ, ఎగ్జిట్‌తో పాటు ప్రాంగణమంతా కవరయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని. తగిన సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బందిని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సరైన ఏర్పాట్లు చేసుకోవాలని, అశ్లీలతకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఔట్‌డోర్‌లో ఉండే సౌండ్ సిస్టమ్స్ రాత్రి 10 గంటలకల్లా బంద్ చేయాలని, ఇండోర్‌లో ఒంటి గంట వరకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. సామరŠాధ్యనికి మించి టిక్కెట్లు జారీ చేయడం వల్ల పలు రకాల ఇబ్బందులతో పాటు శాంతి భద్రతల సమస్యలు కూడా తలెత్తుతాయన్నారు. ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ వాడకూడదని, ఈ విషయంలో నిర్వాహకులు పార్కింగ్, ఇతర ప్రాంతాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎక్సైజ్ శాఖ నిబంధనల మేరకు నిరీ్ణత సమయం వరకే మద్యం ఉపయోగించాలని, ఈవెంట్‌కు వచ్చే కస్టమర్లు తిరిగి వెళ్లే సమయంలో డ్రైవర్లు, క్యాబ్స్ అందుబాటులో ఉంచాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు కస్టమర్లను దూరంగా ఉంచాలన్నారు. ఆ రోజు రాత్రి విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని సీపీ తెలిపారు. అగ్నమాపక శాఖ ఆదేశాల మేరకు ఫైర్ వర్క్స్‌ను ఉపయోగించరాదని సూచించారు. -
9 అంశాల ఎజెండా !
ఇవీ ఎజెండాలోని అంశాలు ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం – కాలానుగుణ పరిస్థితులు, ఆరోగ్యం– సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య. శాంతిభద్రతలు–రక్షణ సంబంధిత సమస్యలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం.సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలకు ముందే సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 16న మంత్రులతో కలిసి కీలక సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్కమిషనర్లు, ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు పాల్గొంటారు. పాలనను పూర్తిస్థాయిలో పరుగులు పెట్టించే క్రమంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు సమాచారం.గత డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకసారి కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో సమావేశం నిర్వహించినా, ఆ తర్వాత వెంటనే లోక్‌సభ ఎన్నికల కోడ్ రావడం, కలెక్టర్లు, ఎస్పీలంతా పూర్తిగా ఎన్నికల విధుల్లోనే నిమగ్నం కావడంతో పాలనపై దృష్టి సారించలేకపోయారు. కోడ్ ముగియడం, ఈ మధ్యనే కలెక్టర్లు, కార్యదర్శులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల బదిలీలు చేయడం ద్వారా కొత్తగా ఆయా స్థానాల్లోకి వచ్చిన అధికారులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ ప్రా«థమ్యాలపై దిశానిర్దేశం చేయడానికి ఈ సమావేశాన్ని వినియోగించుకోనున్నారు. 16న నిర్వహించే సమావేశ ఏజెండాలోని అంశాలను కూడా వారికి పంపించారు. ప్రధానంగా తొమ్మిది అంశాలను ఎజెండాలో చేర్చారు. ⇒ రాష్ట్రప్రభుత్వం అధికారంలోకి వచి్చన వెంటనే ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మార్చి, అక్కడ ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ప్రజల నుంచి విజ్ఞాపన పత్రాలు స్వీకరించడం, వాటిని సంబంధిత విభాగాలకు పంపించి అవి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.గడిచిన ఆరేడు నెలల్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? వాటిలో ఏ విధమైన విజ్ఞాపనలు ఉన్నాయి? వచి్చన విజ్ఞాపనల్లో ఎన్నింటికి పరిష్కరించారు? ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? పెండింగ్‌లో ఉండడానికి గల కారణలేంటి? అన్న అంశాలను ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. ⇒ ఆర్థికంగా పెద్దగా భారం కాని పనులు కూడా పరిష్కరించకుండా ఉన్న పక్షంలో వాటిపై అధికారులకు నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించేలా ఆదేశాలు ఇవ్వనున్నట్టు ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ⇒ భూముల సమస్యకు సంబంధించి ధరణిని రద్దు చేస్తామని, రైతులకు ప్రయోజనకరంగా ఉండే కొత్త వ్యవస్థ తీసుకొస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచి్చన సంగతి తెలిసిందే. ధరణిపై ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం నియమించిన సంగతి విదితమే. ఆ కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమై పూర్తిస్థాయిలో నివేదిక సిద్ధం చేసినట్టు తెలిసింది. దీనిపై కలెక్టర్ల నుంచి ఫీడ్ తీసుకొని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. ⇒ వ్యవసాయ సీజన్ ప్రారంభమై దాదాపు నెలన్నర రోజులు అవుతున్న నేపథ్యంలో రైతులకు ఎరువులు, వర్షాభావ పరిస్థితులున్న చోట ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఈ సమావేశంలోనే చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ⇒ వర్షాకాలసీజన్లో వ్యాధులు ప్రబలే అవకాశం అధికంగా ఉన్నందున, ముందస్తుగా చేపట్టాల్సిన జాగ్రత్తలు గురించి ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు, ఆస్పత్రుల్లో సరైన వైద్య సదుపాయం కలి్పంచేందుకు డాక్టర్లు, సిబ్బంది, మందులు తదితర అంశాలను చర్చించనున్నారు. ⇒ వర్షాకాలంలో దాదాపు 20 కోట్ల మొక్కలను ఈసారి నాటాలని నిర్ణయించారు. కార్యక్రమం కొనసాగుతున్న తీరును కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షించనున్నారు. ⇒ మహిళాశక్తి క్యాంటీన్ల ఏర్పాటు, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఏ విధంగా ముందుకు వెళ్లాలని చర్చించనున్నారు.⇒ విద్యాసంవత్సరం ప్రారంభం, పాఠశాలల పరిస్థితి, వసతి గృహాలు, మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల కొరత తదితర అంశాలను క్షుణ్ణంగా కలెక్టర్లతో సమీక్షిస్తారు. ⇒ ఇక శాంతిభద్రతలు, రక్షణపరమైన అంశాలతోపాటు, రాష్ట్రంలో పెరిగిపోతున్న మాదక ద్రవ్యాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు, మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాల మాట వినిపించరాదని సీఎం ఇదివరకు ఇచి్చన ఆదేశాలు మరోసారి ఈ సమావేశంలో పునరుద్ఘాటించనున్నారు. -
తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యపై ప్రభుత్వం సీరియస్
చెన్నై : చెన్నైలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)చీఫ్ కే.ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యతో తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయ్యింది. చెన్నై పోలీస్ కమిషనర్ సందీప్ రాయ్ రాథోర్‌ను బదిలీపై వేటు వేసింది. చెన్నై అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ లా అండ్ ఆర్డర్)గా ఉన్న అరుణ్‌ను కమిషనర్‌గా నియమించింది.ఇప్పటి వరకు చెన్నై పోలీస్ కమిషనర్‌గా ఉన్న సందీప్ రాయ్‌ని చెన్నై పోలీస్ ట్రైనింగ్ కాలేజీ డీజీపీగా ఎంపిక చేసింది. -
హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు: వైజాగ్ చేరుకున్న బాధితులు
విశాఖపట్నం: కంబోడియా కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని విశాఖపట్నం పోలీసు కమిషనర్ రవి శంకర్ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో ఈ కేసు సంబంధించిన విషయాలు తెలిపారు. ‘‘మొత్తం 68 మంది బాధితులను రక్షించాము. ఇంకా 90 మంది కంబోడియాలో ఉన్నారు. 68 మందిలో 25 మంది వైజాగ్ వాళ్ళూ. దేశ వ్యాప్తంగా 25 మంది ఏజెంట్లు ఉన్నారు. 12 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశాం. ఆరుగురు ఏజెంట్లుపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశాము. ఈ మొత్తం స్కాంలో సిమ్ సప్లయార్స్ ముగ్గురుని గుర్తించాం. ... ఒక సిమ్ కార్డు భారత్ నుంచి తీసుకొని వెళ్లి ఇస్తే 10 నుంచి 15 వేలు కమిషన్ ఇస్తారు. నకిలీ బ్యాంక్ అకౌంట్స్.. తయారు చేస్తున్న ముఠాపై కూడా నిఘా పెట్టము. ఎమర్జెన్సీ పాస్ పోర్టు కూడా ఇండియా ఎంబసీ అధికారులు జారీ చేస్తున్నారు’’ అని తెలిపారు.కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్‌పై తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. అక్కడ నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు వాట్సాప్‌తో పాటు ‘ఎక్స్’ ద్వారా వీడియో సందేశాలు పంపించిన విషయం తెలిసిందే.విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్ విజయ్‌కుమార్ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్ల మీదుగా కంబోడియాకు పంపించారు.అక్కడ మరో గ్యాంగ్ బాధితులను రిసీవ్ చేసుకొని కంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్‌కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఆ గ్యాంగ్ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు. అక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.ఈ నేపథ్యంలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. -
హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు సిట్ ఏర్పాటు
సాక్షి, విశాఖపట్నం: హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తాజాగా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయింది. విశాఖ సీపీ రవిశంకర్ ఆధ్వర్యంలో 20 మందితో సిట్ బృందం ఏర్పడింది. జాయింట్ సీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయనుంది. మరోవైపు.. ఆపరేషన్ కంబోడియా విజయవంతమైంది. 360 మంది భారతీయులను ఎంబసీ అఫ్ ఇండియా కాపాడింది. సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్: + 855 10642777 సంప్రదించాలని అధికారులు కోరారు. అయితే.. విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కంబోడియా వెళ్లిన భారతీయులు మోసపోయారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్‌పై సోమవారం తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. అక్కడ నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు మంగళవారం వాట్సాప్‌తో పాటు ‘ఎక్స్’ ద్వారా వీడియో సందేశాలు పంపించిన విషయం తెలిసిందే.విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్ విజయ్‌కుమార్ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్ల మీదుగా కంబోడియాకు పంపించారు. అక్కడ మరో గ్యాంగ్ బాధితులను రిసీవ్ చేసుకొని కంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్‌కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఆ గ్యాంగ్ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు.అక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.ఈ కేసుని లోతుగా దర్యాప్తు చేయాలని సీపీ రవిశంకర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జాయింట్ కమిషనర్ ఫకీరప్ప సారథ్యంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.భవానీప్రసాద్, సిబ్బందితో ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
‘బెస్ట్ ఠాణా’లో 85 మంది బదిలీ.. సీపీ శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న 85మందిని ఒకేసారి బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఠాణాలో మొత్తం 130 మంది పనిచేస్తుండగా, ఇప్పటికే ఇన్స్పెక్టర్ బి.దుర్గారావు సస్పెండ్ అయ్యారు. తాజాగా ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు ఇక్కడ పనిచేస్తున్న మహిళ సిబ్బంది సహా 85 మందిని బదిలీ చేసి సీఏఆర్(సిటీ ఆర్మ్డ్ రిజర్వు) హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సీపీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో వివిధ ఠాణాల నుంచి 82 మందిని నియమించారు. దేశ పోలీస్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. మసకబారిన ఠాణా ప్రతిష్ట .. నగరంలోని అత్యంత కీలకమైన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ ఏ గ్రేడ్ కేటగిరీలో ఉంది. కొన్నాళ్ల క్రితం వరకు సీఎం నివాసం, క్యాంపు కార్యాలయం దీని పరిధిలోనే ఉండేవి. అనేక కీలక ప్రాంతాలు, బడా వ్యాపార సంస్థలు, జ్యువెలరీ షాపులు, పోలీసు ఉన్నతాధికారుల క్వార్టర్స్... ఇలా విస్తరించి ఉన్న ఈ ఠాణాలో ఇన్స్పెక్టర్ పోస్టింగ్‌కు భారీ డిమాండ్ ఉండేది. కొన్నిసార్లు సీఎం కార్యాలయ అధికారుల చేతిలోనే ఈ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ ఉండేది. పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు 2018లో దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్ల నిర్వహణ, పనితీరును బేరీజు వేస్తూ బెస్ట్ ఠాణా అవార్డులు ఇవ్వడాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆ ఏడాది నుంచే ప్రారంభించింది. ఆ ఏడాది ఈ పోలీస్‌స్టేషన్ దేశంలోనే రెండో బెస్ట్ ఠాణాగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలోనే నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసుఅకాడమీలో శిక్షణ పొందుతున్న ఐపీఎస్‌లతో పాటు ఇక్కడ పర్యటనకు వచ్చిన వివిధ రాష్ట్రాల, దేశాల మంత్రులు, అధికారులకు ఈ మోడల్ ఠాణా చూపించేవారు. దాదాపు మూడునాలుగేళ్ల వరకు ఈ క్రేజ్ కొనసాగింది. ఇటీవల కాలంలో వరుస వివాదాలు కొందరు అధికారుల వ్యవహారశైలి, సిబ్బంది కక్కుర్తి వెరసి ఈ ఠాణా వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న వరుస ఘటనలు కూడా దీని ప్రతిష్టను మసకబారేలా చేశాయి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ ‘రోడ్డు ప్రమాదం–ఎస్కేప్’ఎపిసోడ్లో ఠాణా ఇన్స్పెక్టర్గా పనిచేసిన బి.దుర్గారావుపై సస్పెన్షన్ వేటు పడటం, ఆయన ఇదే కేసులో నిందితుడిగా మారడంతోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇన్స్పెక్టర్ ప్రేమ్‌కుమార్ అరెస్టు కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మద్యం తాగి వాహనం నడుపుతూ ఈ పోలీసులకు చిక్కిన ఇద్దరు ఠాణా నుంచి తప్పించుకున్నారు. గత వారం మద్యం మత్తులో వాహనం నడుపుతూ బీభత్సం సృష్టించిన పాతబస్తీకి చెందిన ఓ యువకుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా, అక్కడ నుంచి అతడు ఎస్కేప్ అయ్యాడు. ► నిందితుల అరెస్టు, నోటీసుల జారీ, కోర్టుకు తరలింపు, నాన్‌బెయిలబుల్ వారెంట్ల (ఎన్బీడబ్ల్యూ) ఎగ్జిక్యూషన్.. ఇలా ప్రతి దాంట్లో అవినీతి ఉందని ఉన్నతాధికారులు గుర్తించారు. ► గత ప్రభుత్వ పెద్దలు, నగరానికి మాజీలు అయి న ఉన్నతాధికారులకు ఈ ఠాణా నుంచి కీలక సమాచారంపై లీకులు వెళుతున్నట్టు తేలింది. సీరియస్‌గా తీసుకున్న సీపీ పంజగుట్ట పీఎస్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సమగ్ర విచారణ జరిపే బాధ్యతను డీసీపీ విజయ్‌కుమార్‌కు అప్పగించారు. పంజగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్ సహాయంతో వివిధ కోణాల్లో ఆరా తీశారు. ఈ ఠాణాలో పనిచేస్తున్న సిబ్బందిలో అత్యధికులు విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి, ఏమరుపాటు నిండిపోయాయని గుర్తించారు. ఇక్కడ పనిచేస్తున్న వారిలో దాదాపు 90 శాతం పైరవీలతో వచ్చిన వారే కావడంతో సరైన పర్యవేక్షణ కొరవడిందని వెలుగులోకి వచ్చింది. దీంతో ఒకేసారి 85 మందిని బదిలీ చేశారు. వీరిని మరో ఠాణాకు పంపకుండా పనిòÙ్మంట్ కింద సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. బదిలీ అయిన వారి స్థానంలో వివిధ ఠాణాల నుంచి 82 మంది కొత్తవారిని నియమించారు. వేటుపడిన వారిలో ఆరుగురు ఎస్ఐలు ఎనిమిది మంది ఏఎస్ఐలు, 17 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 54 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. రహీల్ ఎస్కేప్ ఎపిసోడ్లో సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ బి.దుర్గారావు పరారు కావడానికి, ఈ ఠాణా సిబ్బంది నుంచి వెళ్లిన సమాచారమే కారణమని ఉన్నతాధికారులు తేల్చారు. ఆ కేసులో నిందితుడిగా మార్చినట్టు దుర్గారావుకు ఈ ఠాణా నుంచే సమాచారం అందిందని అధికారులు ఆధారాలు కూడా సేకరించారు. -
సిటీ ట్రాఫిక్.. ఓ జీవనది
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ అనేది ఒక జీవనది అని, పరిస్థితులను బట్టి పెరగడం–తగ్గడం ఉంటాయి తప్ప.. ఆగడం, లేకపోవడం అనేది జరగదని నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు. దీని నిర్వహణలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నగర ట్రాఫిక్ విభాగంలో వలంటీర్లుగా (ట్రాఫిక్ ఫరిస్టే) పని చేస్తున్న వారిని హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్సీఎస్సీ) గురువారం సన్మానించింది. బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో జరిగిన ఈ కార్యక్రమానికి హెచ్సీఎస్సీ చైర్మన్‌గా ఉన్న కొత్వాల్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కౌన్సిల్ పోలీసులకు విరాళంగా ఇచ్చిన అంబులెన్స్‌ను ప్రారంభించడంతో పాటు ఫ్రీ లెఫ్ట్ సైనేజ్ బోర్డులను ఆయన ఆవిష్కరించారు. అనివార్య కారణాలతో.. సాధారణంగా ప్రతి మెట్రో నగరంలోనూ ట్రాఫిక్ సమస్యలు ఉంటాయని, అనివార్య కారణాల వల్ల సిటీలో ఇవి కొద్దిగా ఎక్కువని కొత్వాల్ అన్నారు. అన్ని చోట్లా సమాన వెడల్పులో ఉన్న రోడ్లు లేకపోవడం, రహదారులకు మధ్యలో ప్రార్థనా స్థలాలు ఉండటంతో పాటు రద్దీ ప్రాంతాల్లోకీ అన్ని వేళల్లో, అన్ని రకాల వాహనాలను అనుమతించడం, ఆక్రమణలు ప్రధాన కారణాలని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక అలవెన్స్ సహా అనేక రకాలుగా ప్రభుత్వ ఆదుకోవడంతో సంక్షేమం విషయంలో ముందున్నామని పేర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు తగిన ప్రాధాన్యం ఇస్తూ అన్ని వ్యవస్థలు కలిసి పని చేయాలని, కేవలం ట్రాఫిక్ పోలీసులనే బాధ్యులుగా చూస్తారని సీపీ వ్యాఖ్యానించారు. ఉల్లంఘనులకు జరిమానా విధింపు అనేది అసలైన ఎన్ఫోర్స్మెంట్ కాదని, వాహనాలు నియంత్రణే దీని కిందికి వస్తుందని స్పష్టం చేసిన శ్రీనివాసరెడ్డి రద్దీ వేళల్లో చలాన్లు విధించవద్దని అధికారులను ఆదేశించారు. కొన్ని కీలక చర్యలపై లోతుగా అధ్యయనం... పీక్ అవర్స్‌లో అదనపు సీపీ నుంచి ప్రతి అధికారి కచ్చితంగా రోడ్డుపై ఉండి, వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయాలని సీపీ పునరుద్ఘాటించారు. ట్రాఫిక్ అంశంలో పాఠశాల స్థాయి నుంచి 2 వరకు చదువుతున్న వారిని భాగస్వాముల్ని చేయడం, ట్రాఫిక్ క్విజ్‌ల నిర్వహణ, ఎంపిక చేసిన రోడ్ల పైకి రద్దీ వేళల్లో వేగంగా నడిచే వాహనాల నియంత్రణ, ఆటోలపై సమగ్ర విధానం, తేలికపాటి వాహనాలకు సంబంధించి ‘సరి–బేసి’ విధానం అమలు, కార్ పూలింగ్ను ప్రోత్సహించడం సహా మరికొన్ని కీలక చర్యలపై అధ్యయనం చేస్తున్నామని కొత్వాల్ శ్రీనివాసరెడ్డి వివరించారు. ట్రాఫిక్ విభాగంలో పని చేసే వాళ్లు అన్సంగ్ హీరోలు కాదని, వారి పనిని గుర్తించి, ఆ మేరకు ఫలితాన్ని అందిస్తామన్నారు. ట్రాఫిక్ నిర్వహణలో అవగాహనకే పెద్దపీట... ప్రస్తుతం నగర ట్రాఫిక్ పోలీసులకు సహకరించడానికి దాదాపు 80 మంది ఫరిస్టేలు ఉన్నారని, ఈ సంఖ్యలో తొలి దశలో 310కి పెంచడమే లక్ష్యమని ట్రాఫిక్ చీఫ్ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. ఈ బాధ్యతలను స్థానిక ఇన్స్పెక్టర్లకు ఆ బాధ్యతలు ఇస్తూ ఠాణాల్లో అప్లికేషన్లు అందుబాటులో ఉంచుతామని, ఔత్సాహికులు ముందుకు వచ్చి వలంటీర్లుగా చేరాలని కోరారు. పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులని ఆయన వివరించారు. ట్రాఫిక్ నిర్వహణలో 80 శాతం అవగాహన (ఎడ్యుకేషన్), 20 శాతం చలాన్ల విధింపు (ఎన్ఫోర్స్మెంట్) పాత్రలు ఉంటాయని విశ్వప్రసాద్ అభిప్రాయపడ్డారు. -
ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులో నిర్లక్ష్యం
ఖమ్మంక్రైం: రహదారి నిబంధనలు అతిక్రమించిన వాహనదారులకు అటు రవాణా శాఖ, ఇటు ట్రాఫిక్ పోలీసులు జరిమానా చలానా విధించడం పరిపాటి. అయితే, ఈ చలాన్లను ఎప్పటికప్పుడు చెల్లించకపోతే తనిఖీల్లో దొరికినప్పుడు వాహనాన్ని సీజ్ చేసే అవకాశముంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో చలాన్లు పేరుకుపోయినట్లు గుర్తించిన ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలపై 80శాతం, కార్లు, ట్రాలీలు వంటి నాలుగు చక్రాలు, లారీలు, ఇతర భారీ వాహనాల పై 60శాతం రాయితీని ప్రకటించినా చెల్లించడంలో వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. కమిషనరేట్ పరిధిలో 9లక్షల చలాన్లు ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో చాన్నాళ్లుగా చలాన్లు పేరుకుపోయాయి. ట్రాఫిక్ స్టేషన్లలో సిబ్బంది కొరత కారణంగా జరిమానా విధించడమే తప్ప వసూళ్లపై పెద్దగా దృష్టి సారించడం లేదు. దీంతో చలాన్లు నానాటికీ పెరిగి 9లక్షలకు చేరాయి. వీటి చెల్లింపునకు ప్రభుత్వం భారీగా రాయితీ ప్రకటించినా వాహనదారుల నుంచి స్పందన రావడం లేదు. గతనెల 26వ తేదీ నుంచి రాయితీ అమల్లోకి రాగా బుధవారం నాటికి కేవలం 1,12,125 మంది మాత్రమే చలాన్లపై జరిమానా చెల్లించారు. వీటి ద్వారా రూ.70,13,485 ఆదాయం లభించింది. అంటే ఇంకా 7,87,875 పెండింగ్‌లో ఉన్నాయి. కాగా, రాయితీ గడువు ఈనెల 10వ తేదీతో ముగియనున్నందున వాహనదారులు ముందుకు రావాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆతర్వాత తనిఖీల్లో దొరికితే వాహనాలు సీజ్ అవకాశముంది. అవగాహన లేమితోనే.. నిత్యం వీవీఐపీలు, వీఐపీల బందోబస్తులో నిమగ్నమవుతున్నట్రాఫిక్ పోలీసులు ప్రభుత్వం రాయితీ కల్పించిన అంశంపై వాహనదారులకు అవగాహన కల్పించలేకపోతున్నారు. దీంతో కమిషనరేట్ పరిధి లోని 9లక్షల చలాన్లలో కనీసం 20శాతం కూడా చెల్లింపులు జరగలేదు. ఈనెల 10వ తేదీతో గడువు ముగియనన్న నేపథ్యాన ఇకనైనా ట్రాఫిక్ పోలీసులు జిల్లా వ్యాప్తంగా రాయితీపై అవగాహన కల్పించాల్సిన అవసరముంది. సకాలంలో చెల్లించండి ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్న వారు ఈనెల 10వ తేదీలోగా చెల్లించాలి. తద్వారా ప్రభుత్వం ప్రకటించిన రాయితీ వర్తిస్తుంది. మీ సేవ కేంద్రాల్లో లేదా ఆన్లైన్లో సొంతంగానూ చెల్లించవచ్చు. గడువులోగా చెల్లిస్తేనే రాయితీ వర్తిస్తుందనే విషయాన్ని వాహనదారులు గుర్తించాలి. – అశోక్, ట్రాఫిక్ సీఐ -
రంగనాథ్‌పై బదిలీ వేటు.. వరంగల్ ఇన్చార్జ్ సీపీగా దాసరి మురళీధర్
వరంగల్ క్రైం: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బదిలీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో క్రైం డీసీపీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి దాసరి మురళీధర్‌ను ఇన్చార్జ్ సీపీగా నియమించారు. గురువారం సీపీ రంగనాథ్ నుంచి దాసరి మురళీధర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏవీ రంగనాథ్ వరంగల్ పోలీస్ కమిషనర్‌గా 2022 డిసెంబర్ 3న బాధ్యతలు స్వీకరించారు. మొదటి రోజునుంచే అనేక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలు, బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు క్షేత్రస్థాయిలో ఉన్న అనేక సమస్యలను స్వయంగా పరిశీలన చేసి సంబంధిత అధికారులకు పరిష్కార మార్గాలను చూపించారు. తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. భూకబ్జాదారుల గుండెల్లో రైళ్లు.. సామాన్యుల భూములను ఆక్రమించి వ్యాపారం చేసే భూకబ్జాదారుల గుండెల్లో సీపీ రంగనాథ్ రైళ్లు పరిగెత్తించారు. సుమారు 2,500కు పైగా ఫిర్యాదులను బాధితులు, ప్రజలు స్వయంగా సీపీకి అందజేశారు. ఆ ఫిర్యాదులను సీపీ.. సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతోపాటు ఏసీపీ, డీసీపీ, టాస్క్‌ఫోర్స్, ఎస్బీ విభాగాల ద్వారా విచారణ చేయించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. దీంతో భూకబ్జాలకు పాల్పడుతున్న వారు చాలామంది వెనక్కి తగ్గారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో అధికా రులు సమస్యాత్మక విషయాల్లో రెండు వర్గాలను సీపీ దగ్గర ప్రవేశపెట్టడంతో స్వయంగా పరిష్కార మార్గాలను చూపెట్టారు. మొదట్లో చాలామంది ప్రజలు సీపీ ఫొటోలకు పాలాభిషేకాలు నిర్వహించి కొత్త ఒరవడికి నాంది పలికారు. 10 నెలలు.. 24 మందిపై సస్పెన్షన్ వరంగల్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన 10 నెలల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్న 24 మంది పోలీస్ అధికారులపై సీపీ రంగనాఽథ్ సస్పెన్షన్ వేటు వేశారు. భూకబ్జాదారులకు సహకరించి నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్న పోలీస్ అధికారులను హెచ్చరించారు. పద్ధతి మార్చుకోని వారిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. కమిషనరేట్‌లో ఏడుగురు ఇన్స్పెక్టర్లు, ఒక ఆర్ఐ, ఏడుగురు సబ్ ఇన్స్పెక్టర్లు, ఒక ఏఎస్సై, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులపై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో పాటు పలువురిని క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఏఆర్‌కు అటాచ్డ్ చేశారు. చిట్‌ఫండ్ యాజమాన్యాలపై కొరడా... రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మోసాలకు పాల్పడిన చిట్‌ఫండ్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. సామాన్యులను మోసం చేసి సకాలంలో చెల్లింపులు చేయకుండా డబ్బులు ఎగ్గొట్టి ఇబ్బందులకు గురిచేసిన చిట్‌ఫండ్ యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. కమిషనరేట్‌లో పలుమార్లు సమావేశాలు నిర్వహించి ప్రతి నెల చిట్టి డబ్బులను చెల్లించేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీని పర్యవేక్షణ కోసం డీసీపీ స్థాయి అధికారిని నియమించారు. సుమారు రూ.200 కోట్లకు పైగా యజామాన్యాల ముక్కుపిండి చెల్లింపులు చేయించారు. ప్రతి శుక్రవారం చిట్స్‌ఫండ్ యాజమాన్యాలు ఎంతెంత చెల్లించాయో వివరాలు తెలిపేలా ప్రత్యేకంగా వ్యవస్థను సిద్ధం చేయించారు. బండి సంజయ్ ఫిర్యాదుతోనేనా? రాష్త్రంలో పలువురు అధికారుల బదిలీ ఎలక్షన్ కమిషన్ చేసినప్పటికి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాఽథ్ బదిలీ వెనక బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో తన పాత్ర లేకున్నా అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారనే కోపంతో బండి సంజయ్ సీపీ బదిలీ కోసం కేంద్రంతో పట్టుబట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవల ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో పర్యటించిన సమయంలో బండి సంజయ్.. సీపీ రంగనాథ్‌పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీపీ వెంట మరికొంత మంది అధికారులు..? ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కమిషనరేట్‌లో పనిచేస్తున్న కొంతమంది అధికారులపై కూడా బదిలీ వేటు పడే అవకాశం ఉందని పోలీస్ శాఖలో పలువురు చర్చించుకుంటున్నారు. గతంలో కొంత మంది అధికారులపై కొందరు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఆ అధికారులపై ఈ సమయంలో వేటు పడే అవకాశం ఉందనే సమాచారం. 21 మంది అధికారులపై వచ్చిన అభియోగాలపై సీపీ రంగనాఽథ్ గతంలో ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చారు. పాలనపై ప్రత్యేక ముద్ర వేసిన సీపీ రంగనాఽథ్ బదిలీ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిదిలో సంచలనంగా మారింది. -
బేబీ సినిమాపై హైదరాబాద్ సీపీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్లో సంచలనాలకు నెలవైన బేబీ సినిమాపై నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఫైర్ అయ్యారు. సినిమా డ్రగ్స్ కల్చర్‌ను ప్రొత్సహించేలా ఉందంటూ మండిపడ్డారాయన. సినిమాలో డ్రగ్స్‌ను ప్రొత్సహించేలా సన్నివేశాలు ఉన్నాయి. ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో రైడ్లు నిర్వహించినప్పుడు.. బేబీ సినిమాలోని సీన్లలాంటివి కనిపించాయి. ఆ సినిమాను చూసే నిందితులు అలా పార్టీ చేసుకున్నారు. సినిమాల్లో అలాంటి సన్నివేశాలు పెట్టినప్పుడు.. కనీస హెచ్చరిక(కింద మూలన వేసే ప్రకటన) కూడా వెయ్యికుండా డైరెక్ట్ ప్లే చేశారు. ( బేబీ చిత్రంలోని అభ్యంతరకర సీన్లుగా చెబుతున్నవాటిని మీడియాకు ప్లే చేసి చూపించారాయన). మళ్లీ మేం హెచ్చరిస్తేనే హెచ్చరిక వేశారు. ఇందుకుగానూ.. బేబీ సినిమా టీంకు నోటీసులు జారీ చేస్తాం అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇక నుంచి ప్రతీ సినిమాపై నిఘా వేస్తామని.. అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే ఊరుకునేది లేదని నగర సీపీ స్పష్టం చేశారు. -
సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమేనా
కేయూ క్యాంపస్: కాకతీయ వర్సిటీ పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి టాస్క్ ఫోర్స్ పోలీసులతో కొట్టించారని, పైగా తాము కొట్టలేదని వరంగల్ పోలీస్ కమిషనర్ సమర్ధించుకోవటంపై బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. ఈ వ్యవహారంపై లైడిటెక్టర్ పరీక్షలు, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణకు సిద్ధమేనా? అని సీపీకి సవాల్ విసిరారు. ఈ నెల 5న క్యాంపస్‌లోని ప్రిన్సిపాల్ ఆఫీస్ వద్ద విద్యార్థి నాయకులు ఆందోళన చేయగా పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ సమయంలో తమను పోలీసులు కొట్టారని విద్యా ర్థులు జడ్జి ఎదుట తెలిపారు. కాగా, ఆ విద్యార్థి నాయకులను శుక్రవారం రఘునందన్‌రావు కేయూ దూరవిద్య కేంద్రం ఆవరణలో పరామర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ నమోదై ఉన్న వీసీపై విచారణ జరపాల్సింది పోయి, ఆయనతో కలసి సీపీ ప్రెస్‌మీట్ నిర్వహించటమేమిటని ప్రశ్నించారు. వీసీ, పీహెచ్డీ అవకతవకల వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. పోలీసుల, ప్రభుత్వ వైఖరికి నిరసనగా 12న వరంగల్ జిల్లా బంద్ చేపట్టినట్లు తెలిపారు. కాగా, పోలీసులు తమని అరెస్ట్‌చేసి టాస్క్‌పోర్స్ పోలీసులతో కొట్టించారంటూ విద్యార్థులు గవర్నర్ తమిళిసైని కలిసి ఫిర్యాదు చేశారు. -
12 పెళ్లిచూపులు..కట్నం ఇవ్వనందుకు సంబంధం క్యాన్సిల్
ఎంఎస్సీ మాథ్స్ చేసి ఆన్లైన్లో లెక్కలు చెప్పే భోపాల్ యువతికి పెళ్లి కావడం లేదు. కట్నం ఇవ్వను అనడమే కారణం. ‘50 లక్షలు అడుగుతున్నారు మా నాన్న ఎక్కడ నుంచి తెస్తాడు’ అని ఆమె ప్రశ్న. ‘సంబంధం కేన్సిల్’ అనేది తరచూ వినవస్తున్న జవాబు. ఇప్పటికి 12 పెళ్లి చూపులు భగ్నమయ్యాయి. విసిగిపోయిన ఆమె పోరాటానికి దిగింది. పోలీసులకు కంప్లయింట్ చేసింది. అన్ని చోట్లా చైతన్యానికి నడుం బిగించింది. ‘ఇది రొటీన్‌గా జరుగుతోంది. ఎప్పట్లాగే నేను ట్రేలో టీకప్పులు పెట్టుకుని వస్తాను. దానికి ముందు మా అమ్మ నాకు బాగుంటుందని చెప్పి ఆకుపచ్చ డ్రస్సు తీస్తుంది. నా పళ్లు కొంచెం ఎగుడుదిగుడుగా ఉంటాయని ఎక్కువగా నవ్వొద్దని హెచ్చరిస్తుంది. టీ ట్రేతో నేను హాల్లోకి రాగానే అందరూ నన్ను ఆపాదమస్తకం శల్యపరీక్ష చేస్తున్నట్టుగా చూస్తారు. ఏం చదివావు, ఏం పని చేస్తున్నావు, వంటొచ్చా... అవే ప్రశ్నలు. ఆ తర్వాత కీలకమైన సందర్భం వస్తుంది. కట్నం ఎంత ఆశిస్తున్నారు అని మా నాన్న అడుగుతాడు. అప్పుడు పెళ్లికొడుకు తరుఫువారు ఏ యాభైలక్షలో అరవైలక్షలో లేకుంటే పెళ్ళిళ్లు జరుగుతున్నాయా అనంటారు. కొంచెం ఆలోచించండి అని మా నాన్న అంటాడు. మీ అమ్మాయి అందంగా ఉంది కాబట్టి డిస్కౌంట్ ఇవ్వొచ్చులేండి అని వారు జోక్ చేస్తారు. నాకు మాత్రం ఇదంతా చాలా అసహ్యంగా ఉంటుంది’ అంటుంది రూప. ఇది ఆమె అసలు పేరు కాదు. ఇలాంటి అమ్మాయిలు దేశమంతా ఉన్నారు. వారికి వేరే వేరే పేర్లు ఉంటాయి. కాని వారందరి సమస్య మాత్రం ఒకటే– కట్నం. నేషనల్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం మన దేశంలో 2017 నుంచి 2022 వరకు 35,493 మంది నవ వధువులు, కొత్త పెళ్లి కూతుళ్లు వరకట్న చావులకు గురయ్యారు. అంటే రోజుకు సగటున 20 మంది. అయినా కట్నం కొనసాగుతూనే ఉంది. పేరు మారిందంతే మన దేశంలో వరకట్నం 1961లో నిషేధించారు. కాని అలాంటి చట్టం ఒకటుందని సమాజం ఆనాడు పట్టించుకోలేదు.. ఈనాడూ పట్టించుకోవడం లేదు. 1980ల కాలంలో వరకట్న పిశాచం దేశాన్ని పీడించింది. ఎందరో కొత్తకోడళ్లు కిరోసిన్ స్టవ్ మంటల్లో కాలిపోయారు. ఆ తర్వాత కొంత చైతన్యం వచ్చింది. అమ్మాయిలు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. కొన్నివర్గాల ఆర్థిక స్థితి మెరుగయ్యింది. కట్నం అనే మాట వాడటం నామోషీగా మారింది. దానికి బదులుగా లాంఛనాలు అంటున్నారు. ఫార్మాలిటీస్ అంటున్నారు. ఏ మాట వాడినా ఉద్దేశం మాత్రం ఆడపిల్ల తరఫువారు మగపెళ్లి తరఫు వారికి ఆర్థికంగానో ఆస్తిపాస్తుల రూపేణానో ముట్టజెప్పాలి. అంతస్తును బట్టి ఈ లాంఛనాల స్థాయి ఉంటుంది. లక్షల నుంచి కోట్ల వరకు. కట్నం ఇవ్వను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి, భోపాల్‌లో తన కాళ్ల మీద తాను నిలబడే స్థితిలో ఉన్న రూపకు 27 ఏళ్లు వచ్చేశాయి. ఈమె తల్లిదండ్రులు ఐదారేళ్ల నుంచి సంబంధాలు చూస్తున్నారు. కాని కట్నం కారణంగా కుదరడం లేదు. ‘మా నాన్న నూటాయాభై మంది కుర్రాళ్ల ప్రొఫైల్స్ చూసి 20 మందిని సెలక్ట్ చేశాడు. వారిలో 12 మందితో పెళ్లిచూపులు అయ్యాయి. అందరూ కట్నం అడిగేవాళ్లే. ఎవరూ 50 లక్షలకు తక్కువ లేరు. మా నాన్న అంత ఖర్చు పెట్టలేడు. అసలు కట్నం ఎందుకివ్వాలి? నేను కట్నం ఇవ్వను... కట్నం అనేది చాలా చెడ్డ ఆచారం. పెళ్లి ఖర్చులు పెట్టుకుంటాను అని ఏ అబ్బాయికి చెప్పినా నా ముందు తలాడిస్తున్నాడు కాని ఆ తర్వాత సంబంధం కేన్సిల్ అనే కబురు వస్తోంది. నా ఆత్మవిశ్వాసం మొత్తం పోయింది. మరోవైపు మా బంధువులేమో అమ్మాయి ఇప్పటికే ముదిరిపోయింది అని టెన్షన్ పెడుతున్నారు. పెళ్లి చేసుకోవాలని నాకూ ఉంది. ఒంటరిగా జీవితాన్ని లాగలేము కదా. కాని ఈ కట్నం బాధ ఏమిటి? ఎంతమంది అప్పులు చేసి, ఆస్తులు అమ్మి ఇంకా ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలి?’ అని ప్రశ్నిస్తోంది రూప. పోలీసులు పూనుకోవాలి కట్నం తీసుకోవడం శిక్షార్హం కాబట్టి పోలీసులు పూనుకొని ఈ దురాచారాన్ని నిలువరించాలని, ప్రతి పెళ్లి జరిగే మంటపాల్లో చెకింగులు చేయాలని, కట్నం తీసుకుంటున్న కొంతమందికైనా శిక్ష పడితే కట్నం డిమాండ్ తగ్గుతుందని అంటుంది రూప. ఈమేరకు ఆమె భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణ్‌ను వినతిపత్రం ఇచ్చింది. వరకట్న దురాచారం వల్ల వస్తున్న ఆర్థిక బాధల గురించి చైతన్యం రావాలని మీడియాను సంప్రదించింది రూప. ‘నేను కట్నం వద్దంటున్నానని మా అమ్మ నాతో మాట్లాడటం లేదు. కట్నం వద్దంటే జన్మలో నీ పెళ్లి చేయలేనని మా నాన్న టెన్షన్ పడుతున్నాడు. నేటి కాలంలో కట్నం ఉంటే తప్ప పెళ్లి కాని స్థితిలో ఒక యువతి ఉండటం ఎంత విషాదమో ఈ సమాజం ఆలోచించాలి’ అంటోంది రూప. ఈ స్థితికి తాము ఎంత కారణమో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ పరిస్థితిలో మార్పుకోసం ప్రయత్నించాలి. -
తెరపైకి కొత్త సీపీ.. సీఎంవోలో పని చేస్తున్న పోలీస్ ఉన్నతాధికారి
ఖలీల్‌వాడి : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోస్టు ఖాళీ అయి రెండు నెలలు గడుస్తున్నా నియామకం జరగడం లేదు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత లేకపోవడమే కారణంగా విమర్శలు వస్తున్నాయి. పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన కేఆర్ నాగరాజు పదవీ విరమణ చేయడంతో ఈ పోస్టు ఖాళీ అయ్యింది. నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్ నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా రెండు నెలలుగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ పోలీసు కమిషనర్ నియామకానికి జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు వేర్వేరుగా ఇద్దరు పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఒకరు రెడ్డి సామాజికవర్గానికి చెందిన పోలీస్ అధికారిని, మరొకరు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పోలీస్ అధికారిని నియమించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇద్దరు బలమైన ప్రజాప్రతినిధులు ప్రపొజల్స్ పంపడంతో పోలీస్ ఉన్నతాధికారులు తలలు పట్టుకున్నట్లు సమాచారం. ఎన్నికల గడువు సమీపించడంతో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా వ్యవహరించే కమిషనర్ కావాలని జిల్లాలోని ప్రధాన ప్రజాప్రతినిధులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. జిల్లాలో ఎస్సై, సీఐ తదితర పోస్టులకు సదరు ప్రజాప్రతినిధుల సిఫార్సుల లేఖలు లేనిదే పోలీస్స్టేషన్లలో పోస్టులు భర్తీ కావడంలేదనే చర్చ పోలీస్‌శాఖలో సాగుతోంది. ఇప్పుడు వచ్చే పోలీస్‌కమిషనర్ రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు. ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా ఉండే సీపీ ఉంటే బాగుంటుందని చర్చించినట్లు తెలిసింది. దీంతో కొత్త కొత్వాల్ కోసం మల్లాగుల్లాలు పడుతున్నట్లు సామాచారం. ఇద్దరు ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు చేసిన వారిని కాకుండా సీఎంవోలో పని చేస్తున్న పోలీస్ ఉన్నతాధికారి పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో సదరు ఐపీఎస్ అధికారి నిజామాబాద్ సీపీ పోస్టు కోసం ప్రయత్నం చేసినప్పటికీ కేఆర్ నాగరాజుకు అవకాశం లభించినట్లు తెలిసింది. దీంతో మరోసారి సదరు ఐపీఎస్ అధికారి ఈ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీసు వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇదిలా ఉండగా పోలీస్స్టేషన్లలో సమస్యలు పరిష్కారం కాకపోతే ఉన్నతాధికారులకు చెపుకుందామంటే అవకాశం లేకుండా పోయిందని పలువురు పేర్కొంటున్నారు. -
33 రోజుల్లో.. 1000 మొబైల్ ఫోన్లు
సాక్షి, హైదరాబాద్ః చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల జాడ కనిపెట్టేందుకు అమల్లోకి తెచ్చిన సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్) పోర్టల్ విధానం సత్ఫలితాలిస్తోంది. గత నెల ఏప్రిల్ 13వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 780 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ నూతన పోర్టల్ విధానాన్ని డీజీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. 60 మంది ట్రైనర్లకు తొలుత ఈ పోర్టల్ వాడకంపై శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఏప్రిల్ 20 నుంచి ఈ సీఈఐఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో అమల్లోకి తెచ్చారు. అప్పటి నుంచి ఈ పోర్టల్ విధానంతో సోమవారం వరకు అంటే 33 రోజుల్లో వెయ్యి మొబైల్ ఫోన్ల జాడను గుర్తించడంతోపాటు వాటిని తిరిగి ఫోన్ల యజమానులకు అందించారు. వీటిలో అత్యధికంగా సైబరాబాద్ కమిషనరేట్‌లో 149, వరంగల్ కమిషనరేట్ పరిధిలో 91, కామారెడ్డి జిల్లా పరిధిలో 79 మొబైల్ ఫోన్ల జాడ కనిపెట్టినట్టు సీఈఐఆర్ నోడల్ అధికారి, సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ తెలిపారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు మొత్తం 16,011 మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ విధానంలో బ్లాక్ చేసినట్టు చెప్పారు. రాష్ట్ర పౌరులెవరైనా తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నట్టయితే దగ్గరలోని మీసేవా లేదా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి సీఈఐఆర్ విధానంలో ఫిర్యాదు చేయవచ్చని మహేశ్ భగవత్ సూచించారు. ఇది కూడా చదవండి: GO 111: మాస్టర్‌ప్లాన్ ఇప్పట్లో లేనట్టే! -
కొత్త డీసీపీలకు పీఏల కేటాయింపు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ కమిషనరేట్ పునర్ విభజన నేపథ్యంలో కొత్తగా రెండు జోన్లు వస్తున్న విషయం విదితమే. వీటితో పాటు డివిజన్లు, ఠాణాలు అధికారికంగా ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికే సౌత్ వెస్ట్ జోన్‌కు ఖారె కిరణ్ ప్రభాకర్, సౌత్ ఈస్ట్ జోన్‌కు చెన్నూరి రూపేష్‌లను డీసీపీలుగా నియమించారు. వీరికి పీఏలను సైతం కేటాయిస్తూ కొత్వాల్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. సౌత్ ఈస్ట్ డీసీపీకి మీర్జా ఇమ్రాన్ ఖాన్, సౌత్ వెస్ట్ డీసీపీకి టి.వినీత్ కుమార్ పీఏలుగా నియమితులయ్యారు. సౌత్ జోన్లో పని చేస్తున్న కె.అనిల్ రెడ్డిని సెంట్రల్ జోన్ డీసీపీ పీఏగా బదిలీ చేస్తూ మంగళవారమే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ పీఏలు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముగిసిన ప్రీబిడ్ సమావేశాలు సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 21 నుంచి వరుసగా మూడు రోజుల పాటు జరిగిన ప్రీ బిడ్ సమావేశాలు గురువారం ముగిశాయి. మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలోని 5 ల్యాండ్ పార్సిల్స్‌పై ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలో గురువారం ప్రీబిడ్ మీటింగ్ జరిగింది. హెచ్ఎండీఏ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గంగాధర్, మేడిపల్లి తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, హెచ్ఎండీఏ డీఏవో శోభారాణి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామారావు, ఎమ్మెస్టీసీ ప్రతినిధులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 5, సంగారెడ్డి జిల్లాలో 23 ల్యాండ్ పార్సిల్స్ కొనుగోలుదారులు కోసం సిద్ధంగా ఉన్నాయి. గండిపేట మండలంలో 3, శేరిలింగంల్లి 5, ఇబ్రహీంపట్నం మండలంలో 2 చొప్పున అమ్మకానికి ఉన్నాయి. మేడిపల్లి 4, ఘట్కేసర్ 1, అమీన్పూర్ 16, ఆర్సీపురం 6, జిన్నారం మండలంలో 1 చొప్పున విక్రయించనున్నారు. మార్చి 1న ఈ మొత్తం 38 ల్యాండ్ పార్సిల్స్‌ను ఎమ్మెస్టీసీ ఆధ్వర్యంలో ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేపట్టింది. ఉస్మానియాలో హైకోర్టు అడ్వకేట్ జనరల్‌కు వైద్య పరీక్షలు అఫ్జల్‌గంజ్: రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ గురువారం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, ఆర్ఎంఓ–1 డాక్టర్ శేషాద్రిలు రక్త, జనరల్ పరీక్షలు చేయించారు. ఆస్పత్రిలో పేద రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు అవయవ మార్పిడి శస్త్ర చికిత్సల గురించి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ఆయనకు వివరించారు. -
పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా శారదా విద్యాలయ క్రీడా మైదానం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: కేజీ నుంచి పీజీ వరకూ వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్న శారదా విద్యాలయలో ఇటీవలే శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న వేడుకల్లో విశిష్ట వ్యక్తులు పాల్గొంటూ.. విద్యాలయంతో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం (జనవరి 31) జరిగిన వేడుకల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా.. తెలంగాణ రాష్ట్ర యువజన వ్యవహారాలు, పర్యాటక, సాంస్కృతిక శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా గౌరవ అతిథిగా పాల్గొని, క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. గ్రౌండ్లో క్రికెట్ ప్రాక్టీస్ కోసం ఐదు నెట్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో పాటు బాస్కెట్‌బాల్, వాలీబాల్ క్రీడల కోసం ప్రత్యేక కోర్టులు, అథ్లెటిక్స్ కొరకు ట్రాక్‌లను అందుబాటులోకి తెచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు, ఏంజెల్ ఇన్వెస్టర్ మరియు నోహ్ సాఫ్ట్ వ్యవస్థాపకులు శ్రీ మైనేని పాల్గొన్నారు. వీరితో పాటు శారదా విద్యాలయ ట్రస్టీ, సింథోకెమ్ ల్యాబ్స్ ఛైర్మన్ శ్రీ జయంత్ ఠాగోర్, శారదా విద్యాలయ సెక్రటరీ రామ్ మాదిరెడ్డి, కరస్పాండెంట్ జ్యోత్స్న అంగారా పాల్గొన్నారు. కాగా, నిరుపేద విద్యార్థులకు మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే మహోన్నత సంకల్పంతో వై సత్యనారాయణ గారు 1922లో శారదా విద్యాలయ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఈ విద్యాలయను నాటి హైదరాబాద్ నిజాం ప్రధానమంత్రితో పాటు భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. ఇక్కడ దాదాపు 1450 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. శారదా విద్యాలయకు 2018లో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డు లభించింది. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణ పూర్తి.. నయా స్వరూపం ఇలా..
సాక్షి, హైదరాబాద్: సిటీ పోలీసు కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణ కొలిక్కి వచి్చంది. నగరంలో కొత్తగా రెండు జోన్లు, 10 డివిజన్లు, 13 ఠాణాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో జోన్ల సంఖ్య ఐదు నుంచి ఏడుకు, డివిజన్లు 17 నుంచి 27కు, ఠాణాలు 60 నుంచి 73కు చేరనున్నాయి. ఈ మార్పు చేర్పుల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కొన్ని డివిజన్లు మాయమవుతుండగా.. ఠాణాల పరిధులు మారుతున్నాయి. పక్షం రోజుల్లో వీటికి సంబంధించిన కార్యాలయాల ఎంపిక పూర్తి చేయాలని, కొత్త ఏడాది నుంచి పని ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇటీవల పోలీసు విభాగానికి 3,966 పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటి నుంచి సిటీకి మూడు డీసీపీ, 12 ఏసీపీ, 26 ఇన్స్పెక్టర్ సహా 1,252 పోస్టులు వచ్చాయి. గతేడాది డిసెంబర్లో నగర కొత్వాల్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. వీటిలో భాగంగానే పునర్ వ్యవస్థీకరణపైనా ఆయన దృష్టి పెట్టారు. ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన తుది నివేదికకు ఇటీవలే ప్రభుత్వ ఆమోదం లభించింది. వచ్చే జనవరి 1 నుంచి పని ప్రారంభించేందుకు సీపీ ఆనంద్ సన్నాహాలు చేస్తున్నారు. ఈస్ట్ జోన్: ప్రస్తుతం సుల్తాన్‌బజార్, కాచిగూడ, మలక్‌పేట డివిజన్లు.. సుల్తాన్‌బజార్, చాదర్‌ఘాట్, అఫ్జల్‌గంజ్, కాచిగూడ, నల్లకుంట, ఉస్మానియా యూనివర్సిటీ, మలక్‌పేట, సైదాబాద్, అంబర్పేట్ ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో నార్త్‌జోన్, సెంట్రల్ జోన్లలోని కొన్ని ఠాణాలు దీంట్లోకి వస్తున్నాయి. కాచిగూడ, మలక్‌పేట డివిజన్లు మాయమై అంబర్‌పేట, చిలకలగూడ, ఉస్మానియా యూనివర్సిటీ పేరు తో కొత్తవి వస్తున్నాయి. వారాసిగూడ పేరుతో కొత్త ఠాణా, చిలకలగూడ, లాలాగూడ, నారాయణగూడ ఠాణాలు ఈ జోన్లోకి వస్తున్నాయి. నార్త్‌జోన్: ఇందులో గోపాలపురం, మహంకాళి, బేగంపేట సబ్–డివిజన్లు, గోపాలపురం, తుకారాంగేట్, లాలాగూడ, చిలకలగూడ, మహంకాళి, మార్కెట్, మారేడ్‌పల్లి, కార్ఖానా, బేగంపేట, బోయిన్పల్లి, బొల్లారం, తిరుమలగిరి ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో తిరుమలగిరి కేంద్రంగా డివిజన్ ఏర్పడుతోంది. తాడ్‌బన్‌లో కొత్త ఠాణాతో పాటు మధ్య మండల నుంచి రామ్‌గోపాల్‌పేట ఈ జోన్లోకే వస్తోంది. సౌత్ జోన్: ప్రస్తుతం చార్మినార్, మీర్‌చౌక్, ఫలక్‌నుమా, సంతోష్‌నగర్ డివిజన్లు, చార్మినార్, బహదూర్‌పుర, కామాటిపుర, హుస్సేనిఆలం, కాలాపత్తర్, మీర్‌చౌక్, డబీర్‌పుర, మొఘల్‌పుర, రెయిన్‌బజార్, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, శాలిబండ, ఛత్రినాక, కంచన్‌బాగ్, భవానీనగర్, మాదన్నపేట, సంతోష్‌నగర్ ఠాణాలు ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ జోన్లో ఉండే ఫలక్‌నుమా డివిజన్ మాయమవుతోంది. దాని స్థానంలో బహదూర్‌పుర వస్తుండగా.. పోలీసుస్టేషన్ల 11కు తగ్గుతున్నాయి. వెస్ట్ జోన్: ప్రస్తుతం పంజగుట్ట, బంజారాహిల్స్, ఆసిఫ్‌నగర్ డివిజన్లు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్సార్‌నగర్, ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, లంగర్‌హౌస్, గోల్కొండ, టప్పాచబుత్ర, షాహినాయత్‌గంజ్, హబీబ్‌నగర్, కుల్సుంపుర, మంగళ్‌హాట్ ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో ఆసిఫ్‌నగర్ డివిజన్ ఈ జోన్ నుంచి మాయమవుతోంది. దీని స్థానంలో జూబ్లీహిల్స్ పేరుతో కొత్తది వస్తోంది. మాసబ్‌ట్యాంక్, రెహ్మత్‌నగర్, ఫిలింనగర్, బోరబండల్లో కొత్త ఠాణాలు వస్తున్నాయి. వీటితో పాటు ఈ జోన్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్సార్‌నగర్ ఠాణాలు మాత్రమే ఉంటాయి సౌత్ ఈస్ట్ జోన్: కమిషనరేట్‌లో ఆరో జోన్‌గా సౌత్ ఈస్ట్ ఏర్పడుతోంది. ఇందులో కొత్తగా ఏర్పాటయ్యే చాంద్రాయణగుట్ట, సైదాబాద్ సబ్–డివిజన్లతో పాటు ఈస్ట్ నుంచి వచ్చే మలక్‌పేట, సౌత్ నుంచి వచ్చే సంతోష్‌నగర్ డివిజన్లు ఉండనున్నాయి. ఆ రెండు జోన్ల నుంచి వేరయ్యే చంద్రాయణగుట్ట, కంచన్‌బాగ్, చాదర్‌ఘాట్, మలక్‌పేట, మాదన్నపేట, సైదాబాద్, రెయిన్‌బజార్, భవానీనగర్, సంతోష్నగర్లతో పాటు కొత్తగా బండ్లగూడ, ఐఎస్ సదన్ ఠాణాలు ఈ కొత్త జోన్లో ఉంటాయి. సౌత్ వెస్ట్ జోన్: ఏడో జోన్‌గా పరిగణించే సౌత్ వెస్ట్ మరో కొత్త జోన్‌గా అవతరిస్తోంది. ఇందులో వెస్ట్, సెంట్రల్ జోన్ల నుంచి వేరైన ఆసిఫ్‌నగర్, బేగంబజార్‌తో పాటు కొత్తగా గోల్కొండ, కుల్సుంపుర డివిజన్లు వచ్చి చేరుతున్నాయి. ఆ రెండు జోన్ల నుంచే విభజించిన ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, హబీబ్‌నగర్, బేగంబజార్, షాహినాయత్‌గంజ్, మంగళ్‌హాట్, గోల్కొండ, లంగర్‌హౌస్, కుల్సుంపుర, టప్పాచబుత్ర ఠాణాలతో పాటు కొత్తగా టోలిచౌకి, గుడిమల్కాపూర్ పోలీసుస్టేషన్లు రానున్నాయి. సెంట్రల్ జోన్: ప్రస్తుతం ఈ జోన్లో అబిడ్స్, చిక్కడపల్లి, సైఫాబాద్ డివిజన్లు.. అబిడ్స్, నారాయణగూడ, బేగంబజార్, గాంధీనగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నాంపల్లి, రామ్‌గోపాల్‌పేట, సైఫాబాద్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. తాజా మార్పు చేర్పులతో గాం«దీనగర్ డివిజన్‌గా ఏర్పడుతోంది. దోమలగూడ, లేక్ పోలీసు, ఖైరతాబాద్‌ల్లో కొత్త ఠాణాలు ఏర్పాడుతున్నాయి. నారాయణగూడ, బేగంబజార్, నాంపల్లి, రామ్‌గోపాల్‌పేట్ ఠాణాలు ఈ జోన్లో ఉండవు. -
హైదరాబాద్‌లో మరికొందరు ‘పోలీస్ దొంగ’లు!.. విమానాల్లో తిరుగుతూ సెటిల్మెంట్లు
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ మేకల ఈశ్వర్ వ్యవహారంతో నగర ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సిటీలో ఈ తరహా దందాలకు పాల్పడుతున్న ‘పోలీసు దొంగ’ల్లో మరో ముగ్గురిని గుర్తించారు. వీరిలో ఇద్దరు నగర కమిషనరేట్‌లో పని చేస్తుండగా... మరొకరు సైబరాబాద్‌లో ఉన్నట్లు తెలిసింది. వీరి వ్యవహారాలకు సంబంధించిన నివేదికలు అందిన తర్వాత చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ అధికారులకు సహకరించిన, సహరిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్ల వ్యవహారాన్నీ సీరియస్‌గా తీసుకున్నారు. సమాచారంతో మొదలై సహవాసం వరకు... పోలీసులకు, దొంగలకు మధ్య పరిచయాలు ఉండటం కొత్త విషయం కాదు. వీరికి సమాచారం ఇచ్చే వారిలో పాత నేరగాళ్లే ఎక్కువగా ఉంటారు. ఎంత ఎక్కువ మంది నేరగాళ్లతో పరిచయాలు ఉంటే అంత ఎక్కువ సమాచారం అందుతుంది. ఈశ్వర్ సహా నగరంలో పని చేస్తున్న/చేసిన ముగ్గురు ఇన్స్పెక్టర్లు సమాచారం స్థాయిని దాటి సహవాసం వరకు వెళ్లారు. వీళ్లలో కొందరు పిక్ పాకెటింగ్, స్నాచింగ్స్ గ్యాంగ్స్‌తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. మరికొందరు ఏకంగా వారికి సంబంధించిన సెటిల్మెంట్లు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. జేబు దొంగలకు చెందిన ఓ బడా నాయకుడు ఇటీవల అస్వస్థతకు గురయ్యాడు. అతడు ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఓ అధికారి వెళ్లి పరామర్శించడంతో వారి మధ్య సంబంధం బయటపడింది. పిక్ పాకెటింగ్ గ్యాంగ్స్‌ను పట్టుకున్న ఠాణాలు, ప్రత్యేక విభాగాల వద్దకు వెళ్లే మరో అధికారి వాళ్లను అరెస్టు చూపకుండా వదిలేసేలా పైరవీలు చేయడంలో సిద్ధహస్తుడిగా మారాడు. విమానాల్లో తిరుగుతూ సెటిల్మెంట్లు... ప్రస్తుతం సైబరాబాద్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారి ఈ వ్యవహారాల్లో సిద్ధహస్తుడు. తన మాట వినని, తన గ్యాంగ్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్న ముఠాలను అరెస్టు చేయడంతోనే ఇతడి సక్సెస్ రేటు పెరిగిపోయింది. ఈ సక్సెస్‌ను మాత్రమే చూసిన ఉన్నతాధికారులకు ఇప్పుడిప్పుడే అతడి పూర్తి వ్యవహారాలు తెలుస్తున్నాయి. అంతర్రాష్ట్ర పిక్ పాకెటింగ్ ముఠాలో ఈ అధికారికి సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఏ నగరంలోని పోలీసులకు వీరు చిక్కితే ఈయనే వెళ్లి విషయం సెటిల్ చేసి వచ్చేవాడు. దీనికోసం లీవ్ కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా విమానాల్లో వెళ్లి వస్తూ పని పూర్తి చేసేవాడు. నగరంలో సుదీర్ఘకాలం పని చేసిన ఈయన ఎప్పుడూ ఫోకల్ పోస్టు కోసం ప్రయత్నించలేదు. కేవలం ఠాణాల్లోని డిటెక్టివ్, క్రైమ్ వింగ్స్‌లో పని చేయడానికే పైరవీలు చేసుకునేవాడు. ఈశ్వర్‌తో పాటు అలాంటి వ్యవహారాలు చక్కబెట్టిన కొందరు కానిస్టేబుళ్లకు అధికారులు సహకారాలు అందిస్తూ వారిని బందోబస్తు డ్యూటీలకు దూరంగా ఉంచేవారని తెలిసింది. అంతర్జాతీయ చోరీ ఫోన్ల నెట్‌వర్క్‌లో ఈశ్వర్.. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలు కూడా ఈశ్వర్‌కు ఆ పరిధిలోని ఠాణాలో పోస్టింగ్ వచ్చాక క్రైమ్ ప్రోన్ ఏరియాలుగా మారిపోయేవని తెలిసింది. ఆ పోలీస్ స్టేషన్లో ఉండే మార్కెట్లు, అనువైన ప్రాంతాలను గుర్తించే ఇతగాడు తన గ్యాంగ్స్‌ను దింపి నేరాలు చేయించేవాడు. ఇలా కొందరు దొంగలను తమ కంట్రోల్లో పెట్టుకోవడం, రికవరీల్లో సెటిల్మెంట్లు చేయడంలో ఈశ్వర్‌తో పాటు మరికొందరూ నిష్ణాతులని తెలుస్తోంది. చోరీ ఫోన్లు ట్రాక్ కాకుండా ఉండటానికి ఈశ్వర్ అంతర్జాతీయ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. తన గ్యాంగ్ ద్వారా తన వద్దకు చేరిన ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లు క్లోనింగ్ చేసేవాడు. అలా కుదరని పక్షంలో బయటి దేశాలకు... ప్రధానంగా నేపాల్‌కు పంపేవాడని సమాచారం. గతంలో ఈశ్వర్‌తో పాటు ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారి ఒకే ఠాణాలో పని చేశారు. అçప్పట్లోనూ ఈ గ్యాంగ్స్ నిర్వహణ, సెటిల్మెంట్లకు సంబంధించి ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చాయి. చదవండి: Viral: కుటుంబంతో సేదతీరేందుకు వ్యవసాయక్షేత్రంలో రెడీమేడ్ ఇల్లు -
ప్రారంభానికి సిద్ధం చేయాలి
మర్కూక్(గజ్వేల్): మర్కూక్ పోలీస్ స్టేషన్ అవరణలోని నూతనంగా నిర్మించిన పోలీస్ కాంప్లెక్స్ భవనాలను ప్రారంభానికి సిద్దం చేయాలని పోలీస్ కమిషనర్ శ్వేత తాదేశించారు. శుక్రవారం ఆమె భవనాలను సందర్శించారు. కాంప్లెక్స్ భవనాల పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఏసీపీ, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఏసీపీ రమేశ్, డీఈ రాజయ్య, కాంట్రాక్టర్ ప్రసాద్‌రావు, సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐ హరీష్ తదితరులు పాల్గొన్నారు. -
నేను..సీవీ ఆనంద్‌ను మాట్లాడుతున్న..
బంజారాహిల్స్: తన నివాసిత ప్రాంతం చుట్టుపక్కల రాత్రిపూట శబ్ద కాలుష్యం నెలకొందని చర్యలు, తగిన తీసుకోవాల్సిందిగా నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ 100కు డయల్ చేశారు. దీంతో పోలీసులు కొద్దిసేపట్లోనే ఘటనా స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీని ఆనుకొని ఉన్న ప్లజెంట్ వ్యాలీలో నగర పోలీస్ కమిషనర్ ఆనంద్ ఉంటున్నారు. శుక్రవారం రాత్రి 10.50 గంటల ప్రాంతంలో డప్పుల హోరుతో శబ్ద కాలుష్యం పెరగడంతో ఆయన వెంటనే 100కు డయల్ చేశారు. నైట్‌డ్యూటీలో ఉన్న జూబ్లీహిల్స్ డీఐ శ్రీనివాస్, ఎస్ఐ చంద్రశేఖర్ అక్కడికి వెళ్లి పరిశీలించగా సమీపంలోని ఓం నగర్ బస్తీలో తొట్టెల ఊరేగింపు నిర్వహిస్తూ డప్పులు వాయిస్తున్నట్లుగా గుర్తించారు. వెంటనే నిర్వాహకులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని 70బి కింద పెట్టీ కేసు నమోదు చేశారు. సమస్యను అక్కడికక్కడే పరిష్కరించారు. స్వయంగా సీపీ 100కు డయల్ చేయడం అధికారులు, సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది. (చదవండి: పెట్స్.. అదో స్టేటస్! ) -
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు ఐఎస్వో గుర్తింపు
కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం (సీపీవో)కు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్వో) గుర్తింపు లభించింది. ఆ సంస్థ ప్రతినిధులు శనివారం పోలీస్ కమిషనర్ సత్యనారాయణకు ధ్రువీకరణపత్రం అందజేశారు. కమిషనరేట్ పరిధిలో పోలీసుల పనితీరు, పరిశుభ్రత, సదుపాయాలు, బాధితులకు త్వరితగతిన సమస్యలు పరిష్కరించడం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ఐఎస్వో 9001 సర్టిఫికెట్‌కు ఎంపిక చేశారు. కాగా, కమిషనరేట్ పోలీస్ కార్యాలయం (సీపీవో) విభాగంలో తెలుగు రాష్ట్రాల్లోనే కరీంనగర్ కమిషనరేట్ ఎంపికై మేటిగా నిలవడం ప్రత్యేకం. ఈ సందర్భంగా కమిషనరేట్‌లో విలేకరుల సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ ఐఎస్వో గుర్తింపునకు ఎంపికవడం బాధ్యతను మరింత పెంచిందన్నారు. మరిన్ని సమర్థవంతమైన సేవలందించేందుకు ఈ గుర్తింపు దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ఎస్.శ్రీనివాస్ (ఎల్‌అండ్‌వో) జి.చంద్రమోహన్ (పరిపాలన), ఏసీపీలు తుల శ్రీనివాసరావు, విజయ్‌కుమార్, సి.ప్రతాప్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి మునిరత్నం పాల్గొన్నారు. -
ఇక అరెస్టులు ఉండవు.. తిప్పి పంపుడే: కమిషనర్ సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమంగా నివసిస్తున్న ఆఫ్రికన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. వీరు చిక్కినప్పుడు అరెస్టు చేస్తే వస్తున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని డిపోర్టేషన్ (బలవంతంగా తిప్పి పంపడం) విధానానికి శ్రీకారం చుట్టారు. ఫారెనర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) సాయంతో తొలిసారిగా ఐదుగురిపై ఈ ప్రక్రియను అనుమతి పొందారు. వీరిని బుధవారం నగర పోలీసు కార్యాలయం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు పంపారు. ఈ నేపథ్యంలో హెచ్–న్యూ డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్ ఆనంద్ వివరాలు వెల్లడించారు. అరెస్టు చేస్తే నేరాలకు ఊతమే... నైజీరియా, సోమాలియా, టాంజానియా, ఐవరీ కోర్టు వంటి ఆఫ్రికన్ దేశాల నుంచి అనేకమంది వివిధ రకాలైన వీసాలపై హైదరాబాద్ వస్తున్నారు. వీరిలో అనేక మంది వీసా, పాస్‌పోర్టుల గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్నారు. గతంలో ఇలా ఉంటూ చిక్కిన వారిపై ఫారెనర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసేవాళ్లు. కోర్టులో దీని విచారణ పూర్తయ్యే వరకు డిపోర్టేషన్ చేయడానికి ఆస్కారం లేదు. ఈ మధ్య కాలంలో బెయిల్‌పై బయటకు వచ్చే ఆ ఆఫ్రికన్లు సైబర్ నేరాలు, డ్రగ్స్ విక్రయం చేపట్టడంతో కొత్త తల నొప్పులు వచ్చేవి. ఇలాంటి వారిలో కొందరు నగరంతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో ఉన్న ఈశాన్య రాష్ట్రాల యువతులతో సహజీవనం చేస్తూ వారి ఇళ్లల్లోనే నివసిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లు, గుర్తింపుకార్డులు, వీసాలు తయారు చేసుకుని వీటి ఆధారంగా బ్యాంక్ ఖాతాలు తెరవడం, ఆధార్ కార్డులు పొందడం చేస్తున్నారు. అత్యంత సమస్యాత్మక వ్యక్తులైన వీరి ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉంటోంది. ఎఫ్ఆర్ఆర్ఓ సాయంతో డిపోర్టేషన్... ఈ పరిణామాలను గమనించిన సీవీ ఆనంద్ డిపోర్టేషన్‌కు శ్రీకారం చుట్టారు. ఇటీవల హెచ్–న్యూ అధికారులు డ్రగ్స్ కోసం ఆíఫ్రికన్ల ఉంటున్న ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. ఇన్స్పెక్టర్లు పి.రాజేష్, పి.రమేష్ రెడ్డిలు తమ బృందాలతో రెండు నెలల క్రితం బంజారాహిల్స్‌లోని పారామౌంట్‌కాలనీలో సోదాలు చేశారు. అక్రమంగా నివసిస్తున్న ఆంటోనీ సన్డే (నైజీరియా), కోనే మౌసా (ఐవరీ కోస్టు), ఆసూయ్ విలియం డెకోస్టేరియా (ఐవరీ కోస్టు), ఒబేరా పీటర్ (నైజీరియా), ఒమెజోరియా కింగ్స్లే (నైజీరియా) చిక్కారు. వీరి వివరాలు ఎఫ్ఆర్ఆర్ఓకు పంపి మూవ్మెంట్ రిస్ట్రెక్షన్ ఆర్డర్ పొంది సీసీఎస్‌లోని డిపోర్టేషన్ సెంటర్లో ఉంచారు. ఆయా ఎంబసీలకు సమాచారం ఇచ్చి వీరి గుర్తింపులు, ఢిల్లీ కార్యాలయం నుంచి టెంపరరీ ట్రావెల్ డాక్యుమెంట్లు పొందారు. ఈ ఐదుగురికీ విమాన టిక్కెట్లు ఖరీదు చేసిన సిటీ పోలీసులు ఖతర్ ఎయిర్వేస్ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్, ఎఫ్ఆర్ఆర్ఓ నుంచి ఎగ్జిట్ పర్మిట్ తీసుకున్నారు. వీటి ఆధారంగా బుధవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి డిపోర్ట్ చేశారు. దీంతో వీళ్లు మరోసారి భారత్‌లో అడుగుపెట్టడానికి ఆస్కారం ఉండదు. 750 మంది అక్రమంగా ఉంటున్నారు హైదారాబాద్ ఎఫ్ఆర్ఆర్ఓ ద్వారా 2900 మంది ఆఫ్రికన్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 750 మంది వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉండిపోయారు. వీళ్లు నగరంలో ఉన్నారా? ఇతర ప్రాంతాలకు వెళ్లారా? అనేది ఆరా తీస్తున్నాం. ఇలాంటి వారిని గుర్తించడానికి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు ప్రారంభిస్తాం. ఇకపై చిక్కిన వాళ్లంతా డిపోర్టేషన్ కావాల్సిందే. ఇళ్ల యజమానులు సైతం వీసా, పాస్‌పోర్టు చూడకుండా అద్దెకు ఇవ్వద్దు. అనుమానం ఉంటే పోలీసుల సహాయం తీసుకోండి. – సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ చదవండి: బీజేపీ జాతీయ సభ.. షెఫ్‌లకు యాదమ్మ ‘వంటల’ పాఠాలు! -
సిటీలో డీడీసీ... మాదకద్రవ్యాలపై స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో కొన్ని రోజులుగా మాదక ద్రవ్యాలపై స్పెషల్ డ్రైవ్ నడుస్తోంది. శాంతిభద్రతల విభాగం అధికారులతో పాటు టాస్క్‌ఫోర్స్, హెచ్– న్యూ వంటి ప్రత్యేక విభాగాలూ డ్రగ్స్‌ను పట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు వీటిని భద్రపరచడమనేది పోలీసులు పెద్ద తలనొప్పిగా ఉండేది. ఇటీవల మాదకద్రవ్యాల నిరోధక చట్టంలో (ఎన్డీపీఎస్ యాక్ట్) కేంద్రం కీలక సవరణలు చేసింది. దీని ఆధారంగా నిర్ణీత సమయం తర్వాత డ్రగ్స్‌ను ధ్వంసం చేయడానికి ఆస్కారం ఏర్పడింది. అందుకు అనుమతి జారీ చేయడానికి సిటీలో డ్రగ్ డిస్పోజల్ కమిటీని (డీడీసీ) ఏర్పాటు చేస్తూ కొత్వాల్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కీలక సవరణ చేసిన కేంద్రం... ఇలా పోలీసుస్టేషన్ల అధీనంలో ఉన్న మాదకద్రవ్యాల అమ్మకాలు జరగడం, కొందరు పోలీసులే వాటిని వినియోగించడం, అమాయకులపై కేసుల నమోదుకు వీటిని వినియోగించడం వంటి ఉదంతాలు ఉత్తరాదిలో చోటు చేసుకున్నాయి. డ్రగ్‌ను ఎలుకలు తినేశాయని, కింది పడిపోయిదని రికార్డుల్లో పొందుపరిచి ఇలా దుర్వినియోగం చేశారు. వీటిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్డీపీఎస్ యాక్ట్‌కు కీలక సవరణ చేసింది. దీని ప్రకారం మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసు అప్పీల్ సమయం ముగిసే వరకు వాటిని భద్రపరచాల్సిన అవసరం తప్పింది. వీటిని ధ్వంసం చేయడానికి విధివిధానాలను రూపొందించింది. గంజాయి సహా పోలీసులు స్వాధీనం చేసుకున్న ప్రతి మాదకద్రవ్యం శాంపిల్‌ను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి (ఎఫ్ఎస్ఎల్) పంపిస్తారు. వీళ్లు ధ్రువీకరిస్తూ, నివేదిక ఇస్తేనే న్యాయస్థానం స్వాధీనం చేసుకున్నది మాదకద్రవ్యంగా అంగీకరిస్తుంది. ఇలా ఈ రిపోర్టు వచ్చే వరకు మాత్రమే ఆ డ్రగ్‌ను భద్రపరచాలి. ఎఫ్ఎస్ఎల్ నుంచి అందిన నివేదికను కోర్టులో సమర్పించే పోలీసులు దాంతో పాటు తాము స్వాధీనం చేసుకున్న డ్రగ్‌ను తీసుకువెళ్తారు. ఇందులోంచి కొంత మొత్తం తీసి భద్రపరచమని ఆదేశించే న్యాయమూర్తులు మిగిలింది ధ్వంసం చేయడానికి అనుమతి ఇస్తారు. రాంకీ ప్లాంట్‌లో ధ్వంసానికి యోచన.. ఇలా అనుమతి వచ్చిన తర్వాత ఆ డ్రగ్స్‌ను ధ్వంసం చేయడానికి పోలీసులకు ఆస్కారం వస్తుంది. అయితే ఎవరికి వారుగా ఈ పని చేసుకుంటూపోతే జవాబుదారీతన కొరవడటంతో పాటు దుర్వినియోగానికి, అవకతవకలకు ఆస్కారం ఉంటుంది. దీని పర్యవేక్షణ కోసమే ప్రత్యేకంగా డీడీసీని ఏర్పాటు చేశారు. నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) సంయుక్త పోలీసు కమిషనర్ గజరావ్ భూపాల్ నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తుంది. సీసీఎస్ అదనపు డీసీపీ (పరిపాలన) స్నేహ మెహ్రా, ఏసీపీ కె.నర్సింగ్‌రావు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. మాదకద్రవ్యాలను ఎక్కడపడితే అక్కడ ధ్వంసం చేస్తే పర్యావరణంతో పాటు స్థానికుల పైనా అనేక దుష్ఫరిణామాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆయా ఏజెన్సీలు నగర శివార్లలో రాంకీ సంస్థ నిర్వహిస్తున్న యూనిట్లో నిపుణుల పర్యవేక్షణలో ఈ డ్రగ్స్‌ను ధ్వంసం చేస్తున్నాయి. సిటీ పోలీసులూ ఇదే యూనిట్‌ను వాడాలని యోచిస్తున్నారు. ఠాణాల్లో పేరుకుపోయేవి.. గతంలో అమలులో ఉన్న ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం పోలీసులు స్వా«ధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను చాలా కాలం వరకు భద్రపరచాల్సి వస్తోంది. నగరంలో చిక్కుతున్న వాటిలో ఇతర డ్రగ్స్ కంటే గంజాయి ఎక్కువగా ఉండేవి. ఈ నేపథ్యంలో పోలీసుస్టేష్లలోని మాల్ఖానాలు (అధికారిక గోదాములు) మొత్తం వీటితో నిండిపోయేవి. మాదకద్రవ్యానికి సంబం«ధించిన కేసు విచారణ కోర్టులో పూర్తి కావడానికి కొన్నేళ్లు పట్టేది. ఆ తర్వాత అప్పీల్ చేసుకోవడానికి మరికొంత సమయం ఉండేది. అంటే ఈ కేసులో దోషులుగా తేలిన వాళ్లు, నిర్దోషులుగా తేలితే పోలీసులు ఆ తీర్పును సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడాన్ని అప్పీల్ అంటారు. ఈ సమయం ముగిసే వరకు ఆ మాకద్రవ్యాన్ని కేసు నమోదై ఉన్న పోలీసుల అధీనంలో ఉంచుకోవాల్సి వచ్చేది. సిటీలో డ్రగ్స్‌ను, నిందితులను శాంతిభద్రతల విభాగం, టాస్క్‌ఫోర్స్, హెచ్–న్యూ అధికారులు పట్టుకుంటారు. దీనికి సంబంధించిన కేసులు మాత్రం స్థానికంగా శాంతిభద్రతల విభాగం ఠాణాలోనే నమోదు చేస్తారు. ఈ కారణంగానే ఠాణాల మాల్ఖానాలన్నీ గంజాయితో నిండిపోయేవి. (చదవండి: ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ సక్సెస్ చేస్తాం ) -
చలో విజయవాడకు అనుమతి లేదు
విజయవాడ: ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఈ నెల 25వ తేదీన విజయవాడలో నిర్వహించ తలపెట్టిన చలో విజయవాడ, సీఎం కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి అనుమతి మంజూరు చేయలేదని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ టి.కె.రాణా తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. నగరంలో 30 పోలీస్ యాక్ట్, 144 సీఆర్పీసీ ఆంక్షలు అమలులో ఉన్నాయని తెలిపారు. ఈ నిబంధనలు అతిక్రమించవద్దని ఉపాధ్యాయ సంఘాల నాయకులకు సూచించారు. ఈ ఆంక్షలు ఉల్లగించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే పలువురికి ముందస్తుగా నోటీసులు ఇచ్చామన్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని చలో విజయవాడ కార్యక్రమాన్ని విరమించుకోవాలని సూచించారు. -
హైదరాబాద్‌లో కొత్తగా రెండు జోన్లు, 13 పోలీస్ స్టేషన్లు.. ఏయే ప్రాంతాల్లో అంటే...
సాక్షి, హైదరాబాద్: సిటీ పోలీసు కమిషనరేట్‌కు 175 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది ఏర్పాటైన నాటి నుంచి పలుమార్లు చిన్నచిన్న మార్పులతో పునర్వ్యవస్థీకరణ జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గతానికి భిన్నంగా భారీ రీ– ఆర్గనైజేషన్‌కు కసరత్తు పూర్తయింది. కొత్తగా రెండు జోన్లు, 13 పోలీసుస్టేషన్లతో పాటు వాటికి తగ్గట్టు సబ్–డివిజన్లను ప్రతిపాదిస్తూ ప్రత్యేక కమిటీ తయారుచేసిన ప్రతిపాదనలు సోమవారం ప్రభుత్వానికి చేరాయి. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం సర్కారు ఆమోదముద్ర వేయనుంది. ఈమేరకు ఉత్తర్వులు వెలువడితే నగరంలో జోన్ల సంఖ్య 7కు, పోలీసు స్టేషన్లు 73కు చేరనున్నాయి. ఇదీ చరిత్ర.. ► హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ 1847లో ఏర్పడింది. అప్పట్లో నిజాం స్టేట్‌కు హైదరాబాద్ రాజధాని కావడంతో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, జరిగిన నేరాలను కొలిక్కి తీసుకురావడం తదితర విధులతో దీన్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రం, హైదరాబాద్ సంస్థానం విలీనం అనంతరం తొలిసారిగా 1955లో నగర పోలీసు పునర్వ్యవస్థీకరణ జరిగింది. అప్పటి మద్రాస్ సిటీ పోలీసు విధానాలను అధ్యయనం చేసి ఇక్కడ అమలుపరిచారు. దీంతో క్రైమ్, లా అండ్ ఆర్డర్ వేరు పడటం, హైదరాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాలు రైల్వే పోలీసులోకి బదిలీ కావడం తదితర కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ► ఆ ఏడాది జూలై 15 నుంచి ఈ విధివిధానాలు అమలులోకి వచ్చాయి. తొలిసారిగా ఏర్పాటు చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్లకు కొందరు సిబ్బందిని అప్పగించి పెట్రోలింగ్ విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకున్నారు. 1956లో హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. దీంతో జంట నగరాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పోలీసు విభాగంలో లా అండ్ ఆర్డర్, క్రైమ్‌తో పాటు ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్ తదితర విభాగాలనూ ఏర్పాటు చేస్తూ 1957 అక్టోబర్ 11న నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పుతో పాటు నగర కమిషనరేట్నూ పాలనా సౌలభ్యం కోసం విభజించారు. నాలుగు సబ్– డివిజన్లు, 12 సర్కిళ్లతో 34 పోలీసుస్టేషన్లు ఏర్పడ్డాయి. నగర విస్తరణతో 1981 పునర్వ్యవస్థీకరణ.. ► విస్తరిస్తున్న నగరంలో పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టు 1981లో కమిషనరేట్‌ను మరోసారి పునర్వ్యవస్థీకరించారు. దీనిప్రకారం నగరంలో నాలుగు జోన్లు (ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్), 12 సబ్–డివిజన్లు ఏర్పడ్డాయి. జోన్‌కు డీసీపీలు, సబ్–డివిజన్‌కు ఏసీపీలు నేతృత్వం వహించే ఏర్పాట్లు చేశారు. ► 1985, 2001ల్లో జరిగిన మార్పుచేర్పులతో సెంట్రల్ జోన్, రెయిన్‌బజార్, కంచన్‌బాగ్ పోలీసుస్టేషన్ల ఏర్పాటుతో నగరంలోని జోన్ల సంఖ్య 5కు, పోలీసు స్టేషన్ల సంఖ్య 60కి పెరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ విశ్వనగరంగా మారుతూ వచ్చినా పోలీసుస్టేషన్లు, సబ్–డివిజన్లు, జోన్ల సంఖ్య పెరగలేదు. ► ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేశారు. తక్షణం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, నేరాల నమోదుతో పాటు జనాభా, పోలీసింగ్ తీరుతెన్నులు ప్రాతిపదికన పోలీసు కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తన నేతృత్వంలో సంయుక్త పోలీసు కమిషనర్, ముగ్గురు అదనపు డీసీపీలు, ముగ్గురు ఏసీపీలతో గత నెలలో కమిటీకి రూపమిచ్చారు. ► నగరంలో సుదీర్ఘ కాలం పని చేసిన అనుభవం, పట్టు ఉన్న ఈ అధికారులు పునర్వ్యవస్థీకరణ అంశాన్ని అనేక కోణాల్లో పరిశీలించారు. ఎట్టకేలకు సౌత్, వెస్ట్, సెంట్రల్, నార్త్జోన్లలో ఉన్న ప్రాంతాలను విడగొడుతూ రెండు జోన్లకు, 15 ఠాణాల్లోని ఏరియాలను కలుపుతూ 13 పోలీసుస్టేషన్లకు రూపమిస్తూ దస్త్రం రూపొందించి ప్రభుత్వానికి పంపారు. (క్లిక్: పోలీస్ పరీక్షల ఉచిత శికణకై ప్రీ రిక్రూట్మెంట్ టెస్ట్) ► ప్రస్తుత నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేపథ్యంలోనే కమిషనరేట్‌లో కీలక మార్పులు జరిగాయి. సెంట్రల్ జోన్ ఏర్పడినప్పుడు తొలి డీసీపీగా ఆయనే పని చేశారు. హుస్సేన్‌సాగర్‌లో ఆత్మహత్యల నిరోధానికి లేక్ పోలీసుస్టేషన్‌కు ఆనందే రూపమిచ్చారు. తాజాగా భారీ మార్పులు ఆయన నేతృత్వంలోని కమిటీ ద్వారానే జరగనుండటం విశేషం. (క్లిక్: మది దోచే మల్కంచెరువు..) -
నగర పోలీసు కమిషనరేట్‌లో కీలక నిర్ణయం.. ఇకపై ఆ లైసెన్సుల జారీ కఠినతరం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆయుధ లైసెన్సుల జారీ విధానాన్ని మరింత కఠినతరం చేస్తూ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తుదారుడిని ఇంటర్వ్యూ చేసిన తర్వాతే దరఖాస్తును ఆమోదించనున్నారు. లైసెన్సుల జారీలో లోపాలను సరిచేయడం, పారదర్శకత పెంచడం, దుర్వినియోగాన్ని తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. అనునిత్యం బిజీ షెడ్యూల్లో ఉండే కొత్వాల్ ఆనంద్ ఈ ఇంటర్వ్యూల కోసం ప్రతి రోజూ నిర్ణీత సమయాన్ని కేటాయిస్తున్నారు. మూడు కేటగిరీలుగా జారీ.. ►సాధారణంగా తుపాకీ ఖరీదు చేసుకోవడానికి, కలిగి ఉండటానికి లైసెన్సును మూడు కేటగిరీల్లో జారీ చేస్తుంటారు. వ్యక్తిగత భద్రత, సెక్యూరిటీ గార్డులు, ఫైరింగ్ వంటి క్రీడలకు సంబంధీకులకు వీటిని ఇస్తుంటారు. నగర పరిధిలో నివసిస్తున్న క్రీడాకారులతో పాటు వ్యాపారులు, ప్రముఖులు, సెక్యూరిటీ గార్డులకు వీటి జారీ అధికారి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలు ఉన్న పోలీసు కమిషనర్‌కు ఉంది. ►ఆయుధ చట్టంలో 2020లో వచ్చిన సరవణ ప్రకారం వ్యక్తిగత భద్రత కేటగిరీలో గరిష్టంగా రెండు తుపాకులు మాత్రమే కలిగి ఉండాలి. అంతకుమించి ఉన్న వారి నుంచి నగర పోలీసులు రెండేళ్ల క్రితం డిపాజిట్ చేయించారు. వ్యక్తిగత భద్రత కేటగిరీలో ఆయుధ లైసెన్సు తీసుకున్న కొందరు దాన్ని క్రీడలు లేదా సెక్యూరిటీ విధులు వంటి వాటికి వినియోగిస్తుంటారు. ఇలా చేయడం ఆయుధ చట్టం ప్రకారం నేరమే అవుతుంది. గతంలో ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. నేర చరిత్ర లేనివారికే.. ►ఆయుధ లైసెన్సు కోసం నగరవాసి చేసుకున్న దరఖాస్తు దస్త్రంపై పోలీసుస్టేషన్, ఏసీపీ కార్యాలయం, డీసీపీ కార్యాలయం, సంయుక్త పోలీసు కమిషనర్ కార్యాలయాలు తొలుత ఆమోదముద్ర వేస్తాయి. ఎలాంటి నేరచరిత్ర లేని వారికే మంజూరుకు అనుమతిస్తాయి. ఇప్పటి వరకు ఇలా వస్తున్న దరఖాస్తు ఫైళ్లపై కొత్వాల్ ప్రాథమిక పరిశీలన చేసి సంతకం చేస్తూ లైసెన్సు జారీ చేస్తారు. దీని ఆధారంగా అనుమతి పొందిన క్యాలిబర్, సంఖ్యలో ఆయుధాలను లైసెన్సుదారు ఖరీదు చేసుకుంటారు. ►ఇటీవల కాలంలో లైసెన్స్డ్ ఆయుధాలు కలిగి ఉడటమనేది అవసరమున్నా లేకపోయినా స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. ఇదే కొన్నిసార్లు అపశ్రుతులకు దారి తీస్తోంది. ఏదైనా ఉదంతం జరిగినప్పుడు మాత్రమే ఈ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయుధ లైసెన్సులకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో వివిధ స్థాయిల్లో పోలీసులపై ఒత్తిళ్లు, ప్రలోభాలకు ఆస్కారం ఏర్పడుతోంది. వీటిని అన్ని సందర్భాల్లోనూ కింది, మధ్య స్థాయి అధికారులు పట్టించుకోకుండా ఉండలేరు. ప్రలోభాల కంటే ఒత్తిళ్లే ఎక్కువగా పని చేస్తుంటాయి. పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతే.. ►ఇలాంటి అంశాలకు ఆస్కారం లేకుండా నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయుధ లైసెన్సు దస్త్రం వివిధ స్థాయిలను దాటి తన వద్దకు చేరాక దాన్ని పరిశీలించే సమయంలో దరఖాస్తుదారుడిని ముఖాముఖీ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ►దరఖాస్తు చేసుకున్నది ఎవరు? ఏ అవసరం కోసం అప్లై చేశారు? నిజంగా వారికి ఆయుధం కలిగి ఉండాల్సిన అవసరం ఉందా? తదితర అంశాలను ఆయనే స్వయంగా ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుంటున్నారు. పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే లైసెన్సు జారీ చేస్తున్నారు. ►నగరవాసులు పోలీసు కమిషనర్‌ను నేరుగా కలవడానికి ప్రతి రోజూ విజిటింగ్ అవర్స్ ఉంటాయి. వీటిని కొత్వాల్ సీవీ ఆనంద్ పక్కాగా అమలు చేస్తున్నారు. ఆ సమయంలోనే ఆయుధ లైసెన్స్ దరఖాస్తుదారులనూ ఇంటర్వ్యూ చేయడానికీ కొంత కేటాయిస్తున్నారు. -
ఫస్ట్ ఉమన్.. క్లిష్ట పరిస్థితుల్లో గట్టి పోలిస్ ఆఫీసర్
‘దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది ఇప్పుడు’ అనేది మన తెలుగు సినిమా డైలాగైతే కావచ్చుగానీ హరియాణాలోని గుర్‌గ్రామ్‌కు వెళితే ‘సిటీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు’ అనే రియల్ డైలాగ్ లోకల్ లాంగ్వేజ్‌లో అప్పట్లో తరచు వినిపించేది. సిటీ పరిస్థితి క్లిష్టస్థితిలో పడడానికి శాంతిభద్రతల నుంచి ట్రాఫిక్ అస్తవ్యస్తతల వరకు రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇలాంటి క్లిష్టసమయంలో గుర్‌గ్రామ్ తొలి మహిళా పోలిస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు కళారామచంద్రన్. రెవారి, ఫతేహబాద్, పంచ్‌కుల జిల్లాల సూపరిండెంట్ ఆఫ్ పోలిస్‌గా పనిచేసినా, ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసినా, మేఘాలయాలోని ఈశాన్య ప్రాంత పోలిస్ అకాడమీ హెడ్‌గా పనిచేసినా... కళా రామచంద్రన్ తనదైన ప్రత్యేకతను సృష్టించుకున్నారు. నిఖార్సయిన పోలిస్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు.గుర్‌గ్రామ్‌లో చూడచక్కని రోడ్లు ఉన్నాయి. కానీ ఏంలాభం? ‘వేగమే మా నైజం’ అన్నట్లుగా దూసుకుపోతుంటాయి వాహనాలు. దీనివల్ల యాక్సిడెంట్లు, మరణాలు. మరోవైపు డ్రంకెన్ డ్రైవింగ్. ఇంకోవైపు స్ట్రీట్క్రైమ్స్. సైబర్‌క్రైమ్, ఈవ్‌టీజింగ్ లాంటి సమస్యలు బోలెడన్ని ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల నిష్క్రియాపరత్వం మీద వేడివేడి విమర్శ లు కూడా వచ్చాయి.అలాంటి క్లిష్ట సమయంలో బాధ్యత లు తీసుకున్న కళారామచంద్రన్ ‘నగరాన్ని ఏ మేరకు భద్రంగా ఉంచగలరు?’ అనే సందేహాలు రాకపోవడానికి కారణం ఆమెకు ఉన్న వృత్తి నిబద్ధత, మంచిపేరు. ‘క్షేత్రస్థాయి నుంచి పోలిసు పర్యవేక్షణను బలోపేతం చేసే కార్యాచరణకు శ్రీకారం చుట్టాం’ అంటున్నారు కళా రామ చంద్రన్. రకరకాల ప్రాంతాలలో పనిచేసిన అనుభవంతో పాటు, భర్త ఇచ్చిన సూచనలు కూడా గుర్గ్రామ్ని ‘సేఫర్ అండ్ బెటర్’ సిటీగా మార్చడానికి ఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కళారామచంద్రన్ భర్త నవదీప్‌సింగ్ సీనియర్ ఐపీయస్ అధికారి. గుర్‌గ్రామ్ పోలిస్ కమిషనర్‌గా పనిచేశారు. -
లండన్ పోలీస్ కమిషనర్ రేసులో మనోడు
విదేశాల్లో సత్తా చాటుతున్నారు ప్రవాస భారతీయులు. ఇప్పటికే వివిధ దేశాల చట్ట సభల్లో అనేక మంది చోటు సాధించి తమదైన ముద్ర వేశారు. తాజాగా ప్రసిద్ది చెందిన లండన్ పోలీస్ కమిషనర్ రేసులో ప్రవాస భారతీయుడు అనిల్ కాంతి నీల్ బసు ఉన్నట్టుగా బ్రిటీష్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే ఈ పదవిని చేపట్టిన తొలి శ్వేతజాతీయేతరుడిగా ఆయన రికార్డుల్లోకి ఎక్కుతారు. అనిల్ కాంతి నీల్ బసు తండ్రిది కోల్‌కతా. ఆయనకొక సర్జన్. 1961లో ఇంగ్లండ్ షిఫ్ట్ అయ్యారు. ఆయన భార్య ఓ నర్సు. అనిల్ కాంతి బసు యూకేలోనే పుట్టి పెరిగారు. నాటింగ్‌హామ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా తీసుకున్నాక 1992లో మెట్ పోలీస్‌శాఖలో చేరారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. కౌంటర్ టెర్రరిజమ్ చీఫ్‌గా, స్పెషలిస్ట్ ఆపరేషన్స్ బాస్‌గా పని చేశారు. ఇంగ్లండ్ పోలీస్ శాఖలో అనిల్కాంతికి మంచి పేరుంది. ఎంఐ 15, యూకే డొమెస్టిక్ సర్వీస్‌లో సైతం అనిల్ కాంతిపై సదాభిప్రాయం కలిగి ఉంది. లండన్ మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్‌గా పని చేస్తున్న క్రెసిడా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.దీంతో కొత్త కమిషనర్ ఎంపిక అనివార్యంగా మారింది. ఈ పదవి కోసం ఎంపిక చేసిన పోలీసు అధికారుల తుది జాబితాలో అనిల్కాంతి ఉన్నట్టు బ్రిటీష్ మీడియా పేర్కొంటుంది. ప్రస్తుతం హోం సెక్రటరీగా ఉన్న ప్రీతి పటేల్‌తో అనిల్ కాంతిల మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నట్టు బ్రిటీష్ మీడియాలో మరో వర్గం వాదిస్తోంది. హోం సెక్రటరీ పదవిలో ప్రీతీ ఉండగా లండన్ పోలీస్ కమిషనర్ పదవి కాంత్రి బసుకు రాకపోవచ్చని చెబుతోంది. అయితే క్రైం ఇన్విస్టిగేషన్లో దిట్టగా పేరున్న అనిల్ కాంతికి లండన్ పోలీస్ కమిషనర్ పోస్టు రాని పక్షంలో స్కాట్లాండ్ యార్డ్ చీఫ్ పోస్టయినా దక్కే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. చదవండి: ఇండియన్ కాల్సెంటర్లపై అమెరికాలో కేసు నమోదు -
జనవరి 31న సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద కాల్పులు
-
మళ్లీ సెంట్రల్ ‘క్రైమ్’ స్టేషన్!
సాక్షి హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అంటే ఒకప్పుడు చోరులు, దోపిడీ దొంగలు, బందిపోట్లకు హడల్. జూపార్క్‌లో పులి సాఖీని చంపిన సలావుద్దీన్ నుంచి పాతబస్తీలోని మహంకాళి ఆలయంలో చోరీకి పాల్పడిన గౌస్, సలీంల వరకు ఎందరో కరుడుగట్టిన నేరగాళ్లను అరెస్టు చేసిన ఘన చరిత్ర దీనికి ఉంది. కొంత కాలంగా నిర్వీర్యమైన సీసీఎస్ క్రైమ్ టీమ్స్‌ను పునరుద్ధరించాలని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులు అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నో విభాగాలు... నగరంలో చోటు చేసుకున్న సంచలనాత్మక కేసులను ఒకప్పుడు సీసీఎస్‌కు బదిలీ చేసే వాళ్లు. రూ.30 లక్షలకు పైబడిన సొత్తుతో కూడిన భారీ చోరీలతో పాటు దోపిడీ, బందిపోటు దొంగతనం, కార్ల తస్కరణ తదితరాలన్నీ ఇక్కడకే వచ్చేవి. దీనికోసం ఇందులో యాంటీ డెకాయిటీ అండ్ రాబరీ టీమ్, ఆటోమొబైల్ టీమ్, క్రైమ్ బృందం... ఇలా వివిధ విభాగాలు పని చేసేవి. నగర టాస్క్‌ఫోర్స్, సైబరాబాద్ ఎస్ఓటీలతో పాటు క్రైమ్ వర్క్‌కు సంబంధించి అప్పట్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న గోషామహల్ ఏసీపీ టీమ్‌లకు పోటీగా సీసీఎస్ అధికారులు పని చేసే వాళ్లు. ఫలితాలు కూడా అదే స్థాయిలో సాధించారు. ప్రస్తుతానికి అంతర్గతంగా నియామకం... ఆయా జోన్లలో జరిగే భారీ నేరాలను ఈ బృందాలు దర్యాప్తు చేస్తాయి. కేసులను కొలిక్కి తీసుకువచ్చి నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. అత్యంత సంచలనాత్మక కేసులను పర్యవేక్షించడానికి మరో ప్రత్యేక టీమ్ పని చేస్తుంది. ప్రస్తుతానికి ఈ ఆరు టీమ్స్‌లోని సీసీఎస్‌లో పని చేస్తున్న వారినే తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆసక్తి ఉన్న వారు ముందుకు రావాలంటూ అంతర్గతంగా సమాచారం ఇచ్చారు. రానున్న రోజుల్లో నగరంలోని ఠాణాలు, ఇతర విభాగాల్లో ఉన్న అనుభవజ్ఞులను నియమించడం ద్వారా సీసీఎస్ క్రైమ్ టీమ్స్‌ను దీటుగా తీర్చిదిద్దడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఆర్థిక నేరాల కేసులతోనే.. కాలక్రమంలో సీసీఎస్‌లోని ఈ క్రైమ్ టీమ్‌లు తమ ఉనికిని కోల్పోయాయి. అప్పట్లో ఆర్థిక నేరాలు, మోసాల కేసులను దర్యాప్తు చేయడానికి పరిమిత సంఖ్యలో టీమ్స్ ఉండేవి. అయితే రానురాను ఈ తరహా కేసులు పెరగడంతో పాటు అనుభవజ్ఞలైన సిబ్బంది దూరం కావడంతో సీసీఎస్‌లో క్రైమ్ వర్క్ తగ్గింది. ప్రస్తుతం దాదాపు అన్ని బృందాలు ఈ ఆర్థిక నేరాలనే దర్యాప్తు చేస్తున్నాయి. ఈ విషయం గమనించిన నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కమిషనరేట్ పరిధిలోని ఐదు జోన్లకు సంబంధించి ఐదు, ప్రత్యేకంగా మరొకటి కలిపి ఆరు క్రైమ్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
ముదిరిన ఎంపీ.. సీపీల వివాదం.. ఢిల్లీకి గల్లీ లొల్లి!
సాక్షి, కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్.. కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మధ్య వివాదం ముదిరింది. నగరంలోని ఎంపీ కార్యాలయం ఉన్న చైతన్యపురి గల్లీలో మొదలైన వివాదం.. ఢిల్లీలోని ప్రివిలేజ్ కమిటీ వద్దకు చేరింది. ఈ వ్యవహారంలో శుక్రవారం సంజయ్ పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరుకానున్నారు. 317 జీవో సవరణకు సంజయ్ ఈ నెల 2న తలపెట్టిన జాగరణ దీక్ష సందర్భంగా పోలీసులు అతడిని అరెస్టు చేసిన వి షయం తెలిసిందే. ఆ సమయంలో పోలీసులు బీజేపీ కార్యాలయం తలుపులు బద్దలుకొట్టి, తన గల్లా పట్టుకుని ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారని సంజయ్ ఆరోపించారు. సంబంధిత వార్త: సీపీ నా గల్లా పట్టుకున్నారు: బండి సంజయ్ ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ, పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఆయన ఈ– మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన ప్రివిలేజ్ కమిటీ హోంశాఖ కార్యదర్శిని రిపోర్టు అడిగిందని స మాచారం. హోంశాఖ కార్యదర్శి తెలంగాణ డీ జీపీ, సీఎస్‌ను నివేదిక కోరారని తెలిసింది. ని వేదికలు ఇప్పటికే ప్రివిలేజ్ కమిటీకి చేరాయని సమాచారం. ఈ నేపథ్యంలో తనపై పోలీసులు దాడి చేశారని, అరెస్టు సందర్భంగా హద్దుదాటి వ్యవహరించారని సంజయ్ ఆరోపిస్తున్నారు. గ్యాస్ కట్టర్లతో ఎంపీ కార్యాలయం తలుపులు, కిటికీలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి అత్యుత్సాహం ప్రదర్శించారని ప్రివిలేజ్ కమిటీకి ఇ చ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమపై పోలీసులు అకారణంగా లాఠీచార్జీ చేశారని వివరించారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చే పలు ఫొటోలు, వీడియోలు, న్యూస్ క్లిప్పింగులతో కూడిన ఫైల్‌ను కమిటీకి సంజయ్ సమర్పించనున్నారని సమాచారం. చదవండి: జాగ‘రణం’.. బండి సంజయ్ దీక్ష భగ్నం సీపీతోపాటు ముగ్గురికి నోటీసులు!? ఎంపీ సంజయ్ ఇచ్చిన ఆధారాలను పరిశీలించిన అనంతరం కమిటీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీపీతోపాటు ముగ్గురు పోలీసుల అధికారులకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి. కరీంనగర్ పోలీసులపై సంజయ్ పార్లమెంటు కు ఫిర్యాదు చేయ డం రెండోసారి కావడం గమనార్హం. అది కూడా ప్రస్తుత సీపీ సత్యనారాయణపైనే. 2019లో ఆర్టీసీ సమ్మె సమయంలోనూ ఓ ఆర్టీసీ కార్మికుడి శవయాత్రలో పోలీసులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని బండి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అప్పటి సీపీ కమలాసన్‌రెడ్డి సెలవులో ఉ న్నారు. ఆ సమయంలో రామగుండం సీపీగా ఉన్న సత్యనారాయణ కరీంనగర్‌కు ఇన్చార్జి సీపీగా వ్యవహరించారు. అప్పుడూ ఎంపీ సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తీరు వివాదాస్పదంగా మారింది. దీంతో వీరిద్దరి మధ్య వృత్తిగతంగా విభేదాలు రావడం ఇది రెండోసారి కావడం విశేషం. సీనియర్లకు వివరణతో సరి..! మరోవైపు ఇటీవల సంజయ్‌కి వ్యతిరేకంగా అ సమ్మతి రాగాలు పలికిన సీనియర్ల విషయంలో అధిష్టానం స్పష్టమైన వైఖరితోనే ఉంది. ఈ వ్య వహారంపై సీనియర్ నాయకుడు నల్లు ఇంద్రసే నారెడ్డి నేతృత్వంలో విచారణకు ఆదేశించిన విష యం తెలిసిందే. పార్టీ అధ్యక్షుడిపై అసమ్మతి గళం విషయంలో తొలుత సీనియర్లను పిలిపించి మాట్లాడాలని నిర్ణయించినట్లు సమాచారం. వారి వివరణలు వినాలని, వాటితో సంతృప్తి చెందకపోతే అపుడు నోటీసులు జారీ చేయాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలిసింది. ఇటీవల కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో సీనియర్ నేతలు సుగుణాకర్‌రావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి తదితరులు సమావేశం నిర్వహించడం రాష్ట్ర బీజేపీలో కలకలం రేపింది. దీనిని తీవ్రంగా పరిగణించిన అధిష్టానం వెంటనే అసమ్మతి నిప్పును ఆర్పేందుకు చర్యలు చేపట్టింది. బీసీ కమిషన్ ఎదుట సీపీ వివరణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఈనెల 2న నిర్వహించిన జాగరణ దీక్షను భగ్నం చేసిన ఘటనలో సీపీ సత్యనారాయణ జాతీయ బీసీ కమిషన్ ఎదుట హాజరయ్యారు. గురువారం హైదరాబాద్‌లోని దిల్కుషా గెస్ట్‌హౌస్‌లో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజ్ ఆచారీ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. ఎంపీ సంజయ్ కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ భారీ జనసమీకరణతో దీక్ష తలపెట్టిన నేపథ్యంలో అతడిని అరెస్టు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. దీక్షకు అనుమతి లేదని, కోవిడ్ ప్రబలుతున్న నేపథ్యంలో దీక్షను రద్దు చేసుకోవాలని సూచిస్తూ ఆ రోజు ఉదయం బీజేపీ నాయకులకు నోటీసులు జారీ చేసినట్లు సీపీ తెలిపారు. అయినా దీక్ష కొనసాగించడంతో అరెస్టు చేయాల్సి వచ్చిందని సీపీ సత్యనారాయణ వివరణ ఇచ్చినట్లు తెలిసింది. -
పోలీస్ కమిషనర్ పేరుతో పోలీసులనే బురిడి కొట్టించాడు!!
కొన్ని సంఘటనలు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇటీవల దొంగలు కూడా రూటు మార్చారనే చెప్పాలి. ఇదివరకు దొంగలు అమాయకులు, ఒంటరివాళ్లను, వృద్ధులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడేవారు. ఇప్పుడు అత్యున్నతస్థాయి ఉద్యోగులను, బ్యాంకు ఉద్యోగులనే కాక ఏకంగా పోలీసులునే బురిడి కొట్టిస్తున్నారు. అచ్చం అలాంటి సంఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. (చదవండి: మృత్యుంజయురాలు! ...ఐదు రోజులుగా గడ్డకట్టే మంచులో కారులోనే ... అసలు విషయంలోకెళ్లితే...ముంబైలోని గోరేగావ్‌కు చెందిన ఖలీలుల్లా అయానుల్లా ఖాన్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కి కాల్ చేసి తనను తాను అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) విజయ్ సింగ్‌గా పరిచయం చేసుకున్నాడు. ఈ మేరకు అయానుల్లా ఖాన్పింప్రీ చించ్వాడ్ పోలీస్ చీఫ్ నంబర్ ఇవ్వవల్సిందిగా అభ్యర్థించాడు. ఆ తర్వాత కాసేపటికి అయానుల్లా ఖాన్ తానే మళ్లీ కంట్రోలో రూమ్‌కి ఫోన్ చేసి ఆయనని కలవలేకపోయాను అందువల్ల క్రైమ్ బ్రాంచ్‌లోని ఇతర పోలీసు నెంబర్లను ఇవ్వండి అని కోరాడు. ఈ క్రమంలో అయానుల్లా ఖాన్ ఒక పోలీసు అధికారికి ఫోన్ చేసి టౌన్షిప్ ప్రాంతంలో సుమారు 5 నుంచి 6 వరకు పిస్టల్స్ డెలివరీ అయ్యే అవకాశం ఉందంటూ అక్రమ ఆయుధాలకు సంబంధించిన సమాచారాన్ని అందించాడు. అంతేకాదు వాట్సాప్‌లో కొంతమంది వ్యక్తుల ఫోటోలను కూడా పంపించాడు. ఈ మేరకు పూర్తి సమాచారం కొరకు అయానుల్లా ఖాన్ పోలీసులను రూ 15, 000 కూడా డిమాండ్ చేశాడు. అయితే పోలీసులు కూడా అంగీకరించి డబ్బులు పంపించారు. ఈ క్రమంలో కొంత మంది పోలీసులకు అయానుల్లా ఖాన్ తీరు పై అనుమానం వచ్చి విచారించడం మొదలు పెట్టారు. ఈ మేరకు అయానుల్లా ఖాన్ పోలీస్ కమిషనర్ పేరుతో మోసం చేసినట్ల గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. (చదవండి: రాజహంసలు ఒకేచోట సందడి చేశాయి: క్యూట్ వైరల్ వీడియో!!) -
New Year Celebrations: ‘సాగర్’ చుట్టూ నో ఎంట్రీ.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీసులు కొన్ని చోట్ల ట్రాఫిక్ ఆంక్షల్ని విధించారు. పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యామ్నాయం లేని బేగంపేట ఫ్లైఓవర్ మినహా మిగిలిన అన్నింటిని శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు మూసేస్తున్నారు. ►ట్యాంక్ బండ్‌పై భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. శుక్రవారం రాత్రి 10 నుంచి శనివారం తెల్లవారుజాము 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ►సచివాలయం పక్కనున్న మింట్ కాంపౌండ్ లైన్‌ను పూర్తిగా మూసేస్తారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. వీవీ స్టాచ్యూ నుంచి నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్, రాజ్ భవన్ మీదుగా మళ్లిస్తారు. బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వచ్చే ట్రాఫిక్ని ఇక్బాల్ మీనార్, లక్డీకాపూల్, అయోధ్య జంక్షన్ వైపు పంపుతారు. ►లిబర్టీ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే ట్రాఫిక్ని జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి బీఆర్కే భవన్, తెలుగుతల్లి, ఇక్బాల్ మీనార్, రవీంద్రభారతి, లక్డీకాపూల్, అయోధ్య జంక్షన్ మీదుగా మళ్లిస్తారు. ►ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను మీరా టాకీస్ లైన్ మీదుగా పంపుతారు. నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వాహనాలను సంజీవయ్య పార్క్, నెక్లెస్‌రోడ్ పైకి పంపరు. వీటిని కర్బాలా మైదాన్, మినిస్టర్స్ రోడ్ మీదుగా పంపిస్తారు. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సెయిలింగ్ క్లబ్ నుంచి కవాడిగూడ చౌరస్తా, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ టెంపుల్, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు మళ్లిస్తారు. -
ఆర్తిసింగ్ ఐపీఎస్..ఎంటరైతే చాలు..కాకలు తీరిన క్రిమినల్స్ గజగజ వణకాల్సిందే
దేశంలో దాదాపు అన్ని పోలీస్ కమిషనరేట్లలో దాదాపు అందరూ మగ అధికారులే కమిషనర్లు. సినిమాల్లో కూడా హీరోయే పోలీస్ కమిషనర్. కాని ఆర్తి సింగ్ ఈ సన్నివేశాన్ని మార్చింది. మహారాష్ట్రలోని అమరావతికి కమిషనర్‌గా చార్జ్ తీసుకుంది. ప్రస్తుతం దేశంలో ఈమె ఒక్కతే మహిళా పోలీస్ కమిషనర్. రావడంతోటే స్ట్రీట్ క్రైమ్‌ను రూపుమాపాలనుకుంది. ఎస్.. నేను చేయగలను అంటున్న ఆర్తి సింగ్ పరిచయం. 2009. దేశానికి ఎలక్షన్లు. కీలకమైన సమయం. మరోవైపు మావోయిస్టులు తమ కదలికలను పెంచారు. మహారాష్ట్రలోని ‘రెడ్ కారిడార్’ అయిన గడ్చిరోలి ప్రాంతంలో జరిగిన దాడిలో 17 మంది పోలీసులు చనిపోయారు. ఆ సమయంలో అక్కడ గట్టి పోలీస్ ఆఫీసర్ అవసరం. మావోయిస్టుల దాడులను నిరోధించేందుకే కాదు ఎలక్షన్లు సజావుగా జరిగేందుకు కూడా చర్యలు తీసుకోవాలి. కాని చార్జ్ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో పై అధికారులకు తట్టిన ఒకే ఒక్క పేరు ఆర్తి సింగ్. ఆమె 2006 బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసర్. పెద్దగా అనుభవం లేదు. పైగా మహిళా ఆఫీసర్. ‘ఆమె ఏమి చేయగలదు’ అని గడ్చిరోలి ప్రాంతంలోని సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్లు అనుకున్నారు. కాని ఆమె చార్జ్ తీసుకున్నాక వారంతా అవాక్కయ్యారు. ఎందుకంటే ఆ సమయంలో ఆమె మావోయిస్టుల కదలికలను నివారించడమే కాదు... ఎలక్షన్లను బహిష్కరించండి అన్న వారి పిలుపును గెలవనీకుండా గ్రామీణ ప్రాంతాలలో ఓటింగ్ జరిగేలా చూసింది. అందుకే ఆమె పోలీసుల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు పొందింది. అందరూ మూడు నుంచి ఆరు నెలల కాలం చేసి ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్లిపోయే చోట ఆమె మూడు సంవత్సరాలు పని చేసింది. ‘నేను చేయగలను అనుకున్నాను. చేశాను’ అంటుంది ఆర్తి సింగ్. ఆమె ఆ కాలంలో చాలా ఆయుధాల డంప్‌ను స్వాధీనం చేసుకుంది. అందుకే ఆమె ట్రాన్స్ఫర్ అయి వెళుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్మానం చేసి అవార్డులు ఇచ్చి పంపాయి. అదీ ఆర్తి సింగ్ ఘనత. ఆడపిల్ల పుడితే ఏంటి? ఆర్తి సింగ్‌ది ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్. ఆ ప్రాంతంలో ఆడపిల్లల్ని కనడం గురించి స్త్రీలు వివక్ష ఎదుర్కొంటున్నా ఆర్తి కుటుంబంలో అలాంటి వివక్ష ఏదీ ఉండేది కాదు. ఆర్తి ఎంత చదవాలన్నా చదువుకోనిచ్చారు. ‘మా నాన్న సపోర్ట్ చాలా ఉంది’ అంటుంది ఆర్తి. ఆమె బెనారస్ హిందూ యూనివర్సిటీలో మెడిసిన్ చేసి డ్యూటీ డాక్టర్‌గా పని చేస్తున్నప్పుడు గైనకాలజీ వార్డ్‌లో ఆమెకు తల్లులు అందరి నుంచి ఎదురయ్యే ఒకే ఒక ప్రశ్న ‘ఆడిపిల్లా? మగపిల్లాడా?’– ఆడపిల్ల పుడితే వాళ్ల ముఖాలు మాడిపోయేవి. ‘ఆ పరిస్థితి చాలా విషాదం. తల్లిదండ్రులు ఆడపిల్లలను కాకుండా మగపిల్లలను ఎందుకు కోరుకుంటారంటే వారిని రక్షించలేమేమోనన్న ఆందోళనే. అందుకు వారు ఎన్నుకునే ఉపాయం. పెళ్లి. పెళ్లి చేసేస్తే ఆడపిల్ల సేఫ్ అనుకుంటారు. దాంతో బాల్య వివాహాలు, అపరిపక్వ వివాహాలు జరిగిపోతాయి. నేను ఈ పరిస్థితిని మార్చాలంటే డాక్టర్‌గా ఉంటే కుదరదనిపించింది. ఐఏఎస్ కాని ఐపిఎస్ కాని చేయాలనుకున్నాను. నేను పెద్ద ఆఫీసరయ్యి ఆడపిల్లల తల్లిదండ్రులకు సందేశం ఇవ్వాలనుకున్నాను’ అంటుంది ఆర్తి. అయితే బంగారంలాంటి డాక్టర్ చదువు చదివి ఉద్యోగం చేస్తూ కూడా యు.పి.ఎస్.సి పరీక్షలకు హాజరవ్వాలనుకోవడం రిస్క్. ‘కాని నేను చేయగలను అనుకున్నాను’ అంటుంది ఆర్తి సింగ్. ఆమెకు మొదటిసారి అవకాశం రాలేదు. రెండోసారి పంతంగా రాసి ఐ.పి.ఎస్ సాధించింది. కోవిడ్ వారియర్ మహారాష్ట్రలో మాలేగావ్ సెన్సిటివ్ ఏరియా. ఏడున్నర లక్షల మంది ఉండే ఈ టెక్స్టైల్ టౌన్లో మత కలహాలు ఏ పచ్చగడ్డీ వేయకనే భగ్గుమంటాయి. దానికి తోడు అక్కడే గత సంవత్సరం కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ఆ సమయంలో అధికారులకు మళ్లీ గుర్తొచ్చిన పేరు ఆర్తి సింగ్. అక్కడ చార్జ్ తీసుకోవడం అంటే ఏ క్షణమైనా కరోనా బారిన పడటమే. కాని ఆర్తి సింగ్ ధైర్యంగా చార్జ్ తీసుకుంది. అంతేకాదు రెండు నెలల కాలంలో కరోనాను అదుపు చేసింది. ‘నేను డాక్టర్ని కనుక ఇల్లు కదలకుండా ఉండటం ఎంత అవసరమో ప్రజలకు సమర్థంగా చెప్పాను. మరోవైపు మా సిబ్బంది ఒక్కొక్కరు కరోనా బారిన పడుతుంటే ధైర్యంగా ఉండటం కష్టమయ్యేది. అయినా సరే పోరాడాను. అలాగే కలహాలకు కారణమయ్యే టిక్‌టాక్‌లు, వాట్సాప్ మెసేజ్‌లు కట్టడి చేశాను’ అంటుంది ఆర్తి సింగ్. మహిళా కమిషనర్‌గా దేశంలోని కమిషనరేట్లలో అందరూ మగ ఆఫీసర్లు ఉంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్తి సామర్థ్యాలను గుర్తించి విదర్భ ప్రాంతంలోని అమరావతి నగరానికి కమిషనర్‌గా వేసింది. ఆ నగరంలో స్ట్రీట్ క్రైం ఎక్కువ. రౌడీలు తిరగడం, చైన్ స్నాచింగ్‌లు, తన్నులాటలు, ఈవ్ టీజింగ్‌లు.. మోతాదు మించి ఉండేవి. ఆర్తి చార్జ్ తీసుకున్నదన్న వార్తకే అవి సగం కంట్రోల్ అయ్యాయి. మరి కొన్నాళ్లకు మిగిలిన సగం కూడా. ఒత్తిళ్లకు తలొగ్గకుండా పని చేయడం ఆర్తి తీరు. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆర్తి ‘నేను చేయగలను’ అనుకోగలిగితే స్త్రీలను చేయలేనిది ఏదీ లేదు అని నిరూపిస్తోంది. -
నగరానికి నయా పోలీస్ బాస్.. సీవీ ఆనంద్ గురించి ఆసక్తికర విశేషాలు..
నగర నయా పోలీస్ బాస్ సీవీ ఆనంద్.. ఇక్కడే పుట్టారు. ఇక్కడే పెరిగారు. ఆదర్శ్‌నగర్‌లో వారి ఇల్లు ఉండేది. అక్కడ నుంచి తరచూ ట్యాంక్‌బండ్ మీదకు వెళ్లేవారు. ఆ సందర్భాల్లోనే హుస్సేన్‌సాగర్‌లో అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్న విషయం ఆయన దృష్టికి వచ్చింది. సెంట్రల్ జోన్ డీసీపీగా పని చేస్తున్నప్పుడు 2002లో లేక్ పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారు. సాగర్ చుట్టూ నిఘా, గస్తీతో పాటు అవగాహన బోర్డులు, తొలిసారిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆత్మహత్యల నివారణలో తనదైన శైలితో ముందుకెళ్లారు. ప్రస్తుతం సిటీ సీపీగా కొత్త బాధ్యతలతో శాంతిభద్రతల పరిరక్షణకు గట్టిగా కృషిచేస్తానంటున్నారాయన. ప్రజల శ్రేయోభిలాషిగా నిలుస్తానంటున్నారు ఆనంద్. సిటీ కమిషనర్‌గా రావడం ఆనందంగా ఉందన్నారు. శనివారం బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఏసీబీ డీజీగా వెళ్తున్న అంజనీకుమార్ ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా ఆనంద్ ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. – సాక్షి, హైదరాబాద్ సిటీపై పట్టుంది.. నేను సిటీలోనే పుట్టి పెరిగాను. ఇక్కడే చదువుకున్నా. నగరంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈస్ట్‌జోన్ డీసీపీ, సెంట్రల్ జోన్ తొలి డీసీపీగా, ఆపై ట్రాఫిక్ విభాగం అదనపు సీపీగా పని చేశా. ఇలా వివిధ హోదాల్లో, వివిధ విభాగాల్లో పని చేసిన నేపథ్యంలో సిటీపై పట్టు ఉంది. ఇటీవల కాలంలో నాలుగైదేళ్లు కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌పై విధులు నిర్విర్తించి తిరిగి వచ్చా. చదవండి: కొడుకుల ప్రోత్సాహంతో.. పెళ్లైన 25 ఏళ్లకు మళ్లీ పెళ్లి..! ట్రాఫిక్ నిర్వహణకు ప్రధానం.. ► పోలీసు విభాగానికి సంబంధించి ప్రతి రోజూ నేరుగా ఎక్కువ మంది ప్రజలతో సంబంధాలు కలిగి ఉండేది ట్రాఫిక్ వింగ్. వీళ్లు తీసుకునే ప్రతీ చర్యతో వేలాది మంది వాహనచోదకులు, లక్షలాది నగర ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నిర్వహణకు కీలక ప్రాధాన్యమిస్తాం. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల భద్రతకూ పెద్ద పీట వేస్తాం. ఇప్పటికే అమలులో ఉన్న విధానాలను కొనసాగిస్తూ భవిష్యత్తు ప్రణాళికలు ఉంటాయి. నేరాల నిరోధానికి యాక్షన్ ప్లాన్.. ►ప్రస్తుతం సైబర్ నేరాలను నానాటికీ పెరిగిపోతున్నాయి. వీటిని నిరోధించడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడంతో పాటు కేసుల్ని కొలిక్కి తీసుకురావడానికి సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తాం. పెట్రోలింగ్ వ్యవస్థ, సీసీటీవీ కెమెరాలు, కొత్త టెక్నాలజీతో కేసులను ఛేదిస్తాం. సొత్తు సంబంధిత నేరాలు, చైన్ స్నాచింగ్స్ నిరోధించేందుకు చర్యలు తీసుకుంటాం. మహిళా భద్రత కోసం ఉన్న షీ–టీమ్స్ మరింత బలోపేతం చేస్తాం. చదవండి: చలనాల నుంచి తప్పించుకోవాంటే.. మాస్క్ ఫర్ నంబర్ ప్లేట్! ►మూడేళ్ల మూడు నెలల పాటు నగర ట్రాఫిక్ అదనపు సీపీ పని చేశా. ఆ సందర్భంలో అనేక తీవ్రమైన ప్రమాదాలకు డ్రంక్ డ్రైవింగే కారణంగా గుర్తించా. దీని వల్ల వాహనచోదకులతో పాటు ఎదుటి వారికీ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ట్రాఫిక్ విభాగంలో అనునిత్యం అవసరమైన చర్యలు తీసుకుంటాం. హైకోర్టు ఆదేశాలకనుగుణంగానే న్యూ ఇయర్ వేడుకలు.. ► ఒమిక్రాన్ వేరియంట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ అంత తీవ్రత లేకున్నా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర పరిస్థితులు ఉన్నాయి. నూతన సంవత్సర వేడుకలపై హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. ఈ అంశంలో ప్రభుత్వం సూచించిన విధంగా ముందుకు వెళ్తాం. న్యూ ఇయర్ వేడుకలు ప్రతిసారీ వస్తాయి, పోతాయి. కానీ ప్రాణాలు అత్యంత విలువైనవి. ఈ నేపథ్యంలోనే అందరూ కరోనా నిబంధనలు తప్పక పాటించాలి. -
ప్రజా ప్రయోజనాల కోసమే ఆస్తానా నియామకం
న్యూఢిల్లీ: ఢిల్లీ నగర పోలీసు కమిషనర్‌గా గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి రాకేశ్ ఆస్తానాను నియమించడాన్ని కేంద్రం మళ్లీ సమర్థించుకుంది. ఢిల్లీలో భిన్నమైన శాంతి భద్రతల సవాళ్లను దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రయోజనాల కోసమే ఆయనను నియమించినట్లు ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ఆస్తానా పెద్ద రాష్ట్రమైన గుజరాత్లో పనిచేశారని, భారీ స్థాయిలో పోలీసు బలగాలను నేతృత్వం వహించిన అనుభవజ్ఞుడని, కేంద్ర దర్యాప్తు సంస్థలు, పారా మిలటరీ దళాల్లో పని చేశారని వెల్లడించారు. అలాంటి అపార అనుభవం ఉన్న అధికారి సేవలు ఢిల్లీలో అవసరమని భావించామని, అందుకే నగర పోలీసు కమిషనర్‌గా నియమించినట్లు అఫిడవిట్లో స్పష్టం చేశారు. ఆస్తానా సర్వీసు గడువును సైతం పొడిగించినట్లు తెలిపారు. ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా నియమించడానికి కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) కేడర్‌లో ప్రస్తుతం నిర్దేశిత అనుభవం ఉన్న అధికారులెవరూ అందుబాటులో లేరని వివరించారు. అందుకే తగిన అనుభవం కలిగిన గుజరాత్ క్యాడర్‌కు చెందిన రాకేశ్ ఆస్తానాను నియమించినట్లు పేర్కొన్నారు. ఆస్తానాను ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా అపాయింట్ చేస్తూ కేంద్ర హోంశాఖ జూలై 27న జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజనం వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. -
సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పునర్విభజన?
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ రంగారెడ్డి జిల్లాలో.. రాచకొండ కమిషనరేట్ మేడ్చల్ జిల్లాలో ఉండటంతో.. వీటి పరిధిలోకి వచ్చే ప్రాంతాలకు సంబంధించి గందరగోళం నెలకొంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన కొన్ని ఏరియాలు రాచకొండకు, మేడ్చల్‌కు చెందినవి సైబరాబాద్ పరిధిలోకి వస్తాయి. దీన్ని గమనించిన ఉన్నతాధికారులు ఈ రెండు కమిషనరేట్లను పునర్విభజన చేయాలని యోచిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రాథమిక కసరత్తు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ రూపు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి నివేదించడం ద్వారా అనుమతి పొంది అమలులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. చదవండి: ‘రామప్ప’ పరిసరాలు కాంక్రీట్ జంగిల్‌గా మారొద్దు : హైకోర్టు అప్పట్లో ఒకే కమిషనరేట్.. ► రాజధానిలో ఒకప్పుడు కేవలం హైదరాబాద్ కమిషనరేట్ మాత్రమే ఉండేది. మిగిలిన ప్రాంతాలన్నీ రంగారెడ్డితో పాటు ఇతర జిల్లాల పరిధిలోకి వచ్చేవి. 2002లో సైబరాబాద్ కమిషనరేట్‌కు రూపమిచ్చారు. ► రాష్ట్ర విభజన తర్వాత పెరుగుతున్న జనాభా, మారుతున్న అవసరాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం 2016లో సైబరాబాద్ చుట్టూ ఉన్న ఇతర జిల్లాల్లోని ముఖ్యమైన అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాలను కలుపుతూ రెండుగా విభజించారు. ► తొలినాళ్లల్లో సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్గా వ్యవహరించిన వీటిని ఆపై సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లుగా మార్చారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు ఈ రెండు కమిషనరేట్ల పరిధిలో విస్తరించి ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రిక్రూట్‌మెంట్స్‌లోనూ సమస్యలే.. ► పోలీసు విభాగంలో ఎంపికలు యూనిట్ ఆధారంగా జరుగుతుంటాయి. పోలీసు విభాగంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా కేవలం మూడు స్థాయిల్లోనే ఎంపికలు చేస్తుంది. కానిస్టేబుల్, ఆపై సబ్–ఇన్స్పెక్టర్తో (ఎస్సై) పాటు గ్రూప్–1లో భాగమైన డీఎస్పీ పోస్టుల్ని ప్రభుత్వం భర్తీ చేసుకుంటుంది. ► ఈ మూడింటిలోనూ కానిస్టేబుల్‌కు రెవెన్యూ జిల్లా, ఎస్సైకి జోన్, డీఎస్పీకి రాష్ట్రం యూనిట్‌గా ఉంటుంది. ఆయా యూనిట్స్‌కు చెందిన దరఖాస్తుదారుల్ని స్థానికులుగా ఇతరుల్ని స్థానికేతరులుగా పరిగణిస్తారు. వీటి ప్రామాణికంగానే పోలీసు ఎంపికలు జరగడం అనివార్యం. ► రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ ప్రాంతాలు రాచకొండ కమిషనరేట్లోకి, మిగిలినవి సైబరాబాద్ కమిషనరేట్లోకి వచ్చాయి. ► మేడ్చల్ జిల్లాలోకి బాలానగర్, పేట్ బషీరాబాద్ తదితరాలు సైబరాబాద్ పరిధిలోకి, మిగిలినవి రాచకొండలోనూ ఉన్నాయి. ఇలా ఒకే జిల్లా రెండు కమిషనరేట్లలో విస్తరించి ఉండటం కానిస్టేబుల్ స్థాయి అధికారుల ఎంపికలో సాంకేతిక ఇబ్బందులకు కారణమవుతోంది. జోన్ల మార్పులతో సమస్యలకు చెక్ ► ఈ సమస్యలతో పాటు ఇతర ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న పోలీసు విభాగం సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లను పునర్విభజన చేయాలని యోచిస్తోంది. ఒక కమిషనరేట్‌లో ఒకటి కంటే ఎక్కువ రెవెన్యూ జిల్లాలు ఉన్నప్పటికీ.. ఒక రెవెన్యూ జిల్లా మొత్తం ఆ కమిషనరేట్‌లోనే ఉండేలా కసరత్తు చేస్తోంది. ►ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో రెవెన్యూ పరంగా రంగారెడ్డి జిల్లాలో ఉండి.. పోలీసు విషయానికి వచ్చేసరికి రాచకొండ పరిధిలోకి వచ్చే ఎల్బీనగర్ జోన్‌ను సైబరాబాద్‌లో కలపాలని భావిస్తున్నారు. మేడ్చల్ జిల్లాకు చెందిన, సైబరాబాద్ కమిషనరేట్‌లో ఉన్న బాలానగర్ జోన్‌ను రాచకొండ కమిషనరేట్‌కు మార్చాలని భావిస్తున్నారు. ► ఈ మార్పుచేర్పులకు సంబంధించి ఉన్నతాధికారులు ప్రాథమిక కసరత్తులు చేస్తున్నారని సమాచారం. ఒకే రెవెన్యూ జిల్లా రెండు కమిషనరేట్లలో లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిసింది. -
పతకం మీకే అంకితం: పీవీ సింధు
సాక్షి, హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధు ఆ మెడల్‌ను పోలీసు విభాగానికి అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. తన తండ్రి పీవీ రమణతో కలిసి ఆమె మంగళవారం నగర పోలీసు కమిషనరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా పోలీసు విభాగం సింధుకు ఘన స్వాగతం పలికింది. నగర పోలీసు విభాగానికి చెందిన అశ్విక దళాలు నిజాం కాలేజీ హాస్టల్ వద్ద నుంచి సింధు కారుకు పైలట్‌గా వచ్చాయి. కమిషనరేట్ పోర్టుకో వద్ద కొత్వాల్ అంజనీకుమార్, అదనపు సీపీలు అనిల్‌కుమార్, షికాగోయల్ పుష్పగుచ్ఛం అందించి ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సింధు తన పతకాన్ని ప్రదర్శిస్తూ పోలీసు అధికారులకు ఉద్దేశించి మాట్లాడారు. లాక్డౌన్ అమలులో ఉన్నప్పటికీ తన ప్రాక్టీసు నిరాటంకంగా కొనసాగడానికి పోలీసులు అందించిన సహకారం మరువలేనిదని, తాను టోక్యో ఒలింపిక్స్‌లో విజయం సాధించడానికి ఆ ప్రాక్టీస్ కీలకమని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాను సాధించిన పతకాన్ని పోలీసు విభాగానికి అంకితమిస్తున్నానని ప్రకటించారు. అకుంఠిత దీక్ష, నిరంతర సాధనతో సింధు సా«ధించిన విజయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి అని పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కొనియాడారు. ఫస్ట్‌వేవ్, సెకండ్‌వేవ్ సందర్భాల్లో నగర పోలీసులు అందించిన సేవలపై ‘కాప్స్ వర్సెస్ కోవిడ్’, ‘ది సెకండ్ వేవ్’పేర్లతో రూపొందించిన పుస్తకాలను సింధుకు బహూకరించారు. -
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పీవీ సింధుకు ఘన సన్మానం
-
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పీవీ సింధుకు ఘన సన్మానం
సాక్షి, హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్‌లో బాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకం సాధించిన పీవీ సింధును హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెకు స్వాగతం పలికిన పోలీసులు పుష్పగుచ్చం అందించారు. అనంతరం ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి దేశానికి వన్నె తెచ్చిన పీవీ సింధును సీపీ అంజనీకుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పీవీ సింధు తండ్రి పీవీ రమణతో పాటు పెద్ద సంఖ్యలో పోలీసులు పాల్గొన్నారు. -
Siddipet: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు జిల్లాల పర్యటనల్లో భాగంగా ఆదివారం సిద్దిపేటలో చేరుకున్నారు. అనంతరం సిద్దిపేటలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, సిద్దిపేట పోలీసు కమిషనరేట్ కార్యాలయాన్ని, సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తర్వాత ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం కామారెడ్డి జిల్లా పర్యటనకు సీఎం వెళ్లనున్నారు. చదవండి: లాక్‌డౌన్‌తోనే కేసులు తగ్గాయ్: సీఎం కేసీఆర్ -
చిన్నారి కిడ్నాప్: సిటీ పోలీసులు మీకు సలాం
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక నుంచి వచ్చి నగరంలో ఫుట్‌పాత్‌పై జీవించే దంపతుల మూడేళ్ల చిన్నారి రుద్రమణిని మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఈ బాలుడి కోసం ఈ నెల 9న రంగంలోకి దిగిన అబిడ్స్ పోలీసులు పది రోజుల పాటు నిర్విరామంగా రెండు రాష్ట్రాల్లో 800 కిమీ మేర ప్రయాణిస్తూ గాలించారు. ఇందులో భాగంగా దాదాపు 1800 సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ను అధ్యయనం చేశారు. ఎట్టకేలకు గురువారం మహారాష్ట్రలోని మాలేగావ్ ప్రాంతంలో బాబును రెస్క్యూ చేశారు. మధ్య మండల డీసీపీ ఎన్.విశ్వప్రసాద్, అబిడ్స్ ఏసీపీ కె.వెంకట్‌రెడ్డితో కలిసి శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్ అంజనీకుమార్ పూర్తి వివరాలు వెల్లడించారు. ► బీదర్ జిల్లాకు చెందిన ఎం.శివకుమార్ ఈ నెల 2న తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నగరానికి వలసవచ్చాడు. వీరి చిన్నకుమారుడే మూడేళ్ల రుద్రమణి. ఎలాంటి నివాసం లేని ఈ కుటుంబం పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఫుట్‌పాత్‌పై నివసిస్తూ కూలీ పనులు చేసుకుంటోంది. ►మాలేగావ్ తాలూక అమన్వాడీ గ్రామానికి చెందిన శ్యామ్ భీమ్రావు సోలంకి పాలమూరు ఎత్తిపోతల పథకంలో పనిచేయడానికి వలసవచ్చాడు. అక్కడ రాళ్లు కొట్టే పని కష్టంగా ఉండటంతో తన స్వస్థలానికి తిరిగి వెళ్లాలని భావించి ఈ నెల 7న మరో వ్యక్తితో కలిసి సిటీకి వచ్చాడు. ►ఇతడికి ఉన్న నలుగురు అక్కా చెల్లెళ్లకు వివాహాలు అయి, పిల్లలు కూడా పుట్టారు. ఇతడి ప్రవర్తన సరిగ్గా లేని కారణంగా 40 ఏళ్లు వచ్చినా వివాహం కాలేదు. పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఇతడు భోగిరామ్ అనే వ్యక్తితో కలిసి శివకుమార్ కుటుంబాన్ని కలిశాడు. ►తనతో వస్తే ముంబైలో పని ఇప్పిస్తానంటూ వారితో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే రుద్రమణి ఇతడికి దగ్గరయ్యాడు. శివకుమార్‌కు చెందిన సెల్‌ఫోన్, నగదు పోవడంతో వాళ్లు తమ మకాంను గాంధీ భవన్ మెట్రో స్టేషన్ వద్దకు మార్చారు. ►ఈ నెల 8న వీరి వద్దకు వచ్చిన శ్యామ్, భోగిరామ్ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్దామంటూ కోఠి వరకు తీసుకువెళ్లి వెనక్కు తెచ్చాడు. రాత్రి 7 గంటలకు చిన్నారితో ఆడుకుంటున్నట్లు నటించాడు. తండ్రి సమీపంలోని ఓ హోటల్లో పనికోసం, తల్లి నీటి కోసం వెళ్లడంతో అదును చూసుకుని ఆ చిన్నారిని తీసుకుని ఉడాయించాడు. ►తిరిగి వచ్చిన తల్లిదండ్రులు భోగారామ్ను రుగ్రమణి విషయం అడగ్గా అతడు తనకు తెలియదన్నాడు. శ్యామ్ జాడ కూడా లేకపోవడంతో అనేక ప్రాంతాల్లో గాలించిన శివకుమార్ మరునాడు అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ►శ్యామ్‌కు సంబంధించిన ఏ వివరాలూ బాధితుల వద్ద లేవు. అతడు బాధిత కుటుంబానికి పరిచయమైనప్పుడు ముంబైలో పని ఇప్పిస్తానంటూ చెప్పినట్లు తెలుసుకున్న పోలీసులు మహారాష్ట్ర వాసిగా అనుమానించారు. సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ►కిడ్నాప్ జరిగిన మెట్రో స్టేషన్ నుంచి అఫ్జల్‌గంజ్ వరకు ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఆ రోజు రాత్రి అఫ్జల్‌గంజ్ వంతెన కింద ఉన్న మురికివాడలో తలదాచుకున్న శ్యామ్ మరుçÜటి రోజు బయటకు వచ్చినట్లు తేలింది. ►చిన్నారితో సహా అక్కడ బస్సు ఎక్కి, సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లిన ఇతగాడు బీహార్‌కు వెళ్లే ధనాపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. మహారాష్ట్రలోని సేవాగ్రామ్ రైల్వేస్టేషన్లో దిగిన ఇతడు అక్కడ నుంచి ఆటోలో వాద్రా స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ విదర్భ ఎక్స్‌ప్రెస్ ఎక్కి అలోక్ స్టేషన్లో దిగిపోయాడు. ►అక్కడ నుంచి బస్సులో మాలేగావ్ ప్రాంతానికి వెళ్లినట్లు తేలింది. ఈ అన్ని ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను అబిడ్స్ పోలీసులు తనిఖీ చేసి ఇది నిర్ధారించారు. దీంతో మాలేగావ్ పోలీసులను సంప్రదించిన అధికారులు కిడ్నాప్ విషయం చెప్పారు. సీసీ కెమెరాల నుంచి సంగ్రహించిన ఫీడ్‌ను వారికి అందించారు. ►అక్కడి పోలీసులు తమ సోషల్ మీడియా గ్రూపుల్లో ఈ ఫొటోలు పోస్ట్ చేసి సమాచారం తెలపమన్నారు. దీన్ని చూసిన అమన్వాడీకి చెందిన మహిళ విషయాన్ని రాజస్థాన్‌లో సైనికుడిగా పనిచేసే తన సోదరుడికి చెప్పింది. ఆయన మాలేగావ్ ఇన్స్పెక్టర్కు సమాచారం ఇచ్చారు. ►ఆయన ద్వారా సమాచారం అందుకున్న అబిడ్స్ పోలీసులు గురువారం అక్కడకు వెళ్లి నిందితుడిని అరెస్టు చేసి రుద్రమణిని రెస్క్యూ చేశారు. కొన్నాళ్లు ఆ చిన్నారిని పెంచుకుని, ఆ తర్వాత విక్రయించాలనే శ్యామ్ ఈ నేరం చేశాడని పోలీసులు గుర్తించారు. ►తన కుటుంబీకులకు బాబు దొరికాడని, చుట్టుపక్కల వారికి తన సోదరి కుమారుడంటూ శ్యామ్ చెప్పుకొచ్చాడు. ఈ పది రోజులూ బాబుకు ఏ లోటు రాకుండా చూసుకున్నాడు. రుద్రమణికీ ఇతడి దగ్గర ఆడుకునే అలవాటు ఉండటంతో అతడికీ ఇబ్బంది రాలేదు. చదవండి: టార్గెట్ వామన్రావే.. సాక్ష్యం ఉండొద్దనే భార్య హత్య చదవండి: రైతులకు ఇచ్చే గౌరవం ఇదేనా?: కాంగ్రెస్ చదవండి: ఆవు బొప్పాయి పండును దొంగలించిదని.. -
ఎస్సైల బదిలీలు; సీపీ సెలవులో ఉండగా ఉత్తర్వులు!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సబ్ ఇన్స్సెక్టర్ల బదిలీల అంశం పోలీసుశాఖలో చర్చనీయాంశమైంది. సీపీ కార్తికేయ సెలవుల్లో ఉన్న సమయంలో బదిలీ ఉత్తర్వులు వెలువడటం ఆసక్తికరంగా మారింది. జిల్లాలో 15 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయా స్థానాల్లోరెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి, రెండేళ్లకు దగ్గరలో ఉన్నవారికి స్థానచలనం కల్పిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఇందులో పనితీరుపై విమర్శలు ఎదుర్కొన్న ఒకరిద్దరు ఎస్సైలపై కూడా బదిలీ వేటుపడడం చర్చనీయాంశంగా మారింది. సీపీ మంగళవారం నుంచి వ్యక్తిగత సెలవులో వెళ్లారు. ఆయన సెలవుల్లో ఉండగా, ఉత్తర్వులు వెలువడడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఎస్సైల బదిలీల విషయంలో సీపీ పంపే ప్రతిపాదిత జాబితాను పరిశీలించి డీఐజీ నిర్ణయం తీసుకుంటారు. బదిలీల ప్రక్రియకు సంబంధించి సీపీ నెలరోజులుగా కసరత్తు చేసినట్లు సమాచారం. మార్పులు, చేర్పులుచేశాక పంపిన ప్రతిపాదనల మేరకు ఉత్తర్వులు జారీఅయినట్లు తెలుస్తోంది. కాగా పోలీసుశాఖలో ఫిబ్రవరి,మార్చి మాసాల్లో పెద్దఎత్తున బదిలీలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఇంతలోపు ముందస్తుగా బదిలీలు జరగడం గమనార్హం. అయితే మూకుమ్మడిగా జరిగే బదిలీల్లో తమకు అనువైన స్థానం లభిస్తుందో లేదోననే ముందు జాగ్రత్తగా కొందరు తమకు అనుకూలమైన స్థానాలకు బదిలీ చేయించుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది.(చదవండి: ఎంపీడీవో భారతి ఆత్మహత్యాయత్నం) ప్రజాప్రతినిధులను సంప్రదించాకే..! నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల కన్నుసన్నల్లోనే పోలీసు అధికారుల బదిలీలు జరగడం కొంతకాలంగా పరిపాటిగా మారింది. గతంలో జరిగిన బదిలీల్లో జిల్లాకు చెందిన ఒకరిద్దరు ఎస్సైలు రిలీవ్ కాలేదు. బదిలీ అయిన స్థానంలో జాయిన్ కాలేదు. ఈ వ్యవహారం అప్పట్లో పోలీసుశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో పాటు, విమర్శలకు దారి తీసింది. రాజకీయ పలుకుబడితో ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా పాటించకపోవడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. దీంతో ఈసారి బదిలీల్లో పోలీసు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులను సంప్రదించాకే బదిలీపై నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. గతంలో మాదిరి ఘటనలు పునరావృతం కాకుండా ఈసారి జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. -
‘వారియర్స్’ కుటుంబాలకు వర్రీలే!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడి స్తున్న కరోనా మహమ్మారి.. పోలీసు విభాగానికి పెద్ద నష్టం చేసింది. ఒక్క హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే 34 మంది సిబ్బంది, అధికారులను పొట్టనపెట్టుకుంది. తొలి మరణం నమోదై ఆరున్నర నెలలు కావొస్తున్నా.. ఇప్పటికీ ఆ అమరవీరుల కుటుంబాలకు పరిహారం, కారుణ్య నియామకాలపై ఎలాంటి హామీ దక్కలేదు. ఉన్నతాధికారులు మాత్రం ఈ ప్రతిపాదనలు సర్కారు వద్ద పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. కాగా, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో తొలి కరోనా పాజిటివ్ కేసు ఏప్రిల్‌లో సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. మేలో కుల్సుంపుర ఠాణాలో పని చేస్తున్న కానిస్టేబుల్ దయాకర్‌రెడ్డి కన్నుమూశారు. అప్పటి నుంచీ సెప్టెంబర్ తప్ప అక్టోబర్ వరకు మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. రికార్డు అసిస్టెంట్ల నుంచి సబ్ ఇన్స్పెక్టర్ల వరకు వివిధ హోదాల్లో పని చేస్తున్న 34 మంది మరణించారు. ఈ షాక్ నుంచి ఆ కుటుంబాలు ఇప్పటికీ కోలుకోలేదు. ఆ నగరాల్లో భరోసా.. కోవిడ్ నియంత్రణకు నిత్యం శ్రమించిన ఫ్రంట్‌లైన్ వారియర్స్ జాబితాలో పోలీసులదీ కీలక స్థానం. దీన్ని గుర్తించిన ఢిల్లీ సర్కారు ఈ వైరస్ బారినపడి మరణించిన పోలీసులకు రూ.కోటి పరిహారం ప్రకటించింది. ముంబై సహా మరికొన్ని నగరాల పోలీసులు కూడా భారీ మొత్తాన్నే ఇస్తామని హమీ ఇచ్చారు. ఇక్కడ మాత్రం ఎదురుచూపులే.. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా లు, కమిషనరేట్లలోనూ వారియర్స్ మరణాలు నమోదయ్యాయి. అయితే ఇప్పటివరకూ వీరికి పరిహారం అందించే అంశంతో పాటు కారుణ్య నియామకాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ లేదు. సాధారణ మరణాలకే కారుణ్య నియామకాలు వర్తింపజేసే ప్రభుత్వం పోలీసుల కుటుంబాలను మాత్రం వదిలేసింది. మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు.. ‘కుల్సుంపుర పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మా సోదరుడు దయాకర్‌రెడ్డి కరోనాతో మే 20న చనిపోయాడు. ఆయనకు ఐదేళ్లు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు. కరోనాతో 5 రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పరిహారం, కారుణ్య నియామకాల కోసం 3 నెలలుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎలాంటి మద్దతు లభించట్లేదు. కనీసం బతికున్న వారికైనా భరోసా ఇవ్వాలి కదా..?’ – సుధాకర్, దయాకర్‌రెడ్డి సోదరుడు -
మరణిస్తూ.. 8 మందికి ప్రాణదానం
-
అంతిమయాత్రలో పాడె మోసిన సీపీ సజ్జనార్
సాక్షి, లక్డీకాపూల్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ స్పెషల్ పార్టీలో ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కోనేరి ఆంజనేయులు ఈ నెల 18న విధులకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సోమన్గుర్తి గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో అపస్మారక స్థితికి చెరుకున్న పీసీ ఆంజనేయులును స్థానికులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి అతని కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. మెరుగైన వైద్య చికిత్స కోసం కుటుంబ సభ్యులు బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా సోమవారం వేకువజామున పీసీ ఆంజనేయులు బ్రెయిన్ డెడ్‌కు గురయ్యారు. ఈ విషయాన్ని డాక్టర్లు నిర్ధారించటంతో కానిస్టేబుల్ ఆంజనేయులు కుటుంబ సభ్యులను సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పరామర్శించారు. ఈ సందర్భంగా జనేయులు అవయవాలను దానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడాలని కుటుంబ సభ్యులను సీపీ సజ్జనార్ కోరారు. సీపీ కోరిక మేరకు వికారాబాద్ జిల్లా పరిగి మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన కోనేరి ఆంజనేయులు (2018 బ్యాచ్) గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్/కాలేయం, కళ్లు వంటి ఎనిమిది అవయవాలను ఇతరులకు ఉపయోగించేందుకు గాను ఆర్గాన్ డొనేషన్ ఇనీషియేటివ్ ‘మరోజన్మ’ సహకారంతో ప్రభుత్వ రంగ సంస్థ ‘జీవన్ దాన్’కు అప్పగించారు. మరో 8 మంది ప్రాణాన్ని కాపాడేందుకు ముందు కొచ్చిన ఆంజనేయులు కుటుంబ సభ్యులను సీపీ సజ్జనార్ అభినందించారు. -
ఎవరీ మహేష్.. హత్యకు కారణం ఏంటి?
సాక్షి, విజయవాడ: బెజవాడ శివారులో దారుణం చోటు చేసుకుంది. స్నేహితులతో కలసి మద్యం సేవిస్తున్న ఓ యువకుడిని కొందరు ఆగంతకులు కిరాతంగా కాల్చిచంపారు. మృతుడు నగర పోలీసు కమిషనరేట్‌లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ గజకంటి మహేష్(33)గా గుర్తించారు. ఈ కాల్పుల ఘటన శనివారం అర్ధరాత్రి నున్న బైపాస్‌రోడ్డు ప్రాంతంలోని ఓ బార్ సమీపంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన నున్న రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు.. మహేష్ తన నలుగురు స్నేహితులు కుర్ర హరి కృష్ణ(24), ఉయ్యూరు దినేష్(29), యండ్రపతి గీతక్ సుమంత్ అలియాస్ టోనీ, కంచర్ల అనుదీప్ అలియాస్ దీపులతో కలిసి శనివారం రాత్రి నున్న బైపాస్ రోడ్డులోని ఓ బార్లో మద్యం కొనుగోలు చేసి.. నున్న మ్యాంగో మార్కెట్ వైపు ఉన్న నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లి రోడ్డుపైనే కూర్చొని మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో సిగరెట్లు, బీరు సీసాలు ఖాళీ అవడంతో మహేష్ స్నేహితులు టోనీ, అనుదీప్ తీసుకొచ్చేందుకు బార్ వద్దకు వెళ్లారు. ఇంతలో ఓ ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వచ్చి 7.65 ఎంఎం తుపాకీ చూపించి డబ్బులు కావాలంటూ అకారణంగా మహేష్‌తో గొడవ పెట్టుకున్నారు. పక్కనున్న స్నేహితులు గొడవ ఎందుకని సర్ది చెబుతుండగానే వెనుక ఉన్న వ్యక్తి తుపాకీతో మహేష్‌ను లక్ష్యంగా చేసుకుని విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. మహేష్ శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఘటన అనంతరం పారిపోదామనుకున్న నిందితులు ఒకరు స్కూటీపై మరొకరు బాధితుల కారులో పారిపోయారు. కొంత దూరం వెళ్లాక ముస్తాబాద్ రోడ్డులో వదిలేశారు. రక్తపు మడుగుల్లో ఉన్న మహేష్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ హాస్పిటల్‌కు స్నేహితులు తీసుకువెళ్లగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అసలు ఎవరీ మహేష్.. విజయవాడ క్రీస్తురాజుపురం ప్రాంతానికి చెందిన గజకంటి మహేష్ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. మహేష్ తండ్రి వెంకటేశ్వర్లు హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ కొంతకాలం క్రితం చనిపోవడంతో మహేష్‌కు ఆ ఉద్యోగం లభించింది. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే పోలీసు కంట్రోల్ రూమ్‌లో పనిచేసే మహిళా ఉద్యోగులకు అసభ్యకరమైన సందేశాలు పంపాడనే కారణంతో ఈ ఏడాది మే నెలలో సీపీ ద్వారకా తిరుమలరావు మహేష్‌ను సస్పెండ్ చేశారు. సెప్టెంబరు చివరాఖరున సస్పెన్షన్ ఎత్తివేశాక గత 15 రోజుల కిందట విధుల్లో చేరాడు. మహేష్‌కు 2015లో వివాహమైంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2017లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నాడు. కారణం ఏంటి? భార్యతో విడాకులు తీసుకున్న మహేష్ నగరంలోని ఓ మహిళా డాక్టర్‌తో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నాడని తెలిసింది. అలానే మహేష్ సోదరి వరసయ్యే ఓ మహిళ గుంటూరుకు చెందిన ఓ వివాహితుడితో ప్రేమయాణం సాగిస్తున్నట్లు.. దీనికి మహేష్ సాయం చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం గ్రహించిన ఆ వివాహితుడి భార్య తరపు వ్యక్తులు కానీ, మహేష్ ప్రేమిస్తున్న డాక్టర్ తరపు వ్యక్తులు కానీ.. లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో తలెత్తిన వివాదాలు కానీ మహేష్ హత్యకు దారి తీశాయా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మూడు ప్రత్యేక బృందాలు.. ఈ కేసును ఛేదించేందుకు నగర పోలీసు కమిషనర్ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనాస్థలికి సమీపంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇప్పటికీ హత్య మిస్టరీగానే ఉంది. పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. -
హేమంత్ హత్య: సీపీ సజ్జనార్‌ని కలిసిన అవంతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో హేమంత్ కుమార్ హత్య తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ హత్యను గచ్చిబౌలి పోలీసులు పరువు హత్యగా నిర్ధారించారు. తన భర్త హేమంత్ కుమార్ హత్యకు.. తన తండ్రి, మేనమామ కారణమని అవంతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హేమంత్ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని అవంతి బుధవారం సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిశారు. తమకు, తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని వినతి పత్రం అందించారు. హేమంత్ హత్యతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేయాలని అవంతి ఈ సందర్భంగా సీపీని కోరారు. పోలీసు కస్టడీకి నిందితులు: ఈ హత్య కేసులో పోలీస్ కస్టడీకి తీసుకున్న ప్రధాన నిందితులు యుగంధర్‌రెడ్డి, లక్ష్మారెడ్డిలను ఆరు రోజుల పాటు పోలీసులు విచారణ చేయనున్నారు. హత్య కేసులో ప్రధాన కుట్రదారు లక్ష్మారెడ్డి, అమలు చేసింది యుగంధర్‌రెడ్డి అని పోలీసుల పేర్కొన్నారు. సూపారీ కిల్లింగ్‌లో ఇంకా ఎవరి హస్తం ఉందనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. అదే విధంగా గోపన్‌పల్లి హేమంత్ కిడ్నాప్ స్థలం నుంచి సంగారెడ్డి హత్య స్థలం వరకు నిందితులను తీసుకెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు 21మందిని అరెస్ట్ చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. చదవండి:(హత్యకేసులో 21కి పెరిగిన నిందితుల సంఖ్య) -
హేమంత్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
-
బాబోయ్ ఆ డ్యూటీలా.. వద్దే వద్దు
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ పోలీసు కమిషరేట్‌లో పోస్టు అంటే ఏ పోలీసు అధికారి అయినా ఎగిరి గంతేస్తారు. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ పరిస్థితి ఉంది. లా అండ్ ఆర్డర్ విభాగంలో పనిచేయలేమని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. అవసరమైతే లూప్లైన్లో పనిచేయడానికైనా సిద్ధమంటున్నట్లు తెలుస్తోంది. తీరిక లేని విధులే ఇందుకు కారణమని సమాచారం. ప్రస్తుత పని విధానం.. ప్రతిరోజు డ్యూటీలో చేరిన వెంటనే టెలీ కాన్ఫరెన్స్‌కు హాజరు కావాలి. తరువాత స్టేషన్ పరిధిలో అప్పటి వరకు ఉన్న కేసులు పరిశీలించడంతో పాటు వీఐపీల రాక వంటి బాధ్యతలు చూసుకోవాలి. సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్, మళ్లీ రాత్రికి వాహనాల తనిఖీ, వీటితో పాటు నిత్యం స్టేషన్లకు వచ్చే కేసుల దర్యాప్తు ఉండనే ఉంటుంది. వీటితో వీక్లీ ఆఫ్‌లు సరిగా వినియోగించుకోలేని పరిస్థితి. కొత్తగా స్టేషన్లలో విధుల్లో ఉన్న యువ ఎస్‌ఐలూ మా వల్ల కాదంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ విభాగం పరిధిలోని స్టేషన్లలో కొందరు ఉన్నతాధికారులు రెండేళ్లుగా పనిచేస్తున్నారు. వీరంతా కొంత కాలంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. ఎందుకీ పరిస్థితి.. నగర కమిషనరేట్ పరిధిలో చిన్నచిన్న ఘటనలపైనా మినిట్ టూ మినిట్ వాకబు ఉంటోంది. అధికారులు ఫోన్లలోనే పరిస్థితిని సమీక్షిస్తారు. చిన్న పొరపాట్లకు చార్జీ మెమోలు జారీ. దీంతో మానసిక వేదనకు గురవుతున్నట్లు చెబుతున్నారు. పోలీసు బాస్‌లు మారిన ప్రతిసారి ఆయా పోలీసు అధికారుల తీరు నచ్చకపోతే వారి స్థానంలో కొత్త వారు రావడం సహజంగా జరిగే పనే. అయితే ప్రస్తుతం పనితీరు బాగున్నా కొందరు అధికారులను తప్పించేందుకు కొందరు పావులు కదుపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ నగరంలో కీలకమైన ఓ జోన్ పరిధిలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఉన్నతాధికారి ఒకరు ఇటీవల తాను శాంతిభద్రతల విభాగంలో పనిచేయలేనని ఓ ఉన్నతాధికారికి తేల్చిచెప్పగా.. మరో అధికారి ఆ జోన్లో ఫోకస్ పోస్ట్ వద్దు బాబోయ్.. లూప్లైన్లో పనిచేస్తానని ఉన్నతాధికారి వద్ద మొర పెట్టుకున్నట్లు తెలిసింది. ఇలా నగర కమిషనరేట్ పరిధిలో పలువురు అధికారులు లూప్లైన్లో పనిచేయడానికి ఇంటెలిజెన్స్, టాస్క్‌ఫోర్స్, ఎస్బీ విభాగాలకు దరఖాస్తు చేసుకునేందుకు క్యూ కడుతున్నట్లు తెలిసింది. పోలీసులపై ఒత్తిడి లేదు.. నగర కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసులపై ఎలాంటి ఒత్తిడి లేదు. అందరూ సమన్వయంతో పనిచేయాలంటున్నాం. విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చాం. ప్రస్తుతం పోలీసులు సమర్ధవంతంగా పనిచేయడం వలనే పెండింగ్‌లో ఉన్న 10 వేల కేసులను నాలుగు వేలకు తీసుకురాగలిగాం. పోలీసుల పనితీరు వల్లే ఇది సాధ్యమైంది. పనితీరు బాగాలేకపోతే వారి స్థానంలో కొత్త వారు వస్తారు. –బత్తిన శ్రీనివాసులు, నగర పోలీసు కమిషనర్, విజయవాడ -
వారిపై ఆరా.. ఖాకీల్లో గుబులు..!
సాక్షి, అమరావతిబ్యూరో: గంజాయి మాఫియా ముఠాలతో సంబంధాలున్న పోలీసు శాఖలోని కొంతమందిపై చర్యలు చేపట్టేందుకు విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు రంగం సిద్ధం చేశారు. బాధ్యతగా ఉండాల్సింది పోయి మామూళ్ల మత్తులో జోగుతున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు కసరత్తు చేస్తున్నారు. గంజాయి ముఠాలకు పోలీసు శాఖలో ఎవరు సహకరిస్తున్నారనే కోణంలో ఆరా తీస్తున్నట్లు సమాచారం. విచారణ అనంతరం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాలని సీపీ భావిస్తున్నట్లు సమాచారం. కింది స్థాయి సిబ్బంది నుంచి అధికారుల వరకు సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. అక్రమార్జనే ధ్యేయం విజయవాడ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు చిత్తశుద్ధితో పనిచేమాల్సిన పోలీసు అధికారులు గత ప్రభుత్వ పాలనలో అడ్డదారుల్లో పయనించి, అక్రమార్జనే ధ్యేయంగా పనిచేశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరు ఇప్పటికీ అదేరీతిలో భక్షకులై చెలరేగిపోతున్నారు. న్యాయం కోసం ఆశ్రయించిన వారిని నయానో.. భయానో తమ దారికి తెచ్చుకుని దోచేస్తున్నారు. నానా తంటాలు పడి పోస్టింగ్ తెచ్చుకున్నాం. ‘ఇప్పుడు కాక మరెప్పుడు..’ సంపాదించుకోవాలనే తరహాలో రీతిలో దందాలు, దోపిడీ మార్గంలో ఉరకలేస్తున్నారు. ఇలా పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలను నిలువునా దోచేస్తున్నారు. ఏకంగా పోలీసు కమిషనరేట్‌లోనే అక్రమాలకు తెరలేపారు. గంజాయి, గుట్కా వ్యాపారులకు అండదండలు అందిస్తూ వారి నుంచి నెలవారీ ముడుపులు దండుకుంటున్నారు. స్టేషన్లకు వచ్చే కేసులనే ఆదాయ వనరులుగా మార్చుకుని దోపిడీకి బరితెగిస్తున్న పోలీసు శాఖలోని పలువురి అధికారులపై పోలీసు బాస్ సీరియస్‌గా ఉన్నారు. అన్నీ నమ్మినబంటుల ద్వారానే.. భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, వైట్ కాలర్ పంచాయతీలను చక్కబెట్టడానికి.. గుట్టుచప్పుడు కాకుండా వాటాలను అందజేయానికి అడ్డదారిలో వెళ్తున్న అధికారులు ప్రత్యేకంగా సిబ్బందిలో ఒకరిద్దరిని ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. పోలీసుల్లో పారదర్శకత లోపిస్తున్న విషయంపై ఇంటిలిజెన్స్ వర్గాలు నివేదించడం లేదా? ఈ అక్రమాలు పైస్థాయికి వెళ్లడం లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. అవినీతి పోలీసులపై ఆరా విజయవాడ నగరం వ్యవస్థీకత నేరాలకు అడ్డాగా మారింది. ఇక్కడ నిత్యం భూకబ్జాలు, సివిల్ తగాదాలు, జీరో వ్యాపారం, కాల్‌మనీ, గంజాయి వంటి కేసులతో కొన్ని పోలీసు స్టేషన్లు నిత్యం కిటకిటలాడుతుంటాయి. ఇదే కొందరు పోలీసులకు ఆదాయ వనరుగా మారింది. సివిల్ తగాదాల్లో తలదూర్చి అందినకాడికి దండుకుంటున్నారు. వెండి, బంగారు వ్యాపారులతో కుమ్మక్కై వారు చేసే జీరో వ్యాపారానికి సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే కొంత మందికి గంజాయి మాఫియా సభ్యులతో సంబంధాలున్నట్లు తేలినట్లు సమాచారం. గంజాయి స్మగ్లర్లపై పీడీ చట్టం ప్రయోగించేందుకు కసరత్తు చేస్తుండగా, మరోవైపు శాఖాపరమైన చర్యలకు సీపీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. దీంతో గంజాయి స్మగ్లర్లతో సంబంధమున్న పోలీసుల్లో గుబులు మొదలైంది. -
పోలీసు శాఖపై సీపీ మార్క్
సాక్షి, వరంగల్ : వరంగల్ రేంజ్ ఐజీ, పోలీసు కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఐజీ పి.ప్రమోద్‌కుమార్ కమిషనరేట్‌పై పట్టు బిగిస్తున్నారు. కమిషనర్‌గా ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకున్న ఆయన పరిపాలనాపరంగా తనదైన ముద్ర వేస్తున్నారు. సిబ్బంది, అధికారులు ఎవరైనా సరే తప్పు చేస్తే శాఖాపరమైన విచారణ చేపట్టడం, ఆ తర్వాత చర్యలు తీసుకుంటుండడంతో పలువురు అధికారుల్లో టెన్షన్ నెలకొంది. కమిషనరేట్ పరిధిలో భూముల ధరలు ఆకాశాన్ని అంటడం, ప్రతీ పోలీసు స్టేషన్ పరిధిలో ప్రతిరోజు పదుల సంఖ్యలో వస్తున్న సివిల్ కేసులకే స్టేషన్ హౌస్ అధికారులు కొందరు ప్రా«ధాన్య త ఇవ్వడం, ఆ తర్వాత కేసులు వివాదాస్పదమైన అవి అధికారుల తలకు చుట్టుకోవడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. దీంతో సీపీ ప్రమోద్‌కుమార్ హంగు, ఆర్భాటాలు లే కుండా పోలీసుశాఖను గాడిన పెట్టే పనిలో పడ్డారు. దందా లు, వసూళ్లకు పాల్పడే వారిపై సస్పెన్షన్ వేటు వేస్తుండడంతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై అంతర్గత విచారణకు ఆదేశిస్తున్నారు. బదిలీలు, మందలింపులు, అంతర్గత చర్యలు ఇటీవల ఊపందుకోగా, బాధితులు ఒక్కరొక్కరుగా బయటకు వస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు. కంచె చేను మేసిన చందంగా... అక్రమాలు, సెటిల్మెంట్ దందాలు సాగిస్తున్న కొందరు పోలీసు అధికారులపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుగుతుండటం కలకలం రేపుతోంది. కొందరు భూవివాదాలకే ప్రాధాన్యత ఇస్తూ సెటిల్మెంట్లు చేస్తుండటం ఇటీవల వివాదాస్పదమైన విషయం విధితమే. ఈ నేపథ్యంలో భూముల పంచాయితీలు ఎక్కువగా జరిగే పోలీసుస్టేషన్లపై దృష్టి సారించిన ఇంటలిజెన్స్ ఉన్నతాధికారులు అక్కడ జరిగే అంశాలపై ఉన్నతాధికారులకు వివరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇటీవల పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కమిషనరేట్ పరిధిలో ఏడుగురు ఇన్స్పెక్టర్లపై విచారణ ప్రారంభమైనట్లు సమాచారం. అయితే ఈ ఇన్స్పెక్టర్లు ఎవరనేది శాఖలో అంతర్గతంగా ప్రచారం జరుగుతుండగా, కొందరు సెలవులో వెళ్లినట్లు సమాచారం. ఫిర్యాదులు, వివాదాల్లో కొన్ని.. ⇔ కమిషనరేట్ పరిధిలోని ఓ స్టేషన్ ఎస్హెచ్ఓ(ఇన్స్పెక్టర్) పట్టుబడిన గుట్కాలను అమ్ముకోవడం వివాదస్పదమైంది. ఆ ఇన్స్పెక్టర్పై ఇప్పటికే పదుల సంఖ్యలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో పాటు ఆ పోలీసుస్టేషన్ పరిధిలో ఇటీవల భూముల విషయంలో జరిగిన సెటిల్మెంట్లపై కూడా విచారణ సాగుతోంది. ⇔ ఓ ఇన్స్పెక్టర్ ఫిర్యాదులు స్వీకరించేది లేదు, రశీదులు ఇచ్చేది అంతకన్నా లేదు అన్న విధంగా వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు వేదికైంది. పోస్టు ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే విధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన పరిధిలో ప్రతీ నిత్యం పదుల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు నడుస్తున్నాయి. దీనికి గాను నెలవారీ మామూళ్ల బదులు రోజువారీ మామూళ్లకు తెరలేపి దండుకుంటున్నారన్న ఫిర్యాదులు గతంలో కమిషనరేట్ వరకు కూడా వచ్చాయి. లాక్డౌన్ సమయంలో హర్వెస్టర్ల యాజమానుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి రికార్డు సృష్టించిన ఈయన కొత్తగా ఇండ్లు నిర్మించుకున్న వారి నుంచి సైతం ‘పెనాల్టీ’ వసూలు చేసి రికార్డు సృష్టించారు. ⇔ కమిషనరేట్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఆ పోలీసు స్టేషన్‌కు వచ్చే వారిలో ఎవరికైనా న్యాయం జరుగుతుందా అనేది అర్థం కాని పరిస్థితి. బాధితులతో పాటు వారి వ్యతిరేక వర్గాల వారి నుంచి ఆ ఇన్స్పెక్టర్ ముందుస్తుగా డబ్బు తీసుకోవడం, రెండు వర్గాలను కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేయడం ఆయన రోజువారి దినచర్యగా విమర్శలు ఉన్నాయి. ⇔ హన్మకొండ, హైదరాబాద్ ప్రధాన రహదారి ఆనుకుని ఉన్న ఓ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ విషయంలో వచ్చే ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. ఇప్పటికే భూముల విషయంలో పలుసార్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన భూమి సెటిల్మెంట్ల విషయంలో పెద్ద మొత్తంలో వెనకేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈయనపై డీజీపీ వరకు ఫిర్యాదులు వెళ్లాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ⇔ ఓ రైల్వే స్టేషన్ ఆనుకుని ఉన్న పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ స్టయిలే వేరు. ఎన్ని ఆరోపణలు వచ్చిన ఆయన పట్టించుకోడు. ఆయనపై ఉన్నత అధికారులకు ఫిర్యాదులు అంది వాటిపై ఆరా తీస్తే ఉల్టా ఉన్నతాధికారులను బెదిరిస్తుంటాడు. అవసరమైతే ప్రజాప్రతినిధితో ఫోన్ చేయిస్తాడు. డబ్బు వచ్చే పనులకు మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. స్టేషన్లో ఎవరికైనా టీ ఆఫర్ చేస్తే వారు ఆ అధికారికి డబ్బులు ఇచ్చినట్లు లెక్క. ఇది ఆ స్టేషన్లో పని చేస్తున్న సిబ్బంది బాహాటంగానే చెబుతుండడం గమనార్హం. ⇔ వరంగల్ సబ్ డివిజన్లో ఓ ప్రజాప్రతినిధి సిఫారసుతో పోస్టింగ్ పొందిన ఓ ఇన్స్పెక్టర్ తక్కువ కాలంలో ఆ ప్రజాప్రతిని«ధితో సంబంధాలు చెడిపోయాయి. దీంతో ఉన్నన్ని రోజులో నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే చందంగా దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేసిన సంఘటనల్లోనూ ఈయన డబ్బు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఇన్స్పెక్టర్ వ్యవహారంపై పోలీసు స్టేషన్ సిబ్బందే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ⇔ ఇలాంటి వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ప్రజలు, బాధితులు కోరుతున్నారు. వసూళ్లకు పాల్పడుతున్నఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు వరంగల్ క్రైం: అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తేలడంతో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కేంద్రంలోని మట్టెవాడ పోలీసు స్టేషన్లో నమోదైన ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో, దొంగిలించిన వారి నుంచి వాహనాలు కొనుగోలు చేసిన వ్యక్తుల వద్ద కానిస్టేబుళ్లు జి.మహేందర్, ఓ.రాజు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సీపీ విచారణ చేయించారు. ఈ మేరకు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసిన తొర్రూరు మండలం గట్టికల్లుకు చెందిన వారిని బెదిరించి డబ్బు వసూలు చేసినట్లు నిర్ధారణ కావడంతో కానిస్టేబుళ్లు ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు బెదిరించిన, అక్రమ వసూళ్లకు పాల్పడిన సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తామని సీపీ హెచ్చరించారు. -
ఆన్లైన్లో ఏం చేస్తున్నారో గమనించండి
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ గేమ్స్ పేరుతో భారీ మోసం చేసిన అంతర్జాతీయ ముఠా గుట్టు రట్టైంది. ఓ చైనీస్ కంపెనీ రూ.1000 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఆ కంపెనీకి చెందిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆన్లైన్ బెట్టింగ్ ముఠాను పట్టుకున్నట్లు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు తెలిపారు. ఈ ముఠాపై సైబర్ క్రైంలో రెండు కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. టెలిగ్రాం గ్రూప్ ద్వారా అడ్మిన్ సహాయంతో ఆన్లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారని తెలిపారు. వెబ్‌సైట్స్‌ను ప్రతిరోజు కొత్తగా మార్చుతూ.. అందులోని సమాచారాన్ని గ్రూప్‌లో తెలుసుకుంటారని చెప్పారు. ఈ కంపెనీలో చైనా, ఇండియాకు చెందిన డైరెక్టర్లు ఉన్నారని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. సుమారు రూ.1,100 కోట్ల నగదు ట్రాన్జాక్షన్ జరిగిందని వెల్లడించారు. (రూ. 1000 కోట్ల హవాలా సొమ్ము: చైనా స్పందన) పలు బ్యాంకు ఖాతాల్లో రూ.30కోట్లు సీజ్ చేశామని వెల్లడించారు. ఒక చైనీయునితో పాటు నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. దీనిపై లోతుగా దర్యాప్తు కొనసాగుతుందని వివరించారు. ఐటీశాఖకు సమాచారం ఇచ్చామని, ఆన్లైన్ గేమింగ్ తెలంగాణలో రద్దైందని పేర్కొన్నారు. ఆన్లైన్ గేమింగ్‌లో మోసపోయి చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని, పిల్లలపై దృష్టి పెట్టాలని సీపీ తెలిపారు. ఆన్లైన్ తమ పిల్లలు ఏం చేస్తున్నారని తల్లిదండ్రులు గమనించాలని సీపీ అంజనీ కుమార్ సూచించారు. -
విశాఖలో కత్తితో యువకుడి హల్చల్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోలీసు కమిషనరేట్ వద్ద కలకలం చోటు చేసుకుంది. కమిషనరేట్ ముందు ఓ యువకుడు కత్తితో హల్చల్ చేశాడు. అక్కడితో ఆగకుండా ఆ యువకుడు కత్తితో కమిషనరేట్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. రిసెప్షన్ వద్ద నిర్వహించిన తనిఖీలో యువకుడి వద్ద కత్తిని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మహేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతని వద్ద ఉన్న కత్తిని స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కత్తితో కమిషనరేట్లోకి చొరబడేందుకు యత్నించిన యువకుడిని మహేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించి యువకుడు అనుమానాస్పదంగా సీపీ కార్యాలయం వద్ద తిరగటంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై అతన్ని ఆపి తనిఖీలు చేశారు. మెటల్ డిటెక్టర్‌లో ఆ యువకుడి వద్ద కత్తి ఉన్నట్లు సిబ్బంది గుర్తించారని పోలీసులు తెలిపారు. -
రాజధానిలో మారనున్న పోలీసు ప్రధాన కార్యాలయం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం దాదాపు 44 ఏళ్ల తర్వాత మారనుంది. గురువారం కొత్త కార్యాలయం నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఇప్పటివరకు ఉన్న ఐటీఓ మార్గ్ నుంచి సెంట్రల్ ఢిల్లీలోని జైసింగ్ మార్గ్‌లోని 17 అంతస్థుల భవనంలోకి అక్టోబరు 31న అడుగుపెట్టనుంది. 1912లో బ్రిటిష్ పాలనా కాలంలో కశ్మీర్ గేట్ వద్ద ప్రధాన కార్యాలయం ఉండేది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దాన్ని అక్కడినుంచి మార్చి 1970లో ప్రస్తుతమున్న ఐటీఓ మార్గ్‌లోని పిడబ్ల్యూడి భవనానికి మార్చారు. అప్పుడు ఐజీ ర్యాంకు అధికారి అధిపతిగా ఉండేవారు. అనంతరం 1976లో మొదటిసారిగా కమిషనరేట్ ఏర్పాటు చేసి, జైనారాయణ్ చతుర్వేదిని మొదటి కమిషనర్‌గా నియమించారు. -
బాస్.. నడిపించేవారేరీ ?
సాక్షి, గుంటూరు : జిల్లా పోలీసు శాఖలో కీలక పోస్టులు ఖాళీ అయ్యాయి. అర్బన్ జిల్లాలో ఏఎస్పీ అడ్మిన్, క్రైమ్ ఏఎస్పీ, ఏఆర్ డీఎస్పీ, ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ, ఎస్బీ సీఐ–1, రూరల్ జిల్లాలో ఎస్బీ డీఎస్పీ, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ, ఏఆర్ ఆర్ఐ, ఏవో పోస్టులు గత కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్నాయి. ఇటీవల కాలంలో జరిగిన బదిలీల్లో ఇక్కడి జిల్లా అధికారులు ఇతర ప్రాంతాలకు వెళ్లారు. అయితే వారి స్థానంలో ఎవరినీ నియమించలేదు. ఈ పరిస్థితి పోలీసింగ్పైన, పోలీసు పరిపాలనపైనా పడుతోంది. ఏఎస్పీ పోస్టులు ఖాళీ.. అర్బన్ జిల్లాలో ఏఎస్పీ క్రైమ్, ఏఎస్పీ అడ్మిన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ అడ్మిన్‌గా పని చేస్తున్న వై.టి. నాయుడు ఇటీవల బదిలీ అయ్యారు. క్రైమ్ ఏఎస్పీ ఎం. వెంకటేశ్వర్లు గత ఆగస్టులో పదవీ విరమణ పొందారు. నెల రోజుల అనంతరం ఈ నెల 4న వెయిటింగ్లో ఉన్న ఏఎస్పీ ఎం. శ్రీనివాస్‌ను క్రైమ్ ఏఎస్పీగా నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆయన నేటికీ వచ్చి జాయిన్ అవ్వలేదు. అర్బన్ ఏఆర్ డీఎస్పీ పోస్టు చాలా రోజులుగా ఖాళీగా ఉంటోంది. ఆర్ఐ అడ్మిన్, ఆర్ఐ వెల్ఫేర్లతోనే బందోబస్తు, ఏఆర్ కానిస్టేబుళ్ల డ్యూటీలు, పరిపాలన తదిర వ్యవహారలను నెట్టుకొస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ సీతరామయ్యను ఇటీవల మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా బదిలీ చేశారు. ఆ స్థానంలోకి కొత్త అధికారిని నియమించలేదు. దీంతో మహిళా పోలీస్ స్టేషన్, ఎస్సీ, ఎస్టీ డీఎస్పీగా, ఏఎస్పీ అడ్మిన్‌గా అదనపు బాధ్యతలను సీతరామయ్య చూసుకుంటున్నారు. అర్బన్ ఎస్బీ సీఐ–1 పోస్టు కూడా చాలా రోజులుగా ఖాళీగా ఉంది. ఇక్కడ పని చేస్తున్న రాజశేఖర్‌రెడ్డిని కొత్తపేట సీఐగా బదిలీ చేశారు. అనంతరం ఆ స్థానంలో ఎవరిని కేటాయించలేదు. నిఘా విభాగం అస్తవ్యస్తం.. స్పెషల్ బ్రాంచి(ఎస్బీ) పోలీసింగ్‌లో అత్యంత కీలకం. జిల్లాలో ఎక్కడ ఏం జరుగుతుందో క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా ముందుగానే పసిగట్టి జిల్లా బాస్‌కు సమాచారం ఎస్బీ చేరవేస్తుంది. శాంతిభద్రతలు ఎక్కడ ఎలా ఉన్నాయో శోధిస్తుంది. ఈ విభాగంలో సీనియర్ అధికారులు ఉంటే క్షేత్రస్థాయిలో తమ అనుభవాలను జోడించి శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు బాస్‌కు వెన్నుముకలా వ్యవహరిస్తారు. సుమారు మూడు నెలల క్రితం ఎస్బీ డీఎస్పీగా పని చేస్తున్న వెంకటనారాయణ బదిలీపై హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లారు. అనంతరం ఇక్కడికి కొత్త డీఎస్పీని కేటాయించలేదు. ఈ విభాగంలో సీఐ–2 పోస్టు కూడా ఖాళీగానే ఉంది. ప్రస్తుతం ఒక సీఐ మాత్రమే రూరల్ ఎస్బీని నడిపిస్తున్నారు. సీనియర్ డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ లేకపోవడంతో రూరల్ ఎస్బీ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూరల్ జిల్లా ఏవో శివకుమార్ సుమారు మూడు నెలల క్రితం పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమించలేదు. డీసీఆర్బీ డీఎస్పీ గోలి లక్ష్మయ్యకు ఏవోగా అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో ఈయన ఎక్కువ సమయం ఏవో విధులకే కేటాయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో డీసీఆర్బీలో పర్యవేక్షణ కొరవడిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రూరల్ మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ధర్మేంద్రబాబు గత జూలైలో కృష్ణా జిల్లాకు బదిలీ అయ్యారు. అనంతరం ఇక్కడ డీఎస్పీని కేటాయించలేదు. దీంతో సీఐతో మహిళా పోలీస్ స్టేషన్ నడుపుతున్నారు. డీఎస్పీ పోస్టు ఖాళీగా ఉండటంతో రూరల్ మహిళా పోలీస్ స్టేషన్లో కేసుల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని తెలుస్తోంది. దీనికి తోడు సిబ్బంది గ్రూపులుగా విడిపోయి గొడవలు పడుతున్నట్టు పోలీస్ శాఖలో చర్చ నడుస్తోంది. ఉన్నతాధికారులపైనే భారం.. అర్బన్, రూరల్ జిల్లాలో కీలకమైన ఏఎస్పీ, డీఎస్పీ, సీఐల పోస్టులు కొన్ని నెలలుగా ఖాళీగా ఉండటంతో పోలీస్ బాస్‌లే వీటి పర్యవేక్షణ చూసుకోవాల్సి వస్తోంది. సీనియర్ అధికారులు లేకపోవడంతో ఈ మొత్తం భారం ఎస్పీలపైనే పడుతోంది. సీఎం, ప్రతిపక్ష నేత, మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర వీఐపీలు, వీవీఐపీలు నివాసం ఉంటూ నిత్యం పర్యటించే జిల్లాల్లో కీలక పోస్టులు ఖాళీగా ఉండటం ఎస్పీలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. డీజీపీ, ఐజీలు దృష్టి సారించాలి... రాజధాని జిల్లాలో కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో కేసుల విచారణ, బందోబస్తు, పరిపాలన మొదలైన వ్యవహారాలపై ప్రభావం పడుతోంది. కావున డీజీపీ, ఐజీలు ఖాళీగా ఉన్న కీలక పోస్టులపై దృష్టి సారించి వీలైనంత త్వరగా ఆయా పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. లేని పక్షంలో శాంతిభద్రతలపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. -
ఆడపిల్ల పుట్టిందని కుమార్తెను చంపేశారు..
సాక్షి, అమరావతి : ‘ఆడపిల్ల పుట్టిందని కుమార్తెను చంపేశారు..’ ‘హోటల్లో బకాయిలు చెల్లించమంటే డీజీపీ పేరు చెప్పి బెదిరిస్తున్నాడు..’ ‘ఆక్రమణలో ఉన్న నా పొలం నాకు అప్పగించినందుకు కృతజ్ఞతలు..’ ఇలా ఫిర్యాదుదారులు విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ను కలసి వినతులు అందజేశారు. సోమవారం కమిషనరేట్‌లో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వాటిని సీపీ ద్వారకా తిరుమలరావు, జాయింట్ సీపీ నాగేంద్రకుమార్, డీసీపీ కోటేశ్వరరావు పరిశీలించి సమస్యల పరిష్కారానికి స్టేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 166 ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నింటిని వారంలోగా పరిష్కరించాలని సీపీ ఆదేశించారు. నిజం చెప్పండి.. ‘సార్.. మాది మచిలీపట్నం మండలం గిలకలదిండి గ్రామం. మాకు ఇద్దరు సంతానం. కుమార్తె దివ్యను పల్లితుమ్మలపాలెం గ్రామానికి చెందిన కార్పెంటర్ అంకాని రాంకుమార్‌కు ఇచ్చి వివాహం చేశాం. ఆ సమయంలో కట్నం కింద ఎకరం పొలం, పసుపు కుంకుమ కింద రూ.50 వేలు ఇచ్చాం. దివ్య జనవరిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. కూతురుని చూడడానికి తండ్రి మూడు నెలలు మా ఇంటికే రాలేదు. ఐదో నెలలో కుమార్తెను అత్తవారింటికి పంపాం. వారు మూడు నెలల కిందట విజయవాడ శివార్లలోని పెనమలూరుకు వచ్చి నివసిస్తున్నారు. గత ఆగస్టు 20న తన బాబాయ్‌కు ఫోన్ చేసి తనను భర్త కొడుతున్నాడంటూ.. అదనపు కట్నం తెచ్చివ్వాలని వేధిస్తున్నాడంటూ.. తాను ఇంటికి వచ్చేస్తానంటూ బోరుమని విలపిస్తూ చెబుతుండగానే ఫోన్ కట్ అయింది. ఆ తర్వాత సాయంత్రం 5.30 గంటల సమయంలో మాకు ఫోన్ చేసి మీ కుమార్తె ఉరి వేసుకుని చనిపోయింది. మచిలీపట్నానికి ఆమెను తీసుకొస్తున్నామంటూ చెప్పి ఫోన్ పెట్టేశారు. అనుమానంతో కేసు పెట్టాం.. పెనమలూరు పోలీసులను ఎన్నిసార్లు ప్రయత్నించినా సరైన సమాధానం చెప్పడం లేదు. కుమార్తెను అత్తామామలు, బావ, భర్త కలసి చంపేశారు. పోస్టుమార్టం రిపోర్టులో ఏముందో చెప్పాలని వేడుకున్నా.. ఫలితం లేదు. మీరే మాకు న్యాయం చేయండి’ – బడుగు కనకదుర్గా, ఆదిశేషు, తల్లిదండ్రులు, పల్లితుమ్మలపాలెం బిల్లు అడిగితే బెదిరిస్తున్నాడు.. లంకా దినకర్ మా హోటల్లో రెండున్నర నెలల పాటు ఉన్నాడు. బిల్లు అడిగిన ప్రతిసారి టీడీపీ నేతలతో ఫోన్లు చేయించేవాడు. వారు కూడా ఖాళీ చేసే సమయంలో డబ్బు మొత్తం చెల్లిస్తాడని చెప్పారు. చివరకు రూమ్ ఖాళీ చేసినా బిల్లు డబ్బులు రూ.2.50 లక్షలు చెల్లించలేదు. నిలదీస్తే డీజీపీ గౌతంసవాంగ్ పేరు చెబుతున్నాడు. అరెస్టు చేయిస్తానని బెదరిస్తున్నాడు. – శ్రీనివాస్, మేనేజర్, వైబ్రెంట్ హోటల్ నా పొలం నాకు దక్కింది.. సార్, ఆక్రమణలో ఉన్న నా పొలం మీ జోక్యంతో నాకు దక్కింది. తనఖా పెట్టిన తన భూమిని ఆక్రమించిన వారి నుంచి నా పొలం తిరిగి నాకు అప్పగించమని మీకు గత వారం ఫిర్యాదు చేయగా.. తక్షణమే మీరు స్పందించి నాకు న్యాయం చేశారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. – డొకుపర్తి సత్యనారాయణ, ముస్తాబాద, గన్నవరం -
బౌద్ధక్షేత్రంలో మొక్కలు నాటిన విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం : విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శనివారం తొట్లకొండ బౌద్ధక్షేత్రంలో 'వనం-మనం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి బౌద్ధ కేంద్రాన్ని శుభ్రపరచి, మొక్కలు నాటారు. అంతకుముందు విశాఖ బీచ్ రోడ్లో ఉన్న మాజీ సీఎం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలు వేసి నివాలులర్పించారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను నెరవేర్చడమే మా లక్ష్యమని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మోపిదేవి వెంకటరమణ, అవంతి శ్రీనివాస్, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, విప్ బూడిద ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాధ్, కరణం ధర్మశ్రీ, భాగ్యలక్మి, గొల్ల బాబురావు, ఉమాశంకర్ గణేశ్, విఎంఆర్డిఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల వద్దకే ఆరోగ్య భద్రత
సాక్షి, సిటీబ్యూరో: శాంతిభద్రతల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసుల ఆరోగ్య పరిరక్షణ కోసం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే బాలానగర్, మాదాపూర్, శంషాబాద్ జోన్ల పరిధిలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాలు నిర్వహించినా సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నట్లు గుర్తించిన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రతి పోలీసు స్టేషన్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సీపీ ఆదేశాల ప్రకారం సైబరాబాద్ పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో వివిధ ఆస్పత్రుల వైద్యులను సమన్వయం చేసి ప్రతి బుధవారం కొన్ని ఠాణాల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా బాలానగర్, మాదాపూర్, రాయదుర్గం, ఆర్సీపురం, శంషాబాద్ పోలీస్ స్టేషన్లలో యశోధ, కేర్ హైటెక్ సిటీ, మ్యాక్స్ క్యూర్, కాంటినెంటల్, సిటిజన్ ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సిబ్బందికి రక్త పరీక్షలు, బీపీ, ఈసీజీ, 2డీ ఎకోటెస్టులు, కార్డియో, ఆర్థో, జనరల్ మెడిసిన్ డాక్టర్లతో కన్సల్టేషన్ నిర్వహించారు. దీంతో పాటు ఎఫ్ఎంస్ డెంటల్, డాక్టర్ ఐ అగర్వాల్, మెక్సివిజన్ వారిచే దంత, కంటి పరీక్షలు నిర్వహించారు. సిబ్బంది పని చేసే స్థలంలోనే ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆరోగ్య భద్రత ద్వారా చికిత్సలు చేయించుకునేందుకు అవకాశం ఉంది. వచ్చే బుధవారం మిగతా పోలీస్ స్టేషన్లో కూడా వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. ప్రజల వద్దకే పాలనలా, సిబ్బంది పనిచేసే చోటే ఆరోగ్య పరీక్షలు ఏర్పాటు చేసి నూతన ఒరవడికి నాంధి పలికిన సైబరాబాద్ సీపీకి పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు సీహెచ్ భద్రా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శిబిరాల్లో సీఏఆర్ అడిషనల్ డీసీపీ మణిక్ రాజ్, అడిషనల్ డీసీపీ సైబరాబాద్ పర్యవేక్షణలో పోలీస్ డాక్టర్లు సరిత, సుకుమార్ పాల్గొన్నారు. సీఏఆర్ అడిషనల్ డీసీపీ మణిక్ రాజ్, డాక్టర్లు సరిత, సుకుమార్, సంబంధిత ఇన్స్పెక్టర్లకు పోలీస్ అధికారుల సంఘం నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు చార్మినార్: విధి నిర్వహణలో నిరంతరం శ్రమించే పోలీసులు తమ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. బుధవారం పేట్లబురుజులోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో మెడికల్ క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విధి నిర్వహణతో పాటు ఆరోగ్యంగా ఉండటం కూడా ఎంతో అవసరమన్నారు. పోలీసు విభాగంలో పని చేస్తున్న అన్ని స్థాయిల్లోని సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో అదనపు పోలీసు కమిషనర్ మురళీకృష్ణతో పాటు అపోలో ఆసుపత్రికి చెందిన వైద్యులు డాక్టర్ నారాయణ్ రావు, డాక్టర్ హరినాథ్, డాక్టర్ ప్రశాంత్ గుప్తా, డాక్టర్ వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లోని పెట్రోలింగ్ వాహనాల ఫిట్నెస్ తదితర అంశాలను పరిశీలించి వాహనాల పనితీరు పట్ల సీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. -
మెగా కమిషనరేట్
సాక్షి, అమరావతి బ్యూరో (కృష్ణా) : విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ పరిధిని విస్తరిస్తూ మెగా కమిషనరేట్ ఏర్పాటుకు మార్గం సుగమమవుతోంది. ప్రస్తుతం ఉన్న పరిధిలోకి సీఆర్డీఏలోని ప్రాంతాలను తీసుకొస్తూ నూతన కమిషనరేట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో జరుగుతున్న సమావేశాల్లో భాగంగా రెండో రోజు శాంతిభద్రతలపై జరిగిన సమీక్షలో ఈ మేరకు డీజీపీతో చర్చించి అధ్యయనం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. అలాగే విజయవాడలోని ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి, దోపిడీని ఉపేక్షించవద్దని నగర సీపీ ద్వారకా తిరుమలరావుకు ఆదేశాలు జారీ చేశారు. ‘విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు మార్గాలు అన్వేషించండి.. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి, దోపిడీని ఉపేక్షించ వద్దు.. కాల్‌మనీ లాంటి ఘటనలు నగరంలో మళ్లీ పునరావృతం కావడానికి వీల్లేదు.. ఫిర్యాదు వస్తే సత్వరమే చర్యలు తీసుకోండి.. చట్టవిరుద్ధ కార్యకలాపాలు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపండి’ అంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల అంశంపై మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ నగర సీపీ ద్వారకా తిరుమలరావుతో ముఖాముఖీ నిర్వహించిన సీఎం నగర పరిస్థితులపై మాట్లాడారు. మెగా కమిషనరేట్ ఏర్పాటుకు ప్రతిపాదన.. రాజధాని నగరానికి తగినట్లుగా పోలీసు వ్యవస్థను పటిష్ట పరచడానికి ప్రస్తుత విజయవాడ కమిషరేట్ పరిధిలోకి సీఆర్డీఏ ప్రాంతాన్ని తీసుకువస్తూ ‘మెగా కమిషనరేట్(అమరావతి కమిషరేట్)ను ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించాలని సీపీ ద్వారకా తిరుమలరావు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కృష్ణా ఎస్పీ పరిధిలో ఉన్న ఇబ్రహీంపట్నం నుంచి జగ్గయ్యపేట వరకు కూడా ఈ కమిషరేట్ పరిధిలోకి వస్తుందని, అలాగే కృష్ణా జిల్లా, గుంటూరు రూరల్, గుంటూరు అర్బన్ పోలీసుల పరిధిలోని కొన్ని ప్రాంతాలను విజయవాడ కమిషనరేట్ పరిధిలోకి తేవాల్సి ఉందని తెలిపారు. అలాగే కమిషరేట్‌ను ఆరు సబ్డివిజన్లుగా విభజించి.. ఒక్కో డివిజన్‌కు ఒక్కో ఐపీఎస్ అధికారిని డీసీపీగా నియమించాల్సి ఉంటుందని, అదనంగా మరో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐ పోస్టులతోపాటు కానిస్టేబుళ్లను వివిధ విభాగాలకు కేటాయించాలని ప్రతిపాదించారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ డీజీపీతోపాటు నిపుణుల కమిటీతో అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని సీపీకి తెలిపారు. ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే.. విజయవాడ నగరం నుంచి చెన్నై–కోల్‌కతా, విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారులు వెళ్తున్నాయని.. తద్వార ఉత్పన్నమవుతున్న సమస్యలకు పరిష్కారం కావాలంటే నగరంలో ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం ఒక ప్రత్యామ్నాయమని నగర సీపీ ద్వారకా తిరుమలరావు సీఎం వైఎస్ జగన్‌కు ప్రతిపాదించారు. కనకదుర్గ వారథి నుంచి గన్నవరం వరకు నేరుగా వాహనాలు వెళ్లేందుకు వీలుగా ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల బెంజిసర్కిల్, నిర్మలా జంక్షన్, రమేష్ ఆస్పత్రి సర్కిల్, మహానాడు, రామవరప్పాడు, ఎనికేపాడు, గూడవల్లి, గన్నవరం వరకు ఈ మార్గంలో ట్రాఫిక్ నియంత్రణలోకి వస్తుందన్నారు. మరో ప్రత్యామ్నాయం.. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడప వరకు బైపాస్ మార్గాన్ని నిర్మించి దీనిని తాడిగడప కూడలిలోని వంద అడుగుల రోడ్డులో అనుసంధానం చేస్తే నగరంలోని బెంజిసర్కిల్‌పై ఒత్తిడి తగ్గుతుందని సీపీ వివరించారు. విజయవాడ–బందరు హైవేపై మరొకటి.. విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై మరో ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే మార్గాన్ని నిర్మించాలని, దీనివల్ల ఎన్టీఆర్ సర్కిల్, పటమట, ఆటోనగర్ గేట్, కామయ్యతోపు, కానూరు, తాడిగడప, పోరంకి కూడళ్ల వద్ద ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని చెప్పారు. కనకదుర్గ ఫ్లై ఓవర్‌ను గొల్లపూడి వై జంక్షన్ వరకు పొడిగిస్తే ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తొలిగిపోతాయని తెలిపారు. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్.. నగరంలో వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నామని, దీనివల్ల వాహనాల రద్దీని అంచనా వేస్తూ ట్రాఫిక్ కూడళ్లలో సిగ్నల్స్ పనిచేస్తాయన్నారు. పాదచారుల కోసం.. బెంజిసర్కిల్, రమేష్ హాస్పిటల్ సర్కిళ్లో వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో పాదచారులు రోడ్డు దాటేందుకు ఇక్కట్లు పడుతున్నారని వారి కోసం ఈ రెండు సర్కిళ్లలో సబ్ వేలు ఏర్పాటు చేస్తే రోడ్డు మార్గం దాటేందుకు సులువుగా ఉంటుందని సీపీ వివరించారు. వీటిపైన సీఎం జగన్ స్పందిస్తూ సమగ్ర నివేదికతో రావాలని సూచించారు. అవినీతి, దోపిడీని ఉపేక్షించొద్దు.. విజయవాడ నగరంలో అవినీతి, దోపిడీని ఉపేక్షించొద్దని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నగర పోలీసు కమిషనర్‌కు ఆదేశించారు. నగరంలో ప్రకంపనలు సృష్టించిన కాల్‌మనీ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అలాంటి ఘటన మళ్లీ పునరావృతం కారాదని హెచ్చరించారు. ఫిర్యాదు వస్తే సత్వరమే చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. కాల్‌మనీ బాధితులకు న్యాయం జరిగిందా అని ఆరా తీశారు. నగరంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. -
ఇక.. ఈ–ఎస్సార్!
సాక్షి, హైదరాబాద్: సర్వీస్ రికార్డు... సంక్షిప్తంగా ఎస్సార్ అంటూ పిలిచే దీనికి పోలీసు విభాగంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఐపీఎస్‌లు కాని పోలీసు అధికారులు, కిందిస్థాయి సిబ్బందికి ఇది అత్యంత కీలకం. పరిపాలన విభాగం నిర్లక్ష్యంతో ఇందులో ఏర్పడే లోపాల కారణంగా కొందరైతే పదోన్నతుల్నీ కోల్పోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇలాంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర పోలీసు విభాగం ఈ–ఎస్సార్ విధానానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ కమిషనరేట్ సహా రాష్ట్రంలో 45 శాతం ఆన్లైన్ చేయడం పూర్తయింది. త్వరలో పూర్తిస్థాయి డేటాబేస్ రూపొందించి టీఎస్ కాప్ యాప్ ద్వారా ప్రతి అధికారి, సిబ్బందికి దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) సహకారంతో వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ పేరుతో ఈ–ఎస్సార్‌ను అమలు చేస్తున్నారు. గతంలో కోర్టు ఆదేశాలతో ఆఘమేఘాల మీద పోలీసు ఉన్నతాధికారులు చేపట్టిన ఇన్స్పెక్టర్ ఆపై స్థాయి అధికారుల పదోన్నతులు పరిపాలనా విభాగంలోని లోపాలను బట్టబయలు చేశాయి. అక్కడి క్లర్కులు చేస్తున్న అనేక పొరపాట్లు, నిర్లక్ష్యం కారణంగా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు డీఎస్పీ పదోన్నతుల కోసం అనేక వ్యయప్రయాసలకోర్చాల్సి వచ్చింది. మాన్యువల్ ఎస్సార్‌లో తలెత్తిన సమస్యల్ని సరిచేయించుకోవడం కోసం ఆయా అధికారులు డీజీపీ కార్యాలయం చుట్టూ కొన్ని వారాల పాటు ప్రదక్షిణలు చేశారు. మాన్యువల్‌తో ఇబ్బందులు.. సర్వీస్ రికార్డుల్ని మాన్యువల్‌గా నిర్వహిస్తుండటంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఓ అధికారి/సిబ్బందిపై వచ్చిన నెగెటివ్ అంశాలను వేగవంతంగా రికార్డులో పొందుపరుస్తున్న పరిపాలన విభాగం పాజిటివ్ అంశాలను చేర్చట్లేదనే విమర్శలున్నాయి. పోలీస్ విభాగంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని, చిన్న తప్పుల్ని సైతం తీవ్రంగా పరిగ ణిస్తారు. బాధ్యులకు మెమోలు, చార్జ్‌మెమోలు, సాన్‌షూయ్, పోస్ట్‌పోన్ మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్ వంటి శిక్షలు వేస్తుంటారు. వాటి ఉత్తర్వుల్ని పరి పాలనా విభాగాలకు పంపి సర్వీసు రికార్డుల్లోకి ఎక్కేలా చర్యలు తీసుకుం టారు. కొన్నిశిక్షల్ని ఉపసంహరించినప్పుడు, కాలపరిమితి తీరిన తరు వాత ఆ వివరాలను సర్వీసు రికార్డుల్లో నమోదయ్యేలా చూస్తారు. అని వార్య కారణాల నేపథ్యంలో ప్రతికూల అంశాలను రికార్డుల్లో ఎక్కిం చినంత అనుకూలాంశాలు పొందుపర్చ ట్లేదనే ఆరోపణ ఉంది. పదోన్నతి కోల్పోయిన వారెందరో.. గతంలో జరిగిన ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ పదోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితాలో తనకంటే జూనియర్ల పేరు ఉండి, తన పేరు లేకపోవడాన్ని గమనించిన ఓ ఇన్స్పెక్టర్ ఆరా తీయగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ఈయనకు ఉన్నతాధికారులు చార్జ్‌మెమో ఇవ్వకుండానే ఆనవాయితీకి విరుద్ధంగా సాన్‌షూయ్ ఇచ్చారు. ఇది సర్వీసు రికార్డుల్లోకి ఎక్కింది. జరిగిన పొరపాటులో తన ప్రమేయం లేదని మొరపెట్టుకోగా... దాన్ని ఉపసంహరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీటిని సంబంధిత క్లర్కు నిర్లక్ష్యంగా వ్యవహరించి పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్‌గా సర్వీసు రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో రెండు శిక్షలు ఉన్నాయంటూ సదరు ఇన్స్పెక్టర్ పేరును అధికారులు సీనియారిటీ జాబితాలో చేర్చలేదు. మరో ఇన్స్పెక్టర్కు ఎదురైన ఇబ్బంది మరీ ఘోరంగా ఉంది. ఈయనకు గతంలో సాన్‌షూయ్, పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్ రెండూ సర్వీసు రికార్డుల్లోకి ఎక్కాయి. నిబంధనల ప్రకారం సాన్‌షూయ్ వచ్చిన ఏడాది వరకు, పోస్ట్పోన్మెంట్ వచ్చిన రెండేళ్ల వరకు ఆ అధికారికి పదోన్నతులు తదితరాలు వర్తించవు. ఒకే తేదీన ఈ రెంటినీ పొందిన సదరు ఇన్స్పెక్టర్ వాస్తవానికి రెండేళ్లలోనే రెంటి కాలపరిమితి పూర్తి చేసుకున్నారు. దీనికి విరుద్ధంగా మూడేళ్ల వరకు అర్హుడు కాదంటూ పరిపాలనా విభాగం సీనియారిటీ జాబితాలో పేరు చేర్చకపోవడంతో పదోన్నతి, సీనియారిటీ కోల్పోవాల్సి వచ్చింది. ఇలాంటి కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న అధికారులు కోకొల్లలుగా ఉంటారు. 45 శాతం పూర్తి.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర పోలీసు విభాగం ఎస్సార్‌ను ఆన్లైన్ చేస్తూ ఈ–ఎస్సార్ ప్రవేశపెడుతోంది. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 45 శాతం ఈ ప్రాజెక్టు పూర్తయింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక విరామం ఇచ్చినా త్వరలో పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఇకపై ప్రతి పోలీసు అధికారి/సిబ్బందికి సంబంధించిన సర్వీసు రికార్డులు అన్ని వేళల్లోనూ టీఎస్ కాప్‌లో అందుబాటులో ఉంటుంది. ఏవైనా లోపాలు ఉన్నట్లు గమనిస్తే కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన పని లేదు. ఆ యాప్ ద్వారానే దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత సమయంలో సమస్య పరిష్కారమవుతుంది. అలా కానిపక్షంలో వీటిని పర్యవేక్షించే ఉన్నతాధికారులకు పరిపాలన విభాగం సిబ్బంది ఆ దరఖాస్తు ఎన్ని రోజులు పెండింగ్‌లో ఉంది? ఎందుకు ఉంచాల్సి వచ్చింది? తదితర వివరాలు ఎప్పటికప్పుడు చెప్పాల్సి ఉంటుంది. ‘భద్రత’పథకం కింద ఇచ్చే రుణాలు, ఇతర సౌకర్యాలు తదితరాలను కూడా ఆన్లైన్ ద్వారానే యాప్‌లోకి తీసుకువచ్చి పారదర్శకంగా చేయాలని రాష్ట్ర పోలీసు విభాగం నిర్ణయించింది. -
రూ.3.3 కోట్ల వ్యవహారంలో లోతుగా దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం నగర వ్యాప్తంగా నగదు తరలింపుపై నిఘా పెట్టి ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఈ నేపథ్యంలో ఓ సమాచారం ఆధారంగా గురువారం బంజారాహిల్స్ పోలీసులు రూ.3,30,84,500 నగదు స్వాధీనం చేసుకోగలిగారని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, తదుపరి చర్యల నిమిత్తం ఆదాయపుపన్ను శాఖకు అప్పగించామని ఆయన శుక్రవారం తెలిపారు. వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కళింగరావులతో కలసి తన కార్యాలయంలో అంజనీకుమార్ విలేకరులతో మాట్లాడారు. గురువారం ప్రజల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా వేగంగా స్పందించిన బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు తనిఖీలు చేయడానికి ఆదేశించారు. ఇన్స్పెక్టర్ కళింగరావు నేతృత్వంలోని బృందం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రోడ్ నం.10లో ఉన్న జహీరానగర్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఓ వాహనంలో వస్తున్న చంద్రకాంత్ అనే వ్యక్తి నుంచి రూ.కోటి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం సూత్రధారులకు తెలియకుండా ఉండేందుకు అతడి నుంచి ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు లోతుగా విచారించారు. అలా అతడిచ్చిన సమాచారంతో అబిడ్స్‌లోని జవేరి జ్యూయలర్స్ అధినేత అనిల్ అగర్వాల్ వద్దకు వెళ్లిన అధికారులు అతడి వద్ద నుంచి రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అమీర్‌పేట ప్రాంతంలో దాడి చేసి ప్రసాద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్దనుంచి రూ.30.84 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి బంజారాహిల్స్, అమీర్‌పేట్, రామాంతపూర్, బషీర్‌బాగ్, బేగంపేట తదితర ప్రాంతాలకు చెందిన చంద్రకాంత్, అనిల్‌కుమార్, ప్రకాష్, సంతోష్‌కుమార్, విక్కీ సింగ్, వి.నరేష్‌బాబు, పోబిష్ గగోయ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరు గతంలో హవాలా వ్యాపారం చేసిన వాళ్లు, మరికొందరు వ్యాపారులు ఉన్నారు. ఈ నగదు సరఫరాకు ఎన్నికలకు ఏదైనా లింకు ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా కేసును నగదుతో సహా ఆదాయపుపన్ను శాఖ అధికారులకు అప్పగిస్తున్నారు. ఆపై లోతుగా దర్యాప్తు చేయడంలో భాగంగా ఈ కరెన్సీ నోట్ల నంబర్ల ఆధారంగా అవి ఏ బ్యాంకు శాఖ నుంచి, ఏ ఖాతా నుంచి డ్రా అయ్యాయి? ఎవరు చేశారు? అనేవి గుర్తించనున్నారు. ఈ వివరాలు ఆధారంగా వారికి నోటీసులు జారీ చేసి విచారించే ఆస్కారాలు ఉన్నాయి. ఈ నగదు అక్రమ లావాదేవీల నేపథ్యంలో ఆడి, పోలో కార్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
హలో.. పోలీస్ సేవలెలా ఉన్నాయి..?
సాక్షి, రాయికల్(జగిత్యాల): ‘హలో.. మేం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి మాట్లాడుతున్నాం. మీ పోలీస్‌స్టేషన్‌లో దరఖాస్తు ఇచ్చారు కదా.. పోలీసులు వెంటనే స్పందించారా. ఒకసారి వెళ్లగానే ఎస్సై, ఎస్‌హెచ్‌వో(స్టేషన్ హౌస్ ఆఫీసర్) కలిశారా. రెండు, మూడు పర్యాయాలు వెళ్లారా. మీతో పోలీస్ అధికారి బాగా మాట్లాడారా. అక్కడ పోలీసులు, ఇతర సిబ్బంది ఇవ్వమని అడిగారా. పోలీస్‌స్టేషన్‌లో మరోసారి పని పడితే ఒక్కరే వెళ్లే ధైర్యం వచ్చిందా’ అంటూ పోలీస్ ఉన్నతాధికారులు బాధితులకు ఫోన్ కాల్ చేసి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ శాఖలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట వేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. జగిత్యాల జిల్లాలోని ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులకు సంబంధించి వారం రోజుల వ్యవధిలో బాధితులకు ఫోస్ చేసి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. పోలీస్‌స్టేషన్ వెళ్లినప్పటి నుంచి కేసు నమోదు ప్రక్రియ ముగిసి కేసుకు సంబంధించిన పత్రం ఇచ్చేవరకు జరిగే వ్యవహారాలకు సంబంధించిన అన్ని విషయాలను ప్రశ్నల రూపంలో అడుగుతున్నారు. పోలీసుల పనితీరుపై పోలీస్ ఉన్నతాధికారులు నేరుగా ఫోన్ కాల్ చేసి ఆరా తీడయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి నిర్మూలనే ధ్యేయంగా.. పోలీస్ శాఖలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు అధికారులు చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలనిస్తున్నాయి. గతంలో పోలీస్ అధికారులు, సిబ్బందిపై ఉన్న మచ్చలను తొలగించాలనే ఉద్దేశంతో పోలీస్ ఉన్నతాధికారులు నేరుగా ప్రజలతో మాట్లాడుతున్న తీరును ప్రజలు హర్షిస్తున్నారు. ఒకప్పుడు పోలీస్‌స్టేషన్ మెట్లక్కాలంటే భయపడే విధానానికి స్వస్తి పలకాలనే సంకల్పంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కేసు నమోదు చేసే సమయంలో బాధితుల చరవాణి నంబర్‌ను అంతర్జాలంలో నమోదు చేసేస్తున్నారు. ఆ నంబరుకు కాల్ చేసి సేవల తీరును తెలుసుకుంటున్నారు. పోలీసులు సైతం ప్రజలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తున్నారు. నిందితులు, వారి కుటుంబసభ్యులతోనూ అధికారులు మాట్లాడుతున్నారు. పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. రిమాండ్, స్టేషన్ బెయిల్ ఇతర విషయాల్లో నగదు తీసుకుంటున్నారా.. పారదర్శకంగా పని చేస్తున్నారా.. అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ విధానాలతో గతంతో పోలిస్తే జిల్లాలో కిందిస్థాయిలో అవినీతి చాలావరకు తగ్గిందని ఉన్నాతాధికారులు తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలతో పోలీసులు వ్యవహరించే విధానంలో మార్పులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ తీరు ఫలించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అధికారులు తమ విధులను పారదర్శకంగా నిర్వర్తిస్తున్నారు. ఒక్కరే పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలనే ఉద్దేశంతో చేపడుతున్న కార్యక్రమాలతో పోలీస్స్టేషన్లకు సమస్యల పరిష్కారానికి వెళ్లే ప్రజల్లో మనోధైర్యం పెరుగుతోంది. -
హైదరాబాద్‌లో భారీగా హవాల డబ్బు సీజ్
-
మళ్లీ తెరపైకి నయీం అనుచరుల ఆగడాలు
సాక్షి, యాదాద్రి : గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరుల ఆగడాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. వీరిని అదుపుచేయలేక పోతున్నారని భువనగిరిజోన్ డీసీపీ ఈ.రామచంద్రారెడ్డి, భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ వెంకన్నపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ శనివారం సాయంత్రం హుటాహుటిన చర్యలు తీసుకున్నారు. కొందరు ఇటీవల సీఎం కార్యాలయంలో నయీమ్ అనుచరుల అగడాలు, పోలీ స్ల వైఖరిపై ఫిర్యాదు చేయడంతో మరోసారి అధికార యంత్రాంగం శాఖపరమైన చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా డీసీపీ రామచంద్రారెడ్డిని రాచకొండ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేశారు. యూసుఫ్‌గూడ పీఎంటీ, పీఈటీ ఫస్ట్ బెటాలియన్ చీఫ్ సూపరింటెండెంట్‌కు రిపోర్టు చేసి పోలీస్ రిక్రూట్మెంట్ పూర్త య్యే వరకు పనిచేయాలని ఆదేశాలు జారీచేయగా, భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ వెంకన్నగౌడ్‌ను రాచకొండ సీపీ కార్యాలయానికి అటాచ్ చేసి ఆయన స్థానంలో భువనగిరి ట్రాíఫిక్–2 ఇన్స్పెక్టర్ సురేందర్‌కు బాధ్యతలు అప్పగించారు. భువనగిరి శివారులో గల సర్వే నంబర్ 730లో 5.20 ఎకరాల భూమిని నయీమ్ అనుచరులైన పాశం శ్రీను, ఎండీ నాసర్‌లు భువనగిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటీవల రిజిష్ట్రేషన్ చేయించారని సీపీకి అందిన ఫిర్యాదుపై విచారణ జరిపారు. సిట్ ఆదేశాలతో పోలీస్‌లపై వెంటనే చర్యలు తీసుకున్నారు. నయీమ్ అనుచరులపై భువగగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీస్ అధికారి అండదండలతోనే నయీ మ్ అనుచరుల ఆగడాలు మళ్లీ మొదలయ్యాయన్న ఫిర్యాదుతోనే సీపీ సీరియస్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. భువనగిరి కేంద్రంగా నేర సామ్రాజ్యాన్ని ప్రారంభించిన నయీం ప్రస్థానం 2016 ఆగస్టు 8న మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌తో ముగిసింది. ఎన్కౌంటర్ అనంతరం అతని ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగుచూశాయి. నేర సామ్రాజ్యంలో ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు ఇలా అన్ని వర్గాల ప్రాతినిధ్యం బయటపడింది. ప్రధానంగా భువనగిరి కేంద్రంగా నయీం, అతని అనుచరులు సాగించిన ఆకృత్యాలు, బలవంతపు వసూళ్లు, వ్యవసాయ భూములు, ఇళ్ల ప్లాట్ల బాధితులు పోలీసులు ముందుకు వచ్చారు. వారు ఇచ్చిన ఫిర్యాదులతో అప్పట్లో నయీమ్ అనుచరులపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించారు. సిట్ ఏర్పాటు నయీంఎన్కౌంటర్తో వెలుగులోకి వచ్చిన వందలాది మంది బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం సిట్ దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాపితంగా 230కిపైగా సిట్ కేసులు నమోదు చేసింది. జిల్లాలో భువనగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో 121, రూరల్ పోలీస్‌స్టేషన్‌లో 25, యాదగిరిగుట్టలో 21, వలిగొండలో 4, చౌటుప్పల్‌లో 1 కేసు నమోదైంది. భువనగిరి పట్టణంలో సుమారు 50 బలవంతపు వసూళ్ల కేసులు కాగా, మిగతావన్నీ భూ కబ్జాల కేసులు నమెదయ్యాయి. టీచర్స్ కాలనీలో ప్లాట్ల కేసు భువనగిరి టీచర్స్ కాలనీ సమీపంలోని శ్రీ లక్ష్మినర్సింహస్వామి నగర్ ప్లాట్ల అక్రమణ కేసులో నయీం అనుచరులు, కుటుంబ సభ్యులపై 2016లో కేసు నమోదైంది. 1994లో భువనగిరి పట్టణ శివారు, బొమ్మాయిపల్లి శివారులోని సర్వేనంబర్లు 722, 723, 724, 726, 727, 728, 729, 730, 731, 732, 733లలో మూడు దశల్లో వెంచర్లు చేసి ప్లాట్లు విక్రయించారు. 154 ఎకరాల భూమిలో 1756 ఓపెన్ ప్లాట్ల వెంచర్లో భువనగిరి, హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు చెందిన వందలాది మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. 2003– 2004 నుంచి ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులకు తెలియకుండా నయీం, అతని అనుచరులు భూ యజమాని పట్టాదారు పాస్‌పుస్తకాలతో తమకు సంబంధించిన వ్యక్తుల పేరుమీద డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అనంతరం మరికొందరికి విక్రయించారు. ఈ విషయంలో 2010లో బాధితులు పెద్ద ఎత్తున భువనగిరిలో, హైదరాబాద్‌లో ఆందోళన చేశారు. కానీ నయీం అనుచరులు బెదిరించడంతో పాటు అధికారులనుంచి సరైన సహకారం లభించకపోవడంతో ఈ విషయం కాస్త అటకెక్కింది. నయీం ఎన్కౌంటర్ జరగడంతో బాధితులంతా తమ ప్లాట్లను తమకు ఇప్పించాలని ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. కేసు భువనగిరి ఆర్డీఓ కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది. పోలీస్‌లు కుమ్మక్కు అయ్యారా? నయీమ్ అనుచరులతో పోలీస్‌లు కుమ్మక్కు అయయ్యారన్న ఆరోపణలపైనే సీపీ తీవ్రమైన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రిటైర్మెంట్కు చేరువలో ఉన్న డీసీపీ రామచంద్రారెడ్డి జిల్లాలో విధుల్లో చేరిన నాటినుంచి రియల్ఎస్టేట్ సెటిల్మెంట్లు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తనకింది ఉద్యోగులు కొందరితో కలిసి ఇటీవల నయీమ్ అనుచరులకు భూ సెటిల్మెంట్లకు సహకరిస్తున్నాడన్న ఫిర్యాదులు అందాయి. భువనగిరి శివారులోగల సర్వేనంబర్ 730లో ఎ5.20గుంటల భూమి అక్రమంగా ఇటీవల నయిమ్ అనుచరులు పాశం శ్రీను, అబ్దుల్ నాసర్‌లు కలిసి భువనగిరి, బీబీనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నయీమ్‌కు సంబంధించిన బినామీ ఆస్తులను రిజిస్ట్రేషన్‌కు సిద్ధం చేసినట్లు సమాచారం. దీంతో బాధితులు సీపీని కలిసి తమను పోలీస్‌లు పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదు చేయడంతో ఆయన సిట్ విచారణకు ఆదేశించారు. దీంతో శనివారం సిట్ అధికారులు భువనగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. హార్డ్‌డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు జిల్లా రిజిస్ట్రార్‌తోపాటు సబ్ రిజిస్ట్రార్లను విచారించారు. పాశం శ్రీను, అబ్దుల్నాసర్లతోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. -
అందేంత దూరంలోనే ‘వంద’
సాక్షి, హైదరాబాద్: దారిన వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే మనకెందుకులే అని వెళ్లిపోయే రోజులు పోయాయి. ఫోన్ చేసినా పోలీసులు స్పందిస్తారో లేదో అనే సందేహం గతంలో ఉండేది. కానీ టెక్నాలజీతో కూడిన పోలీసింగ్ రావడంతో క్షణాల్లో స్పందించడం, ఆ మేరకు కావాల్సిన సర్వీస్ వేగవంతం కావడం ఇప్పుడు ప్రజల్లో ఎనలేని నమ్మకాన్ని పెంచింది. ఒకప్పుడు డయల్ 100కు ఫోన్ చేయాలంటే బాధితులే సందిగ్ధం వ్యక్తం చేసేవారు. కానీ ఇప్పుడు థర్డ్ పార్టీ వ్యక్తులు కూడా డయల్ 100కు ఫోన్ చేసి ఘటనలపై సమాచారం అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఉన్న వారిని రక్షించడం నుంచి ప్రాపర్టీ నేరాల వరకు అన్నింటిపై క్షణాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. అటు పోలీస్ శాఖ నుంచి కూడా నిమిషాల్లోనే సేవలు అందుతుండటం డయల్ 100ను మరింత విస్తృతం చేసేందుకు ఉపయోగపడుతోంది. కేవలం 8నిమిషాల్లోనే... రాష్ట్రవ్యాప్తంగా డయల్ 100కు ఒక ఘటనపై ఫోన్ రాగానే పోలీసులు సంబంధిత స్థలానికి కేవలం 8నిమిషాల్లో చేరిపోతుండటం పోలీస్ శాఖను ప్రజలకు మరింత దగ్గర చేసిందనే చెప్పాలి. అత్యాధునిక పెట్రోలింగ్ వాహనాలు, అనేక విప్లవాత్మక యాప్స్ అందుబాటులోకి రావడంతో ఇది సులభమైంది. డయల్ 100కు వచ్చిన కాల్ మానిటరింగ్ చేయడంతో పాటు దగ్గర్లో ఉన్న పెట్రోలింగ్ వాహనం ఘటన స్థలికి వెళ్తుందా? లేదా అన్నది కూడా గమనించే వ్యవస్థ పోలీసులను నిమిషాల్లో బాధితుల దగ్గరకు వెళ్లేలా చేస్తోంది. ఇలా రాష్ట్రంలో గడిచిన ఏడాదిలో 8.5 లక్షల మంది డయల్ 100 ద్వారా పోలీస్ సేవలను వినియోగించుకున్నారు. రోడ్డు ప్రమాదాలు, పబ్లిక్ న్యూసెన్స్, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలు, మహిళలపై వేధింపులు, ఇతర నేరాలు, ప్రాపర్టీ నేరాలు, ఆత్మహత్యలు ఇలా మొత్తంగా 8.5లక్షల ఘటనలపై డయల్ 100కు ఫోన్ రావడం, పోలీసులు స్పందించడం జరిగింది. మహిళలపై వేధింపులే ఎక్కువ 2018 జనవరి నుంచి డిసెంబర్ చివరివరకు డయల్ 100కు రోడ్డు ప్రమాదాలపై 1.4లక్షల కాల్స్ వచ్చాయి. అదేవిధంగా పబ్లిక్ న్యూసెన్స్ కింద 346, గాయపరిచిన కేసుల్లో 1.8లక్షలు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై 8,936, సాధారణ న్యూసెన్స్ 1.4లక్షల కాల్స్‌వచ్చినట్టు పోలీస్ శాఖ రికార్డులు స్పష్టం చేశాయి. అదేవిధంగా మçహిళలపై వేధింపులకు సంబంధించినవి 2.1లక్షలు, ప్రాపర్టీ నేరాల్లో 28,402, ఆత్మహత్యలపై 24,611 కాల్స్ వచ్చినట్టు వెల్లడించారు. స్పందించే సమయం తగ్గించేందుకు రాష్ట్రవ్యాప్తంగా డయల్ 100కు కాల్‌రాగానే పోలీసులు ఘటనా స్థలికి 8నిమిషాల్లో చేరుతున్నారు. ఇది పోలీస్ శాఖ సరాసరి సర్వీస్ డెలివరీ, రెస్పాన్స్ సమయం. అయితే ఇందులో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కేవలం 3నిమిషాల్లోనే పోలీస్ సేవలందుతున్నాయి. అదేవిధంగా సైబరాబాద్, రాచకొండలో 5నుంచి 6నిమిషాల్లో స్పందిస్తున్నారు. జిల్లాల్లోని కొన్ని రూరల్ ప్రాంతాల్లో రెస్పాన్స్ సమయం తగ్గించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల రూరల్ ప్రాంతాల్లోని స్టేషన్లకు రెండు బ్లూకోట్స్ పెట్రోలింగ్ బైక్‌లతోపాటు ఒక అత్యాధునిక పెట్రోలింగ్ కారును అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ వాహనాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించనున్నారు. దీని ద్వారా సంబంధిత వాహనాలు ఎక్కడ తిరుగుతున్నాయో జీపీఎస్ టెక్నాలజీ ద్వారా తెలిసిపోతుంది. -
చంపావత్ ప్రశ్నల భవంతి
ఫైనాన్స్ కమిషన్ కేటాయింపులతో కట్టిన భవనాన్ని బహిష్టు కేంద్రంగా మార్చారంటే.. ప్రభుత్వం ఏమైనా అంటుందేమోనన్న భయం కన్నా, నెలసరి వచ్చిన మహిళలు ఎవర్నైనా అంటుకుంటారేమోనన్న భయమే చంపావత్ జిల్లా గ్రామస్తులలో, గ్రామ పంచాయతీల్లో వ్యాపించి ఉందని అనుకోవలసి వస్తోంది! మాధవ్ శింగరాజు ‘ఫైనాన్స్ కమిషన్’ అనే మాట ఎంచేతో భయంగొల్పేలా ఉంటుంది. ఇంతకన్నా పోలీస్ కమిషన్ కొంచెం స్నేహపూర్వకంగా ఉంటుందేమో. ఉంటుందేమో కానీ, భారత రాజ్యాంగంలో పోలీస్ కమిషన్ అనేది లేదు. ఉంటే అది కూడా భయమో, అభయమో గొల్పుతూ ఉండేది ఇప్పటికి.ప్రస్తుతం దేశాన్ని నడిపిస్తున్నది పద్నాల్గవ ఫైనాన్స్ కమిషన్. కమిషన్ ఐదేళ్ల కాలపరిమితిలో ఇంకా రెండేళ్లు మిగిలే ఉన్నాయి. 2020 వరకు. అయినప్పటికీ రెండేళ్ల క్రితమే 2017లో పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ కూడా రెడీ అయిపోయింది. 2020 నుంచి 25 వరకు. ఆ కమిషన్‌కు ఛైర్మన్ ఎన్.కె.సింగ్. పద్నాల్గవ ఫైనాన్స్ కమిషన్ తరఫున వచ్చిన కొంతమంది అధికారులు ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాలో ఫైళ్లు పట్టుకుని తిరుగుతున్నారు! మొదట వాళ్లు ఆ జిల్లాలోని ఘర్చమ్ గ్రామానికి వెళ్లారు. వాళ్లకేదో ఇన్ఫర్మేషన్ అందింది.. పంచాయతీ నిధులతో అక్కడ కొత్తగా కట్టిన ఒక భవంతి లెక్కల్లో అవకతవకలు జరిగాయని. ఆ నిధులు ఫైనాన్స్ కమిషన్ కేటాయించిన నిధులే. పని సక్రమంగానే జరిగింది. అయితే ఆ భవంతిని వినియోగిస్తున్న తీరే సక్రమంగా లేదు! లేకపోవడమే కాదు, పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేదిగా కూడా ఉంది. భవంతి లోపలంతా మహిళలు ఉన్నారు! వాళ్లేమీ డ్రాక్వా మహిళలు, స్వయం సహాయ బృందాల మహిళలు కాదు. రుతుక్రమంలో ఉన్న మహిళలు! కేంద్ర నిధులతో పంచాయతీ కట్టించిన భవనంలో వీళ్లు ఉండడం ఏంటి? ఇది రెండో ప్రశ్న. ఊళ్లో రుతుక్రమంలో ఉన్న మహిళలందర్నీ ఇలా ఊరికి దూరంగా ఉంచడం ఏమిటి? ఇది మూడో ప్రశ్న. మరి మొదటి ప్రశ్న ఏమిటి? రుతుక్రమంలో ఉన్న మహిళను అసలు ఇంటి బయట ఉంచడం ఏమిటి? ప్రశ్నల క్రమం ఎలా ఉన్నా మహిళల్ని ఇలా ఇంటికి దూరంగా , ఊరికి దూరంగా, రాజ్యాంగ హక్కుకు దూరంగా ఉంచడం సక్రమం కాదు. భవన నిర్మాణంలో నిధుల దుర్వినియోగం జరిగిందని గ్రామస్తులు కొందరు జిల్లా మేజిస్ట్రేట్ రణ్‌బీర్ చౌహాన్ దృష్టికి తెచ్చినప్పుడు, ఆ భవనాన్ని ‘బహిష్టు కేంద్రం’లా వినియోగిస్తున్నట్లు బయటపడింది. చౌహాన్ నివ్వెరపోయారు. జిల్లాలో ఇంకా ఎక్కడైనా ఇలాంటి ‘పంచాయతీ నిధుల బహిష్టు కేంద్రాలు’ ఉన్నాయేమో చూడాలని అధికారులను ఆదేశించారు. ఉన్నదీ లేనిదీ ఒకటీ రెండు రోజుల్లో తెలుస్తుంది. అయితే ఉండేందుకే అవకాశం ఉందనిపిస్తోంది.చంపావత్ జిల్లా.. భారత్–నేపాల్ సరిహద్దుల్లో ఉంది. నేపాల్ గ్రామాల్లో ‘నెలసరి పాక’ల (పీరియడ్ హట్స్) ఆచారం ఉంది. రుతుక్రమం వచ్చిన మహిళల్ని ఆ ఐదు రోజులూ వాటిలో ఉంచుతారు. ఆ అనాగరిక ఆచారానికి సరిహద్దుకు ఇవతల ఉన్న మన గ్రామాలు కూడా ప్రభావితం అవుతున్నాయనేందుకు నిదర్శనమే ఇప్పుడు బయట పడిన ఘర్చమ్ గ్రామంలోని బహిష్టు కేంద్రం. ఇటీవలే నేపాల్‌లోని బజురా జిల్లాలోని ఒక గ్రామంలో అంబా బొహారా (35), పన్నెండు, తొమ్మిదేళ్ల వయసు గల ఆమె కొడుకులిద్దరు నిద్రిస్తున్నప్పుడు నెలసరి పాకకు నిప్పంటుకుని ఊపిరి ఆడక ఆ ముగ్గురూ చనిపోయినట్లు వార్తలు వ చ్చాయి. గత నవంబర్‌లో వచ్చిన గజ తుఫాన్లో తమిళనాడులో విజయలక్ష్మి అనే పన్నెండేళ్ల బాలిక నెలసరి పాకలో ఉన్నప్పుడు ఈదురుగాలులకు కొబ్బరి చెట్టు కూలిపడి చనిపోయింది. ఆమె తల్లి గాయపడింది. ఇంకా ఇలాంటి వార్తలు మిగతా రాష్ట్రాల నుంచీ తరచూ వినిపిస్తూనే ఉన్నాయి కనుక ఆడపిల్లల విషయంలో నేపాలైనా, భారత్ అయినా, ఇంకో దేశమైనా ఒకటే అనుకోవాలి. ఇంకొకటి కూడా అనుకోవాలి. ఫైనాన్స్ కమిషన్ కేటాయింపులతో కట్టిన భవనాన్ని బహిష్టు కేంద్రంగా మార్చారంటే.. ప్రభుత్వం ఏమైనా అంటుందేమోనన్న భయం కన్నా, నెలసరి వచ్చిన మహిళలు ఎవర్నైనా అంటుకుంటారేమోనన్న భయమే గ్రామస్తులలో, గ్రామ పంచాయతీల్లో వ్యాపించి ఉందని అనుకోవాలి. చంపావత్ జిల్లా మేజిస్ట్రేట్‌కు ఈ సంగతి తెలిసినప్పుడు మొదట ఆయన అన్నమాట.. ‘ఇదేంటీ!’ అని. రెండో మాట.. ‘అలా ఉంచేశారా, ప్యాడ్స్ ఏమైనా ఇచ్చారా?’ అని. మంచి మాట. అరవై ఏడేళ్లుగా ఫైనాన్స్ కమిషన్ దేశాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య డబ్బు లెక్కలు చూస్తోంది. మహిళా సంక్షేమం అన్నది కమిషన్ పరిధిలోకి రాని విషయమే అయినా, అభివృద్ధిలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించిన విధంగానే, స్త్రీల జీవితాలను దుర్భరం చేసే దురాచారాలను పాటిస్తున్న గ్రామాలకు నిధులను తగ్గిస్తాం అన్న భయం పెట్టొచ్చు. డబ్బు ఇచ్చే కాదు, డబ్బును ఇవ్వకుండా కూడా అభివృద్ధిని సాధించవచ్చు.. స్త్రీ సంక్షేమం కూడా దేశాభివృద్ధిలో ఒక భాగం అనుకుంటే. -
ఎన్ఐఏకు సహాయ నిరాకరణ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసును కుట్రపూరితంగా నిర్వీర్యం చేసిన విశాఖ పోలీసులు... ఇప్పుడు కేసు విచారణ చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ)కు సహాయ నిరాకరణ చేస్తున్నట్టు తెలుస్తోంది. విశాఖ విమానాశ్రయంలో గతేడాది అక్టోబర్ 25న ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం ఘటనమీద దర్యాప్తును హైకోర్టు ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ)కు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఎన్ఐఎ జనవరి 1న ఎఫ్ఐఆర్ను నమోదు చేసి దర్యాప్తు కూడా మొదలుపెట్టింది. ఆ క్రమంలో ఎన్ఐఎ ప్రధాన దర్యాప్తు అధికారి(సీఐఓ) మహ్మద్ సాజిద్ఖాన్తోసహా ఐదుగురు అధికారులు శనివారం విశాఖకు చేరుకుని రంగంలోకి దిగారు. ఎన్ఐఎ అధికారులు ఇలా అడుగుపెట్టగానే విశాఖ పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్హా అర్ధంతరంగా సెలవులోకి వెళ్లడం గమనార్హం. వ్యక్తిగత పనుల పేరిట ఆయన శనివారం నుంచి నాలుగురోజులపాటు లీవులోకి వెళ్లడంతో సీనియర్ ఐపీఎస్ అధికారి రవిశంకర్ అయ్యన్నార్‌కు తాత్కాలిక సీపీ పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ప్రతిష్టాత్మక కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగగానే లడ్హా ఉద్దేశపూర్వకంగా సెలవు పేరిట సహాయ నిరాకరణ చేస్తున్నారన్న వాదనలు స్వయంగా పోలీసువర్గాల నుంచే వినిపిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం సూచనల మేరకే లడ్హా సెలవుపై వెళ్లారని ఆ వర్గాలంటున్నాయి. మొదటినుంచీ లడ్హా తీరు వివాదాస్పదమే వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ఘటన జరిగినప్పటి నుంచి విశాఖ సీపీ లడ్హా తీరు వివాదాస్పదంగానే ఉంది. ఘటన జరిగిన రోజైన గతేడాది అక్టోబర్ 25న ఆయన ఎవరికీ అందుబాటులోకి రాలేదు. అమరావతిలో ఉన్నతాధికారులతో సమావేశానికి వెళ్లినందువల్ల ఆరోజు కాస్త ఇబ్బందైందని చెప్పుకున్న లడ్హా ఆ తర్వాత విచారణ తంతును దగ్గరుండి నడిపించారు. కేసు విచారణకు ప్రత్యేకంగా ఏసీపీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను నియమించినప్పటికీ మొత్తం కథ లడ్హానే నడిపారు. జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీనివాసరావు ఒక్కడికే విచారణను పరిమితం చేసి... అతడి పోలీస్ కస్టడీ ముగియగానే సిట్ విచారణనూ బంద్ చేసేశారు. చివరికి సిట్ కార్యాలయానికి తాళం కూడా వేసేశారు. అయితే కేసు జనవరి 1న ఎన్ఐఎకి బదిలీ అయిన విషయం తెలుసుకుని హడావుడిగా సీపీ లడ్హా జనవరి 2న ప్రెస్‌మీట్ పెట్టి జగన్‌పై జరిగింది హత్యాయత్నమే కాదని, ప్రచారం కోసం శ్రీనివాసరావు గాయం చేశాడని ప్రకటించారు. ఈ ప్రకటనతో లడ్హా తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా ఇప్పుడు ఎన్ఐఎ రంగంలోకి దిగగానే నాలుగురోజులపాటు సెలవు పేరిట సెల్ స్విచాఫ్ చేసి ఎవరికీ అందుబాటులోకి రాకుండా వెళ్లిపోవడం వివాదాస్పదమవుతోంది. మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దంటూ.. ఇదిలా ఉండగా, రంగంలోకి దిగిన ఎన్ఐఎ అధికారులు శనివారం ముందుగా ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించి అక్కడి పోలీసు అధికారులతో మాట్లాడారు. పోలీసులు విచారణ చేపట్టిన క్రమాన్ని అడిగి తెలుసుకునేందుకు యత్నించారు. తర్వాత సిట్ అధికారులతోనూ సమావేశమయ్యారు. అయితే సదరు అధికారులెవ్వరూ ఎన్ఐఎ అధికారులకు ఏమాత్రం సహకరించలేదని తెలుస్తోంది. కనీసం సమాచారం కూడా అందించలేదంటున్నారు. అంతా పోలీస్ కమిషనర్ లడ్హా దగ్గరుండి చూశారు.. ఏదైనా ఉంటే మీరు ఆయనతో మాట్లాడండని ఎయిర్పోర్ట్ స్టేషన్ పోలీసులు, సిట్ వర్గాలు ఎన్ఐఎ అధికారులకు స్పష్టం చేసినట్టు సమాచారం. ‘‘దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి.. మీ దర్యాప్తు మీరు చేసుకోండి... మీకు సహకరించాలని హైకోర్టు ఉత్తర్వుల్లో ఎక్కడా లేదు.. అలాగని రాష్ట్రప్రభుత్వం కూడా ఇప్పటివరకు మాకేమీ ఆదేశాలివ్వలేదు.. ప్రభుత్వాన్ని కాదని సమాచారమిచ్చినా.. సహకరించినా మాకు ఇబ్బంది.. మమ్మల్ని అర్థం చేసుకోండి’’ అంటూ పోలీసులు ఓ దశలో ఎన్ఐఎ అధికారుల్ని వేడుకున్నట్టు తెలుస్తోంది. అలా ఏమీ లేదు.. వాళ్ళడిగిన సమాచారం ఇస్తున్నాం ‘‘ఎన్ఐఎ అధికారులకు మేం సహకరించట్లేదనే వాదనల్లో నిజం లేదు. ఎన్ఐఎ సీఐఓ మహ్మద్ సాజిద్‌ఖాన్ నన్ను కలిశారు. కావాల్సిన సమాచారం అడిగారు. నా పరిధిలో నేను చెప్పాల్సింది చెప్పాను..’’ అని కేసు విచారణపై రాష్ట్రప్రభుత్వం నియమించిన సిట్ అధికారి ఏసీపీ నాగేశ్వరరావు సాక్షి ప్రతినిధితో అన్నారు. కాగా ఇప్పటివరకు ఎన్ఐఎ బృందం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన దాఖలాల్లేవని విశాఖ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ప్రకాష్‌రెడ్డి చెప్పారు. – సిట్ అధికారి ఏసీపీ నాగేశ్వరరావు దర్యాప్తు మొదలుపెట్టాం.. అప్పుడే ఏమీ చెప్పలేం ‘‘దర్యాప్తు ఇవాళే మొదలుపెట్టాం... విచారణ ప్రాథమిక దశలో ఉంది.. అప్పుడే ఏమీ చెప్పలేం...’’ అని ఎన్ఐఎ ప్రధాన దర్యాప్తు అధికారి(సీఐఓ) మహ్మద్ సాజిద్‌ఖాన్ శనివారం రాత్రి సాక్షి ప్రతినిధితో అన్నారు. రాష్ట్ర పోలీసులు సహకరిస్తున్నారా? అనే ప్రశ్నకు.. నో కామెంట్ అని ఆయన సమాధానమిచ్చారు. – ఎన్ఐఎ సీఐఓ మహ్మద్ సాజిద్‌ఖాన్ -
ఏటీఎంనే ఏమార్చారు!
సాక్షి, హైదరాబాద్: చిన్న టెక్నిక్‌తో ఏటీఎంలనే ఏమార్చారు. సాంకేతిక సమస్య సృష్టిస్తూ డబ్బులు దోచుకున్నారు. విత్‌డ్రా చేసుకున్నా.. డబ్బులురానట్లు చూపేలా ఏటీఎంలో మార్పులు చేశారు. ఈ వ్యవహారం మొత్తం 4 సెకన్లతో పూర్తి చేశారు. పైగా బ్యాంకులకు ఫిర్యాదు చేసి మళ్లీ ఆ మొత్తాన్ని తిరిగి పొందారు. ఇదీ హరియాణా–రాజస్తాన్ సరిహద్దుల్లోని మేవాట్ రీజియన్‌కు చెందిన ముఠా నిర్వాకం.. ఈ టెక్నిక్‌తో భారీ మొత్తంలో డబ్బు దోచేయాలని స్కెచ్ వేసి హైదరాబాద్ వచ్చిన ఈ గ్యాంగ్.. సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు చిక్కింది. వీరి నుంచి పలు బ్యాంకులకు చెందిన 31 డెబిట్ కార్డులు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్‌తో కలసి సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. మేవాట్ రీజియన్‌కు చెందిన అఖ్లక్ అహ్మద్ (ఐటీఐ ఫిట్టర్ విద్యార్థి), ముంథీజ్ (ఐటీఐ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ విద్యార్థి), తౌఫీఖ్ (పళ్ల వ్యాపారి), తస్లీమ్ (ఐటీఐ ఎలక్ట్రీషియన్ విద్యార్థి), షాకీర్ మహ్మద్ (రైతు) ఓ ముఠాగా ఏర్పాడ్డారు. వీరు ఏటీఎం మెషీన్‌ను ఏమార్చే విధానం గుర్తించారు. పరిచయస్తులు, స్నేహితుల ఏటీఎం కార్డులు తీసుకున్నారు. నాలుగు రోజుల కింద హైదరాబాద్ చేరుకున్న ఈ ఐదుగురు రెండు బృందాలుగా ఏర్పడ్డారు. అత్యంత తెలివిగా.. సెక్యూరిటీ గార్డుల్లేని, పాత ఏటీఎం మెషీన్లను గుర్తించేవారు. తమ వద్ద ఉన్న ఏటీఎం కార్డుతో లావాదేవీ మొత్తం పూర్తి చేసేవారు. డబ్బులు వచ్చాక లావాదేవీ పూర్తయ్యేందుకు నాలుగైదు సెకన్ల సమయం ఉంటుంది. ఆ తర్వాతే లావాదేవీ పూర్తయినట్లు స్క్రీన్‌పై కనిపించడంతో పాటు మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ సమయాన్నే ఈ ముఠా తమకు అనుకూలంగా మార్చుకుంది. ఓ వ్యక్తి ఏటీఎం మెషీన్‌కు ఉన్న కెమెరాకు చేయి అడ్డుపెట్టేవాడు. మరో వ్యక్తి ఆ మెషీన్లో సాంకేతిక సమస్య సృష్టించేవాడు. దీంతో ఏటీఎం నుంచి డబ్బు బయటకొచ్చినా అందులో మాత్రం లావాదేవీ ఫెయిల్ అయినట్లు నమోదయ్యేది. ఇదే విషయాన్ని పేర్కొంటూ స్లిప్ ప్రింట్ వచ్చేది. దీన్ని వాట్సాప్ ద్వారా అసలు కార్డు వినియోగదారుడికి పంపేవాళ్లు. ఈ విషయం బ్యాంకుకు ఫిర్యాదు చేసి తిరిగి ఖాతాలో పడేలా చర్యలు తీసుకోవాలని కోరేవారు. దీంతో బ్యాంకు నుంచి ఆ మొత్తం వారి ఖాతాల్లోకి వెళ్లిపోవడంతో తిరిగి ఇవ్వాల్సినపనీ ఉండేది కాదు. పక్కా ప్రణాళికతో.. ఈ గ్యాంగ్ బ్యాంకు హోం బ్రాంచ్‌కు చెందిన ఏటీఎం కేంద్రాలకు వీరు వెళ్లేవారు కాదు. మరో బ్యాంకు ఏటీఎం నుంచి నగదు తీసుకుంటూ ఈ టెక్నిక్ వాడేవారు. హైదరాబాద్‌ను టార్గెట్‌గా చేసుకున్న ఈ గ్యాంగ్ 31 కార్డులతో రంగంలోకి దిగింది. ఈ కార్డులు ఇచ్చిన హరియాణా, రాజస్తాన్‌కు చెందిన వారంతా చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారే. దీంతో వారికి జీతాలు వచ్చినప్పుడే ఖాతాల్లో డబ్బు ఉంటుంది. ఆ సమయంలోనే ఈ టెక్నిక్‌తో డ్రా చేసుకునే వారు. రాజధానిలోని 7 ప్రాంతాల్లో రూ.లక్ష వరకు విత్‌డ్రా చేశారు. ఈ అనుభవంతో వచ్చే నెలలో భారీ మొత్తం కాజే యాలని స్కెచ్ వేశారు. ఈలోపు వీరి కదలికలపై సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, కేఎన్ ప్రసాద్‌వర్మ, మహ్మద్ తఖీయుద్దీన్, వి.నరేంద్ర తమ బృందాలతో దాడి చేసి ఐదుగురినీ పట్టుకున్నారు. కాగా, ఏటీఎం మెషీన్‌కు సృష్టించిన సాంకేతిక సమస్యను పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. కొన్ని ఏటీఎం మెషీన్లకు ఉన్న ఈ లోపంపై బ్యాంకులకు లేఖ రాసి, లోపాన్ని సరిచేయనున్నారు. -
వరంగల్: సీసీ కెమెరాలే ఇక మా పెద్ద దిక్కు..
సాక్షి, వరంగల్: ఎన్నికల ఘట్టానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. దీంతో అభ్యర్థులు ఒంటికాలుమీద నిల్చుని ప్రచారం కొనసాగిస్తున్నారనడంలో సందేహం లేదు. తమ గెలుపు కోసం ఏ ఒక్క అవకాశం వదులుకోవడం లేదు. ఎలాగైన గెలవాలనేది అన్ని పార్టీల అభ్యర్థుల ఏకైక లక్ష్యం. దీని కోసం కొత్త దారులను అన్వేషిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మద్యం.. డబ్బులను ఆశగా చూపుతున్నారు. దీంతో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరూ ఎప్పుడు పార్టీ మారుతారో తెలియని అయోమయ పరిస్థితుల్లో అభ్యర్థులు ఉన్నారు. పొద్దంత ప్రచారం..రాత్రంత పంపిణీ అనే విధంగా ఎన్నికలు ముందుకు సాగుతున్నాయి. ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టే డబ్బులు, మద్యం ను అదుపు చేసేందుకు ఎలక్షన్ కమిషన్ అధికారులతో పాటు పోలీసులు పలు విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రస్తుతం పోలీసు అధికారులకు పెద్ద దిక్కుగా మారాయి. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఉండడం వల్ల ఏం జరిగినా క్షణాల్లో పోలీసులకు సమాచారం అందుతోంది. దీనికి తోడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై అడుగడుగునా ఎలక్షన్ కమిషన్ నిఘా పెట్టింది. నిబంధనలను అతిక్రమించిన వివిధ పార్టీల నేతలపై ఎక్కడికక్కడే కేసులు నమోదు చేస్తుంది. ఇప్పటికే అధికారులు ప్రతి నియోజకవర్గంలో రెండు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను జల్లెడ పడుతున్నారు. దీంతో లెక్క చూపని డబ్బు పెద్ద మొత్తంలో దొరుకుతుంది. 51 కేసులు నమోదు.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో 51 కేసులు నమోదు అయ్యాయి. ఎన్నికల నియమాళిని ఉల్లంఘించిన వ్యక్తులు, నేతలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. మాడల్ కోడ్ ఆఫ్ కండక్డ్ (ఎంసీసీ) కింది ఎన్నికల పర్యవేక్షకులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం రాజకీయ పార్టీల ప్రచారం, వారి కార్యకలపాలపై నిఘా పెట్టి ఉంచారు. ఎక్కడ నిబంధనల ఉల్లంఘన జరిగిన స్థానిక పోలీసు స్టేషన్ల్లో కేసులు నమోదు చేయిస్తున్నారు. కమిషనరేట్‌లోని సెంట్రల్ జోన్ పరిధిలో 27 కేసులు, వెస్ట్ జోన్ పరిధిలో 14 కేసులు, ఈస్ట్ జోన్ పరిధిలో 10 కేసులు నమోదు చేశారు. 2014లో జరిగిన ఎన్నికలలో కమిషనరేట్ పరిధిలో 133 కేసులు నమోదు చేశారు. వీటిలో 246 మందిపై చర్యలు తీసుకున్నారు. నిఘా నేత్రాలు.. కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రస్తుతం అధికారులకు వజ్రాయుధంగా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైన గొడవలు జరిగితే సీసీ కెమెరాల అధారంగా పరిశీలించి కేసులు నమోదు చేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 21091 కెమెరాలు ఉన్నాయి. ఇందులో మెజారిటీ సీసీ కెమెరాలను స్థానిక పోలీసు స్టేషన్లకు విరివిగా అనుసంధానం చేశారు. వినూత్న పద్ధతుల్లో.. ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు ఓటుకు నోటు అనే విధంగా ముందుగు సాగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ప్రతి 100 మంది ఓటర్లకు ఒక నాయకుడిని ఎంపిక చేసుకున్నారు. డబ్బుల పంపిణీ, ఎన్నికల తేదీ వరకు వారి బాగోగులు చూసే బాధ్యతను ఆ నాయకుడికి అప్పగించారు. ప్రచార సమయంలో ప్రచారం ముగిసిన తర్వా త అందరినీ ఒక దగ్గరకు చేర్చి రూ.150 చొప్పున అందజేస్తున్నారు. దీంతో పాటు మగవారికి అదనంగా బీరు, బిర్యానీ అందజేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులను పంపిణీ చేసేందుకు 20 రోజుల క్రితమే సిద్ధం చేసి ఉంచారు. -
నేర రహిత పోలీస్ కమిషనరేట్ లక్ష్యం
సాక్షి, కాజీపేట అర్బన్: వరంగల్ కమిషనరేట్‌ను నేర రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్ తెలిపారు. హన్మకొండ డివిజనల్ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం కాజీపేట మండలంలోని న్యూశాయంపేటలో 150 మంది సిబ్బందితో కార్డన్ సర్చ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన సీపీ రవీందర్ న్యూ శాయంపేట ప్రజలతో మాట్లాడి పోలీసుల పనితీరుపై ఆరా తీశారు. తొలుత న్యూశాయంపేటలోని రౌడీషీటర్లు, పాత నేరస్తులు, అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సీపీ రవీందర్ మాట్లాడారు. శాంతి భద్రతల పరీరక్షణలో ప్రజలకు భరోసా అందించేందుకు కార్డన్ సర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. నేరాల నివారణకు పోలీసుల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్డన్ సర్చ్‌లో నేరస్తులను గుర్తించి పీడీ యాక్ట్‌లు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 45 మంది నేరస్తులపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలకు ప్రశాంతమైన జీవనాన్ని, పూర్తి భద్రత కలిగించేందుకు 24 గంటల పెట్రోలింగ్, నిరంతర నిఘాకు గస్తీ వాహానాలు, బ్లూకోట్స్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫేస్ రికగ్నైజింగ్ సాఫ్ట్‌వేర్‌తో నేరస్తులను ఫింగర్ స్కానర్ సాయంతో గుర్తించడం జరుగుతుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్డన్ సర్చ్‌లో సెంట్రల్ జోన్ డీసీపీ వెంకట్‌రెడ్డి, హన్మకొండ ఏసీపీ చంద్రయ్య, ఇన్స్పెక్టర్ సదయ్య, సంపత్‌రావు, రాఘవేందర్, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రశాంత ఎన్నికలకు ప్రత్యేక కార్యాచరణ
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుసాగుతున్నట్లు వరంగల్ కార్యాచరణతో ముందు పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నామని.. ఓటరు ప్రలోభాలకు గురికాకుండా నిఘా పెట్టినట్లు వివరించారు. రూ.50 వేల వరకు జేబులో పెట్టుకుని ప్రయాణించవచ్చని.. అయితే బడా వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు తమ అవసరాలకు ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్, ఆర్టీజీఎస్, నెఫ్ట్ వంటి సౌకర్యాలను వినియోగించుకోవాలని ‘సాక్షి’ ఇంటర్వూ్యలో సూచించారు. సాక్షి: ఎన్నికల నేపథ్యంలో పౌరుల వద్ద ఎంత డబ్బు ఉండవచ్చు? సీపీ : తనిఖీలు, సోదాల నేపథ్యంలో పోలీసులకు రూ.50 వేలు నగదు నగదు లభిస్తే ఎలాంటి అభ్యంతరం చెప్పరు. రూ.లక్ష వరకు అయితే తాజాగా లావాదేవీలు జరిగినట్లు బ్యాంకు రశీదులు గానీ.. ఏటీఎం రశీదులు గానీ చూపిస్తే ఇబ్బంది ఉండదు. అంతకుమించి కనిపిస్తే ఆ మొత్తానికి లెక్కలు అడుగుతారు. అవి చూపించలేని సందర్భంలో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం ఆదాయపు పన్ను శాఖకు (ఐటీ) అప్పగిస్తాం. అనుమానాస్పద స్థితిలో ఎవరి వద్దనైనా రూ.లక్ష లోపు లభించినా స్వాధీనం చేసుకుంటాం. ఆ డబ్బుకు, ఎన్నికలకు లింక్ ఉందని తేలితే కేసు కూడా నమోదు చేస్తాం. కేంద్ర బనా వచ్చాయా? మనకు ఎంత అలగాలు ఏమైవవసరం? సీపీ : ఎన్ని కంపెనీల బలగాలు అవసరం.. ఎక్కడెక్కడ మొహరిస్తాం అనే అంశాలను నేరుగా మీడియాకు చెప్పలేం. ఆ వివరాలను ఎన్నికల కమిషనే మీకు వివరిస్తుంది. ప్రస్తుతం అయితే ఒక అడ్వాన్స్డ్ కంపెనీ మాత్రం వచ్చింది. ఎన్నికలు సజావుగా జరుగుతాయని ప్రజల్లో మనోధైర్యాన్ని పెంచేందుకు ఈ బలగాలు తోడ్పడుతాయి. బలగాలను గస్తీ తిప్పడం, సమస్యాత్మక ప్రాంతాల్లో కవాతు చేయించడం, కూడళ్లలో మొహరించడం తదితర బాధ్యతలు అప్పగిస్తాం. నగదు తప్పనిసరి అయితే ఎలా? సీపీ : రూ.10 లక్షలకు మించి తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో బ్యాంకు అధికారులకు విషయం చెప్పి.. వారి నుంచి ధ్రువీకరణ తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు స్టేట్మెంట్, డ్రా చేయడానికి ఉపకరించిన పత్రాలను వెంట ఉంచుకోవాలి. కొద్ది రోజుల ముందే డ్రా చేసిన డబ్బును ఇప్పుడు తీసుకువెళ్తుంటే బ్యాంక్ పాస్‌బుక్, స్టేట్మెంట్ వెంట ఉంచుకోవాలి. వ్యాపారులైతే డబ్బు వసూళ్లు , చెల్లింపులు తదితర లావాదేవీలకు సంబంధించిన అధీకృత రశీదులు వెంట ఉంచుకోవాలి. అవకాశం ఉన్న వారు ఆన్లైన్ ట్రాన్స్ఫర్, ఆర్టీజీఎస్, నెఫ్ట్ వంటి సౌలభ్యాలను ఉపయోగించుకోవడం మంచిదే. ఎన్నికల కోసం ఏమైనా ప్రత్యేక కార్యాచరణ ఉందా? సీపీ : కచ్చితంగా ఉంటుంది. ఎనిమిది నియోజకవర్గాల్లో పూర్తిగాను, 5 నియోజకవర్గాల్లో పాక్షికంగాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. ప్రతి నియోజకవర్గంలో మూడు చొప్పున చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. ఇవికాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. డబ్బు, మద్యం, చీరలు, క్రికెట్ కిట్ ఇలా ఎన్నికల సరళని ప్రభావితం చేసే ప్రతి అక్రమ కార్యకలాపాలపై గట్టి నిఘా పెట్టాం. అదే సమయంలో ప్రతి చిన్న విషయంలో సాధారణ పౌరులు ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడుతున్నాం. మొత్తం 1,150 ప్రాంతాల్లో 2,235 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇందులో 250 ప్రాంతాలు సమస్యాత్మకంగా గుర్తించాం. అక్కడ అవసరమైనంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు ఉండేలా జాగ్రత్త పడుతున్నాం. ఇప్పటివరకు 2,290 మంది సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేశాం. ఈ ప్రక్రియ నడుస్తోంది. నాన్‌బెయిలబుల్ వారంట్ ఉన్న 100 మంది వ్యక్తులను గుర్తించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాం. పాత నేరస్తుల కదలిక మీద ఓ కన్నేసి ఉంచాం. అల్లర్లు సృష్టించేందుకు అవకాశం ఉన్న వాళ్ల మీద నిఘా పెట్టాం. ఎన్నికల సరళికి విఘాతం కల్పించే వాళ్ల మీద ఉక్కుపాదం మోపుతాం. కమిషనరేట్ పరిధిలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయా? వాళ్లతో అభ్యర్థులకు ఏమైనా ముప్పు పొంచి ఉందా? సీపీ : ఇప్పటివరకైతే కమిషనరేట్ పరిధిలో మావోయిస్టుల కదలికలు లేవు. అయితే అదును చూసుకుని దాడులకు పాల్పడే యాక్షన్ టీంల సంచారాన్ని తేలికగా కొట్టిపారేయలేం. ఇటువంటి దళాల జాడలను ఎప్పటికప్పుడు గుర్తించి, ప్రతి దాడులు చేసేందుకు కౌంటర్ యాక్షన్ దళాలను సిద్ధంగా ఉంచాం. అభ్యర్థులు రోజువారి షెడ్యూల్‌ను ముందుగానే సంబంధిత పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇస్తే.. ఆయా అభ్యర్థుల పర్యటన, ప్రచారం కోసం అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తాం. -
సిట్‌కు దూరంగా వైజాగ్ పోలీస్ కమిషనర్
-
పోలీసుశాఖలో జోరుగా ఎన్నికల బదిలీలు
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల బదిలీలు జోరందుకున్నాయి. వీటి ప్రభావం రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో భారీగానే ఉంది. గడిచిన మూడు రోజుల్లో జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం పలువురు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైల బదిలీలు, పదోన్నతులు చోటు చేసుకున్నాయి. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నతాధికారులు వీటిని చేపడుతున్నారు. ఈ అంతర్ కమిషనరేట్ బదిలీలకు అనుబంధంగా కొన్ని అంతర్గత బదిలీలు చేయాల్సి ఉండటంతో ఆయా కమిషనర్లు కసరత్తు ముమ్మరం చేశారు. ఒకటిరెండు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. ♦ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 16 డీఎస్పీ (ఏసీపీ) బదిలీల్లో మూడు కమిషనరేట్లకు చెందిన పోస్టులు ఐదు ఉన్నాయి. ఇక్కడి వారు ఇద్దరు బయటకు వెళ్తుండగా... బయట నుంచి ఇద్దరు వస్తున్నారు. ఓ అధికారి మాత్రం సైబరాబాద్ నుంచి రాచకొండకు మారుతున్నారు. ♦ మలక్‌పేట ఏసీపీ కె.నర్సింగ్‌రావు కాగజ్‌నగర్‌కు వెళ్తుండగా నిజామాబాద్ ఏసీపీ ఎం.సుదర్శన్ మలక్‌పేటకు వస్తున్నారు. ట్రాన్స్‌కోలో ఉన్న ఎం.చంద్రశేఖర్ కూకట్పల్లి ట్రాఫిక్‌కు, సైబరాబాద్‌లో ఉన్న పి.శ్రీనివాసులు ఎల్బీనగర్ ట్రాఫిక్‌కు బదిలీ అయ్యారు. నగరంలో ఉన్న ఎస్.మహేశ్వర్ దేవరకొండ డీఎస్పీగా వెళ్తున్నారు. భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీ రాజధానిలోని మూడు కమిషనరేట్లలో భారీగా ఇన్స్పెక్టర్ల ‘మార్పిడి’ జరిగింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో పని చేస్తూ ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువు ముగిసిన అధికారుల్ని ఆయా కమిషనరేట్ల నుంచి బయటకు పంపించారు. కొత్తగా మరికొందరికి అక్కడకు బదిలీ చేశారు. ఈ మేరకు వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా బదిలీ అయిన వారిలో అనేక మంది స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్హెచ్ఓ) సైతం ఉన్నారు. ఆయా కమిషనరేట్లకు వచ్చిన వారికి పోస్టింగ్స్ ఇవ్వాల్సి ఉంది. దీంతో అధికారులు అందుకు సంబంధించిన కసరత్తులు ప్రారంభించారు. జోన్ పరిథిలో మొత్తం 82 మంది బదిలీలు జరిగాయి. ఈ నేపథ్యంలో సిటీ నుంచి 17 మంది బయటకు వెళ్తుండగా కొత్తగా 42 మంది వస్తున్నారు. అలానే సైబరాబాద్ నుంచి 21 మంది వెళ్తుండగా 20 మంది వస్తున్నారు. రాచకొండలో ఈ సంఖ్యలు 9, 3గా ఉన్నాయి. ఇటీవల పలువురు 1995 బ్యాచ్ ఇన్స్పెక్టర్లకు ఏసీపీలు పదోన్నతులు వచ్చాయి. దీనికి కొనసాగింపుగా 2009 బ్యాచ్‌కు చెందిన 53 మంది సబ్–ఇన్స్పెక్టర్లకు (ఎస్సై) ఇన్స్పెక్టర్లుగా పదోన్నతులు ఇచ్చారు. వీరిలో సిటీకి చెందిన వారు 21 మంది, సైబరాబాద్‌కు చెందిన వారు తొమ్మిది మంది, రాచకొండకు చెందిన వారు ఆరుగురు ఉన్నారు. వీరికీ త్వరలో పోస్టింగ్స్ ఇవ్వనున్నారు. ఇన్స్పెక్టర్ల బదిలీల్లో కీలకమైనవి:షాహినాయత్‌గంజ్–ఎం.రవీందర్‌రెడ్డి, సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్–కె.మధుమోహన్‌రెడ్డి, మార్కెట్–ఎం.మట్టయ్య, కార్ఖానా–బి.జానయ్య, ఫలక్‌నుమ–పి.యాదగిరి, శాలిబండ–ఎన్.లింగయ్య, కంచన్‌బాగ్–ఎన్.శంకర్, గాంధీనగర్–ఆర్.శ్రీనివాస్, మాదన్నపేట్–డి.నగేష్, లంగర్‌హౌస్–సి.అంజయ్య, సుల్తాన్‌బజార్–పి.శివశంకర్‌రావు, చందానగర్–ఎన్.తిరుపతిరావు, బాచుపల్లి–కె.బాలకృష్ణారెడ్డి, మేడ్చెల్–ఎస్.వెంకట్‌రెడ్డి, శామీర్‌పేట్– డి.భాస్కర్‌రెడ్డి, అల్వాల్–వి.శ్రీకాంత్‌గౌడ్, మాదాపూర్–ఎన్.కళింగ్రావు, మియాపూర్–సీహెచ్ హరిచంద్రారెడ్డి, జీడిమెట్ల సీహెచ్ శంకర్‌రెడ్డి, బాలానగర్ ఎస్ఓటీ–పి.శంకర్‌యాదవ్. ♦ వీరితో పాటు అనేక మంది ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సైతం ఉన్నారు. ఈ స్థానాల్లో కొత్త అధికారుల్ని నియమించాల్సి ఉంది. పదోన్నతి పొందిన ఎస్సైలు: ♦ సిటీలో పని చేస్తున్న జి.వెంకట్‌రెడ్డి, డి.కృష్ణమోహన్, బి.జగదీశ్వర్‌రావు, జి.జగన్నాథ్, జి.రాజేందర్‌గౌడ్, ఎం.మహేందర్‌రెడ్డి, కె.రవీందర్, కె.సత్యనారాయణ, కె.కృష్ణప్రసాద్, కె.శ్రీనివాస్‌రావు, ఎస్.రామన్, డి.ప్రశాంత్, బి.వెంకటేశం, మహ్మద్ షకీర్ అలీ, జి.వెంటకరామిరెడ్డి, ఎస్.రవికుమార్, జె.నిరంజన్‌రావు, జి.వీరాస్వామి, ఎన్.సురేష్, పీవీఆర్ ప్రసాదరావు, ఎస్.హరికృష్ణ గౌడ్. ♦ సైబరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్.వెంకన్న, కె.చంద్రశేఖర్‌రెడ్డి, కె.నాగయ్య, ఎన్.శ్రీధర్‌రెడ్డి, శివకుమార్, ఎం.వెంకటేశం, ఎం.వేణుకుమార్, సి.గంగాధర్. ♦ రాచకొండకు చెందిన బి.నర్సయ్య, పి.రాజశేఖర్, హెచ్.ప్రభాకర్, ఎస్.సుధీర్‌కృష్ణ, జి.నాగరాజు, ఎస్.లక్ష్మణ్. -
నిజాం మ్యూజియంలో భారీ చోరీ సీసీటీవీ ఫుటేజ్
-
మ్యూజియంలో దొంగలు పడ్డారు..
హైదరాబాద్: హైదరాబాద్‌లోని హిజ్ ఎక్సాల్టెడ్ హైనెస్(హెచ్‌ఈహెచ్) నిజాం మ్యూజియంలో ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు. అత్యంత విలువైన డైమండ్, బంగారు, వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పురానీహవేలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యూజియంలోని మూడు గ్యాలరీల్లో నిజాం పాలకులు వాడిన డైమండ్, బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులున్నాయి. ప్రతిరోజు మాదిరిగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు మ్యూజియాన్ని సిబ్బంది మూసివేశారు. రాత్రి విధి నిర్వహణలో ఉన్న ఐదుగురు సెక్యూరిటీ గార్డులు గ్యాలరీలకు తాళాలు వేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు మ్యూజియాన్ని తెరిచి చూడగా దొంగతనం వెలుగు చూసింది. రెండో గ్యాలరీలో ఉన్న డైమండ్ టిఫిన్ బాక్స్, బంగారు టీ కప్పు, సాసర్, స్పూన్లు కనిపించలేదు. ఈ విషయంపై మ్యూజియం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ షౌకత్ హుస్సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మ్యూజియం వెనుకాల ఉన్న వెంటిలేటర్లను విరగ్గొట్టి లోనికి వచ్చిన దొంగలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లు మ్యూజియాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలను సేకరించాయి. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. మ్యూజియాన్ని సోమవారం మధ్యాహ్నం నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సందర్శించారు. చోరీ జరిగిన తీరుపై సిబ్బందిని ఆరా తీశారు. మ్యూజియానికి సంబంధించి తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై పోలీసులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తును ముమ్మరం చేయాలని ఆదేశించారు. విలువైన డైమండ్, బంగారు, వెండి వస్తువులు... ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1911లో రాజ్యాధికారం చేపట్టాడు. 1936లో తన పాతికేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహించేందుకు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. ఈ రజతోత్సవాలకు దేశ, విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు హాజరై బహుమతులు అందజేశారు. నిజాం కోరిక మేరకు ప్రజల సందర్శనార్థం వీటితో మ్యూజియం ఏర్పాటు చేశారు. నిజాం పరిపాలనలో ఉపయోగించిన అనేక వస్తువులు ఈ మ్యూజియంలో కొలువుదీరాయి. అప్పటి నిజాం నవాబ్ పురానీహవేలీలో నిర్మించుకున్న మెుదటి రాజమహాల్లాలో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో ఆరు, ఏడో నిజాం నవాబుల వరకు వాడిన వస్తువులను సందర్శనార్థం ఉంచారు. -
ట్రాఫిక్ కమాండ్ & కంట్రోల్
సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖ సాంకేతికమయం అవుతోంది. టెక్నాలజీ సహాయంతో నేరాలను నిరోధించడానికి, కేసుల్ని కొలిక్కి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకరూప పోలీసింగ్ అమలు చేయాలని నిర్ణయించామని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ మాదిరిగా అన్ని జిల్లాలు, పోలీసు కమిషనరేట్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్లను ఆయన బుధవారం ప్రారంభించారు. డీజీపీ మాట్లాడుతూ ‘బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లో నిర్మితమవుతున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) ఆధునిక టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటుంది. ఈ ఏడాది చివరి నాటికి దీని నిర్మాణం పూర్తి చేసి, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, కమిషనరేట్లను అనుసంధానించి సేవలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం’ అని చెప్పారు. ‘హైదరాబాద్ కమిషనరేట్‌లో ఈ టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ ఏర్పాటు చేశాం. తొలుత ఇక్కడ అమలులోకి తీసుకువచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేస్తాం. లోపాలు బయటపడితే వాటిని సరిచేసి ఐసీసీసీ అందుబాటులోకి వచ్చేనాటికి పక్కాగా రూపొందిస్తాం’అని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురైతే వెంటనే అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేయడానికి టెక్నాలజీ దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లు, జిల్లాల్లోని పోలీసులకు శిక్షణ ఇచ్చే బాధ్యతల్ని హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు అప్పగిస్తున్నామని అన్నారు. రాష్ట్రాన్ని శాంతిభద్రతలకు నిలయంగా మార్చి పెట్టుబడులకు కేంద్రాన్ని చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పది లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు. ఈ అంశంలో 1.66 లక్షల కెమెరాలను ఏర్పాటు చేయించిన హైదరాబాద్ కమిషనరేటే మిగిలిన వాటికి ఆదర్శం’అని అన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్చార్జి పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావుతోపాటు మూడు కమిషనరేట్ల అధికారులు పాల్గొన్నారు. -
పోలీసన్నా.. విచక్షణ ఏదన్నా..
సాక్షి, హైదరాబాద్: ‘అడుసు తొక్కనేల.. కాలు కడుగనేల’.. అన్న సామెత పోలీస్ శాఖలోని కొంతమంది అధికారులకు సరిగ్గా సరిపోయేలా ఉంది. నేరాల నియంత్రణ, టెక్నాలజీ వినియోగంలో దేశంలోనే నంబర్ వన్ అనిపించుకున్న రాష్ట్ర పోలీస్ శాఖ.. ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకునేలా కనిపిస్తోంది. ఓ వైపు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ అధికారులు, సిబ్బందిని డీజీపీ మహేందర్‌రెడ్డి నడిపిస్తుంటే.. మరోవైపు బాధితులు, నిందితులతో అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఆ శాఖను కుదిపేస్తోంది. అదనపు డీసీపీ కొట్టడమేంటి? షార్ట్ ఫిలిం డైరెక్టర్, అందులో నటించిన యువతి మధ్య వివాదంలో మాదాపూర్ అదనపు డీసీపీ గంగారెడ్డి వ్యవహరించిన తీరు పోలీస్ శాఖ తలపట్టుకునేలా చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అదనపు డీసీపీ స్థాయి అధికారి తన్నడం, కొట్టడం ఏంటని విమర్శలు వెల్లువెత్తాయి. విషయం మీడియాలో ప్రసారమవ్వడంతో డీజీపీ విచారణకు ఆదేశించారు. గంగారెడ్డిని సైబరాబాద్ ఆర్మ్డ్ హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. ఈ ఇన్స్పెక్టర్ ముందునుంచీ అంతే రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్రావు.. బాధితురాలి ఇంటికెళ్లి వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. భర్త హత్య కేసుకు సంబంధించి దివానులో కూర్చొని బాధితురాలు ఫిర్యాదురాస్తుంటే.. ఆయన దివానుకు కాలు పెట్టి దర్జా ప్రదర్శించారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అతన్ని బదిలీ చేసి కమిషనరేట్‌కు అటాచ్ చేశారు. విచారణకు ఆదేశించారు. గతంలో అబిడ్స్ ఇన్స్పెక్టర్గా పనిచేసినప్పుడూ మహిళా కానిస్టేబుల్‌తో దురుసు ప్రవర్తన వల్ల ఆయన సస్పెండ్ అయ్యారు. నేరేళ్ల ఘటనతో ఇరకాటంలో.. సిరిసిల్లా జిల్లా ‘నేరెళ్ల’ఘటనలో దళితులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వ్యవహారం పోలీస్ శాఖను కుదిపేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రయత్నిస్తుంటే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను అనుభవం లేని అధికారులు చిత్రహింసలకు గురిచేసినట్లు సొంత విభాగం నుంచే విమర్శలొచ్చాయి. ఈ ఘటనలో ఎస్సైపై వేటు వేసినా అధికారుల ప్రవర్తనలో మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మీడియాపై రుసరుస.. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద బందోబస్తులో ఉన్న అప్పటి పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లూ వివాదాస్పదమయ్యారు. ఓ న్యూస్ చానల్ మహిళా రిపోర్టర్‌తో దురుసుగా ప్రవర్తించడంతో జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇటీవల ఉస్మానియా వర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి మృతదేహం తరలింపు çసమయంలో ఓ న్యూస్ చానల్ రిపోర్టర్‌ను సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ, ఓయూ ఇన్స్పెక్టర్ అశోక్ పోలీస్ జీపెక్కించి స్టేషన్‌కు తీసుకెళ్లి 3 గంటలు నిర్బంధించారు. మార్పు రావాల్సిందే.. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికారులు, సిబ్బంది ప్రవర్తనలో మార్పులు తీసుకొచ్చిన డీజీపీ.. అంకితభావ సేవలు, జవాబుదారితనంతో పని చేయాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. వివాదాస్పద ఘటనకు పాల్పడితే ఉపేక్షించేబోనని స్పష్టం చేశారు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునేలా పని చేయాలని, నేరస్థులపై ఉక్కుపాదం మోపుతూనే మరోవైపు ఫ్రెండ్లీగా విధులు నిర్వహించాలని సూచించారు. అయినా కొంతమంది అధికారులు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్న తీరు ఉన్నతాధికారులను ఒత్తిడిలోకి నెడుతున్నట్లు తెలుస్తోంది. -
కాల్ చేస్తే ‘కనిపెట్టేస్తారు’!
సాక్షి, హైదరాబాద్:నగరంలోని అబిడ్స్ ప్రాంతం. ఓ వ్యక్తికి హఠాత్తుగా ఆపద ఎదురైంది. వెంటనే ‘డయల్–100’కు కాల్ చేశాడు. ఆపై తను ఎక్కడ ఉన్నాడో చెప్పే పరిస్థితుల్లో అతడు లేడు. దీంతో బాధితుడు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అక్కడికి చేరుకోవడానికి పోలీసులకు కొంత సమయం పట్టింది. ఇలాంటి పరిస్థితి చాలా సందర్భాల్లో నగర పోలీసులకు ఎదురవుతోంది. దీనికి పరిష్కారంగా నగర పోలీసు విభాగం ‘డయల్–100’వ్యవస్థను ఆధునీకరిస్తోంది. బాధితుడు కాల్ చేసిన వెంటనే అతడు ఉన్న ప్రాంతాన్నీ తక్షణం గుర్తించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న ఈ విధానాన్ని.. మూడు నెలల్లో నగరంలోనూ అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. రెస్పాన్స్ టైమ్ తగ్గించడమే లక్ష్యం.. బాధితుల నుంచి ఫోన్ వచ్చినప్పుడు ఎంత త్వరగా వారి వద్దకు చేరితే అంత ఎక్కువ మేలు జరిగే ఆస్కారం ఉంది. దీన్నే సాంకేతికంగా ‘పోలీసు రెస్పాన్స్ టైమ్’అంటారు. గస్తీ విధానంలో జవాబుదారీతనం పెంచడం, తక్కువ సమయంలో ఘటనాస్థలికి చేరడానికి నగరంలో గస్తీ విధులు నిర్వర్తించే రక్షక్, బ్లూకోల్ట్స్‌కు ‘రెస్పాన్స్ టైమ్’నిర్దేశిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే గస్తీ వాహనాలను ‘డయల్–100’తో అనుసంధానించారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) ఆధారంగా పనిచేసే ఈ విధానం పూర్తిస్థాయిలో ఫలితాలు ఇవ్వాలంటే బాధితులు ఉన్న ప్రాంతాన్ని (లొకేషన్) పక్కాగా తెసుకోవాల్సి. ఇది సాధ్యమైతే రెస్పాన్స్ టైమ్‌ను గణనీయంగా తగ్గించవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ‘100’కాల్స్‌ను డైవర్ట్ చేసినప్పటికీ.. బాధితులు ‘100’కు ఫోన్ చేసి సహాయం కోరిన వెంటనే అక్కడి సిబ్బంది సదరు ఫిర్యాదుదారుడు ఉన్న ప్రాంతాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. గస్తీ వాహనాలకు జీపీఎస్ పరికరాలు అమర్చడంతో ‘100’సిబ్బందికి ఏ వాహనం ఎక్కడ ఉందో కచ్చితంగా తెలుస్తోంది. బాధితునికి సమీప ప్రాంతంలో ఉన్న వాహనానికే నేరుగా ఆ కాల్‌ను డైవర్ట్ చేస్తున్నారు. కాల్ అందుకున్న గస్తీ సిబ్బంది బా«ధితుడిని సమాచారం అడిగి అతను ఉన్న ప్రదేశానికి చేరుకోవడానికి కొంత సమయం పడుతోంది. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర పోలీసులు.. ‘100’కు ఎవరైనా కాల్ చేస్తే వారు కచ్చితంగా ఎక్కడ నుంచి చేశారనేది కంప్యూటర్ తెరపై కనిపించేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఫలితంగా ‘రెస్పాన్స్ టైమ్’గణనీయంగా తగ్గింది. లొకేషన్ తెలుసుకోవడానికి లింకేజీ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న ఓ ప్రైవేట్ సంస్థ అందించింది. నగర పోలీసులు ఆ సంస్థ ప్రతినిధులతో బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లో బుధవారం సమావేశమయ్యారు. బాధితుడి లొకేషన్ తెలుసుకోవడానికి సెల్ సర్వీసు ప్రొవైడర్ల నుంచి లింకేజ్ తీసుకోవాలి. మొత్తం 11 సర్వీస్ ప్రొవైడర్ల నుంచి లింకేజ్‌కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఢిల్లీకి చెందిన సంస్థ అందించనుంది. గరిష్టంగా మూడు నెలల్లో ఈ విధానాన్ని అమలులోకి తీసుకురావడానికి నగర పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఇది అమలైతే బాధితులకు సత్వర సహాయం అందడంతో పాటు బోగస్ కాల్స్‌కు చెక్ పెట్టవచ్చని చెప్తున్నారు.