ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుసాగుతున్నట్లు వరంగల్ కార్యాచరణతో ముందు పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నామని.. ఓటరు ప్రలోభాలకు గురికాకుండా నిఘా పెట్టినట్లు వివరించారు. రూ.50 వేల వరకు జేబులో పెట్టుకుని ప్రయాణించవచ్చని.. అయితే బడా వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు తమ అవసరాలకు ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్, ఆర్టీజీఎస్, నెఫ్ట్ వంటి సౌకర్యాలను వినియోగించుకోవాలని ‘సాక్షి’ ఇంటర్వూ్యలో సూచించారు.
సాక్షి: ఎన్నికల నేపథ్యంలో పౌరుల వద్ద ఎంత డబ్బు ఉండవచ్చు?
సీపీ : తనిఖీలు, సోదాల నేపథ్యంలో పోలీసులకు రూ.50 వేలు నగదు నగదు లభిస్తే ఎలాంటి అభ్యంతరం చెప్పరు. రూ.లక్ష వరకు అయితే తాజాగా లావాదేవీలు జరిగినట్లు బ్యాంకు రశీదులు గానీ.. ఏటీఎం రశీదులు గానీ చూపిస్తే ఇబ్బంది ఉండదు. అంతకుమించి కనిపిస్తే ఆ మొత్తానికి లెక్కలు అడుగుతారు. అవి చూపించలేని సందర్భంలో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం ఆదాయపు పన్ను శాఖకు (ఐటీ) అప్పగిస్తాం. అనుమానాస్పద స్థితిలో ఎవరి వద్దనైనా రూ.లక్ష లోపు లభించినా స్వాధీనం చేసుకుంటాం. ఆ డబ్బుకు, ఎన్నికలకు లింక్ ఉందని తేలితే కేసు కూడా నమోదు చేస్తాం.
కేంద్ర బనా వచ్చాయా? మనకు ఎంత అలగాలు ఏమైవవసరం?
సీపీ : ఎన్ని కంపెనీల బలగాలు అవసరం.. ఎక్కడెక్కడ మొహరిస్తాం అనే అంశాలను నేరుగా మీడియాకు చెప్పలేం. ఆ వివరాలను ఎన్నికల కమిషనే మీకు వివరిస్తుంది. ప్రస్తుతం అయితే ఒక అడ్వాన్స్‌డ్ కంపెనీ మాత్రం వచ్చింది. ఎన్నికలు సజావుగా జరుగుతాయని ప్రజల్లో మనోధైర్యాన్ని పెంచేందుకు ఈ బలగాలు తోడ్పడుతాయి. బలగాలను గస్తీ తిప్పడం, సమస్యాత్మక ప్రాంతాల్లో కవాతు చేయించడం, కూడళ్లలో మొహరించడం తదితర బాధ్యతలు అప్పగిస్తాం.
నగదు తప్పనిసరి అయితే ఎలా?
సీపీ : రూ.10 లక్షలకు మించి తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో బ్యాంకు అధికారులకు విషయం చెప్పి.. వారి నుంచి ధ్రువీకరణ తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు స్టేట్‌మెంట్, డ్రా చేయడానికి ఉపకరించిన పత్రాలను వెంట ఉంచుకోవాలి. కొద్ది రోజుల ముందే డ్రా చేసిన డబ్బును ఇప్పుడు తీసుకువెళ్తుంటే బ్యాంక్ పాస్‌బుక్, స్టేట్‌మెంట్ వెంట ఉంచుకోవాలి. వ్యాపారులైతే డబ్బు వసూళ్లు , చెల్లింపులు తదితర లావాదేవీలకు సంబంధించిన అధీకృత రశీదులు వెంట ఉంచుకోవాలి. అవకాశం ఉన్న వారు ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్, ఆర్టీజీఎస్, నెఫ్ట్ వంటి సౌలభ్యాలను ఉపయోగించుకోవడం మంచిదే.
ఎన్నికల కోసం ఏమైనా ప్రత్యేక కార్యాచరణ ఉందా?
సీపీ : కచ్చితంగా ఉంటుంది. ఎనిమిది నియోజకవర్గాల్లో పూర్తిగాను, 5 నియోజకవర్గాల్లో పాక్షికంగాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. ప్రతి నియోజకవర్గంలో మూడు చొప్పున చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. ఇవికాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. డబ్బు, మద్యం, చీరలు, క్రికెట్ కిట్ ఇలా ఎన్నికల సరళని ప్రభావితం చేసే ప్రతి అక్రమ కార్యకలాపాలపై గట్టి నిఘా పెట్టాం. అదే సమయంలో ప్రతి చిన్న విషయంలో సాధారణ పౌరులు ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడుతున్నాం. మొత్తం 1,150 ప్రాంతాల్లో 2,235 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇందులో 250 ప్రాంతాలు సమస్యాత్మకంగా గుర్తించాం. అక్కడ అవసరమైనంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు ఉండేలా జాగ్రత్త పడుతున్నాం. ఇప్పటివరకు 2,290 మంది సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేశాం. ఈ ప్రక్రియ నడుస్తోంది. నాన్‌బెయిలబుల్ వారంట్ ఉన్న 100 మంది వ్యక్తులను గుర్తించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాం. పాత నేరస్తుల కదలిక మీద ఓ కన్నేసి ఉంచాం. అల్లర్లు సృష్టించేందుకు అవకాశం ఉన్న వాళ్ల మీద నిఘా పెట్టాం. ఎన్నికల సరళికి విఘాతం కల్పించే వాళ్ల మీద ఉక్కుపాదం మోపుతాం.
కమిషనరేట్ పరిధిలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయా? వాళ్లతో అభ్యర్థులకు ఏమైనా ముప్పు పొంచి ఉందా?
సీపీ : ఇప్పటివరకైతే కమిషనరేట్ పరిధిలో మావోయిస్టుల కదలికలు లేవు. అయితే అదును చూసుకుని దాడులకు పాల్పడే యాక్షన్ టీంల సంచారాన్ని తేలికగా కొట్టిపారేయలేం. ఇటువంటి దళాల జాడలను ఎప్పటికప్పుడు గుర్తించి, ప్రతి దాడులు చేసేందుకు కౌంటర్ యాక్షన్ దళాలను సిద్ధంగా ఉంచాం. అభ్యర్థులు రోజువారి షెడ్యూల్‌ను ముందుగానే సంబంధిత పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇస్తే.. ఆయా అభ్యర్థుల పర్యటన, ప్రచారం కోసం అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment