హోంగార్డ్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం | Invite applications to the post of the Home Guard | Sakshi
Sakshi News home page

హోంగార్డ్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Published Sat, Oct 15 2016 12:38 AM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM

హోంగార్డ్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

హోంగార్డ్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో 1,800 హోంగార్డు పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ వెలువడింది. ఒక్కో కమిషనరేట్‌లో 900 చొప్పున ఉన్న పోస్టులకు ఆయా కమిషనరేట్ల పరిధిలో నివసించే స్థానికులు అర్హులని కమిషనర్లు సందీప్ శాండిల్య, మహేశ్ ఎం.భగవత్ స్పష్టం చేశారు. శనివారం నుంచి ఈ నెల 25 వరకు(పని దినాల్లో) దరఖాస్తులు విక్రయించనున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అభ్యర్థులకు గచ్చిబౌలిలోని పోలీసు పెరేడ్‌గ్రౌండ్స్‌లో, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అభ్యర్థులు అంబర్‌పేటలోని రాచకొండ సీఏఆర్ హెడ్-క్వార్టర్స్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 మధ్య రూ.25 చెల్లించి దరఖాస్తులు పొందవచ్చు. అక్కడే అభ్యర్థుల వివరాలను నమోదు చేసుకుంటారు.

అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, 2 సెట్ల జిరాక్స్ ప్రతులు,  3 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో రావాల్సి ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్ విధుల్ని ‘ఎ’ కేటగిరీలో, డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్, సీసీ కెమెరా టెక్నీషియన్, కుక్, శానిటేషన్/మెయింటెనెన్స్ స్టాఫ్, స్వీపర్, ధోబీ, బార్బర్, ప్లంబర్, పెయింటర్, ఆటో ఎలక్ట్రీషియన్, ఆటో మెకానిక్ పోస్టుల్ని ‘బీ’ కేటగిరీలో చేర్చారు. ‘ఏ కేటగిరీ’ పోస్టులకు పదో తరగతి, ‘బీ కేటగిరీ’కి ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పురుషులు కనీసం 165 సెం.మీ. ఎత్తు(ఎస్టీలు 160 సెం.మీ.), మహిళా అభ్యర్థులు 150 సెం.మీ. ఎత్తు(ఎస్టీలు 145 సెం.మీ.) ఉండాలి. నిర్ణీత పోస్టులకు సంబంధించిన వృత్తివిద్యా సర్టిఫికెట్లూ జత చెయ్యాలి. దరఖాస్తుతో పాటు బర్త్ సర్టిఫికెట్, నేటివిటీ సర్టిఫికెట్, ఐటీఐ ట్రేడ్ సర్టిఫికెట్ (ఉన్నట్లైతే), 2014 సెప్టెంబర్ 30కి ముందు జారీ చేసిన డ్రైవింగ్ లెసైన్స్, విద్యార్హత పత్రాలు, ఆధార్ ప్రతు ల్ని జత చేయాలి. అభ్యర్థుల ఫిట్‌నెస్, పూర్వాపరాల పరిశీలన తర్వాత ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వారికి రోజుకు రూ.400 చొప్పున వేతనం చెల్లిస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement