
వడోదర: గుజరాత్‌లోని వడోదర(Vadodara)లో కారును వేగంగా నడిపి, ఒక మహిళ మృతికి కారణమైన రక్షిత్ రవీష్ చౌరాసియా పోలీసుల ముందు తన వాదన వినిపించాడు. ప్రమాదం జరిగిన సమయంలో తాను మద్యం మత్తులో లేనని పేర్కొన్నాడు. గురువారం రాత్రి వడోదరలో రక్షిత్ నడుపుతున్న కారు ఒక స్కూటీని ఢీకొంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందగా, ఎనిమిదిమంది గాయపడ్డారు. ఈ నేపధ్యంలో పోలీసులు రక్షిత్‌ను అరెస్టు చేశారు.
నిందితుడు రక్షిత్ శనివారం మీడియాతో మాట్లాడుతూ గురువారం రాత్రి తాను నడుపుతున్న కారు ఆ స్కూటీ కంటే ముందుగా వెళుతున్నదని, ఇంతలో తాను రైట్ సైడ్ తీసుకున్నానని తెలిపారు. అక్కడ రోడ్డుపై పెద్ద గుంత ఉన్నదని, దీంతో కారు అదుపుతప్పి, పక్కనే ఉన్న స్కూటీని ఢీకొన్నదన్నారు. ఇంతలో ఎయిర్ బ్యాగ్ తెరుచుకున్నదని, ఆ తరువాత ఏం జరిగిందో తమకు తెలియలేదన్నారు. తమ కారు ప్రమాదం జరిగిన సమయంలో50 కి.మీ. స్పీడులోనే వెళుతున్నదని, తాను మద్యం తీసుకోలేదని, హోలికా దహనం కార్యక్రమానికి వెళ్లి వస్తున్నామని రక్షిత్ తెలిపారు.
#WATCH | Vadodara, Gujarat: One woman has died, and four others are injured after an overspeeding four-wheeler rammed into a two-wheeler (14/03).
Accused Rakshit Ravish Chaurasia claims, " We were going ahead of the scooty, we were turning right and there was a pothole on the… pic.twitter.com/7UMundtDXH— ANI (@ANI) March 15, 2025
వడోదర పోలీస్ కమిషనర్(Police Commissioner) నరసింహ మీడియాతో మాట్లాడుతూ గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, ఎనిమిదిమంది గాయపడ్డారన్నారు. ఘటన జరిగిన సమయంలో అక్కడున్నవారి నుంచి సమాచారం సేకర్తిస్తున్నామని, రక్షిత్ మద్యం తాగి వాహనం నడిపినట్లు కేసు నమోదయ్యిదన్నారు. అయితే రక్షిత్ ప్రమాదం జరిగిన సమయంలో మద్యం మత్తులో లేనని చెబుతున్నాడని, ఈ కేసులో నిజానిజాలు నిర్థారించాల్సి ఉందన్నారు.
ఇది కూడా చదవండి: దేశ విభజనలో రైల్వే పంపకాలు.. నాడు భారత్-పాక్‌లకు ఏమి దక్కాయి?
Comments
Please login to add a commentAdd a comment