
మీ సేవకు మా సెల్యూట్
చరిత్రపుటల్లోకి కమిషనరేట్
కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడిచింది.. కరడుగట్టిన నేరస్తుల ఆట కట్టించింది.. ప్రేమికులను ఒక్కటి చేసింది.. ప్రాణాలు తీసేవారిని శిక్షించింది.. వంద లాదిమంది పోలీసుల దేవాలయంగా నిలిచి, బాధితుల పాలిట దైవంగా మారిన మన పోలీస్ కమిషనరేట్ త్వరలో తెరమరుగు కానుంది.
నగర పోలీస్ కమిషనరేట్ స్థానంలో తుళ్లూరు కేంద్రంగా గ్రేటర్ అమరావతి కమిషనరేట్ ఆవిష్కృతం కానుంది. ఈ విషయాన్ని కొద్దిరోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు.