
భవనాన్ని పరిశీలిస్తున్న సీపీ శ్వేత, అధికారులు
మర్కూక్(గజ్వేల్): మర్కూక్ పోలీస్ స్టేషన్ అవరణలోని నూతనంగా నిర్మించిన పోలీస్ కాంప్లెక్స్ భవనాలను ప్రారంభానికి సిద్దం చేయాలని పోలీస్ కమిషనర్ శ్వేత తాదేశించారు. శుక్రవారం ఆమె భవనాలను సందర్శించారు. కాంప్లెక్స్ భవనాల పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఏసీపీ, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఏసీపీ రమేశ్, డీఈ రాజయ్య, కాంట్రాక్టర్ ప్రసాద్‌రావు, సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ హరీష్ తదితరులు పాల్గొన్నారు.