Complex Building
-
ద్వారంపూడి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కూల్చివేత..
-
Komuravelli Mallanna: జాతర నాటికి పనులు పూర్తయ్యేనా!
సాక్షి, సిద్దిపేట: ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటి సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం. కోరమీసాల మల్లన్నగా ప్రసిద్ధి. ప్రతి ఏడాది మూడు నెలల పాటు జాతర జరుగుతుంది. ఈ దేవాలయానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి పట్నం, బోనం, స్వామి వారికి మొక్కులు చెల్లిస్తుంటారు. మరో మూడు నెలల్లో జాతర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జాతర సమయంలో రోజుకు 30 వేలకు పైగా, సాధారణ సమయంలో ఆదివారం, బుధవారాల్లో 20 వేలకు పైగా భక్తులు వస్తుంటారు.ఆరేళ్లుగా కొనసాగుతున్న గదుల నిర్మాణంకొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయ పరిసరాల్లో దాతల సహకారంతో 128 గదులు కొన్నేళ్ల కిందట నిర్మించారు. అందులో 18 గదులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక మిగిలినవి 110 గదులు మాత్రమే. అందులో నుంచే జాతర సమయంలో పోలీసులకు, ఇతర అవసరాలకు దాదాపు 50 వరకు వినియోగిస్తారు. ఇక 60 గదులే భక్తులకు అందుబాటులో ఉంటాయి. జాతర మూడు నెలల పాటు జరుగుతుంది. బుధ, ఆదివారాల్లో రోజుకు 50 వేలకు పైగా మిగతా రోజుల్లో 30 వేలకు పైగా భక్తులు వస్తుంటారు. జాతర సమయంలో ప్రైవేట్ అద్దె గదుల యజమానులు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో గదికి 12 గంటలకు రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నారు. డబ్బులు వెచ్చించలేని భక్తులు చెట్ల కిందనే బోనం వండి దేవాలయంలో బోనం, పట్నం చెల్లిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో 2018 సంవత్సరంలో 50 గదుల నిర్మాణంను ప్రారంభించారు. రూ.10.65 కోట్ల వ్యయంతో జీ ప్లస్ టుతో నిర్మాణం చేపట్టారు. అప్పటి నుంచి పనులు ఆగుతూ సాగుతూ వస్తున్నాయి. ఆరేళ్లు పూర్తవుతున్నా ఇంకా గదుల నిర్మాణం పూర్తి కాలేదు. ఈ గదుల నిర్మాణం త్వరగా పూర్తి చేసి ఈ జాతరకు అందుబాటులోకి వచ్చేలా చేసి, ఇంకా 150కి పైగా గదుల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేయాలని భక్తులు కోరుతున్నారు.క్యూ కాంప్లెక్స్ పూర్తయ్యేనా?మల్లికార్జున స్వామి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. కర్రలతో క్యూలైన్లను ప్రతి జాతర సమయంలో ఏర్పాటు చేస్తారు. దర్శనానికి బుధ, ఆదివారాల్లో 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి క్యూలైన్లో ప్రవేశిస్తే మళ్లీ బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. వృద్ధులు, షుగర్ వ్యాధిగ్రస్తులు, చిన్నారులు మూత్రంకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల వినతుల మేరకు క్యూ కాంప్లెక్స్‌లను నిర్మించాలని నిర్ణయించారు. రూ.12 కోట్ల వ్యయంతో నిర్మాణం పనులను 2023, అక్టోబర్‌లో ప్రారంభించారు. ఇప్పటి వరకు స్లాబ్‌లు వేశారు. లోపల క్యూలైన్లు, మూత్రశాలలు నిర్మించాలి.జాతర నాటికి పనులు పూర్తయ్యేనా?మరో మూడున్నర నెలల్లో స్వామి వారి కల్యాణంతో జాతర ప్రారంభం కానుంది. ఉగాది వరకు జాతర జరగనుంది. జాతర సమయంలో రోజుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెరిగితేనే జాతర నాటికి పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే భక్తుల ఇబ్బందులు తప్పవు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ, జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టి పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.పూర్తయ్యేందుకు కృషి చేస్తాంక్యూ కాంప్లెక్స్‌కు మూడు స్లాబ్‌లు వేశాం. 50 గదుల నిర్మాణం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు చేస్తున్నారు. ఈ జాతర నాటికి పనులు పూర్తయ్యేందుకు కృషి చేస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం.– బాలాజీ, ఈఓ -
తిరుపతిలో 2 వసతి సముదాయాలు
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో రెండు వసతి సముదాయాలను నిర్మించనున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. ఇందుకోసం జీఎస్టీ కాకుండా రూ.419.30 కోట్లతో టెండర్లను టీటీడీ పాలకమండలి ఆమోదించినట్లు తెలిపారు. తిరుమలలో మంగళవారం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, పాలకమండలి సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి సత్రం (రెండోసత్రం) స్థానంలో జీఎస్టీ కాకుండా రూ.209.65 కోట్లతో అచ్యుతం వసతి సముదాయం, శ్రీకోదండరామస్వామి సత్రం (మూడోసత్రం) స్థానంలో జీఎస్టీ కాకుండా రూ.209.65 కోట్లతో శ్రీపథం వసతి సముదాయం నిర్మాణానికి టెండర్లను ఆమోదించినట్లు వివరించారు. రూ.14.47 కోట్లతో తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు శాశ్వత క్యూలైన్ల నిర్మాణానికి టెండరు ఖరారు చేసినట్లు తెలిపారు. ఆయన తెలిపిన మేరకు పాలకమండలి తీసుకున్న ముఖ్య నిర్ణయాలు.. ♦ టీటీడీ ఉద్యోగులకు సంబంధించి మొదటిదఫా డిసెంబరు 28న 3,518 మందికి, రెండోదఫా జనవరి మొదటి వారంలో 1,500 మందికి ఇళ్లస్థలాల పంపిణీ. ♦ మూడోదఫా ఫిబ్రవరిలో 5 వేల మందికి లబ్ధి చేకూరేలా ఏర్పేడు సమీపంలోని పాగాలి వద్ద 350 ఎకరాల భూమి సేకరణకు కలెక్టర్‌కు ప్రతిపాదన. ♦ ఇళ్లస్థలాలను ప్రభుత్వం నుంచి టీటీడీ కొనుగోలు చేసి అభివృద్ధి చేసి ఉద్యోగులకు అందిస్తుంది. ఈ మొత్తాన్ని ఉద్యోగులు తిరిగి టీటీడీకి చెల్లిస్తారు. æ శ్రీవారి పోటు కార్మికులకు వేతనం మరో రూ.10 వేలు పెంపు ♦ వాహన బేరర్లు, ఉగ్రాణం కార్మికులను స్కిల్డ్ కేటగిరీగా గుర్తించి తగిన వేతనం పెంపు. ♦ టీటీడీలోని పలు విభాగాల్లో వర్క్ కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్న కార్మికులకు వేతనాలు పెంపు. ♦ ఇప్పటికే స్కిల్డ్ కార్మికులకు రూ.15 వేల నుంచి రూ.18,500 , సెమీస్కిల్డ్ కార్మికులకు రూ.12 వేల నుంచి రూ.15 వేలకు, అన్‌స్కిల్డ్ కార్మికులకు రూ.10,340 నుంచి రూ.15 వేలకు పెంపు. ♦ కల్యాణకట్టలో విధులు నిర్వర్తిస్తున్న పీస్‌రేట్ క్షురకులకు నెలకు రూ.20 వేల కనీస వేతనం. ♦ ఫిబ్రవరిలో తిరుమలలో పీఠాధిపతులు, మఠాధిపతుల సదస్సు ♦ వందల సంవత్సరాలుగా శ్రీవారి ఆలయ అర్చక కైంకర్యాలను పర్యవేక్షిస్తున్న పెద్దజీయర్ మఠానికి రూ.60 లక్షలు, చిన్నజీయర్ మఠానికి రూ.40 లక్షల ఆర్థిక సహకారం పెంపు. భగవద్గీత, గోవింద కోటి పుస్తకాల ఆవిష్కరణ శ్రీ భగవద్గీత, స్థానిక ఆలయాల క్యాలెండర్లు, గోవింద కోటి పుస్తకాలను టీటీడీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి ఈవో ధర్మారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. సనాతన ధర్మం పట్ల, మానవీయ, నైతిక విలువల పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు సరళమైన భాషలో సులభంగా అర్థమయ్యేలా 20 పేజీలతో కూడిన భగవద్గీత లక్ష పుస్తకాలను టీటీడీ ముద్రించింది. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తెలుగు, ఇంగ్లిష్, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 20 వేల పుస్తకాల వంతున ముద్రించిన భగవద్గీతను ఆయా రాష్ట్రాల్లో విద్యార్థులకు ఉచితంగా ఇవ్వనున్నారు. -
ప్రారంభానికి సిద్ధం చేయాలి
మర్కూక్(గజ్వేల్): మర్కూక్ పోలీస్ స్టేషన్ అవరణలోని నూతనంగా నిర్మించిన పోలీస్ కాంప్లెక్స్ భవనాలను ప్రారంభానికి సిద్దం చేయాలని పోలీస్ కమిషనర్ శ్వేత తాదేశించారు. శుక్రవారం ఆమె భవనాలను సందర్శించారు. కాంప్లెక్స్ భవనాల పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఏసీపీ, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఏసీపీ రమేశ్, డీఈ రాజయ్య, కాంట్రాక్టర్ ప్రసాద్‌రావు, సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐ హరీష్ తదితరులు పాల్గొన్నారు. -
దేవుడి భూమిలో దోపిడీ పర్వం..!
విషాన్ని కంఠంలో దాచి లోకాన్ని కాపాడిన నీలకంఠుని భూములకే రక్షణ లేకుండా పోయింది. గతంలో ప్రజలు కట్టబెట్టిన అధికారంతో దశాబ్దాలుగా దేవుని ఆస్తిని అప్పనంగా అనుభవిస్తున్నాడు. మాజీ శాసన సభ్యుడి హోదాలో అధికారులను గద్దిస్తూ ఆలయ భూమిపై వచ్చే ఆదాయాన్ని మింగేస్తున్నా డు. ‘గద్దె’నెక్కిన నాటి నుంచి నేటికీ ఆ భూమిపై సొమ్ముజేసుకున్నది చాలక ఇప్పుడు ఏకంగా వాణిజ్య సముదాయం నిర్మాణాన్ని తలపెట్టా్టడు. రూ.కోట్లు సంపాదించాలనుకుంటున్న ఆ ‘బాబు’ భాగోతం అధికారులకు తెలిసి నోటీసులు జారీచేశారు. అప్పటికీ వినకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం–పాలకొండ ప్రధాన రోడ్డులో చీపురుపల్లి మెయిన్‌రోడ్‌ను ఆనుకుని, మూడు రోడ్ల కూడలి ఎదురుగా నీలకంఠేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన సర్వే నంబర్ 45/1లో 9 సెంట్లు స్థలం ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెంటు ధర రూ.15 లక్షల పైబడి పలుకుతోంది. ఈ లెక్కన ఆ భూమి ఖరీదు రూ.1.5 కోట్లు వరకు ఉంటుందని అంచనా. మూడు, నాలు గు దశాబ్దాల కిందట ఈ స్థలంలో కొత్తకోట సరస్వతి, మా రోజు జగన్మోహిని అనే ఇద్దరు పేద మహిళలు దుకాణాలు పెట్టుకుని ఉండేవారు. ఆ తరువాత కాలంలో ఒక ప్రజాప్రతినిధి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాడు. మూడు దశాబ్దాలుగా... ఆ స్థలంలో ఆ ప్రజాప్రతినిధికి చెందిన నటరాజ్ వైన్ షాప్ ఉండేది. దేవస్థానానికి ఆనుకుని ఉన్న ఈ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణం నడిపేవారు. 2010లో ఈ స్థలంలో ఆక్రమణదారులను తొలగించేందుకు దేవాదాయశాఖ ప్రయతి్నంచింది. ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లింది. దేవాదాయశాఖకు ఆ స్థలాన్ని ట్రిబ్యునల్ ఖరారు చేసింది. ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ కొత్తకోట సరస్వతి, మారోజు జగన్మోహినిలు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తు తానికి కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. కేసు తేలనందున ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఆ స్థలం దేవాదాయ శాఖకు చెందినదే. అయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే అధికారం ముందు అధికారులు నిలువలేకపోయారు. ఎందుకంటే కోర్టులో పిటిషన్ వేసినవారి నుంచి మాజీ ఎమ్మెల్యే స్థలాన్ని తీసుకున్నారు. 2010 నుంచి ఇంతవరకు దేవాదాయశాఖకు కనీసం అద్దె కూడా చెల్లించలేదు. సుమారు రూ.4 లక్షలు అద్దె బకా యిలు కూడా అలానే ఉన్నాయి. అద్దెలోనూ పెత్తనమే.... గత ఏడాది కాలంగా ఈ స్థలంలో ఉన్న నటరాజ్ వైన్‌షాపు లో ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ఎక్సైజ్ శాఖ నిర్వహించింది. దీనికి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వారు నెలకు రూ. 21 వేలు అద్దె చెల్లించేవారు. తాజాగా ఆ ప్రజాప్రతినిధి తనకు నెలకు రూ.35 వేలు అద్దె కావాలని అడగడంతో ఇటీవల మద్యం దుకాణాన్ని ఎత్తేసి వేరేచోటకు తరలించారు. ఖాళీ అయిన ఆ తొమ్మిది సెంట్ల స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆ పెద్దమనిషి పనులు ప్రారంభించారు. నిర్మాణం పూర్తయితే దుకాణాలకు గ్రౌండ్‌ఫ్లోర్‌లో అయితే నెలకు రూ.30 వేలు, పై ఫ్లోర్లో అయితే రూ.15 నుంచి 20 వేలు వరకు అద్దెలు వస్తాయి. నోటీసులు జారీ... అనుమతి లేకుండా దేవాశాఖ భూమిలో ప్రారంభమైన నిర్మాణాలను నిలిపివేయాల్సిందిగా ఆ శాఖ అధికారులు గతంలో కోర్టుకు వెళ్లిన వారికి నోటీసులు జారీ చేశారు. చిత్రంగా నోటీసులు అందుకున్న వారు తమకు ఆ స్థలంతో ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు. కానీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.. అంటే పనులను ఆ మాజీ ఎమ్మెల్యే జరిపిస్తున్నట్టు సమాచారం. దీంతో దేవాదాయశాఖ అధికారులు చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆక్రమిత స్థలంలో అక్రమ నిర్మాణాన్ని నిలువరించి ఆలయ భూమిని కాపాడాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ భూమి కోర్టులో ఉన్న అంశం కావడంతో ఉన్నతాఅధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎస్ఐ ఐ. దుర్గాప్రసాద్ తెలిపారు. ఆ స్థలంలో నివసించడం లేదు.. ఎప్పుడో 40 సంవత్సరాల కింట ఆ స్థలంలో మా నాన్న ఉన్నప్పుడు దుకాణాలు ఉండేవి. ఆ తరువాత ఆ స్థలాన్ని మా తమ్ముడికి మా నాన్న ఇచ్చారు. మా తమ్ముడు ఎవరికైనా అమ్మేసాడో లేక ఇచ్చేసాడో తెలియదు. ఎప్పుడూ మాకే నోటీసులు వస్తాయి. శనివారం కూ డా దేవాదాయశాఖ అధికారులు నోటీసులు పంపించారు. ఇప్పుడు మేము ఆ స్థలానికి పక్కన చిన్న బడ్డీలో అరటి పండ్లు, పూజ సామగ్రి వ్యాపారం చేసుకుంటున్నాం. మాకు ఆ స్థలంతోను, అక్కడ జరుగుతున్న నిర్మాణంతో ఎలాంటి సంబంధం లేదు. – కొత్తకోట సరస్వతి, దేవాదాయశాఖ నోటీసు అందుకున్న మహిళ, చీపురుపల్లి నోటీసులు ఇచ్చాం.. ఫిర్యాదు చేశాం: నీలకంఠేశ్వరస్వామి దేవస్థానం స్థలంలోని సర్వే నంబర్ 45/1లో కట్టడాలు నిలిపివేయాలని కొత్తకోట సరస్వతి, మారోజు జగన్మోహినిలకు ఈ నెల 4న నోటీసులు ఇచ్చాం. వారు గతంలో కోర్టును ఆశ్రయించారు. ఇంకా కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలే దు. ఇంతలో ఆ స్థలంలో నిర్మాణాలు ఎలా జరుపుతా రని నోటీసులు ఇచ్చాం. 2010 నుంచి ఆ స్థలంకు సంబంధించిన అద్దె కూడా చెల్లించలేదు. నోటీసులు ఇచ్చినా కూడా పనులు నిర్వహిస్తున్నారు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం.‘ – కిషోర్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, నీలకంఠేశ్వరస్వామి దేవస్థానం -
వృత్తి పన్ను ఎగనామం
సాక్షి, అమరావతి బ్యూరో: వాణిజ్య సముదాయాలకు చెందిన యజమానులు పలువురు వృత్తి పన్ను ఎగ వేస్తున్నారు. భవనాలు, ఖాళీ స్థలాలను కొంతమంది యజమానులు వాణిజ్య అవసరాల కోసం అద్దెకు ఇస్తారు. అయితే డాక్యుమెంట్ భవన యజమానుల పేరుతో ఉంటాయి. కనుక కేటగిరీ–2 కింద వీరి పేరుతోనే విద్యుత్ కనెక్షన్లు ఇస్తారు. ఈ లెక్కన జిల్లాలో 1.80 లక్షల మంది వాణిజ్య కనెక్షన్లు తీసుకొన్నారు. వాణిజ్య సముదాయం కలిగిన భవన యజమాని ఏపీ ప్రొఫెషనల్ టాక్స్(ఏపీటీటీ) యాక్టు ప్రకారం ఏడాదికి రూ. 2500 వృత్తి పన్ను చెల్లించాలి. దీని ఆధారంగా విజిలెన్స్ శాఖ వృత్తి పన్ను చెల్లింపులపై ఆరా తీసింది విజిలెన్స్ విచారణ.. దీనిపై సమగ్ర విచారణ జరిగింది. రూ.91 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టినట్లు గుర్తించారు. విజిలెన్స్ ఎస్పీ శోభామంజరి నేతృత్వంలో విచారణ జరిపి నివేదిక పంపినట్లు సమాచారం. నోటీసులు పంపి పన్ను వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. లెక్క ఇదిగో.. ♦ జిల్లాలో వాణిజ్య అవసరాల కోసం విద్యుత్తు కనెక్షన్లు తీసుకొన్న యజమానులు 1.50 లక్షల మంది. ఇందులో ప్రభుత్వ భవనాలు,దేవాలయాలు, నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థల సంఖ్య 15,000. ♦ సొంతంగా లైసెన్సు తీసుకొని వ్యాపారం చేసే వారి సంఖ్య15,000. ♦ విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లించకుండా ఆగినవి, డబుల్ ఎంట్రీలు కలిపి ఉన్న కనెక్షన్లు 40 వేలు ♦ మిగిలిన వాణిజ్య సముదాయ కనెక్షన్లు 80 వేలు. ♦ వృత్తి పన్ను ఎగవేసినట్లు గుర్తించినది రూ.91 కోట్లు. -
చంద్రలోక్ కాంప్లెక్స్ భవనం సీజ్
రాంగోపాల్‌పేట్: సికింద్రాబాద్ ప్యారడైజ్ చౌరస్తాలోని చంద్రలోక్ కాంప్లెక్స్‌ను అధికారులు సీజఃŠ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధరెడ్డిలు మంగళవారం భవనాన్ని సందర్శించి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం భవనం రెయిలింగ్ కూలడంతో వెస్ట్‌మారేడుపల్లికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తి దుర్మరణం పాలైన సంగతి విధితమే. మృతుడి కుటుంబానికి రూ.2.5లక్షల నష్టపరిహారం: మేయర్ భవనం రెయిలింగ్ కూలిన ఘటనలో మృతి చెందిన దుర్గయ్య కుటుంబానికి రూ.2లక్షల నష్టపరిహారం అందజేయనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. ఆపద్భందు పథకం కింద మరో రూ.50 వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్మిక శాఖ నుంచి ఏదైనా ఆర్థిక సహాయానికి చర్యలు తీసుకుంటామన్నారు. చంద్రలోక్ కాంప్లెక్స్‌ను సీజ్ చేసి జేఎన్టీయూ నివేదిక కోరనున్నట్లు తెలిపారు. పురాతన భవనాల యజమానులు, అసోసియేషన్లు ఇంజనీర్లను ఏర్పాటు చేసుకుని వాటిని పటిష్టం చేయించుకోవాలని కమిషనర్ జనార్ధన్‌రెడ్డి సూచించారు. భవనంపై ఉన్న సెల్‌టవర్లు, హోర్డింగ్‌లపై విచారణ చేపడతామన్నారు. మేయర్ వెళ్లిన 5 నిమిషాలకే.. మేయర్ మీడియాతో మాట్లాడి వెళ్లిన 5 నిమిషాలకే రెయిలింగ్‌లోని మరికొంత ఊడి పడింది. అంతకు ముందు మేయర్ నిలుచున్న చోటుకు 5 అడుగుల దూరంలోనే శిథిలాలు పడటం గమనార్హం. మళ్లీ కూలే ప్రమాదం ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఎస్డీరోడ్ గుండా మళ్లించారు.