సాక్షి, అమరావతి బ్యూరో: వాణిజ్య సముదాయాలకు చెందిన యజమానులు పలువురు వృత్తి పన్ను ఎగ వేస్తున్నారు. భవనాలు, ఖాళీ స్థలాలను కొంతమంది యజమానులు వాణిజ్య అవసరాల కోసం అద్దెకు ఇస్తారు. అయితే డాక్యుమెంట్ భవన యజమానుల పేరుతో ఉంటాయి. కనుక కేటగిరీ–2 కింద వీరి పేరుతోనే విద్యుత్ కనెక్షన్‌లు ఇస్తారు. ఈ లెక్కన జిల్లాలో 1.80 లక్షల మంది వాణిజ్య కనెక్షన్‌లు తీసుకొన్నారు. వాణిజ్య సముదాయం కలిగిన భవన యజమాని ఏపీ ప్రొఫెషనల్ టాక్స్(ఏపీటీటీ) యాక్టు ప్రకారం ఏడాదికి రూ. 2500 వృత్తి పన్ను చెల్లించాలి. దీని ఆధారంగా విజిలెన్స్ శాఖ వృత్తి పన్ను చెల్లింపులపై ఆరా తీసింది
విజిలెన్స్ విచారణ..
దీనిపై సమగ్ర విచారణ జరిగింది. రూ.91 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టినట్లు గుర్తించారు. విజిలెన్స్ ఎస్పీ శోభామంజరి నేతృత్వంలో విచారణ జరిపి నివేదిక పంపినట్లు సమాచారం. నోటీసులు పంపి పన్ను వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
లెక్క ఇదిగో..
♦ జిల్లాలో వాణిజ్య అవసరాల కోసం విద్యుత్తు కనెక్షన్‌లు తీసుకొన్న యజమానులు 1.50 లక్షల మంది. ఇందులో ప్రభుత్వ భవనాలు,దేవాలయాలు, నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థల సంఖ్య 15,000.
♦ సొంతంగా లైసెన్సు తీసుకొని వ్యాపారం చేసే వారి సంఖ్య15,000.
♦ విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లించకుండా ఆగినవి, డబుల్ ఎంట్రీలు కలిపి ఉన్న కనెక్షన్‌లు 40 వేలు
♦ మిగిలిన వాణిజ్య సముదాయ కనెక్షన్‌లు 80 వేలు.
♦ వృత్తి పన్ను ఎగవేసినట్లు గుర్తించినది రూ.91 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment