swetha
-
సుజనా చౌదరికి కేశినేని శ్వేత కౌంటర్..
-
టీడీపీలో ప్రమోషన్ ఎక్కువ.. పని తక్కువ..!
-
బుద్వేల్ భూమి కోసం భారీ లాబీయింగ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర శివార్లలోని బుద్వేల్‌లో ఉన్న 26 ఎకరాల భూమిని కాజేయడానికి వెస్సెల్లా గ్రూప్ సీఈఓ, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి లాబీయింగ్ చేసినట్లు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీసీపీ ఎన్.శ్వేత బుధవారం తెలిపారు. దాని ఫలితంగానే అప్పట్లో ఎమ్మార్వోకు సాధారణ మెమో జారీ అయిందని, దీని ద్వారానే ఆ భూముల కన్వర్షన్ జరిగిందని వివరించారు. తన అనుచరులతో కలిసి శివానందరెడ్డి చేసిన కుట్ర, అసైన్డ్ భూములు ఖరీదు చేయడం వంటి ఆరోపణలపై సీసీఎస్‌లో మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయని చెప్పారు. వీటిపై విచారించేందుకు సోమవారం అల్లూరు వెళ్లగా... శివానందరెడ్డి పారిపోయారని డీసీపీ వివరించారు. ఈ కేసులు, వాటి పూర్వాపరాలపై బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. రియల్టర్ల కన్ను..అసైనీలకు దగా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1994లో బుద్వేల్లోని సర్వే నం.282 నుంచి 299 వరకు ఉన్న 281 ఎకరాల భూములను 66 మందికి అసైన్ చేసింది. వీరికి రాజేంద్రనగర్ మండల అధికారులు అసైనీ పాస్ పుస్తకాలను సైతం జారీ చేశారు. ఆ తర్వాత మరో 82 మంది అక్కడ మిగిలి ఉన్న భూమిని ఆక్రమించారు. 2000లో అసైనీలు తమ భూములను ఎస్కే డెవలపర్స్ సంస్థకు లీజుకు ఇచ్చారు. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో రెవెన్యూ అధికారులు అసైన్మెంట్ పట్టాలు రద్దు చేశారు. చేవెళ్ల ఆర్డీఓ ఆ భూమిని నిబంధనల ప్రకారం హెచ్ఎండీఏ, పర్యాటక శాఖలకు అప్పగించారు. దీన్ని సవాల్ చేస్తూ అసైనీలు గుంటి నర్సింçహులు తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపి కేసు పరిష్కరించాలంటూ చేవెళ్ల ఆర్డీఓను కోర్టు ఆదేశించింది. దీంతో అసైనీలు ఆర్డీఓకు వివరణ ఇచ్చినా.. దాన్ని ఆయన తిరస్కరించారు. ఆర్డీఓ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 2002లో అసైనీలు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా.. అదే భూమిని అభివృద్ధి చేసి, తమకు ప్లాట్లు ఇవ్వాలంటూ అసైనీలు ప్రభుత్వానికి విన్నవించారు. దీనిపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోక ముందే దీన్ని క్యాష్ చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు టీజే ప్రకాష్, కోనేరు గాం«దీ, దశరథ రామారావు రంగంలోకి దిగారు. అసైనీలతో పాటు ఇతరులను సంప్రదించారు. అసైనీలకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చేలా తాము ప్రభుత్వ అధికారులతో పాటు రాజకీయ నాయకులను మ్యానేజ్ చేస్తా మని నమ్మబలికారు. ఇది నమ్మిన అసైనీలు వీరితో అగ్రిమెంట్లు, ఎంఓయూలు చేసుకున్నారు. వాటిని చూపించిన ఈ ముగ్గురూ ఆ స్థలం అమ్ముతామంటూ కొందరి నుంచి డబ్బు వసూలు చేసి మోసం చేశారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు సీసీఎస్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. ప్రకా‹Ù, గాం«దీ, రామారావు 2021లో రియల్ ఎస్టేట్ బ్రోకర్ దయానంద్‌ను సంప్రదించి అసైనీలు ప్లాట్లు పొందేలా సహకరించాలని కోరారు. ఇతడి ద్వారానే టీజే ప్రకాష్ మాజీ పోలీసు అధికారి, వెస్సెల్లా గ్రూపు సీఈఓ మాండ్ర శివానందరెడ్డిని సంప్రదించారు. రియల్టర్లకు శివానందరెడ్డి ఎర బుద్వేల్ భూమి పూర్వాపరాలు తెలిసిన ఆయన తన çపలుకుబడి వినియోగించి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. ఆ 26 ఎకరాల భూమి తానే తీసుకుంటానని, చదరపు గజానికి రూ.12 వేల చొప్పున ఇస్తానని ఎర వేశాడు. 2021–22 మధ్య కాలంలో అసైనీలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చెక్కుల రూపంలో చెల్లించారు. కన్వర్షన్ కోసం ముమ్మర యత్నం అసైన్డ్ ల్యాండ్ కన్వర్షన్ కోసం శివానందరెడ్డి తదితరులు 2022–23 మధ్య కాలంలో లాబీయింగ్ చేశారు. దీని ఫలితంగా అసైనీలు, ఆక్రమణదారులకు కన్వేయన్స్ డీడ్స్ ద్వారా అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించాలంటూ రాజేంద్రనగర్ ఎమ్మార్వోకు ఓ సాధారణ మెమో జారీ అయింది. దీంతో గతేడాది ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కన్వేయన్స్ డీడ్స్ జరిగాయి. వీటి ఆధారంగా అసైనీలు, ఆక్రమణదారులు ఆ భూమిని ఏ అండ్ యూ ఇన్ఫ్రా పార్క్, వెస్సెల్లా గ్రీన్ కంపెనీలకు చెందిన శివానందరెడ్డి, ఆయన భార్య ఉమాదేవి, కుమారుడు కినిష్కలతో పాటు ప్రశాంత్‌రెడ్డిలకు రిజి్రస్టేషన్ చేశారు. ఇలా శివానందరెడ్డి తదితరులు అసైనీలను భయపెట్టి, ప్రభుత్వ ఉత్తర్వులు, మంత్రివర్గం ఆమోదం లేకుండా అసైన్డ్ భూములు లాక్కోవడానికి కుట్ర పన్నారు. -
మా రాజీనామాకి చంద్రబాబే కారణం.. కేశినేని శ్వేత సంచలన నిజాలు
-
శ్వేత టీడీపీకి రాజీనామా చేయడానికి అసలు కారణం పై క్లారిటీ ఇచ్చిన దేవులపల్లి అమర్
-
మేయర్ భాగ్యలక్ష్మికి రాజీనామా లేఖను అందించిన శ్వేత
-
రాజీనామాకి ముందు..కేశినేని శ్వేత సంచలన నిర్ణయం
-
టీడీపీ కి కేశినేని నాని కుమార్తె గుడ్ బై
-
టీడీపీకి మరో బిగ్ షాక్
-
బీసీ మహిళంటూ బాబు బుకాయింపు!
సాక్షి, అమరావతి: కళ్లార్పకుండా అబద్ధాలను వల్లించడంలో తాను గోబెల్స్‌ను మించిపోయిన విషయాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి రుజువు చేసుకున్నారు! టీడీపీ అనుబంధ విభాగం ఐ–టీడీపీని వికృత పోస్టులకు అడ్డాగా మార్చేసిన ఆయన అసభ్యకర పోస్టులు పెట్టే శ్వేతా చౌదరి అలియాస్ స్వాతిరెడ్డిని నిస్సిగ్గుగా సమర్థించడం విస్మయం కలిగిస్తోంది. పైగా ఆమె బీసీ మహిళా అంటూ బుకాయించడం గమనార్హం. స్వాతి రెడ్డి ఎందుకు అయ్యారంటే... కమ్మ సామాజిక వర్గానికి చెందిన కోట శ్వేతాచౌదరి మారుపేరుతో స్వాతిరెడ్డినంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం వెనుక టీడీపీ పక్కా పన్నాగం దాగుంది. తిరుపతికి చెందిన ఆమె నర్సింగ్ కోర్సు చేసి హాస్పిటల్ మేనేజ్మెంట్ చదివేందుకు స్టూడెంట్ వీసాపై లండన్‌లో ఉంది. ఐ–టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తోంది. కువైట్ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగంలో క్రియాశీలకంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్, ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగతంగా అసభ్యకర పోస్టులను సోషల్ మీడియాలో వైరల్ చేయడమే లక్ష్యంగా ఐ–టీడీపీ ఆమె పేరు, సామాజికవర్గం పేరును మార్చేసింది. శ్వేతా చౌదరిని ఏకంగా స్వాతి రెడ్డిగా మార్చి సోషల్ మీడియాలో అకౌంట్ తెరిచింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా కించపరుస్తూ అసభ్యకర రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. ఆమెను నిస్సిగ్గుగా వెనకేసుకు రావడం ద్వారా ఈ కుట్ర వెనుక తాను ఉన్నట్లు చంద్రబాబు చెప్పకనే చెప్పారు! ఆమె కుటుంబానికీ సంక్షేమ పథకాలు.. ముఖ్యమంత్రి జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్న శ్వేతా చౌదరి అలియాస్ స్వాతి రెడ్డి కుటుంబానికి కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోంది. ఆమె తండ్రి కోట విశ్వనాథ్ ప్రస్తుతం ఆ కుటుంబానికి దూరంగా మదనపల్లిలో మరో మహిళతో కలసి జీవిస్తున్నారు. వారిద్దరికీ రాష్ట్ర ప్రభుత్వం ‘నవరత్నాలు– పేదలు అందరికీ ఇళ్లు’ పథకం కింద విడివిడిగా ఇళ్లను మంజూరు చేసింది. అయితే వారిద్దరూ తమకు పక్కపక్కనే ఇళ్ల స్థలాలను కేటాయించాలని కోరుతున్నారు. శ్వేతాచౌదరి తండ్రి జీవించి ఉన్నప్పటికీ తిరుపతిలో నివసిస్తున్న ఆమె తల్లి లలిత వితంతు పింఛన్ పొందుతున్నారు. -
శ్వేత మృతికి కారణం ఏంటంటే..? షాకింగ్ విషయాలు వెల్లడించిన సీపీ
సాక్షి, విశాఖపట్నం: నగరంలో సంచలనం సృష్టించిన వివాహిత శ్వేత మృతి కేసు అనేక మలుపు తిరిగిన సంగతి తెలిసిందే.. ఆర్.కె.బీచ్‌లో మంగళవారం అర్ధరాత్రి ఆమె శవమై కనిపించిన విషయం విదితమే.. అయితే, శ్వేతది ఆత్మహత్యేనని సీపీ త్రివిక్రమ్ వర్మ స్పష్టం చేశారు. శ్వేత ఆత్మహత్యకు గల కారణాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ‘‘శ్వేతపై అత్తింటి వేధింపులు నిజమే.. శ్వేత తల్లి ఎదుటే దంపతులు గొడవపడ్డారు.. ఆమె కనిపించడం లేదని బంధువులు ఫిర్యాదు చేశారు. బీచ్ దగ్గర మృతదేహం ఉందని సమాచారం వచ్చింది. శ్వేత భర్త, ఆడపడుచు భర్తపై కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. 90 సెంట్ల భూమి శ్వేత పేరు మీద ఉంది. ఆ భూమి తన పేరు మీదకి మార్చాలని భర్త మణికంఠ ఇబ్బంది పెట్టాడు. అత్త, మామ చిన్నచూపు చూడటంతో శ్వేత మనస్తాపానికి గురైంది’’ అని సీపీ వివరించారు. చదవండి: సొంత కొడుక్కే షాకిచ్చిన తండ్రి.. ఇంటికొచ్చిన ప్రియురాలితో కలిసి.. ‘‘అత్తింటి వారు వేధింపులు కారణంగా గతంలోనూ శ్వేత ఆత్మహత్యకు యత్నించింది. గృహ, లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేశాం. ఐపీసీ సెక్షన్ 354 498(ఏ) కింద కేసు నమోదు చేశాం, శ్వేత ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. పోస్ట్ మార్టం వీడియో గ్రఫీ చేయించాం’’ అని సీపీ పేర్కొన్నారు. -
శ్వేత కేసును దిశాకు అప్పగించిన న్యూపోర్ట్ పోలీసులు
-
భర్త, అత్త, మామ, ఆడపడుచు భర్త అరెస్ట్
-
Vizag Beach: వివాహిత శ్వేత మృతి కేసులో ఊహించని ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: వివాహిత శ్వేత అనుమానాస్పద మృతి కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ ఘటనలో పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. భర్త మణికంఠ చెల్లెలి భర్తపైన లైంగిక వేధింపుల కేసు నమోదైంది. శ్వేత తల్లి రమాదేవి ఫిర్యాదుతో త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్వేత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. విశాఖలోని జ్ఞానాపురం స్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టుతోపాటు శ్వేత సెల్‌ఫోన్ కీలకంగా మారింది. మృతురాలి మొబైల్‌ను పరిశీలిస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. కాగా అత్తింటి వేధింపులతో విశాఖ బీచ్‌లో ఐదు నెలల గర్భిణి శ్వేత ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. చదవండి: విశాఖ బీచ్‌లో గర్భిణీ మృతదేహం.. పెళ్లైన నెల నుంచే వేధింపులు.. సూసైడ్ నోట్ స్వాధీనం అసలేం జరిగిందంటే.. పెదగంట్యాడ మండలం నడుపూరులో గురువెల్లి మణికంఠ తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. దొండపర్తికి చెందిన శ్వేత(24)తో గత ఏడాది మణికంఠకు వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. మణికంఠ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వారం రోజుల కిందట అతను హైదారాబాద్ వెళ్లాడు. శ్వేతను ఇక్కడే అతని తల్లిదండ్రుల వద్ద ఉంచాడు. మంగళవారం సాయంత్రం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆమె సాయంత్రం 6.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. తర్వాత ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆమె అత్తామామలు బంధువులు, స్నేహితుల ఇళ్లలో వాకబు చేశారు. ఫలితం లేకపోవడంతో ఆమె మామ శాంతారావు అర్ధరాత్రి 12 గంటల సమయంలో న్యూపోర్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఆర్.కె.బీచ్‌లో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు 3వ పట్టణ పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని శ్వేత ఫొటోతో సరిపోల్చి.. న్యూపోర్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన భర్తతో ఉన్న కుటుంబ కలహాలతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో చిట్టీ(మణికంఠ ముద్దు పేరు) నేను లేకపోయినా నువ్వు బిందాస్‌గా జీవిస్తావని నాకు తెలుసు. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. బిగ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్ అని రాసి ఉంది. చదవండి: సొంత కొడుక్కే షాకిచ్చిన తండ్రి.. ఇంటికొచ్చిన ప్రియురాలితో కలిసి.. -
ఫోన్ లో భర్తతో గొడవపడిన శ్వేత
-
బీచ్‌లో శ్వేత మృతదేహం.. పెళ్లైన నెల నుంచే వేధింపులు, సూసైడ్ నోట్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ బీచ్‌లో శవమై తేలిన మహిళ కేసులో మిస్టరీ కొనసాగుతోంది. వివాహిత శ్వేత మృతికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ కేసులో శ్వేత కాల్ రికార్డింగ్స్, పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే శ్వేత తల్లి రమాదేవి స్టేట్మెంట్ను త్రీటౌన్ పోలీసులు నమోదు చేశారు. ఇంటి నుంచి బయలుదేరే గంట ముందు వరకు కూడా భర్త మణికంఠతో గొడవపడినట్లు విచారణలో తేలింది. అయితే అత్తమామలు వేధింపులపై పోలీసులు కేసు నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు విడాకులు ఇస్తానని భర్త బెదిరింపులు కాగా అత్తింటి వేధింపులు తట్టుకోలేకే తన కూతురు చనిపోయిందని శ్వేత తల్లి రమాదేవి ఆరోపించారు. పెళ్లైన నెల రోజుల నుంచే కూతుర్ని వేధించడం ప్రారంభించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అల్లుడి అసలు గుణం అప్పుడే బయటపడిందని.. నెల రోజులు క్రితం కూడా విడాకులు ఇస్తామని శ్వేతను భర్త మణికంఠ బెదిరించాడని పేర్కొన్నారు. ఈ మేరకు మృతురాలి తల్లి మాట్లాడుతూ శ్వేత అత్తింటి వారిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తన కూతురు అయిదు నెలల గర్భిణీ అని.. కడుపుతో ఉన్నా కూడా కనికరించకుండా అత్తామామలు చిత్రహింసలు పెట్టేవారని తెలిపారు. ఇంట్లో పనులన్నీ తనతోనే చేయించేవారని, అత్త మామలు చెప్పిన పనులు చేయాలంటూ ఫోన్లో భర్త కూడా ఆదేశాలిచ్చేవాడని పేర్కొన్నారు. ఫోన్ చేసి రోజూ ఏడ్చేది.. ‘భర్తను పొగొట్టుకున్నాను. కూతుర్ని ఒక్కదాన్నే కష్టపడి పెంచి పెద్ద చేశాను. అత్తమామలు ఇబ్బందులు పెడుతున్నారని రోజూ ఫోన్ చేసి ఏడ్చేది. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతానని చెప్పింది. పెళ్లైన తరవాత చదివించకుండా వంటింటికే పరిమితం చేశారు. శ్వేత అత్త నటిస్తోంది. అత్తింటి వేధింపులు, భర్త టార్చర్ వల్ల శ్వేత ప్రాణం తీసుకుంది. నా ఒక్కగానొక్క కూతురిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు’ అంటూ వాపోయారు. సూసైడ్ నోట్ ఇదిలా ఉండగా శ్వేత చనిపోయేముందు ఓ సూసైడ్ నోట్ రాసింది. ఇందులో ‘చిట్టీ...నాకు ఎప్పుడో తెలుసు నేను లేకుండా నువ్వు బిందాస్‌గా ఉండగలవని. నీకు అసలు ఏమాత్రం ఫరక్ పడదు. ఎనీ వే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.. అండ్ న్యూ లైఫ్. చాలా మాట్లాడడానికి ఉన్నా కూడా నేను ఏం మాట్లాడటం లేదు. బికాజ్.. నువ్వు బయటకు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా యూ నో ఎవ్రీ థింగ్. జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఏ బిగ్ థాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్’ అని రాసి ఉన్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్వేత భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లో నివసిస్తుండగా.. విశాఖపట్నంలో అత్తమామల వద్ద శ్వేత ఉంటోంది. మంగళవారం అత్తతో గొడవ జరగడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఫోన్లో భర్తతోనూ గొడవపడింది. తర్వాత విగత జీవిగా బీచ్‌లో కనిపించింది. చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 11 మంది జవాన్లు మృతి.. -
మేమే చంపేశాం..
సిద్దిపేటకమాన్: జెడ్పీటీసీ శెట్టే మల్లేశం హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత తెలిపారు. కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ’’ హత్య జరిగిన తర్వాత మంగళవారం చేర్యాల మండలం గుర్జకుంట ఉపసర్పంచ్ నంగి సత్యనారాయణ (32), అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న బస్వరాజు సంపత్‌కుమార్ (24) పోలీస్ స్టేషన్‌కొచ్చి లొంగిపోయారు. తాము నేరాన్ని చేసినట్టు ఒప్పుకున్నారు. కుల సంఘం, గ్రామ రాజకీయంలో మల్లేశం తన ఎదుగుదలకు అడ్డు వస్తున్నాడన్న కక్షతో అడ్డు తొలగించుకోవాలని సత్యనారాయణ పథకం వేసుకున్నాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం సోమవారం తెల్లవారుజామున ఇద్దరు నిందితులు కారులో గ్రామ శివారులో ఉన్న వాటర్ ప్లాంట్ వద్ద వేచి ఉన్నారు. మల్లేశం ఉదయం వాకింగ్ చేసుకుంటూ నిందితులు ఉన్న కారు ముందు నుంచి వెళ్తుండగా.. సత్యనారాయణ కారును వేగంగా నడిపి మల్లేశంను వెనుక నుంచి ఢీకొట్టారు. కిందపడిపోయిన మల్లేశం తలపై.. సత్యనారాయణ కత్తితో బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై కిందపడిపోయాడు. అనంతరం ఇద్దరు నిందితులు కారులో ఘటనా స్థలం నుంచి పారిపోయారు. నిందితుల నుంచి హత్య చేయడానికి ఉపయోగించిన కత్తిని, కారును స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాం’’ అని సీపీ తెలిపారు. కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎవరి పాత్రనైనా ఉందా? అనే విషయాలపై విచారణ కొనసాగిస్తామని చెప్పారు. కేసు ట్రయల్ తొందరగా జరిగేలా చూస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఎస్బి సీఐ రఘుపతిరెడ్డి పాల్గొన్నారు. -
బుసిరెడ్డి శ్వేత.. కొలువుల్లో ఘనత.. వరుసగా మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
సాక్షి, వైఎస్సార్ కడప(వైవీయూ): కడప నగరానికి చెందిన బుసిరెడ్డి శ్వేత వరుసగా మూడో కేంద్ర ప్రభుత్వ కొలువు సాధించింది. కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో భౌతికశాస్త్ర ఆచార్యులు డా. బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నాగేశ్వరి దంపతుల కుమార్తె అయిన శ్వేత ప్రస్తుతం భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో బెంగళూరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌లో అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది. ఈమె ఎస్ఎస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయల్ లెవల్–2019లో ఆలిండియా స్థాయిలో 410వ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. కాగా 2020లో బ్యాంక్ పరీక్షల్లో అర్హత సాధించి బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా విడుదలైన ఎస్ఎస్స్సీ సీజీఎల్–2022 పరీక్షా ఫలితాల్లో ఆలిండియాస్థాయిలో 998వ ర్యాంకు సాధించింది. దీంతో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవిన్యూ, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ కార్యాలయంలో ప్రివెంటివ్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శ్వేత మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రణాళికబద్ధంగా చదవడంతోనే వరుసగా కొలువులు సాధించిగలిగినట్లు ఆమె తెలిపారు. కాగా వీరి స్వస్థలం చింతకొమ్మదిన్నె మండలం గూడవాండ్లపల్లె కాగా, ప్రస్తుతం కడప నగరంలోని రాజీవ్‌మార్గ్ సమీపంలో నివాసం ఉన్నారు. ఈమె పదోతరగతి వరకు నాగార్జున మోడల్ స్కూల్లోను, ఇంటర్ కడప నారాయణ, బీటెక్ హైదరాబాద్‌లోని నారాయణమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో చదివారు. శ్వేతకు ఉత్తమ ర్యాంకు లభించడం పట్ల కుటుంబసభ్యులు అభినందనలు తెలిపారు. -
ప్రారంభానికి సిద్ధం చేయాలి
మర్కూక్(గజ్వేల్): మర్కూక్ పోలీస్ స్టేషన్ అవరణలోని నూతనంగా నిర్మించిన పోలీస్ కాంప్లెక్స్ భవనాలను ప్రారంభానికి సిద్దం చేయాలని పోలీస్ కమిషనర్ శ్వేత తాదేశించారు. శుక్రవారం ఆమె భవనాలను సందర్శించారు. కాంప్లెక్స్ భవనాల పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఏసీపీ, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఏసీపీ రమేశ్, డీఈ రాజయ్య, కాంట్రాక్టర్ ప్రసాద్‌రావు, సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐ హరీష్ తదితరులు పాల్గొన్నారు. -
నిలువెత్తు గెలుపు సంతకం
‘మర్యాద, సభ్యత, క్రమశిక్షణ అనేవి మనిషిని తీర్చిదిద్ది ఉత్తములుగా తయారుచేస్తాయి’ అనేది మంచిమాట. ఈ మాటకు తన వంతుగా మరో మాట చేర్చాడు ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ లారీ బేకర్... ‘మర్యాద, సభ్యత, క్రమశిక్షణ అనేవి అత్యుత్తమ నిర్మాణాలకు కారణం అవుతాయి’ ఆర్కిటెక్ట్‌గా దేశవిదేశాల్లో రాణిస్తున్న శ్వేతా దేశ్‌ముఖ్ లారీ బేకర్ చెప్పిన ప్రతి మాటను అక్షరాలా ఆచరించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ది ఇండియన్ అలర్ట్ ‘టాప్ టెన్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్–2022’ జాబితాలో చోటు సంపాదించిన శ్వేతాదేశ్ముఖ్ గురించి... ముంబైకి చెందిన శ్వేతాదేశ్ముఖ్కు చిన్నప్పటి నుంచి స్కెచ్చింగ్, పెయింటింగ్ అంటే ఇష్టం. ఆ ఇష్టమే తనను ఆర్కిటెక్చర్ వైపు తీసుకువచ్చింది. నాగ్‌పుర్‌లో బీ.ఆర్క్, పుణెలో కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ పూర్తి చేసింది. ఆ తరువాత సొంతంగా ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఉద్యోగంలో చేరితే ఎలా ఉండేదో తెలియదుగానీ, సొంతంగా ప్రాక్టిస్ చేయడం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. వివాహం తరువాత ముంబైలోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సీనియర్ ఆర్కిటెక్ట్‌గా పనిచేసిన శ్వేత ఆ తరువాత ‘డిజైన్బాక్స్’ పేరుతో ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మొదలుపెట్టింది.‘డబ్బులు ఎక్కువ వచ్చినా సరే, తక్కువ క్రియేటివిటీ ఉండే ప్రాజెక్ట్‌లకు దూరంగా ఉండాలి’ అనే నిబంధన విధించుకుంది. క్లయింట్స్ నుంచి సైట్ ఫోటోలు, వీడియోలు, డ్రాయింగ్స్ తీసుకోవడమే కాదు డిజైన్ ప్రాసెస్‌లో కూడా వారిని భాగం చేస్తుంది. కలర్ కన్సల్టింగ్, ఫర్నిచర్ డిజైనింగ్, వాల్ డెకర్, లైటింగ్ ఐడియాస్... ఇలా ఎన్నో విషయాలలో ఎంతోమంది క్లయింట్స్‌కు సేవలు అందించిన ‘డిజైన్బాక్స్’ మోస్ట్ ఇన్నోవేటివ్ ఫర్మ్ అవార్డ్ గెలుచుకుంది. తన ఫేవరెట్ ప్రాజెక్ట్‌ల విషయానికి వస్తే ఇరవై అయిదు ఎకరాల పరిధిలోని భీమాశంకర్ హిల్స్(కర్జత్, మహారాష్ట్ర), పుదుచ్చేరిలోని మలీప్లె్లక్స్,గ్రీన్‌హౌజ్, చెంబూర్‌లోని ఏడు ఎకరాల కమర్షియల్ ఇంటీరియర్... ఇలా ఎన్నో ఉన్నాయి. ‘నాకంటూ ప్రత్యేకమైన స్టైల్ లేదు. క్లయింట్స్ అభిరుచి, అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేస్తాను’ అంటున్న శ్వేత నిర్మాణ ప్రక్రియలో పర్యావరణ కోణానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఉదా: స్క్రాప్ మెటీరియల్‌ను రీసైకిలింగ్ కంపెనీలకు తరలించడం, వర్షపునీటి నిల్వ, స్థానిక వనరులను సమర్థవంతంగా వాడుకోవడం... మొదలైనవి. ‘నా డిజైనింగ్‌కు ప్రకృతే స్ఫూర్తి ఇస్తుంది’ అని చెబుతున్న శ్వేత బాగా అభిమానించే ఆర్కిటెక్ట్ లారీ బేకర్. బ్రిటన్‌లో పుట్టిన బేకర్ ఇండియాకు వచ్చి నిర్మాణరంగం లో అనేక ప్రయోగాలు చేసి ‘లెజెండ్’ అనిపించుకున్నాడు. సామాన్యుల ఆర్కిటెక్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. ‘ఇతర ఆర్కిటెక్ట్‌ల నుంచి స్ఫూర్తి పొందడం కంటే సామాన్యులు సృష్టించిన వాటిలో నుంచే ఎక్కువగా స్ఫూర్తి పొందుతాను’ అనే లారీ బేకర్ మాట తనకు ఇష్టమైనది. ఆయన చెప్పిన ‘లోకల్ విజ్డమ్’ను అనుసరిస్తుంది. ‘ఒక డిజైన్ చేసే ముందు ఆ పరిసరాలకు సంబంధించిన విషయాలపై అవగాహన పెంచుకోవాలి’ అని లారీ చెప్పిన మాటను ఆచరణలో చూపుతుంది శ్వేత. గౌతమ్ భాటియా రాసిన ‘లారీ బేకర్: లైఫ్, వర్క్ అండ్ రైటింగ్’ పుస్తకం అంటే ఇష్టం. ‘ప్రతి వృత్తిలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అయితే ప్రతి సవాలు మన విజయానికి ఒక మెట్టులా ఉపయోగపడుతుంది. మొదట్లో మాకు కూడా రకరకాల సందేహాలు, సవాళ్లు ఎదురయ్యాయి. ఇలా స్టార్ట్ చేశాం. ఇలాగే ఉంటాం... అన్నట్లు కాకుండా ఎప్పటికప్పుడు మా ప్రణాళికలో మార్పు చేసుకుంటూ వచ్చాం’ అంటుంది శ్వేతాదేశ్ముఖ్. చదువుకునే రోజుల్లో, వృత్తిలోకి వచ్చిన తొలిరోజుల్లో మూర్ఛవ్యాధి సమస్యతో సతమతమయ్యేది శ్వేత. అలా అని ఎప్పుడూ ఆగిపోలేదు. ఇంటికి పరిమితం కాలేదు. పనిలో దొరికే ఉత్సాహన్నే ఔషధంగా చేసుకొని ముందుకు కదులుతుంది. -
Jayam Child Artist Yamini Latest Photos: ‘జయం’ ఫేమ్ యామిని శ్వేత (ఫోటోలు)
-
నిజామాబాద్ ప్రభుత్వసుపత్రిలో వైద్యురాలు అనుమానాస్పద మృతి
-
నిజామాబాద్‌లో వైద్యురాలు అనుమానాస్పద మృతి
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గైనిక్ విభాగంలో పీజీ చేస్తున్న డాక్టర్ శ్వేత.. తన ట్రైనింగ్ లో భాగంగా నిన్న రాత్రి రెండు గంటల వరకూ డ్యూటీలోనే ఉన్నారు. ఉదయం తను పడుకున్న గదిలోకి వెళ్లి చూసేసరికి విగతజీవిగా పడి ఉండటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. శ్వేత గుండెపోటుతో మరణించి ఉండొచ్చునని వైద్యులు అంచనా వేస్తున్నారు. అయితే శ్వేతది అనారోగ్యంతో సహజ మరణమా.. లేక, ఇంకేమైనా ఇబ్బందులుండేవా అనేది ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది. డాక్టర్ శ్వేత కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి కాగా.. శ్వేత మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: (మళ్లను పరామర్శించిన సినీనటుడు ఆలీ) -
బీజేపీ నేత శ్వేత మృతి కేసులో సంచలన విషయాలు
బీజేపీ నేత శ్వేతా సింగ్ గౌర్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తన నీచపు బాగోతం బయటపెడుతుందనే ఉద్దేశంతోనే ఆమె భర్తే ఆమెను హత్య చేసి.. అత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేస్తున్నాడంటూ ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే శ్వేత భర్తను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్ బండాకు చెందిన జిల్లా పంచాయితీ సభ్యురాలు, బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్వేతా సింగ్ గౌర్.. బుధవారం తన ఇంట్లో శవమై కనిపించారు. తన భర్త, బీజేపీ నేత దీపక్ గౌర్ ఇన్వాల్వ్ అయిన ఇంటర్నేషనల్ సె* రాకెట్‌కు సంబంధించి ఆడియో కాల్స్ ఆమె రికార్డు చేసిందని, ఆ భయంతోనే ఆమె బిక్కుబిక్కుమంటూ గడిపిందని శ్వేత కుటుంబం ఆంటోంది. అందుకే తమ బిడ్డను హత్య చేశారని, ఇందులో దీపక్‌తో పాటు అతని తండ్రి, తల్లి, అన్న.. అంతా ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపిస్తోంది. ఈ మేరకు ఫిర్యాదు ఆధారంగా దీపక్ కుటుంబంపై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు. నీచపు పని రష్యా, మొరాకో, ఆఫ్రికా అమ్మాయిలతో కూడిన వ్యభిచార ముఠాలతో దీపక్ లావాదేవీలు జరిపాడని శ్వేత కుటుంబం ఆరోపిస్తోంది. తన భర్త విటులను సంప్రదించిన ఫోన్ కాల్స్‌ను శ్వేత రికార్డు చేసిందని, ఇందుకు సంబంధించి ఫొటోలు, డబ్బు పంపిన వ్యవహారాలను సైతం ఆమె సేకరించింది. ఈ మేరకు మూడు సంభాషణలకు సంబంధించిన ఆడియో క్లిప్స్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. అంతేకాదు.. లక్నోలోని ఎంజే ఇంటర్నేషనల్ హోటల్‌ను అడ్డాగా మార్చుకుని రాసలీలలకు దిగాడని శ్వేత తమతో చెప్పిందని ఆ కుటుంబం అంటోంది. తన గుట్టు ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఆమెను హత్య చేశాడని, సీలింగ్‌కు ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని శ్వేత కుటుంబం ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు తమ బిడ్డకు న్యాయం చేయాలని కోరుతూ పూర్తి ఆధారాలను యూపీ పోలీసులకు అప్పగించింది ఆ కుటుంబం. పరువు పోకూడదని అమ్మ భరించింది దీపక్‌కు పలువురు మహిళలతోనే వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయంలో ఇంట్లో చాలాసార్లు గొడవలు జరిగాయని వీళ్ల ఇద్దరు కూతుళ్లు చెప్తున్నారు. అంతేకాదు ఇద్దరు ఆడపిల్లలు కావడంతో తమ తండ్రికి మరో వివాహం చేయాలని.. ఆయన కుటుంబం ప్రయత్నించిందని వాళ్లు అంటున్నారు. ఈ విషయమై చాలాసార్లు తమ తల్లి(శ్వేత) మీద దాడి జరిగిందని, కానీ పరువు పోకూడదనే ఉద్దేశంతో ఆమె ఇంతకాలం భరిస్తూ వచ్చిందని ఆ ఇద్దరు కూతుళ్లు అంటున్నారు. అదే టైంలో రాజేష్ అనే వ్యక్తి పేరిట.. దీపక్-శ్వేతల మధ్య ఓ వీడియో వైరల్ కావడం విశేషం. చదవండి: తల్లితో సహజీవనం.. ఏడాది కాలంగా కుమార్తెపై అత్యాచారం.. -
చెడు అలవాట్లకు బానిసై.. దోపిడీకి స్కెచ్ వేసి!
సిద్దిపేట కమాన్: సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సమీపంలో జరిగిన కాల్పులు, దోపిడీ కేసును సిద్దిపేట పోలీసులు ఛేదించారు. చెడు అలవాట్లకు బానిసై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రూ.43.50 లక్షలు దోచుకెళ్లిన ఈ ఘటనపై సిద్దిపేట పోలీసు కమిషనర్ ఎన్.శ్వేత 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి రూ.34 లక్షలు రికవరీ చేసి, మూడు వాహనాలు, మూడు సెల్ఫోన్లు సీజ్ చేశారు. ఈ కేసు వివరాలను సోమవారం పోలీస్ కమిషనర్ మీడియాకు వెల్లడించారు. సిద్దిపేట పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వకులాభరణం నర్సయ్య తన ప్లాట్‌ను శ్రీధర్‌రెడ్డికి విక్రయించాడు. రిజిస్ట్రేషన్ చేయడానికి జనవరి 31న సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఇద్దరూ వచ్చారు. ప్లాట్ కొనుగోలుదారుడు చెల్లించిన రూ.43.50 లక్షల నగదు బ్యాగును నర్సయ్య తన కారు డ్రైవర్‌కు ఇచ్చి కార్యాలయంలోనికి వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గన్‌తో డ్రైవర్‌పై కాల్పులు జరిపి నగదుబ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు ఆదివారం ఎడమ సాయికుమార్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు మిగతా ముగ్గురు నిందితులు గజ్జె రాజు(26), బలిపురం కరుణాకర్ (28), సికింద్రాబాద్‌లోని చాచా నెహ్రూనగర్‌కు చెందిన బిగుళ్ల వంశీకృష్ణ (20)లను అదుపులోకి తీసుకున్నారు. పాత నేరస్థులే... ప్రధాన నిందితుడైన సిద్దిపేట జిల్లా కొం డపాక మండలం మంగోల్‌కి చెందిన గజ్జె రాజు(26) మేడ్చల్ జిల్లాలోని బండ్లగూడలో నివాసముంటున్నాడు. రాజుకు బండ్లగూడకు చెందిన ఎడమ సాయికుమార్(22) సమీప బంధువు. వీరిపై సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు 2021, ఆగస్టులో పోక్సోచట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. సెప్టెంబర్‌లో బెయిల్‌పై బయటకు వచ్చారు. జల్సాలకు అలవాటు పడిన వీరికి ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకొని ఈ ఘటనకు పాల్పడ్డారు. గన్‌పై ఆరా కాల్పుల ఘటనలో ఉపయోగించిన గన్ను నిందితులు ఎక్కడ, ఎప్పుడు కొనుగోలు చేశారు.. ఇంతకు ముందు ఎక్కడైనా దానిని వినియోగించారా, ఈ కేసులో ప్లాటు క్రయ విక్రయదారుల ప్రమేయం ఉందా? లేదా ? అనే విషయాలపై దర్యాప్తు కోసం సిద్దిపేట ఏసీపీ చల్లా దేవారెడ్డి ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. -
జనవరి 31న సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద కాల్పులు
-
టిక్‌టాక్ స్టార్‌కి ప్రపోజ్ చేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్
Bigg Boss 4 Fame Mehaboob Dil Se Proposed To Swetha Naidu: బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సే గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యూట్యూబ్, టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయిన మెహబూబ్ గతేడాది బిగ్‌బాస్ సీజన్-4లో పాల్గొని మరింత పాపులర్ అయ్యాడు. ఇటీవలె 'గుంటూరు మిర్చి' అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించాడు. ప్రస్తుతం కవర్ సాంగ్స్, వెబ్‌సిరీస్‌లు చేస్తూనే, మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా యూట్యూబర్, టిక్‌టాక్ స్టార్ శ్వేత నాయుడుకు ప్రపోజ్ చేశాడు. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ కలిసి కవర్ సాంగ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ మెహబూబ్ ఎక్కువగా శ్వేత నాయుడుతోనే రీల్స్ అప్లోడ్ చేస్తుంటాడు. తాజాగా ఆమెకు తన ప్రేమ విషయాన్ని బయటపెట్టాడు. 'ఎప్పటి నుంచో చెబ్దాం అనుకున్నా. కానీ ఎప్పుడు ఎలా అయ్యిందో తెలియదు. ఎందుకు ఇష్టం అన్నదానికి ఆన్సర్ తెలియదు. నువ్వు నా తోడుంటే బెటర్, సక్సెస్ఫుల్ పర్సన్‌ని అవుతా. నాతో జీవితాంతం తోడుంటావా' అంటూ తన మనసులో మాటను రివీల్ చేశాడు. దీంతో శ్వేత సైతం సిగ్గుపడుతూ మెహబూబ్ ప్రేమను అంగీకరించింది. దీనికి సంబంధించిన వీడియోను మెహబూబ్ తన సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. మరి ఈ ఇది రియల్ వీడియోనా లేక యూట్యూబ్ కోసం చేసిన ఫ్రాంక్ వీడియోనా అన్నది తెలియాల్సి ఉంది. -
తొక్కలో రిలేషన్షిప్ నాకొద్దన్న యానీ.. కన్నీళ్లు పెట్టుకున్న శ్వేత
బిగ్‌బాస్ ఇంట్లో ఆరోవారం గొడవల వారంగా మారింది. నామినేషన్ ప్రక్రియలో మొదలైన గొడవలు.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’అనే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇంటి సభ్యుల మధ్య చిచ్చుపెట్టినట్లు తెలుస్తోంది. టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు బ్లూ, రెడ్, ఎల్లో, గ్రీన్ అనే నాలుగు టీమ్‌లుగా విడిపోయారు. అందులో గ్రీన్ టీమ్ సభ్యులైన రవి, లోబో, శ్వేతలకు స్పెషల్ ఫవర్ లభించింది. దీంతో వారు మిగిలిన మూడు టీమ్‌లలో తమకు నచ్చిన టీమ్ సభ్యులు తయారు చేసిన బొమ్మలను స్వాధీనం చేసుకోవచ్చు. ఈ స్పెషల్ ఆఫరే బిగ్‌బాస్ ఇంట్లో పెద్ద గొడవకు దారి తీసినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. రవి టీమ్ సభ్యులు తమ స్పెషల్ పవర్‌ను ఉపయోగించి యానీ మాస్టర్ టీమ్ బొమ్మలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో యానీ మాస్టర్ మరో ప్లాన్ చేసింది. శ్వేత దాచిపెట్టిన బొమ్మలను లాక్కునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో శ్వేత, యాజీల మధ్య పెద్ద గొడవే జరిగింది.దీంతో బాగా హర్ట్ అయిన యానీ.. లాస్ట్ టాస్క్‌లో ఫ్రెండ్‌ని కోల్పోయా.. ఈ టాస్క్‌లో బిడ్డని కోల్పోయా.. అలాంటి తొక్కల రిలేషన్షిప్ నాకొద్దంటూ బయటకు వచ్చేసింది. దీంతో బెడ్‌పై పడుకొని శ్వెత కన్నీటిపర్యంతమైంది. మరి యానీ అంతలా ఫైర్ అవడానికి కారణం ఏంటో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
బిగ్‌బాస్ పత్తేపారం.. రవి, లోబో, శ్వేతలకు జాక్‌పాట్
Bigg Boss Telugu, Episode 38 Highlights : నిన్నటి నామినేషన్ ప్రక్రియతో బిగ్‌బాస్ హౌస్ అంతా గంభీరంగా మారిపోగా..నేడు ఆ గొడవల నుంచి బయటకు వచ్చి కాస్త రిలాక్స్ అయ్యేందుకు ప్రయత్నించారు ఇంటి సభ్యులు. ఇంతలోనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చి మళ్లీ హౌస్‌లో యుద్ధ వాతావరణం నెలకొల్పాడు బిగ్‌బాస్. ఈ పోటీలో భాగంగా ఇంటి సభ్యులంతా మళ్లీ టీమ్‌లుగా విడిపోయారు. గేమ్ కోసం ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. యానీ మాస్టర్ అయితే ఆవేశంతో ఊగిపోయారు. సిరి చిన్నబోయింది.. రవి, లోబో, శ్వేతలో ఆనందంతో చిందులేశారు. ఇంకా బిగ్‌బాస్ హౌస్‌లో నేడు ఏమేం జరిగిందో నేటి ఎపిసోడ్లో చదివేద్దాం. సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియ గురించి ఇంటి సభ్యులంతా గుసగుసలు మొదలు పెట్టారు. యాక్టర్స్ అంటూ శ్రీరామ్ నోరు జారడంపై సిరి, షణ్ముఖ్, జెస్సీ మరోసారి సీరియస్ అయ్యారు. ఇక షణ్నూ అయితే గత వారం నామినేషన్ ప్రక్రియను ఇంకా మర్చిపోవడం లేదు. . సీక్రెట్ నామినేషన్స్ అంటే 8 మంది నామినేట్ చేశారు.. ఇప్పుడు డైరెక్ట్ నామినేషన్స్ అంటే ఇద్దరే నామినేట్ చేశారు అని ఇంటి సభ్యులందరిపై అసహనం వ్యక్తం చేశాడు. ప్రియ ఏమో సన్నీ గురించి ప్రియాంక దగ్గర చెబుతూ.. ‘ప్రతి వారం నామినేట్ చేస్తానని అంటున్నాడు. ఆయన నన్ను బెదిరిస్తున్నాడా? మానస్‌ని హెల్ప్ చేయమని తనే పంపానని చెప్పాడు.. సన్నీ చెబితేనే మాసన్ వింటాడా? ఆయనకు ఏం చేయాలిపిస్తే అదే చేస్తాడుగా’అంటూ సన్నీ మాటలకు కౌంటర్ ఇచ్చింది. మరోవైపు మాస్టర్ని ఎందుకు నామినేట్ చేశావని విశ్వని శ్రీరామ్ అడిగాడు. తను ప్రతిసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని నామినేట్ చేస్తాననడం తనకు నచ్చలేదని, అందుకే నామినేట్ చేశానని విశ్వ చెప్పుకొచ్చాడు. మన రాజుకు బుర్రలేదు : షణ్నూ నామినేషన్స్‌లో జరిగిన రచ్చపై త్రిమూర్తులు జెస్సీ, సిరి, షణ్ముఖ్ చర్చ పెట్టారు. లోబోని సన్నీ వెనుకేసుకొస్తున్నాడని జశ్వంత్ చెప్పగా.. మన రాజుకు బుర్రలేదని, ఉంటే ఆ టాస్క్ మనమే గెలిచేవామని షణ్ముఖ్ చెప్పాడు. ఐన్‌స్టీన్ E=mc2 ఎందుకు కనిపెట్టాడో కూడా కనుక్కోవచ్చు. కానీ ఎలిమినేషన్స్ అర్థంకావు’అని షణ్నూ చేసిన ఫన్నీ కామెంట్‌కి జెస్సీ, సిరి పగలబడి నవ్వారు. చర్రితలోనే ఫస్ట్ టైమ్ ఇలాంటి బ్రేకప్! సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో శ్రీరామ్, కాజల్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఇకపై తనను సిస్టర్ అని పిలవొద్దని శ్రీరామ్‌కు చెప్పింది కాజల్.నేడు కూడా అదే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. బెడ్రూమ్లో ఉన్న కాజల్ దగ్గరకు శ్రీరామ్ వెళ్లగా.. ‘బ్రేకప్ బ్రో.. చరిత్రలో బ్రదర్ అండ్ సిస్టర్ బ్రేకప్ ఫస్ట్ టైమ్ కదా’అంటూ నవ్వుతూ చెప్పింది. దాన్ని కామెడీగానే స్వీకరించి శ్రీరామ్.. అవునవును అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’ ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌గా ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’అనే గేమ్ ఇచ్చాడు. ఇందులో కంటెస్టెంట్స్ అంతా నాలుగు టీమ్‌లుగా విడిపోయారు. బ్లూ టీమ్‌లో సభ్యులు: మానస్, సన్నీ, యానీ మాస్టర్ ఎల్లో టీమ్ సభ్యులు షణ్ముఖ్, ప్రియాంక, జెస్సీ రెడ్ టీమ్ సభ్యులు : విశ్వ, శ్రీరామ్, ప్రియ గ్రీన్ టీమ్ సభ్యులు : రవి, లోబో, శ్వేత సిరి, కాజల్ ఫ్యాక్టరీ మేనేజర్, సంచాలకులుగా వ్యవహరిస్తారని చెప్పారు బిగ్ బాస్. రెడ్ అండ్ గ్రీన్ టీంకి మేనేజర్స్‌గా సిరిని.. బ్లూ, ఎల్లో టీంకి కాజల్‌కి మేనేజర్స్‌గా నియమించారు. వీళ్లే బొమ్మల నాణ్యతని తనిఖీ చేసి ఎటువంటి లోపాలు లేకుండా చూస్తారు. కెప్టెన్సీ పోటీ దారులు అవ్వాలంటే.. ప్రతి టీమ్ ప్రత్యర్థుల కంటే ఎక్కువ బొమ్మలు తయారు చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్న కన్వేయర్ బెల్ట్‌పై నుంచి బొమ్మలకు సంబంధించి రా మెటీరియల్ వస్తుంది. వాటిని తీసుకొని బొమ్మలను తయారు చేయాల్సి ఉంటుంది. గెలిచిన టీంకి మేనేజర్‌గా ఉన్నవాళ్లకి కూడా కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. అయితే బొమ్మల్లో కాటన్ సరిగా పెట్టకపోవడంతో.. ఇదో పత్తేపారం.. బొమ్మల్లో పత్తి లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారు అంటూ మానస్ పంచ్ వేశాడు యానీ మాస్టర్ ఉగ్రరూపం.. సిరిపై చిందులు ఈ టాస్క్‌లో భాగంగా యానీ మాస్టర్, సిరిల మధ్య మాటల యుద్దం జరిగింది. సంచాలకులుగా ఉన్నవారు బొమ్మల కౌంటింగ్ సరిగా చేయాలని, బజర్ మోగిన తర్వాత బొమ్మలను తెస్తే నేను యాక్సెప్ట్ చేయను.. గొడవ చేస్తాని యానీ మాస్టర్ అనగా.. 'మాకెవరూ ఏం చెప్పొద్దూ.. సంచాలకురాలిగా మేం చూసుకుంటాం' అంటూ సిరి చెప్పింది. దీంతో యానీ మాస్టర్ ఉగ్రరూపం దాల్చింది. 'నేను అంత రూడ్ కాదు.. నువ్ నన్ను అలా బ్లేమ్ చేయలేవు.. నాకు డ్రామాలు ఆడడం రాదు.. నేను డ్రామా క్వీన్ కాదు' అంటూ మండిపడింది. దీంతో బాగా హర్ట్ అయిన సిరి.. గేమ్ ఫేర్‌గా అడినప్పటికీ.. నేను ఒక టీమ్(షణ్ను ఉన్న ఎల్లో టీమ్)కే సపోర్ట్ చేస్తున్నానని అంటున్నారు.. ఇకపై అలానే ఆడుతాను. 'ఇప్పుడు నా చేతుల్లో గేమ్ ఉంది.. నేను ఆడతాను’అని సిరి అనగా.. గేమ్‌కి రెస్పెక్ట్ ఇచ్చి జన్యూన్‌గా ఆడాలని షణ్ముఖ్ సర్థి చెప్పాడు. రవి టీమ్‌కి జాక్‌పాట్ ఇక ఈ టాస్క్‌లో గ్రీన్ టీమ్ సభ్యులైన రవి, లోబో, శ్వేతాలకు స్పెషల్ పవర్ లభించింది. స్పెషల్ బొమ్మ రావడంతో దాని ద్వారా వేరే టీం దగ్గర ఉన్న బొమ్మల్ని తీసుకునే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. ఇక రేపటి ఎపిసోడ్లో యానీ మాస్టర్, శ్వేతల మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తెలుస్తోంది. లాస్ట్ టాస్క్‌లో ఫ్రెండ్‌ని కోల్పోయా.. ఈ టాస్క్‌లో బిడ్డని కోల్పోయా.. అలాంటి తొక్కల రిలేషన్షిప్ నాకొద్దంటూ యానీ మాస్టర్ తన అసలు రూపాన్ని బయటపెట్టింది. -
ఆమెను నా గర్ల్‌ఫ్రెండ్ చేయండి.. బిగ్‌బాస్‌కు జెస్సీ రిక్వెస్ట్
బిగ్‌బాస్ హౌస్‌లో జెస్సీ అంటే మిగతా కంటెస్టెంట్స్ అందరికి మంచి అభిప్రాయం ఉంది. అందరికి కంటే చిన్నోడు కావడం, అమాకత్వంగా వ్యవహరించడం అతనికి కలిసొస్తుంది.అయితే సొంతంగా నిర్ణయాలు తీసుకోకపోవడం, షణ్ముఖ్ చెప్పింది చేయడం జెస్సీకి మైనస్ అనే చెప్పాలి. ఇదే విషయంపై హోస్ట్ నాగార్జున కూడా జెస్సీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. నీ నిర్ణయాలు నువ్వే తీసుకో అని సలహా కూడా ఇచ్చాడు. (చదవండి: బిగ్‌బాస్: డేంజర్ జోన్లో ఆ ముగ్గురు, ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..) అయితే కెప్టెన్‌గా జెస్సీ చెప్పే మాటలను కొంతమంది పట్టించుకోవడం లేదు. దీంతో అప్పుడప్పుడు జెస్సీ ఇరిటేట్ అవుతున్నాడు కూడా. ఇదంతా పక్కన పెడితే అమ్మాయిలతో పులిహోర కలపడంలో జెస్సీ తక్కువేమి కాదు. చాన్స్ దొరికితే చాలు.. సిరి, హమిదా, శ్వేతలను ఫ్లటింగ్ చేయడానికి ట్రై చేస్తాడు. తన అమాయకమైన మాటలతో వారిని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తాడు. తాజాగా శ్వేతతో పులిహోర కలిపాడు ఈ అమాయకపు చక్రవర్తి. శ్వేతకు తన గర్ల్‌ఫ్రెండ్ పాత్ర ఇచ్చి ఓ టాస్క్ఇవ్వడంటూ ఏకంగా బిగ్‌బాస్‌కే విజ్ఞప్తి చేశాడు. ‘నేను రిక్వెస్ట్ చేస్తున్నా బిగ్‌బాస్.. మా ఇద్దరిని కలిపి బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్‌గా ఓ రోల్ పెట్టండి. ‘మనోహర.. మనోహర’అనే రొమాంటిక్ సాంగ్ ప్లే చేయండి’అంటూ బిగ్‌బాస్‌కు విజ్ఞప్తి చేశాడు. ఇక జెస్సీ మాటలకు శ్వేత పడిపడి నవ్వింది. మరి ఈ అమాయకపు చక్రవర్తి కోరికను బిగ్‌బాస్ నెరవేర్చాడో లేదో తెలియాలంటే.. నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
దారుణం: అందరూ చూస్తుండగానే శ్వేతను చంపేశాడు
సాక్షి, చెన్నై: ప్రేమోన్మాదానికి గురువారం చెన్నైలో మరో యువతి బలైంది. తనను ప్రేమించడం లేదన్న ఆగ్రహంతో పట్టపగలు అందరూ చూస్తుండగానే ఆమె మీద ఉన్మాది దాడి చేసి.. గొంతు భాగంలో పలుమార్లు కత్తితో పొడిచాడు. ఆపై తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తాంబరం రైల్వే స్టేషన్ ఆవరణలో సాయంత్రం మూడు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఇతర ప్రయాణికులు రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న ఆ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రేమించ లేదన్న ఆగ్రహంతోనే.. క్రోంపేట జీహెచ్ ఆస్పత్రిలో చికిత్స ఫలించక కాసేపటికి ఆ యువతి మరణించింది. మెరుగైన చికిత్స నిమిత్తం ఉన్మాదిని రాజీవ్‌గాంధీ జీహెచ్‌కు తరలించారు. ఆ యువతి ఐడీకార్డు ఆధారంగా క్రోంపేటకు చెందిన శ్వేతగా గుర్తించారు. ఆ యువకుడి పేరు రామచంద్రన్‌గా తేలింది. క్రోంపేటలో ఉంటున్న శ్వేత.. తాంబరం రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలోని ఎంసీసీ కళాశాలలో మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్ కోర్సు రెండో సంవత్సరం చదువుతోంది. కొంతకాలంగా రామచంద్రన్ ప్రేమ ప్రేరిట శ్వేతను వేధిస్తున్నట్లు సహచర విద్యార్థినులు పోలీసుల దృష్టికి తెచ్చారు. చదవండి: (అత్యాచారం చేసి పదో అంతస్తు నుంచి తోసేశాడు) అలాగే, రైల్వేస్టేషన్ పరిసరాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇక, ఆస్పత్రిలో స్పృహలోకి వచ్చిన రామచంద్రన్‌ను విచారించగా, తామిద్దరం ప్రేమికులుగా పేర్కొనడం గమనార్హం. నాగపట్నంకు చెందిన రామచంద్రన్ చెన్నై శివారులోని ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 2019లో నాగపట్నం నుంచి వస్తుండగా శ్వేతతో తనకు రైలులో పరిచయం ఏర్పడినట్లు వెల్లడించాడు. హఠాత్తుగా తనను దూరం పెట్టడంతోనే ఈ ఘాతకానికి పాల్పడినట్లు రామచంద్రన్ వాంగ్ములం ఇచ్చాడు. కాగా, గతంలో నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో స్వాతి అనే టెక్కిని ఇదే రకంగా ఓ ప్రేమోన్మాది నరికి చంపిన విషయం తెలిసిందే. చదవండి: (వందల కోట్ల రూపాయల ఆస్తి.. వృద్ధుల కిడ్నాప్) -
పిడుగుపాటుకు ముగ్గురి మృతి
కౌటాల (సిర్పూర్): కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో శుక్రవారం పిడుగుపాటుకు ముగ్గురు మృత్యువాతపడ్డారు. కౌటాల మండలం ముత్తంపేట గ్రామానికి చెందిన రైతు బోర్కుట్ పున్నయ్య(52), తల్లీకూతుళ్లు డొంగ్రీ పద్మ(40), డొంగ్రీ శ్వేత(20) తమ తమ పత్తి చేన్లలో ఎరువులు వేయడానికి వెళ్లారు. పనులు ముగించుకుని ఇంటికి బయల్దేరారు. వర్షం వచ్చే అవకాశం ఉందని పద్మ భర్త హŸక్టు.. పద్మ, శ్వేతలను పున్నయ్య ఎడ్లబండిపై గ్రామానికి పంపాడు. పున్నయ్య, ఆయన భార్య రషిక, కుమారుడు బాలాజీ, పద్మ, శ్వేత ఎడ్లబండిపై బయల్దేరారు. అంతలోగానే ఒక్కసారిగా ఎడ్లబండిపై పిడుగుపడింది. దీంతో పున్నయ్య, పద్మ, శ్వేత అక్కడికక్కడే మృతిచెందారు. వీరితోపాటు ఎద్దు కూడా చనిపోయింది. రషిక, బాలాజీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. -
ఎనీ డ్యూటీ.. వుయ్ డూ ఇట్
మహిళా పోలీసులు అంటే రిసెప్షన్, బందోబస్తులకే పరిమితం అనేది ఒకనాటి మాట. మహిళా పోలీసులు అంటే హోంగార్డు నుంచి డిజీ స్థాయి వరకు ఎక్కడ చూసినా వారే అనేది నేటి మాట. సెంట్రీ గార్డ్, పెట్రోలింగ్, డ్రైవర్ పోలీస్ స్టేషన్, సర్కిల్, సబ్‌డివిజన్ ‘ఎనీ డ్యూటీ.. వుయ్ డూ ఇట్’ అనే కాన్ఫిడెన్స్ మహిళా పోలీసుల్లో పెరిగిందని అంటూ పోలీసు శాఖలో మహిళా శక్తి గురించి ఐపీఎస్ ఆఫీసర్, కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎన్.శ్వేత ‘సాక్షి’కి వివరించారు. ‘‘గతంలో పోలీసు శాఖలో ఎక్కడో ఒక చోట మహిళా సిబ్బంది ఉండేవారు. ఏవైనా ఆందోళన ప్రదర్శనలు, వీఐపీల కార్యక్రమాలు ఉంటే మహిళల కోసం మహిళా పోలీసులను ఎక్కడెక్కడి నుంచో రప్పించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భద్రత విషయంలో వుమెన్ సేఫ్టీ వింగ్ తీసుకుంటున్న అనేక చర్యలు మహిళల్లో ఎంతో ధైర్యాన్ని నింపుతున్నాయి. మహిళలు, విద్యార్థినులు, యువతులపై వేధింపులు, దాడులను నిరోధించడంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ‘షీ టీం’ల ద్వారా పోలీసు శాఖ చాలా వరకు సక్సెస్ అయ్యింది. అలాగే వేధింపులు, దాడులకు గురైన మహిళలను చేరదీసి వారికి ధైర్యాన్ని కలిగించేందుకు ‘భరోసా’ కేంద్రాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. భారీగా మహిళల హాజరు ఇటీవల పోలీసు ఎస్సైతో పాటు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్షకు భారీ సంఖ్యలో యువతులు హాజరయ్యారు. అందులో ఎంపికైన వారు ఎసై ్స, కానిస్టేబుల్ శిక్షణ కూడా పూర్తి చేసుకుని విధుల్లో చేరారు. మరోవైపు పోలీసు శాఖలో హోంగార్డు నుంచి అదనపు డీజీ స్థాయి వరకు మహిళా అధికారులు తమ పనితీరుతో గుర్తింపు పొందుతున్నారు. చాలా మంది మహిళా అధికారులు శాంతిభద్రతల పరిరక్షణలో తమదైన శైలిలో పనిచేస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటున్నారు. శ్వేత, ఐపీఎస్ రాష్ట్రంలో అన్ని విభాగాలకు కలిపి 55 వేల మంది వరకు పోలీసులు ఉండగా, అందులో కానిస్టేబుల్ నుంచి అదనపు డీజీ స్థాయి వరకు 4,829 మంది ఉన్నారు. అలాగే 2 వేల మందికి పైగా హోంగార్డులుగా పనిచేస్తున్నారు. పోలీసు శాఖలో మొత్తం ఉద్యోగుల్లో మహిళల సంఖ్య ప్రస్తుతం 10 శాతానికి చేరింది. ఇంకా పెరగాల్సి ఉంది. ఇటీవల ప్రభుత్వం పోలీసు శాఖ ఉద్యోగాలలో మహిళలకు 33 శాతం కేటాయించిన మీదట వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో కొద్దిమంది మాత్రమే మహిళలు ఉన్న పోలీసు శాఖలో ఇప్పుడు దాదాపు ఏడు వేల పైచిలుకు మహిళా అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. డ్రైవింగ్.. ఎనీ టైమ్.. మహిళా పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్సైలు అందరికీ డ్రైవింగ్‌లో శిక్షణ ఉంటుంది. అవసరం ఏర్పడినపుడు వెహికిల్‌ను వారే స్వయంగా నడుపుకుని వెళ్లేలా శిక్షణ ఇస్తారు. మహిళా కానిస్టేబుళ్లు సెంట్రీ డ్యూటీతో పాటు బందోబస్తు డ్యూటీలు, డ్రైవింగ్, పెట్రోలింగ్, ట్రాఫిక్ డ్యూటీలన్నీ చేస్తున్నారు. ఏ డ్యూటీ అయినా చేయగలమని నిరూపిస్తున్నారు. అందుకు మానసికంగానూ సంసిద్ధులయ్యారు. అన్ని రకాల డ్యూటీలు మగవారితో సమానంగా చేసి సత్తా చాటుతున్నారు. మరింత ప్రోత్సాహం అవసరం మహిళా పోలీసు అధికారులు, సిబ్బందిని ప్రోత్సహిస్తే మరింతగా దూసుకుపోతారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎంతో మంది మహిళా ఉన్నతాధికారులు తమ సత్తా చాటుతున్నారు. పోలీసు డ్యూటీ అనగానే మగవారిదనే భావన సమాజంలో మెల్లమెల్లగా మాయమైపోతోంది. దీనికి అనుగుణంగా పోలీసు శాఖలో చేరడానికి మహిళలూ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పది శాతం వరకు మహిళల సంఖ్య పెరిగింది. మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది. మహిళలకు అండగా... పోలీసు స్టేషన్‌కు వెళ్లాలంటే మహిళలు జంకే పరిస్థితులు ఉండేవి. ఆపద ఉందని పోలీసు స్టేషన్‌కు వెళితే తమ గోడు వినేవారు ఉండకపోగా, వాళ్ల నుంచి వచ్చే ప్రశ్నలు ఇబ్బందిపెట్టేవిగా ఉండేవి. అయితే పోలీసు శాఖలో మహిళలు అధికారులుగా వచ్చిన తరువాత అనేక మార్పులు జరిగాయి. ప్రభుత్వం కూడా మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రతీ ఠాణాలో మహిళా రిసెప్షనిస్టును ఉంచడం ద్వారా మహిళలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఏర్పడింది. అలాగే మహిళలపై దాడుల నిరోధానికి షీ టీమ్స్ ఏర్పాటు, మహిళపై జరిగే అఘాయిత్యాల్లో బాధితులకు ‘సఖి’ అండగా నిలవడం, ఇంకా ఎన్నో చర్యలు చేపట్టింది. ముఖ్యంగా మహిళా అధికారులు ఉన్న చోట బాధిత మహిళలు నేరుగా వెళ్లి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తద్వారా వారికి సత్వర న్యాయం అందుతోంది. పోలీసు శాఖలో మహిళల ప్రాతినిధ్యం పెరగడం ద్వారా మహిళలకు కొండంత అండ దొరికినట్టయ్యింది’’ అని వివరించారు శ్వేత. – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి -
సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సముద్ర గర్భంలో ఒక్కటయ్యారు
సాక్షి , చెన్నై: అందరిలా బాజా భజంత్రీల నడుమ కల్యాణమండపంలో పెళ్లి చేసుకుంటే మజా ఏముందని అనుకుంది ఆ జంట. గతంలో తమిళనాడుకు చెందిన ఒక జంట భారీ బెలూన్‌లో ఆకాశంలో ఎగురుతూ పెళ్లి చేసుకుంది. అందుకు పూర్తి భిన్నంగా మరో జంట కడలి గర్భంలో కల్యాణం చేసుకుని మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది. తమిళనాడులో సోమవారం జరిగిన ఈ చిత్రమైన కల్యాణం వివరాలు ఇలా ఉన్నాయి. తిరువన్నామలైకి చెందిన చిన్నదురై, కోయంబత్తూరు జిల్లాకు చెందిన శ్వేతకు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. వీరిద్దరూ చెన్నైలోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. తమ పెళ్లిని ప్రత్యేకంగా జరుపుకోవాలని భావించారు. సముద్రపు జలాల అడుగులో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. పెళ్లికొడుకు చిన్నదురై పుదుచ్చేరికి వెళ్లి స్కూబా డైవింగ్ శిక్షణ కళాశాల నడిపే తన స్నేహితుని వద్ద శిక్షణ పొందాడు. సోమవారం ఉదయం పెళ్లికుమార్తె శ్వేతతో కలిసి చెన్నై సమీపం నీలాంగరై సముద్రంలో ఒక పడవలో అలలపై ప్రయాణిస్తూ 60 అడుగుల దూరానికి చేరుకున్నాడు. వధూవరులిద్దరూ అక్కడ పెళ్లి దుస్తులు వేసుకున్నారు. ఆక్సిజన్ సిలిండర్ అమర్చిన స్కూబా డైవింగ్ డ్రస్సును ఇద్దరు వేసుకుని సముద్రంలోకి దూకారు. సముద్రపు అడుగు భాగంలో ఉండే మొక్కల మధ్య పూలతో అలంకరించి ఉన్న వివాహవేదిక వద్దకు చేరుకున్నారు. అలల్లో తేలియాడుతూనే ఇద్దరూ మాలలు మార్చుకున్నారు. ఆ తరువాత పెళ్లికుమారుడు చిన్నదురై పెళ్లికుమార్తె శ్వేత మెడలో తాళి బొట్టుకట్టాడు. మాంగల్యధారణ పూర్తికాగానే వధూవరులిద్దరూ సముద్రతీరానికి చేరుకోగా అప్పటికే అక్కడ సిద్దంగా ఉన్న బంధువులు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సముద్ర గర్భంలో మాంగల్యధారణ దృశ్యం కాలుష్యంపై చైతన్యం కోసం.. వివాహానంతరం వరుడు చిన్నదొరై మీడియాతో మాట్లాడుతూ.. సముద్రంలోకి వెళ్లినప్పుడు సందర్శకులు విచ్చలవిడిగా విసిరేసిన వ్యర్థాలు, వాటి వల్ల ఏర్పడిన కాలుష్యాన్ని చూసి బాధపడి, కడలిని కాపాడుకోవాలని ప్రజలకు సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా పెళ్లి చేసుకున్నానని చెప్పారు. పెళ్లిని నేరుగా చూడలేకపోయిన లోటును తీర్చేందుకు ఈ నెల 13న చెన్నై శోళింగనల్లూరులో రిసెప్షన్ ఏర్పాటు చేశానని ఆయన తెలిపారు. -
సాఫ్ట్వేర్ శ్వేత మృతి: కేసులో కొత్త కోణం
సాక్షి, హైదరాబాద్: ప్రేమ వంచనకు గురై ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్వేత మృతి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని ఆమె తల్లిదండ్రులు చెప్తున్నారు. తమ బిడ్డ ప్రాణాలు తీసుకునేంత పిరికిది కాదని అన్నారు. అజయ్ శ్వేతను రైలు పట్టాల వద్దకు తీసుకెళ్లి చంపేసి ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. తమ బిడ్డను అజయ్ హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారని మీడియా ఎదుట వాపోయారు. అతనికి కొందరు పోలీసులు కూడా సాయం చేస్తున్నారని ఆరోపించారు. (చదవండి: మరో మహిళతో అడ్డంగా బుక్కైన కానిస్టేబుల్) ప్రేమ పేరుతో అజయ్ తమ కూతురుని వేధింపులకు గురిచేశాడని శ్వేత తల్లిదండ్రులు వెల్లడించారు. ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి బ్లాక్ మెయిల్‌కు దిగాడని అజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని రాచకొండ కమిషనర్‌ను కలిశామని మంగళవారం మధ్యాహ్నం తెలిపారు. కాగా, మేడిపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని శ్వేత ఘట్కేసర్ రైలు పట్టాలపై శవమై కనిపించిన సంగతి తెలిసిందే. లాలాపేటకు చెందిన అజయ్ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేమ పేరుతో ఆమెను వంచించడం వల్లనే బలవన్మరణానికి పాల్పడిందని ప్రచారం జరిగింది. (చదవండి: ప్రియుడి వంచన.. టెకీ ఆత్మహత్య) -
విషాదం: పరీక్ష రాసేందుకు వెళ్తూ ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్ : ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాన్ని బలతీసుకుంది. పరీక్ష రాయడానికి వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను దురదృష్టం యుముడిలా వెంటాడింది. వెనుకనుంచి వేగంగా వచ్చిన లారీ ఓ యువతి, యువకుడిని ఢీ కొట్టడంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. వివరాల ప్రకారం.. జహీరాబాద్‌కు చెందిన శ్వేతా, శ్రీనివాస్ డైట్‌సెట్ పరీక్ష రాసేందుకు బైక్‌పై ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ పరీక్ష కేంద్రానికి వెళ్తున్నారు. మదీనాగూడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వారు ప్రయాణిస్తున్న బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్వేత, శ్రీనివాస్ అక్కడిక్కడికే మృతి చెందారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే వీరిద్దరు మృత్యువాత పడినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఇక విషయం తెలిసిన వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పరీక్ష రాసేందుకు వెళ్లిన తమ పిల్లలు ఇక తిరిగిరాదనే చేదు నిజం వారిని విషాదంలో ముంచింది. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను మియాపూర్ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
వాటికి నా ఆన్సర్ ‘నో’ అని చెప్తాను
శ్వేత త్రిపాఠి... మల్టీప్లెక్స్, ఓటీటీతో పరిచయం ఉన్నవాళ్లందరికీ తెలిసిన నటి. తన నటనా సామర్థ్యాన్ని సవాలు చేసే పాత్రలంటే అమితమైన అభిమానం ఆమెకు. బర్త్ ప్లేస్ ఢిల్లీ. తండ్రి ఐఏఎస్ ఆఫీసర్. తల్లి టీచర్. ఇద్దరు తోబుట్టువులు.. అక్క, తమ్ముడు. భరతనాట్యం, కథక్ నృత్యాల్లో శిక్షణ పొందింది. ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో డిగ్రీ చదివింది. యాక్టింగ్‌లో భవిష్యత్‌ను వెదుక్కుందామని ముంబై వచ్చి ఫొటోగ్రఫీ ప్రేమలో పడిపోయింది. ఫెమినా మ్యాగజైన్లో ఫొటో ఎడిటర్‌గా చేరింది. నటనలో తర్ఫీదు తీసుకోవడానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరమని సన్నిహితులు చెప్పారు. కాని ఫ్యాషన్ డిగ్రీ కోసం అప్పటికే నాలుగేళ్ల చదువు ఎక్కవనుకున్న శ్వేత యాక్టింగ్ కోసం ఎన్ఎస్డీలో మళ్లీ మూడేళ్లు వెచ్చిచండం వేస్ట్ అనుకుంది. అందుకే షార్ట్‌కట్‌ను ఎంచుకుంది తన టాలెంట్‌కు మెరుగులు దిద్దుకోవడానికి.. ఎన్ఎస్డీ డైరెక్టర్ (అప్పటి) నిర్వహించిన ఆర్నెల్ల వర్క్‌షాప్‌కు హాజరై. కెమెరా కంటే ముందు కెమెరా వెనక పనిచేసింది అసిస్టెంట్ డైరెక్టర్‌గా. సినిమాల్లో కంటే ముందు టెలివిజన్ సీరియల్లో కనిపించింది. ఆమె ఫస్ట్ టెలివిజన్ షో... క్యా మస్త్ హై లైఫ్. తొలి సినిమా.. మసాన్. థియేటర్ (నాటకాలు) అంటే కూడా శ్వేతకు చాలా ఇష్టం. ఒకవైపు ఫెమినాలో ఉద్యోగం చేస్తూనే ఇంకో వైపు థియేటర్లో ఎక్స్పరిమెంట్స్ చేసేది. ఫెమినా జాబ్ వదిలేశాక నాటకాల కోసం ఒక ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించింది ‘ఆల్ మై టీ (All My Tea) ప్రొడక్షన్స్’ పేరుతో. నాట్యం, స్కూబా డైవింగ్, ట్రావెలింగ్, రీడింగ్ అంటే కూడా ఆమెకు ఆసక్తే. దంగల్ ఆడిషన్స్‌కు వెళ్లింది... కాని ఆ పాత్రకు ఫాతిమా సనా షేఖ్ ఖరారు అయింది. ‘‘అలా ఏరికోరి ఎందుకు ఎంచుకుంటావ్.. వచ్చిన అవకాశాలన్నిటినీ అందుకోక? అని నా శ్రేయోభిలాషులు చాలామంది సలహాలిస్తూంటారు. కాని నేనలా చేయలేను. ఆర్టిస్ట్‌గా నేనేం చేస్తున్నానో జనాలు గమనిస్తారు. సినిమాల్లోనే కాదు ప్రకటనల విషయంలోనూ ఆ ఎరుకతో ఉంటా. అందుకే ఫెయిర్‌నెస్ క్రీమ్స్, ఫాస్ట్ ఫుడ్ ప్రమోషన్ యాడ్స్‌కు నేను దూరం. వాటికి నా ఆన్సర్ ‘నో’ అని చెప్తుంది శ్వేత త్రిపాఠి. -
అనుమానాస్పద మృతి.. కొంతకాలంగా ఫోన్లో
చిలకలగూడ: అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి చెందిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... రైల్వే ఉద్యోగి గట్టు లక్ష్మీనారాయణ చిలకలగూడ రైల్వే క్వార్టర్స్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. కొంతమేర శిథిలమైన మూడు అంతస్థుల భవనంలో లక్ష్మీనారాయణ కుటుంబం మాత్రమే ఉంటోంది. అతని కుమార్తె మయూరి(18) స్థానిక రైల్వే కళాశాలలో ద్వితీయ ఇంటర్ చదువుతోంది. కొంతకాలంగా ఎవరితోనో ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడుతున్న తన కుమార్తె, ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5.30 గంటల నుంచి కనిపించడం లేదని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిందని భావిస్తున్న రోజు రాత్రి 9.30 గంటలకు ఆమె ఫోన్ ఎంగేజ్ వచ్చిందని, కొంత సమయం తర్వాత మరోసారి కాల్ చేస్తే నాట్ రీచబుల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 7.30 గంటలకు లక్ష్మీనారాయణ ఉంటున్న భవనం సమీపంలో ఓ యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఆ మృతదేహం మయూరిదేనని వారు గుర్తించారు. భవనం టెర్రస్ పైన పిట్టగోడ కేవలం మూడు అడుగులు మాత్రమే ఉందని, ఫోన్ మాట్లాడుతూ ఆమె ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెంది ఉంటుందని ప్రాథమిక దర్యాప్తులో తేలినప్పటికీ.., మృతురాలి చెప్పులు టెర్రస్‌పైనే ఉండటం, మృత దేహానికి కొద్ది దూరంలో పగిలిపోయిన సెల్‌ఫోన్ పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తున్నది. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి దర్యాప్తు చేపట్టామని చిలకలగూడ ఇన్స్పెక్టర్ బాలగంగిరెడ్డి తెలిపారు. విద్యార్థిని మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. యువతి అదృశ్యం చాంద్రాయణగుట్ట: కిరాణ దుకాణానికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయిన సంఘటన ఛత్రినాక పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మోజీరాం సమాచారం మేరకు... లక్ష్మీనగర్‌కి చెందిన వీరస్వామి కుమార్తె శ్వేత(22) ఈ నెల 28న ఉదయం స్థానికంగా ఉన్న కిరాణ దుకాణానికి వెళుతున్నానని చెప్పి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలు ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేదు. ఈ విషయమై శ్వేత పెద్దమ్మ కల్పన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆచూకీ తెలిసిన వారు ఫోన్: 94906 16500లో సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. -
నా కోసం ఎవరూ ఏడ్వకండి..
సాక్షి, మిర్యాలగూడ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రభుత్వ వైద్యుడి భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. రెడ్డి కాలనీలోని అహల్య అపార్ట్మెంట్లోని నివాసంలో దంత వైద్యురాలు శ్వేత ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. కాగా ఆమె భర్త బండారు కుమార్ పిల్లల వైద్య నిపుణులు. వీరికి తొమ్మిదేళ్ల కుమార్తె ఉంది. పట్టణంలో భార్యాభర్తలకు మంచి పేరు ఉంది. కుటుంబ కలహాలు కారణంగా తరచుగా ఇద్దరూ గొడవ పడుతూ ఉండేవారని ఇరుగుపొరుగు చెబుతున్నారు. మనస్పర్థల కారణంగానే శ్వేత జీవితంపై విరక్తి చెంది ఈ ఘటనకు పాల్పడ్డారు. తన చావుకు ఎవరూ కారణం కాదని, జీవితంపై విరక్తితోనే ఈ ఘటనకు పాల్పడుతున్నానంటూ డైరీలో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సూసైడ్ నోట్లో...తనకు భర్తతో జీవితాంతం కలిసి జీవించాలని ఉన్నా ఆ కోరిక తీరడం లేదని, తన పేరు మీద ఉన్న ఆస్తి పాస్తులు తన కూతురికి చెందాలని, తనకోసం ఎవరూ కేసులు పెట్టుకుని గొడవలు పడొద్దని డైరీలో రాశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా భార్య మృతదేహం చూసి డాక్టర్ కుమార్ భోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఇటలీలో మన గాయని
ప్రతిభతో పదిమందిలో గుర్తింపు వచ్చాక వ్యక్తిత్వమే ప్రధానమవుతుంది. ప్రతిభ కన్నా మనకున్న సామాజిక బాధ్యతనే ప్రామాణికంగాతీసుకుంటారు! అలా చూసినప్పుడు ప్రతిభతో పాటు తన సామాజిక బాధ్యతను కూడా చాటుతున్నారు ప్రముఖ సినీ గాయని, నటి శ్వేతా పండిట్.కరోనా వైరస్ స్వేచ్ఛగా విహరిస్తున్న వాతావరణంలో మనం ఇంటి నుంచి అడుగు బయటపెట్టకపోవడమే సామాజిక బాధ్యతగా.. దేశసేవగా మారుతోంది. దీనికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ శ్వేతా పండిట్. గాన గంధర్వుడు పండిట్ జస్రాజ్కు మనవరాలు (మేనకోడలి కూతురు) శ్వేతా పండిట్. నెల రోజుల కిందట ఇటలీకి వెళ్లిన ఆమె రోజురోజుకి అక్కడ కరోనా వ్యాప్తి తీవ్రమవడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. అప్పటికి మన దేశంలో కరోనా ప్రభావం లేకపోయినప్పటికీ.. ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ రాలేదు. ‘కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న ఇక్కడి (ఇటలీ) నుంచి నేను అక్కడికి రావడం బాధ్యతారాహిత్యమే అవుతుంది. విమాన ప్రయాణం అంత సేఫ్ కాదు. నాకే కాదు భారతదేశంలో నేను చేరుకునే ప్రదేశానికి కూడా. అందుకే నెల రోజులుగా ఇటలీలో నేనుంటున్న ఇంట్లోంచి బయటకు రాకుండా కాలక్షేపం చేస్తున్నాను. ఇక్కడ భయంకరమైన పరిస్థితి. అంబులెన్స్ సైరన్ వింటూ నిద్రపోతున్నాను. మళ్లీ తెల్లవారి ఆ సైరన్‌తోనే నిద్రలేస్తున్నాను. అంబులెన్స్ శబ్దం తప్ప ఇంకేదీ వినిపించడం లేదు. రోడ్ల మీద అవి తప్ప ఇంకేవీ తిరగడం లేదు. ఫ్రెండ్స్.. మీరంతా కూడా జాగ్రత్తగా ఉండండి.. గవర్నమెంట్ చెప్పే సూచనలు పాటించండి.. ఇంట్లోంచి బయటకు రాకండి.. ఇవి మనకు కీలకమైన రోజులు. జాగ్రత్తగా ఉంటే పెద్ద గండం నుంచి గట్టెక్కిన వాళ్లమవుతాం. లేదంటే.. పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఆ దుస్థితి మనకు రావద్దు’ అంటూ అక్కడి విషయాలను, వార్తలను, తన క్వారంటైన్ కాలాన్ని ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, మన క్షేమాన్ని కోరుతున్నారు శ్వేత. ఈ దేశానికి రాకుండా అక్కడే ఉండిపోయిన శ్వేత నిర్ణయాన్ని, ఆమె సాహసాన్ని అభినందిస్త్నురు పలువురు సినీప్రముఖులు, రాజకీయనేతలు.ప్రతిభాశాలి శ్వేతా పండిట్ బాలీవుడ్‌తోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ పాటలు పాడారు.. పాడుతున్నారు. నాలుగేళ్ల వయసులోనే మణిరత్నం ‘అంజలి’తో సినిమాల్లో పాటల ప్రయాణం మొదలుపెట్టారు. హిందీలోకీ డబ్ అయిన అంజలీలో కూడా ఆమే పాడారు. దాంతో బాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి పిన్న వయస్కురాలు అనే కితాబునూ పొందారు శ్వేత. తబలా వాద్యకారుడు ఉస్తాద్ జాకిర్ హుస్సేన్‌తో కలిసి తొమ్మిదో యేటనే సింగీత దర్శకురాలిగా మారారు . ‘సాజ్’ అనే హిందీ సినిమాకు. సాయి పరాంజ్పే దర్శకత్వం వహించిన ఈ సినిమాను లతా మంగేష్కర్ బయోగ్రఫిగా చెప్తారు. శ్వేత క్షేమంగా ఇటలీ నుంచి మన దేశానికి చేరుకోవాలని కోరుకుందాం. -
శ్వేత ఐపీఎస్
‘నాలెడ్జ్ ఈజ్ పవర్.. స్కిల్ ఈజ్ ఎనర్జీ’ అంటారు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత. టెక్నాలజీని పూర్తి స్థాయిలో వాడుకోవడం, మహిళల భద్రత, ఉద్యోగాల ప్రయత్నాల్లో యువతకు ప్రోత్సాహం, పోలీసు పాలనలో నూతన ఆవిష్కరణలు.. ఇలా అనేక కార్యక్రమాలను స్వచ్ఛందంగా చేపడుతూ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారు శ్వేత. తెలంగాణలో జిల్లాల పునర్విభజనలో భాగంగా రెండున్నర యేళ్ల క్రితం కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా శ్వేత వచ్చారు. కొద్ది కాలంలోనే సాంకేతికతను ఆయుధంగా చేసుకుని ఎన్నో కొత్త విధానాలను తీసుకువచ్చారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం కల్పించారు. జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలో షీ టీం బృందాలను ఏర్పాటు చేశారు. ఆకతాయిలను గుర్తిస్తూ వారికి మహిళలను గౌరవించడం పట్ల కౌన్సెలింగ్ ఏర్పాటు చేస్తున్నారు. మహిళా పోలీసు సిబ్బంది పురుషులతో సమానంగా ఉండాలంటే వారికి అన్ని పనులు తెలిసి ఉండాలని అందరికి డ్రైవింగ్ నేర్పించారు. విధుల్లో మహిళా సిబ్బంది ఇతరులపై ఆధారపడకుండా ఉండాలనేది శ్వేత ముఖ్యోద్దేశం. కొత్తగా విధుల్లో చేరిన మహిళా కానిస్టేబుళ్లకు మహిళలపై జరిగే దాడులను తిప్పికొట్టడంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఆత్మరక్షణ పద్ధతులను నేర్పించారు. అంతేకాకుండా మహిళల్లో ఆత్యస్థైర్యాన్ని నింపడం కోసం స్వయంగా వారితో మాట్లాడడం, అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడం చేస్తున్నారు. ఎస్పీ శ్వేత 2017 డిసెంబర్ 31న 13 జిల్లాలకు సంబంధించిన సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సెంటర్‌ను కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేయించారు. ఇందుకోసం ఆమె ఎంతగానో శ్రమించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ ఫీడ్‌బ్యాక్ సెంటర్‌ను డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. దీని ద్వారా ఇప్పటి వరకు 10,802 ఫిర్యాదులు, 33,318 ఎఫ్ఐఆర్లు, 27,251 పాస్‌పోర్టు ఎంక్వైరీలకు సంబంధించిన విచారణ జరిగింది. కామారెడ్డి పట్టణ, దేవునిపల్లి పోలీస్స్టేషన్లను మోడల్ పోలీస్స్టేషన్లుగా తీర్చిదిద్దారు. 5 ఎస్ విధానాన్ని (సార్ట్, సెట్ ఇన్ ఆర్డర్, షైన్, స్టాండరై్డజ్, సస్టెయిన్) అమలు చేస్తూ రికార్డులను, వసతులను, సౌకర్యాల నిర్వహణను అత్యాధునికంగా మెరుగుపర్చారు. మహిళా సిబ్బందికి ప్రత్యేక గదులు, సదుపాయాలు కల్పించారు. ఎస్పీ శ్వేత మొదటి నుంచి సీసీ కెమెరాల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజలకు సీసీ కెమెరాల ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 1342 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. నేరాల నియంత్రణ కోసం క్రమం తప్పకుండా జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ కార్డన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా సీసీటీఎన్ఎస్ (క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్) విధానం శ్వేత ఆధ్వర్యంలోనే ప్రారంభమైంది. మరోవైపు నిరుద్యోగ యువతీ యువకులకు నైపుణ్య శిక్షణలను అందించడానికి ఆమె ఎంతగానో కృషి చేశారు. ‘యువ నేస్తం’ కార్యక్రమం ద్వారా జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు వెళ్తున్న యువతీ, యువకులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయించారు. ఐదు వందల మందికి శిక్షణ ఇప్పించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్టూడెంట్ పోలీసు క్యాడెట్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అన్ని చోట్ల ఈ బృందాలు కొనసాగుతున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం డేటా చోరీ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లోని తొమ్మిది మంది సభ్యులలో శ్వేత కూడా ఒకరు. – సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి చదువు.. చొరవ.. కాన్ఫిడెన్స్ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. దీన్ని దూరం చేసేందుకు ప్రతీ మహిళ ఉన్నత చదువుల వైపు దృష్టి సారించాలి. ఏదైనా సాధిస్తామన్న ఆత్మవిశ్వాసంతో ఉండాలి. నమ్మకానికి తగినట్లుగా శ్రమించాలి. నైపుణ్యం, విషయ పరిజ్ఞానం ఉంటే ఏదైనా సాధ్యమే. మంచి స్నేహితులు కూడా అవసరమే. తోటి వారికి ధైర్యాన్ని ఇవ్వాలి. కుల, మత వివక్షలు ఉండకూడదు. – శ్వేత, ఎస్పీ, కామారెడ్డి -
పూనమ్ 136 నాటౌట్
సాక్షి, గుంటూరు వెస్ట్: బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే లీగ్‌లో పూనమ్ రౌత్ (160 బంతుల్లో 136 నాటౌట్; 15 ఫోర్లు) అజేయ శతకంతో మెరిసింది. ఫలితంగా రైల్వేస్ వరుసగా ఆరో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం సౌరాష్ట్రతో మ్యాచ్‌లో రైల్వేస్ 163 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత రైల్వేస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 251 పరుగులు చేసింది. ఓపెనర్‌గా బరిలో దిగిన పూనమ్ తొలి వికెట్‌కు శ్వేత (45; 8 ఫోర్లు)తో కలిసి 93 పరుగులు జోడించింది. అనంతరం రైల్వేస్ బౌలర్లు స్నేహ రాణా (5/10), రాజేశ్వరి (3/12), పూనమ్ యాదవ్ (2/19) ధాటికి సౌరాష్ట్ర 39.1 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. -
క్యారీ గుంతలో శ్వేత అనుమానాస్పద మృతి
జగద్గిరిగుట్ట: అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీనివాస నగర్‌కు చెందిన అనంద్ కుమార్తె శ్వేత(19) ఈ నెల 11న అదృశ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అదే రోజు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బుధవారం శ్వేత మృతదేహాన్ని గాజులరామారంలోని క్యారీ గుంతలో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అద్దెకు పురుషుల ‘ఫ్యాషన్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బట్టలు కొనాలంటే మనం ఏం చేస్తాం. షోరూమ్‌కు వెళ్లి నచ్చిన బట్టలను ఎంచుకొని.. సరిపోతాయో లేదోనని ట్రయల్ వేసుకొని కొంటాం! సేమ్.. క్యాండిడ్ నాట్స్లోనూ అంతే. కాకపోతే ఇక్కడ కొనాల్సిన పనిలేదు. అద్దెకు తీసుకుంటే చాలు! అంతేకాదు దుస్తులే కాదు టైలు, బెల్టులు, కళ్లద్దాలు, పర్సులు పురుషులకు సంబంధించిన ప్రతి ఒక్క ఫ్యాషన్ ఉత్పత్తులనూ అద్దెకివ్వటమే దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు క్యాండిడ్నాట్స్.కామ్ ఫౌండర్ శ్వేత పొద్దార్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. మాది తమిళనాడు. వీఐటీలో ఇంజనీరింగ్ పూర్తయ్యాక.. అకామాయ్ టెక్నాలజీస్, హెచ్ఎస్బీసీ వంటి కంపెనీల్లో పనిచేశా. కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తుండటంతో మీటింగ్ లేక పార్టీ ఇతరత్రా ప్రత్యేక సందర్భాలు కామన్‌గా జరుగుతుండేవి. ప్రతిసారీ ఖరీదైన బట్టలు కొనాలంటే ఇబ్బంది. దీంతో స్థానికంగా అద్దెకు తీసుకునేదాన్ని. ఇదే పరిస్థితి నా తోటి సహోద్యోగులదీనూ. కాకపోతే పురుషుల ఫ్యాషన్స్ అద్దెకు దొరకటం చాలా తక్కువ. ఇదే క్యాండిడ్నాట్స్ స్టార్టప్‌కు బీజం వేసింది. 2016 ఆగస్టులో రూ.10 లక్షల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా క్యాండిడ్నాట్స్ను ప్రారంభించా. 8 కేటగిరీలు; వెయ్యి ఉత్పత్తులు.. జోధ్‌పురీ సూట్స్, బ్లేజర్స్, జాకెట్స్, కుర్తా అండ్ పైజామా, శేర్వాణీ, వెస్ట్రన్, డిజైనర్ అండ్ ఎత్నిక్ వేర్ దుస్తులుంటాయి. వీటితో పాటు టై, బెల్ట్‌లు, పాదరక్షలు, కళ్లద్దాలు, గడియారాలు, పర్సులు వంటి పురుషుల ఫ్యాషన్‌కు సంబంధించిన అన్ని రకాల యాక్ససరీలుంటాయి. సంజయ్ షానీ, సోలా ఫ్యాషన్స్, మాక్రో ఇటలీ వంటి 6 డిజైనర్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఆయా డిజైనర్ దుస్తులను అద్దెకిస్తాం. మొత్తంగా 8 కేటగిరీల్లో 1,000 రకాల ఉత్పత్తులుంటాయి. ఏడాది కాలంలో 2 వేల ఉత్పత్తులకు చేర్చాలన్నది లక్ష్యం. 2 నెలల్లో హైదరాబాద్‌లో.. ప్రస్తుతం బెంగళూరులో సేవలందిస్తున్నాం. ఇప్పటివరకు 12 వేల మంది కస్టమర్లు మా యాక్ససరీలను అద్దెకు తీసుకున్నారు. ప్రస్తుతం నెలకు 800 ఆర్డర్లు వస్తున్నాయి. సూట్లు ఎక్కువగా అద్దెకు తీసుకుంటున్నారు. ఉత్పత్తుల గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ)లో 10–15% అద్దె ఉంటుంది. కనీస ఆర్డర్ విలువ రూ.1,500. ఏటా రూ.80 లక్షల ఆదాయం వస్తుంది. 2 నెలల్లో హైదరాబాద్‌లో సేవలను ప్రారంభించనున్నాం. ఏడాదిలో ఆఫ్‌లైన్ స్టోర్‌ను ఏర్పాటు చేస్తాం. 2020 నాటికి ఢిల్లీ, ముంబై, పుణే నగరాలకు విస్తరించాలన్నది లక్ష్యం. రూ.2 కోట్ల నిధుల సమీకరణ.. పెళ్లి ఫొటో షూట్స్, ఫ్యాషన్ షోలు, మీటింగ్స్, సమావేశాలు, ఇంటర్వ్యూలు, కార్పొరేట్ ఈవెంట్లకు, కాలేజ్ ఫేర్వెల్, కాన్వొకేషన్స్, వార్షికోత్సవాలకు అద్దెకు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మా సంస్థలో 12 మంది ఉద్యోగులున్నారు. 4 నెలల్లో రెట్టింపు ఉద్యోగులను తీసుకుంటాం. ఏడాదిలో రూ.2 కోట్ల ఆదాయం లక్ష్యం. క్యాండిడ్ నాట్స్‌కు సొంత డెలివరీ, లాజిస్టిక్ వ్యవస్థ ఉంది. త్వరలోనే రూ.2 కోట్ల నిధులను సమీకరించనున్నాం. వీటితో మహిళలు, పిల్లల దుస్తులు, యాక్ససరీల అద్దె విభాగంలోకి విస్తరిస్తామని శ్వేత వివరించారు. -
వదంతులు నమ్మవద్దు
నిజామాబాద్: సోషల్‌మీడియాలో వస్తున్న వదంతులు నమ్మ వద్దని నిజామాబాద్ ఇంచార్జ్ సీపీ, కామారెడ్డి ఎస్పీ శ్వేతా రెడ్డి తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం చేంగల్‌లో ఓ గిరిజనుడిని దొంగగా భావించి గ్రామస్తులు దాడి చేయడంతో ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెల్సిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 23 మంది నిందితులను గుర్తించామని తెలిపారు. ప్రస్తుతం హత్యా నేరం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తే ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మాకు సమాచారమిస్తే మేము స్పందిస్తామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు ఉంటాయన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని చెప్పారు. సురక్షిత సమాజాన్ని నిర్మించేందుకు పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తోందని వ్యాఖ్యానించారు. అవసరమైన అన్ని చోట్లా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం నిఘాను ఏర్పాటు చేశామని చెప్పారు. వదంతులను నమ్మకుండా ప్రజల్ని చైతన్యపరిచేందుకు కళాజాత ద్వారా వదంతులను తిప్పికొట్టేలా ప్రచారం చేస్తామని వివరించారు. జిల్లాలో అక్కడక్కడా జరుగుతున్న సంఘటనలు మా దృష్టికొస్తున్నాయని చెప్పారు. -
ఎస్సైగా ఎంపికైన పేదింటి కుసుమం
-
ఇది లైబ్రరీలాంటి సినిమా
‘‘కొత్తవారందరూ కలిసి చేసిన ఈ సినిమాను సపోర్టు చేయడం చాలా ఆనందంగా ఉంది. కథ బాగుంటే ఏ కొత్త సినిమాకైనా నా వంతు సపోర్ట్ చేస్తా’’ అని ‘దిల్’ రాజు అన్నారు. విశ్వక్సేన్, సుప్రజ , శ్వేత హీరో హీరోయిన్లుగా యాకుబ్ అలీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వెళ్లిపోమాకే’. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు విడుదల చేస్తున్నారు. ప్రశాంత్ విహారి స్వరపరిచిన ఈ చిత్రం పాటలను దర్శకుడు సతీష్ వేగేశ్న విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘మన పక్కింటి అమ్మాయిలు, అబ్బాయిలు, సహోద్యోగు లు ఉన్నట్టే ఈ కథలోని క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. ఇలాంటి సినిమాలను ప్రొత్సహిస్తే మంచి కథనాలతో మరిన్ని సినిమాలు వస్తాయి. రాబోయే సినిమాలకు ఈ సినిమా లైబ్రరీలా ఉంటుంది’’అన్నారు. ‘‘దిల్’ రాజుకు కథ నచ్చడంతో మూడేళ్ల కష్టాన్ని ఇట్టే మర్చిపోయాం’’ అని యాకూబ్ అలీ అన్నారు. ‘‘ఏఆర్ రెహమాన్ దగ్గర పనిచేశా. ఈ చిత్రానికి క్లాసికల్ టచ్ ఉన్న వెస్ట్రన్ మ్యూజిక్ అందించా’’ అని ప్రశాంత్ విహారి చెప్పారు. -
హుస్సేన్‌సాగర్‌లోకి దూకి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో శ్వేత అనే మహిళ హుస్సేన్‌సాగర్‌లోకి దూకింది. గమనించిన లేక్ పోలీసులు ఆమెను రక్షించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇంటికి చేరిన చిన్నారి శ్వేత
హైదరాబాద్: దారి తప్పి వచ్చి బిక్కమొఖంతో చూస్తున్న రెండున్నరేళ్ల చిన్నారిని ఓ వ్యక్తి పోలీసులకు అప్పగించాడు. రెండు గంటల్లోనే ఆ చిన్నారిని తల్లిడండ్రుల చెంతకు చేర్చిన సంఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాలు...మల్లిఖార్జున్, రేఖ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి అడిక్‌మెట్ లలితానగర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ సమీపంలో నివాసముంటున్నారు. రెండున్నరేళ్ల వీరి కుమార్తె స్వేత శనివారం మధ్యాహ్నం ఆడుకుంటూ పక్క వీధిలోకి వెళ్లింది. తర్వాత దారి తెలియక ఇంటికి చేరుకోలేక పోయింది. కృతి కుమార్ అనే వ్యక్తి చిన్నారిని దగ్గరకు తీసుకుని వివరాల కోసం ఆరాతీశాడు. ఆ చిన్నారికి సరిగా మాటలు రాకపోవడంతో ఏమీ చెప్పలేక పోయింది. దీంతో చిన్నారిని కృతి కుమార్ నల్లకుంట పోలీసులకు అప్పగించాడు. చిన్నారి ఆచూకీ కోసం గాలిస్తున్న తల్లిదండ్రులు పోలీసులకు ఎదురుపడ్డారు. దీంతో శ్వేత తప్పి పోయిన విషాయాన్ని పోలీసులకు తెలిపారు. నల్లకుంట పోలీసుల రక్షణలో ఉన్న చిన్నారి వారి కుమార్తెగా గుర్తించారు. అనంతరం చిన్నారిని ఇంటికి చేర్చారు. -
తలసాని కుమార్తె శ్వేత రిసెప్షన్
-
ప్రేమిస్తే పోయే.. కాలం మూవీ స్టిల్స్
-
ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది
కొన్ని బాధలు జీవితాంతం వెంటాడతాయి. అలా అమితాబ్ బచ్చన్‌ని ఎప్పటికీ వెంటాడే బాధ ఒకటుంది. ఇటీవల ఓ సందర్భంలో దాని గురించి ఈ బిగ్ బి చెబుతూ- ‘‘పిల్లల ఎదుగుదలను చూడటం ఏ తల్లీతండ్రికైనా ఓ వరం లాంటిది. కానీ, నా పని ఒత్తిడి వల్ల ఆ అనుభూతిని ఆస్వాదించలేకపోయాను. శ్వేత, అభిషేక్‌ల బాల్యం ఎలా గడిచిందో? ఎలా పెరిగారో నాకు సరిగ్గా తెలియదు. నేను షూటింగ్ ముగించుకుని, ఇంటికి వచ్చేసరికి ఇద్దరూ నిద్రపోతూ కనిపించేవాళ్లు. వాళ్లు మేల్కొనే సరికి నేను వెళ్లిపోవడమో, లేక నేను మేల్కొనక ముందే వాళ్లు స్కూల్‌కి వెళ్లడమో జరిగేది. నేనంత బిజీగా సినిమాలు చేసేవాణ్ణి. నేను కొంచెం పని ఒత్తిడి తగ్గించుకున్న తర్వాత కూడా నా పిల్లలతో గడిపే వీలు చిక్కలేదు. ఎందుకంటే, వాళ్లిద్దరూ హాస్టల్లో ఉండేవాళ్లు. ఇవాళ నేనింత పేరు, డబ్బు సంపాదించుకున్నా, నా పిల్లల ఎదుగుదలను సరిగ్గా చూడలేకపోయాననే బాధ మాత్రం ఉంది’’ అని చెప్పారు. -
ఈ చదువు నా వల్ల కావట్లేదు
-
ఈ చదువు నా వల్ల కావట్లేదు
‘నాకు బీఏ చదవాలని ఉంది. తల్లిదండ్రులు ఎక్కువగా ఆశించారు. నా వల్ల కావడం లేదు. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. క్షమించండి’ -శ్వేత విశాఖపట్నం, న్యూస్‌లైన్: తల్లిదండ్రులు ఇద్దరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారు.. కొడుకు ఇంజినీరింగ్ చదువుతున్నాడు.. కూతురును కూడా అలాగే ఉన్నత చదువు చదవాలంటూ బలవంతం పెట్టారు. తల్లిదండ్రుల మాట కాదనలేక రెండుసార్లు అందుకోసం ప్రయత్నించి విఫలమైంది. ఆ తరువాత కూడా తనకు ఇష్టంలేని చదువులోనే జాయిన్ అయింది. తనకు ఉన్న జ్ఞానం కంటే ఎక్కువ చదవలేనంటూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన విశాఖలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. కేశబోయిన శోభనాద్రి వాణిజ్యపన్నుల శాఖలో సహాయ కమిషనర్, భార్య ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో వైద్యురాలు. వారి కూతురు శ్వేత(19) బీఏ చదవాలని అనుకుంది. కానీ, తల్లిదండ్రులు మాత్రం ఆమెను ఐఐటీ చదవించాలని ఆశించారు. వారి కోరిక మేరకు శ్వేత రెండుసార్లు ఐఐటీ జేఈఈ ఎంట్రన్స్ రాసినా ఎంపిక కాలేదు. దీంతో ఒత్తిడికి గురై మానసికంగా కుంగిపోయింది. కుమార్తె స్థితిని గమనించి శోభనాద్రి ఆమెకు హైదరాబాద్‌లో ఓ సైకాలజిస్ట్ వద్ద రెండేళ్లపాటు చికిత్స అందించారు. ఆ తరువాత కూడా కూతురు కోరిక మేరకు బీఏలో కాకుండా విశాఖలోని ఒక కళాశాలలో బ్యాచ్‌లర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్(బీబీఎం)లో జాయిన్ చేశారు. ప్రస్తుతం బీబీఎం ఫస్ట్ఇయర్ చదువుతోంది. శనివారం అమ్మమ్మ పక్కన పడుకున్న శ్వేత.. అర్ధరాత్రి లేచి సూసైడ్ నోట్రాసింది. తర్వాత సోదరుడు పడుకున్న గది నుంచి బాల్కనీలోకి వచ్చి అక్కడ నుంచి కిందికి దూకింది. శబ్దానికి మేల్కొన్న వాచ్మెన్ వెంటనే శోభనాద్రికి తెలిపారు. అప్పటికే ఆమె మృతిచెందింది. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్నాం.. ‘ఒక్క కుమార్తె కావడంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాం.. టెన్త్, ఇంటర్లలో ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణురాలైంది.. ఐఐటీ జేఈఈ ఎంట్రన్స్ పరీక్షలకు లాంగ్‌టర్మ్ కోచింగ్ ఇప్పించాం.. రెండుసార్లూ ఎంపిక కాకపోవడంతో బీబీఎంలో చేర్పించాం’ అంటూ విగతజీవురాలైన కుమార్తె ను చూసి తండ్రి శోభనాద్రి గుండెలవిసేలా రోదించారు.