
సాక్షి, హైదరాబాద్ : ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాన్ని బలతీసుకుంది. పరీక్ష రాయడానికి వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను దురదృష్టం యుముడిలా వెంటాడింది. వెనుకనుంచి వేగంగా వచ్చిన లారీ ఓ యువతి, యువకుడిని ఢీ కొట్టడంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. వివరాల ప్రకారం.. జహీరాబాద్‌కు చెందిన శ్వేతా, శ్రీనివాస్ డైట్‌సెట్ పరీక్ష రాసేందుకు బైక్‌పై ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ పరీక్ష కేంద్రానికి వెళ్తున్నారు. మదీనాగూడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వారు ప్రయాణిస్తున్న బైక్‌ను బలంగా ఢీ కొట్టింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్వేత, శ్రీనివాస్ అక్కడిక్కడికే మృతి చెందారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే వీరిద్దరు మృత్యువాత పడినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఇక విషయం తెలిసిన వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పరీక్ష రాసేందుకు వెళ్లిన తమ పిల్లలు ఇక తిరిగిరాదనే చేదు నిజం వారిని విషాదంలో ముంచింది. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను మియాపూర్ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment