
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మియాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. జహీరాబాద్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి బీదర్ వెళ్తుండగా ఓ బైక్‌ను వెనకాల నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతున్ని స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న సుమన్ నాయక్‌గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సుమన్ కొంత కాలంగా మియాపూర్‌లో నివాసం ఉంటూ స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment