alvin colony
-
విషాదం: పరీక్ష రాసేందుకు వెళ్తూ ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్ : ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాన్ని బలతీసుకుంది. పరీక్ష రాయడానికి వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను దురదృష్టం యుముడిలా వెంటాడింది. వెనుకనుంచి వేగంగా వచ్చిన లారీ ఓ యువతి, యువకుడిని ఢీ కొట్టడంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. వివరాల ప్రకారం.. జహీరాబాద్‌కు చెందిన శ్వేతా, శ్రీనివాస్ డైట్‌సెట్ పరీక్ష రాసేందుకు బైక్‌పై ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ పరీక్ష కేంద్రానికి వెళ్తున్నారు. మదీనాగూడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వారు ప్రయాణిస్తున్న బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్వేత, శ్రీనివాస్ అక్కడిక్కడికే మృతి చెందారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే వీరిద్దరు మృత్యువాత పడినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఇక విషయం తెలిసిన వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పరీక్ష రాసేందుకు వెళ్లిన తమ పిల్లలు ఇక తిరిగిరాదనే చేదు నిజం వారిని విషాదంలో ముంచింది. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను మియాపూర్ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
జనపథం - ఆల్వీన్ కాలనీ
-
చేజారిన ఆశ..
ఈవిడేంటీ.. గాల్లో ఆ క్యాచులేంటీ.. అనుకుంటున్నారా? నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు పడుతున్న పాట్లకు నిదర్శనమిది. ఆరు రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకున్న ఆల్విన్ కాలనీ ధరణినగర్ అపార్ట్‌మెంట్‌వాసులు.. ఎవరు వస్తున్నా తమకు తినేందుకు ఏదన్నా ఇవ్వకపోతారా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆదివారం అక్కడి వరద బాధితులకు బిస్కెట్ ప్యాకెట్లు పంచారు. కిందికి వచ్చి తీసుకునే అవకాశం లేదు. దీంతో విసిరిన ప్యాకెట్లను దుకునేందుకు మహిళ పడుతున్న తాపత్రయమిది. ఆశగా అందుకుందామని ప్రయత్నించినప్పటికీ.. అది కాస్తా చేజారిపోవడంతో ఆమె ఎంతగా బాధపడుతుందో ఈ చిత్రం చెబుతోంది. -
అల్విన్ కాలనీలో చోరీ
తాళం వేసి ఉన్న ఇంట్లో తలుపులు పగలగొట్టి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మియాపూర్ ఆల్విన్ కాలనీలో మంగళవారం వెలుగు చూసింది. కాలనీలోని 122 నంబర్ ప్లాట్ లో తలుపులు, బీరువాలు పగలగొట్టిన దుండగులు.. 35 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.