
చేజారిన ఆశ..
ఈవిడేంటీ.. గాల్లో ఆ క్యాచులేంటీ.. అనుకుంటున్నారా? నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు పడుతున్న పాట్లకు నిదర్శనమిది. ఆరు రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకున్న ఆల్విన్ కాలనీ ధరణినగర్ అపార్ట్‌మెంట్‌వాసులు.. ఎవరు వస్తున్నా తమకు తినేందుకు ఏదన్నా ఇవ్వకపోతారా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆదివారం అక్కడి వరద బాధితులకు బిస్కెట్ ప్యాకెట్లు పంచారు. కిందికి వచ్చి తీసుకునే అవకాశం లేదు. దీంతో విసిరిన ప్యాకెట్లను దుకునేందుకు మహిళ పడుతున్న తాపత్రయమిది. ఆశగా అందుకుందామని ప్రయత్నించినప్పటికీ.. అది కాస్తా చేజారిపోవడంతో ఆమె ఎంతగా బాధపడుతుందో ఈ చిత్రం చెబుతోంది.