
శ్వేత (ఫైల్)
జగద్గిరిగుట్ట: అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీనివాస నగర్‌కు చెందిన అనంద్ కుమార్తె శ్వేత(19) ఈ నెల 11న అదృశ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అదే రోజు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బుధవారం శ్వేత మృతదేహాన్ని గాజులరామారంలోని క్యారీ గుంతలో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.