సాక్షి, విశాఖపట్నం: నగరంలో సంచలనం సృష్టించిన వివాహిత శ్వేత మృతి కేసు అనేక మలుపు తిరిగిన సంగతి తెలిసిందే.. ఆర్.కె.బీచ్‌లో మంగళవారం అర్ధరాత్రి ఆమె శవమై కనిపించిన విషయం విదితమే.. అయితే, శ్వేతది ఆత్మహత్యేనని సీపీ త్రివిక్రమ్ వర్మ స్పష్టం చేశారు. శ్వేత ఆత్మహత్యకు గల కారణాలను ఆయన మీడియాకు వెల్లడించారు.
‘‘శ్వేతపై అత్తింటి వేధింపులు నిజమే.. శ్వేత తల్లి ఎదుటే దంపతులు గొడవపడ్డారు.. ఆమె కనిపించడం లేదని బంధువులు ఫిర్యాదు చేశారు. బీచ్ దగ్గర మృతదేహం ఉందని సమాచారం వచ్చింది. శ్వేత భర్త, ఆడపడుచు భర్తపై కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. 90 సెంట్ల భూమి శ్వేత పేరు మీద ఉంది. ఆ భూమి తన పేరు మీదకి మార్చాలని భర్త మణికంఠ ఇబ్బంది పెట్టాడు. అత్త, మామ చిన్నచూపు చూడటంతో శ్వేత మనస్తాపానికి గురైంది’’ అని సీపీ వివరించారు.
చదవండి: సొంత కొడుక్కే షాకిచ్చిన తండ్రి.. ఇంటికొచ్చిన ప్రియురాలితో కలిసి..
‘‘అత్తింటి వారు వేధింపులు కారణంగా గతంలోనూ శ్వేత ఆత్మహత్యకు యత్నించింది. గృహ, లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేశాం. ఐపీసీ సెక్షన్ 354 498(ఏ) కింద కేసు నమోదు చేశాం, శ్వేత ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. పోస్ట్ మార్టం వీడియో గ్రఫీ చేయించాం’’ అని సీపీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment