ఆమెను నా గర్ల్‌ఫ్రెండ్‌ చేయండి.. బిగ్‌బాస్‌కు జెస్సీ రిక్వెస్ట్‌ | Bigg Boss 5 Telugu Promo: Jessie Fluting To Swetha | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: ప్లీజ్‌ బిగ్‌బాస్‌.. ఆమెను నా గర్ల్‌ఫ్రెండ్‌ చేయండి: జెస్సీ

Published Tue, Sep 28 2021 8:05 PM | Last Updated on Tue, Sep 28 2021 8:08 PM

Bigg Boss 5 Telugu Promo: Jessie Fluting To Swetha - Sakshi

అమ్మాయిలతో పులిహోర కలపడంలో జెస్సీ తక్కువేమి కాదు. చాన్స్‌ దొరికితే చాలు.. సిరి, హమిదా, శ్వేతలను ఫ్లటింగ్‌ చేయడానికి ట్రై చేస్తాడు.

బిగ్‌బాస్‌ హౌస్‌లో జెస్సీ అంటే మిగతా కంటెస్టెంట్స్‌ అందరికి మంచి అభిప్రాయం ఉంది. అందరికి కంటే చిన్నోడు కావడం, అమాకత్వంగా వ్యవహరించడం అతనికి కలిసొస్తుంది.అయితే సొంతంగా నిర్ణయాలు తీసుకోకపోవడం, షణ్ముఖ్‌ చెప్పింది చేయడం జెస్సీకి మైనస్‌ అనే చెప్పాలి. ఇదే విషయంపై హోస్ట్‌ నాగార్జున కూడా జెస్సీకి స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. నీ నిర్ణయాలు నువ్వే తీసుకో అని సలహా కూడా ఇచ్చాడు.
(చదవండి: బిగ్‌బాస్‌: డేంజర్‌ జోన్‌లో ఆ ముగ్గురు, ఎలిమినేట్‌ అయ్యేది ఎవరంటే..)

అయితే కెప్టెన్‌గా జెస్సీ చెప్పే మాటలను కొంతమంది పట్టించుకోవడం లేదు. దీంతో అప్పుడప్పుడు జెస్సీ ఇరిటేట్‌ అవుతున్నాడు కూడా. ఇదంతా పక్కన పెడితే అమ్మాయిలతో పులిహోర కలపడంలో జెస్సీ తక్కువేమి కాదు. చాన్స్‌ దొరికితే చాలు.. సిరి, హమిదా, శ్వేతలను ఫ్లటింగ్‌ చేయడానికి ట్రై చేస్తాడు. తన అమాయకమైన మాటలతో వారిని ఇంప్రెస్‌ చేసే ప్రయత్నం చేస్తాడు. తాజాగా శ్వేతతో పులిహోర కలిపాడు ఈ అమాయకపు చక్రవర్తి. శ్వేతకు తన గర్ల్‌ఫ్రెండ్‌ పాత్ర ఇచ్చి ఓ టాస్క్‌ఇవ్వడంటూ ఏకంగా బిగ్‌బాస్‌కే విజ్ఞప్తి చేశాడు. ‘నేను రిక్వెస్ట్‌ చేస్తున్నా బిగ్‌బాస్‌.. మా ఇద్దరిని కలిపి బాయ్‌ఫ్రెండ్‌, గర్ల్‌ఫ్రెండ్‌గా ఓ రోల్‌ పెట్టండి. ‘మనోహర.. మనోహర’అనే రొమాంటిక్‌  సాంగ్‌ ప్లే చేయండి’అంటూ బిగ్‌బాస్‌కు విజ్ఞప్తి చేశాడు. ఇక జెస్సీ మాటలకు శ్వేత పడిపడి నవ్వింది. మరి ఈ అమాయకపు చక్రవర్తి కోరికను బిగ్‌బాస్‌ నెరవేర్చాడో లేదో తెలియాలంటే.. నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement