
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ ఇంట్లో పాత టాస్కులనే మరోసారి ఆడిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తాళ్లను కంటిన్యూగా ఆడించే టాస్క్‌లో సిరి, సన్నీ, షణ్ముఖ్ పాల్గొన్నారు. తాళ్లను పట్టుకుని ఎవరు ఎక్కువసేపు కదుపుతూ ఉంటే వారే గెలిచినట్లు లెక్క! ఈ ఆటలో సిరి ఎక్కువసేపు తాళ్లను కదపలేక అవుట్ అయింది. దీంతో పక్కకు వచ్చిన సిరి షణ్ను గెలవాలంటూ అతడిని ఎంకరేజ్ చేసింది. అక్కడిదాకా బానే ఉంది కానీ సన్నీ సరిగా ఆడట్లేదంటూ సరదాగా మాట్లాడింది.
ఇది దృష్టిలో పెట్టుకున్న సన్నీ.. ఓడిపోయావ్ కదా అని ఆటపట్టించాడు. దీంతో చిర్రెత్తిపోయిన సిరి.. నువ్వూ ఓడిపోయావు.. షణ్ను ఒక్కడే గట్టిగా ఆడాడు అని రెచ్చగొట్టేలా మాట్లాడింది. నేను సరదాగా అన్నానని సన్నీ సర్ది చెప్పడానికి ప్రయత్నించగా ఓడిపోయావు అన్నది జోకా? అని సీరియస్ అయింది. అది మజాక్‌లో అన్నానని సన్నీ చెప్పగా సిరి మాత్రం నాతో జోకులెయ్యొద్దని వార్నింగ్ ఇచ్చింది. అలా వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తెలుస్తోంది. మరి ఈ గొడవ చల్లారిందా? లేదా? అన్నది ఎపిసోడ్‌లో తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment