
Bigg Boss 5 Telugu Promo: నామినేషన్స్, కెప్టెన్సీ టాస్క్‌తో రణరంగంగా మారిన బిగ్‌బాస్ హౌస్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీతో చల్లబడిపోయింది. ఆవేశంతో చిందులు తొక్కిన కంటెస్టెంట్లు వారి ఆత్మీయులను చూడగానే మెత్తబడిపోయారు. కొన్ని వారాల తర్వాత కన్నవారు, కట్టుకున్నవారు కళ్ల ముందుకు రావడంతో ఎమోషల్ అవుతున్నారు. నిన్నటి ఎపిసోడ్‌లో కాజల్ భర్త, కూతురు హౌస్‌లో అడుగుపెట్టగా నేడు శ్రీరామ్ సోదరి, సిరి తల్లి, మానస్ తల్లి, సన్నీ తల్లి ఇంట్లోకి వస్తున్నట్లు ప్రోమో రిలీజ్ చేశాడు బిగ్‌బాస్.
సన్నీ తన తల్లిని చూడగానే నిన్ను ఎక్కడో చూశానే అంటూ సరదాగా మాట్లాడాడు. మానస్ తల్లి అయితే తన వాక్చాతుర్యంతో హౌస్‌మేట్స్ అందరినీ ఇట్టే కలుపుకుపోయింది. 'నాకు, మానస్‌కు మీలాంటి అమ్మాయిని చూడండి' అని శ్రీరామ్ అడగ్గా.. 'బయట హమీదా వెయిటింగేమో' అని మానస్ తల్లి పంచ్ ఇచ్చింది. దీంతో శ్రీరామ్ సిగ్గుతో ముఖం దాచుకున్నాడు.
'సిరికి ఊహ తెలిసినప్పుడే డాడీ చనిపోయారు, పాన్ షాప్ పెట్టి ఆమెను చదివించాను. జనాలతో ఎన్నో మాటలు పడ్డాను. ఈ బిగ్‌బాస్‌ను కోట్లాది మంది చూస్తున్నారు. నన్ను బిగ్‌బాస్ సిరి తల్లిగా గుర్తుపడుతున్నారు' అంటూ భావోద్వేగానికి లోనైంది సిరి తల్లి. బాత్రూంకి వెళ్లాలనుకున్న షణ్నును లోనికి వెళ్లనీయకుండా పాజ్ అంటూ అతడిని కదలకుండా ఉండమన్నాడు బిగ్‌బాస్. దొరికిందే ఛాన్స్ అనుకున్న హౌస్‌మేట్స్ అతడిని అమ్మాయిగా అందంగా ముస్తాబు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment