
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు ఇంకా మూడు రోజుల సమయం ఉంది. అప్పటిదాకా ఏం చేయాలో అటు కంటెస్టెంట్లకే కాదు, ఇటు బిగ్‌బాస్‌కు కూడా పాలు పోవట్లేదు. నిన్న అయితే హౌస్‌మేట్స్ అంతా చిన్నపిల్లల్లా మారిపోయి దాగుడుమూతలు ఆడుకున్నారు. ఇప్పుడు బిగ్‌బాస్ కూడా వారిదారిలోకే వచ్చాడు. ఇంతకుముందు ఆడిన టాస్కులనే మళ్లీ మళ్లీ ఆడించాడు.
ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. లేబుల్ లేదు మచ్చా గేమ్‌లో షణ్ముఖ్, మానస్ పోటీపడగా మానస్ గెలిచినట్లు సమాచారం. బెలూన్స్ టాస్క్‌లో షణ్ను గెలిచినట్లు లీకైంది. కొన్ని శబ్ధాలను ప్లే చేసి అవేంటో పసిగట్టి రాయాలన్న టాస్క్‌లో సన్నీ బెకబెక సౌండ్‌ను Frogకు బదులుగా Forg అని తప్పుగా రాయడంతో అందరూ పగలబడి నవ్వారు. సిరి అయితే ఏకంగా అది కప్ప కాదంటూ ఎలుక అని రాసింది. దీంతో కప్పకు, ఎలుకకు ఉన్న సంబంధాన్ని చెప్పమన్నాడు బిగ్‌బాస్. ఇలా ఈరోజు ఎపిసోడ్ ఫన్నీ టాస్కులతో సరదాగా గడిచిపోనున్నట్లు కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment