Bigg Boss Telugu 5 Finale Winner: Sunny Goes Viral in Social Media - Sakshi
Sakshi News home page

Bigg Boss5 Telugu: బిగ్‌బాస్‌-5 విజేతగా సన్నీ?.. నెట్టింట లీకైన ఓటింగ్‌!

Published Sat, Dec 18 2021 3:55 PM | Last Updated on Sat, Dec 18 2021 4:37 PM

Bigg Boss Telugu 5 Grand Finale: Winner Prediction - Sakshi

Bigg Boss Telugu 5 Grand Finale: Winner Prediction: బిగ్‌బాస్‌ సీజన్‌-5 ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం నాడు జరగనున్న గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్‌తో ఈ సీజన్‌కు తెరపడనుంది. దీంతో టైటిల్‌ విన్నర్‌ ఎవరన్న దానిపై సర్వంత ఉత్కంఠ నెలకొంది. టాప్‌-5 కంటెస్టెంట్లలో టైటిల్‌ కోసం గట్టి పోటీ ఉన్నా ప్రధాన పోటీ మాత్రం సన్నీ- షణ్ముక్‌​ల మధ్యే ఉండనున్నట్లు తెలుస్తుంది. యూట్యూబ్‌ స్టార్‌గా ఎంట్రీ ఇచ్చిన షణ్నూ ఓటింగ్‌లో మాత్రం సన్నీ కంటే వెనుక ఉన్నట్లు అన్‌ అఫీషియల్‌ పోల్స్‌ ద్వారా తెలుస్తుంది.

ఇప్పటివరకు ఓటింగ్ పర్సంటేజీలను చూస్తే సన్నీనే టాప్‌లో ఉన్నాడని తెలుస్తోంది. 34% ఓట్లతో సన్నీ విజేతగా నిలిచాడని సోషల్‌మీడియాలో టాక్‌ వినిపిస్తుంది. టైటిల్‌ రేసులో ఉన్న షణ్నూ 31%ఓట్లతో రెండో స్థానంలో, 20% ఓట్లతో శ్రీరామ్‌ మూడవ స్థానంలో, 8% ఓట్లతో మానస్‌ నాలుగో స్థానంలో నిలవగా , అత్యల్పంగా సిరికి7%ఓట్లు వచ్చినట్లు తెలుస్తుంది.  

ఇప్పటివరకు లీకు వీరులు చెప్పినట్లుగానే ఎపిసోడ్‌ సహా ఎలిమినేషన్‌ ప్రక్రియ జరిగింది. దీంతో ఇప్పుడు మరోసారి లీకువీరులు అందించిన ఈ సమాచారం నిజమనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే ఫినాలే ప్రసారం అయ్యేవరకు ఎదురు చూడాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement