షణ్నూకి ముద్దుపెట్టడంపై సిరి బాయ్‌ఫ్రెండ్‌ కామెంట్స్‌ వైరల్‌.. | Bigg Boss 5 Telugu: Siri Boyfriend Reaction After She Kissed Shanmukh Jaswanth | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: షణ్నూకి ముద్దుపెట్టడంపై సిరి బాయ్‌ఫ్రెండ్‌ ఏమన్నాడంటే..

Published Fri, Oct 29 2021 12:26 PM | Last Updated on Sat, Oct 30 2021 7:55 AM

Bigg Boss 5 Telugu: Siri Boyfriend Reaction After She Kissed Shanmukh Jaswanth - Sakshi

Siri Boyfriend Reaction After She Kissed Shanmukh Jaswanth: తెలుగు బిజ్‌బాస్‌ సీజన్‌-5 రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్‌లో సన్నీ, శ్రీరామచంద్ర మాటల యుద్ధం ఒక ఎత్తైతే, షణ్ముక్‌కి సిరి ముద్దు పెట్టడం ఎపిసోడ్‌ హైలైట్‌గా మారింది. ‘మానసికంగా డిస్ట్రబ్‌ అయినప్పుడు ఎమోషనల్‌గా అటాచ్‌ అయిపోతాం’ అని షణ్నూ సిరికి హితభోద చేయగా..నీ వల్లే మెంటల్‌గా ఎక్కువ ఇబ్బంది పడుతున్నా అని సిరి బదులిస్తుంది. దీంతో చిరాకుగా అనిపిస్తే దూరం పెట్టు అని షణ్నూ సింగిల్‌ డైలాగ్‌తో తేల్చేశాడు.

Bigg Boss Siri And Srihan

తర్వాత ఏమైందో ఏమో కానీ సిరి సడన్‌గా షణ్నూకి ముద్దు పెట్టి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో షాకైన షణ్ను ముసిముసిగా నవ్వుతూనే కెమెరాల వంక చూస్తూ జాగ్రత్తగా రికార్డ్‌ చేశారా? నాకు ఉంటదిపుడు అంటూ పేర్కొన్నాడు. ఈ మొత్తం ఎపిసోడ్‌ను చూసిన నెటిజన్లు సిరి-షణ్నూకి ముద్దు పెట్టడం ఏంటని ఆమెపై ఫైర్‌ అవుతున్నారు. ఆల్రెడి శ్రీహాన్‌తో రిలేషన్‌లో ఉన్న సిరి కెమెరాలు చూస్తుండగానే ముద్దు పెట్టుకోవడం నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది.

Bigg Boss Siri And Srihan

ఈ విషయంపై తాజాగా సిరి బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహాన్‌ స్పందించాడు. ఇప్పుడేంట్రా నేనే ఏడవాలా? షార్ట్‌ ఫిల్మ్స్‌, సినిమాల్లో చేస్తే ఓకే కదా మీకు అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. ముద్దు ఎపిసోడ్‌పై పలువురు నెటిజన్లు ట్రోల్స్‌, మెసేజ్‌లు చేస్తుండటంతో శ్రీహాన్‌ ఇలా స్పందించాడు. ప్రేయసి సిరికి మద్దతుగా నిలిచాడు. దీనికి సంబంధించిన పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

Bigg Boss Siri And Srihan

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement