
Bigg Boss Telugu 5 Promo, Ticket To Finale Task: బిగ్‌బాస్ హౌస్‌లో ఇన్నివారాల పాటు ఉండటం ఒకెత్తు అయితే, టాప్ 5కి చేరుకోవడం మరో ఎత్తు. ఎలాగో ఇంతదాకా వచ్చాం కాబట్టి ఫైనల్‌లో కాలు పెట్టాల్సిందేనని కంటెస్టెంట్లు ధృడ నిశ్చయంతో ఉన్నారు. అలాంటివారికి బిగ్‌బాస్ టికెట్ టు ఫినాలే టాస్క్‌తో శుభవార్తను అందజేశాడు. ఈ టాస్క్‌లో గెలిచినవారు నేరుగా ఫైనల్‌కు వెళ్తారని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం హౌస్‌లో 'టికెట్ టు ఫినాలే' మొదటి లెవల్ నడుస్తోంది. ఇందులో ఐస్ క్యూబ్స్‌పై నిల్చొని పక్కవారి బంతులు లాక్కునేదానిమీద ఫోకస్ పెట్టాలి. ఈ గేమ్‌లో సిరి, సన్నీ మధ్య ఫైట్ నడిచినట్లు కనిపిస్తోంది. దీంతో సిరి ఏడ్చేసినట్లు ప్రోమోలో చూపించారు. ఒకరిని విలన్ చేయడానికి సిరి రెడీగా ఉంటుందని చిరాకుపడ్డాడు సన్నీ. మరి ఈ గేమ్‌లో ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారు? అన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారమైతే మానస్ ఎక్కువ పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నాడట! శ్రీరామ్, సిరి తర్వాతి స్థానాల్లో కొనసాగుతుండగా కాజల్, ప్రియాంక చివరి రెండు స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. రసవత్తరంగా సాగుతున్న ఈ పోటీలో ఫినాలేకు ఎవరు ముందుగా బెర్త్ ఖాయం చేసుకుంటారో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment