
Bigg Boss 5 Telugu Promo, Sunny Vs Shannu: ఈ వారం బిగ్‌బాస్ షో ఏ గొడవా లేకుండా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో సన్నీ, షణ్ముఖ్ తగవులాడారు. కెప్టెన్సీ టాస్క్‌లో వీళ్లిద్దరూ పోట్లాటకు దిగారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. బిగ్‌బాస్ 10వ వారం 'టవర్‌లో ఉంది పవర్' అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో కెప్టెన్సీ కంటెండర్లు సిరి, సన్నీ, రవి, కాజల్ తాము చేసిన టవర్‌ను కాపాడుకుంటూనే ఇతరుల టవర్‌ను కూల్చాల్సి ఉంటుంది. దీనికి ఇంటిసభ్యుల సాయం కూడా తీసుకోవచ్చు. అయితే తన టవర్ కూల్చాలనుకుంటున్న సన్నీని గట్టిగా పట్టేసుకుని ఆపే ప్రయత్నం చేసింది సిరి.
దీంతో చిర్రెత్తిపోయిన సన్నీ.. నన్నెందుకు పట్టుకున్నావని ఆవేశంతో ఊగిపోయాడు. 'నేను గేమ్ ఆడితే తంతా మరి! అప్పడం అయితవ్' అంటూ సిరికి వార్నింగ్ ఇచ్చాడు. ఇది నచ్చని షణ్ముఖ్ తనేం అనలేదు కదా అని సిరిని వెనకసుకొచ్చాడు. దీంతో మరింత ఉడికెత్తిపోయిన సన్నీ.. నువ్వాగు అంటూ అతడి మీదమీదకొచ్చాడు. దీంతో సీరియస్ అయిన షణ్ను.. నువ్వు తన్నలేవు? రా వచ్చి తన్ను అంటూ సన్నీని మరింత రెచ్చగొట్టాడు. ఆడపిల్లను పంపించి నువ్వు మాట్లాడుతున్నావు, చేతగాని ఆటలు ఆడుతున్నావని ఫైర్ అయ్యాడు సన్నీ. మరి వీరిద్దరి మధ్య గొడవలు ఎటువైపుకు దారితీస్తాయో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment