
Bigg boss 5 Telugu Grand Finale Latest Promo Released: బిగ్‌బాస్ బిగ్‌బాస్ సీజన్-5 గ్రాండ్ ఫినాలే మరింత గ్రాండ్‌గా ముస్తాబయ్యింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 5మచ్ సర్‌ప్రైజ్‌లతో ఫినాలే ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఇందులో భాగంగా ప్రముఖ సినీ స్టార్స్‌ని రంగంలోకి దించారు. వరుస గెస్ట్‌లతో స్టేజ్ దద్దరిల్లిపోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. టాలీవుడ్ నుంచే కాకుండా బాలీవుడ్ నుంచి ప్రముఖ ప్రేమ జంట, 'బ్రహ్మస్త్ర' టీం నుంచి రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్‌లు సందడి చేశారు.
అంతేకాకుండా ఆలియా.. బాలయ్య ఫేమస్ డైలాగ్ దబిడిదిబిడే.. అంటూ డైలాగ్ చెప్పడం విశేషం. 'ఆర్‌ఆర్‌ఆర్' నుంచి రాజమౌళి, 'శ్యామ్ సింగరాయ్' నుంచి నాని, కృతిశెట్టి, సాయి పల్లవి , 'పరంపర' మూవీ టీం నుంచి జగపతి బాబు, నవీన్‌చంద్ర బిగ్‌బాస్ స్టేజ్‌పై సందడి చేశారు. వీరితో పాటు పుష్ప నుంచి సుకుమార్, దేవీశ్రీ ప్రసాద్, రష్మిక ముఖ్య అతిథులుగా విచ్చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.
All set for #BiggBossTelugu5 Grand Finale evening with lots of surprises and Five much fun!#BBTeluguGrandFinale today at 6 PM on #StarMaa #BiggBossTelugu #FiveMuchFun pic.twitter.com/XETApXv0cN
— starmaa (@StarMaa) December 19, 2021
Comments
Please login to add a commentAdd a comment