Ranbir Kapoor, SS Rajamouli Visits Visakhapatnam For Brahmastra Movie Promotion - Sakshi
Sakshi News home page

Ranbir Kapoor-Brahmastra Movie: విశాఖలో రణ్‌బీర్‌, జక్కన్న సందడి

Published Tue, May 31 2022 3:45 PM | Last Updated on Tue, May 31 2022 5:28 PM

Ranbir Kapoor, SS Rajamouli Visits Visakhapatnam For Brahmastra Movie Promotion - Sakshi

బాలీవుడ్‌ కపుల్స్‌ రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా తొలిసారి నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. సెప్టెంబర్‌ 9న ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా రణ్‌బీర్‌ మంగళవారం వైజాగ్‌లో సందడి చేశాడు. ఈ సందర్భంగా రణ్‌బీర్‌కు గజమాలతో అభిమానులు ఘనస్వాగతం పలికారు. క్రేన్ సాయంతో ఆయనకు భారీ పూలమాల వేసి అభిమానులు సత్కరించారు. ఇక రణ్‌బీర్‌ కూడా ఫ్యాన్స్‌కు అభివాదం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. 

చదవండి: బర్త్‌డే రోజునే సూపర్‌ స్టార్‌ కృష్ణకు అరుదైన గౌరవం

ఫ్యాన్స్‌ అభిమానానికి రణ్‌బీర్‌ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ వైజాగ్‌ పర్యటనలో రణ్‌బీర్‌తో పాటు డైరెక్టర్‌ ఆయాన్‌ ముఖర్జీ కూడా ఉన్నారు. ఈ ప్రమోషన్‌ కార్యక్రమాలకు దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమైళి అతిథిగా వచ్చారు. బ్రహ్మస్త్ర మూవీ టీంతో కలిసి ఆయన కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు. కాగా ఈ సినిమాలో తెలుగు స్టార్‌ హీరో నాగార్జున అక్కీనేని ప్రధాన పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అంతేకాదు బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ కీ రోల్‌ పోషించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement