ఆ అవార్డు అందుకునే అర్హత లేదనిపిస్తోంది: రణ్‌బీర్‌ | Ranbir Kapoor On Getting Dadasaheb Phalke Award | Sakshi
Sakshi News home page

Ranbir Kapoor: నా భార్యకు రావడం సబబే, కానీ నాకు ఆ అర్హత లేదనిపిస్తోంది

Published Thu, Feb 23 2023 9:26 PM | Last Updated on Thu, Feb 23 2023 9:30 PM

Ranbir Kapoor On Getting Dadasaheb Phalke Award - Sakshi

బాలీవుడ్‌ దంపతులు, స్టార్‌ హీరోహీరోయిన్స్‌ రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గెలుచుకున్నారు. బ్రహ్మాస్త్ర సినిమాకు గానూ రణ్‌బీర్‌ ఉత్తమ నటుడిగా, గంగూబాయి కఠియావాడికిగానూ ఆలియా ఉత్తమనటిగా ఈ అవార్డులు పొందారు. తాజాగా తనకు ఈ పురస్కారం రావడంపై రణ్‌బీర్‌ స్పందించాడు. 'తు జూఠీ మై మక్కార్‌' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఛండీఘడ్‌లో పర్యటిస్తున్న రణ్‌బీర్‌ ఈ అంశంపై మాట్లాడుతూ.. 'దాదాసాహెబ్‌ ఫాల్కే రావడం సంతోషంగా ఉంది. కానీ బ్రహ్మాస్త్రలో నేను మరీ అత్యద్భుతంగా ఏమీ నటించలేదని నా అభిప్రాయం. ఈ పురస్కారానికి నేను పూర్తి అర్హుడిని కాదనిపిస్తోంది.

ఆలియాకు అయితే తన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. ఏదైనా అవార్డు వచ్చిందంటే హమ్మయ్య మా సినిమాకు మంచి రిజల్స్‌ వచ్చింది అని హ్యాపీగా ఫీలవుతాం. మరో ప్రాజెక్ట్‌ స్టార్ట్‌ చేసేవరకు ఏ టెన్షన్‌ లేకుండా ఉంటాం' అని చెప్పుకొచ్చాడు. ఇటీవలి కాలంలో తనకు బాగా నచ్చిన పర్ఫామెన్స్‌ల గురించి చెప్తూ పుష్పలో అల్లు అర్జున్‌, గంగూబాయి కఠియావాడిలో ఆలియా అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌లో రాజమౌళి పనితనం తనను బాగా ఆకట్టుకున్నాయన్నాడు. కాగా బ్రహ్మాస్త్ర గతేడాది సెప్టెంబర్‌ 9న రిలీజై సూపర్‌ హిట్‌ సాధించింది.

చదవండి: వేరొకరితో ఎంగేజ్‌మెంట్‌.. మాజీ ప్రియుడిచ్చిన నగలు మాత్రం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement