Ranbir Kapoor Refuses To Promote Brahmastra OTT Release, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Ranbir Kapoor: ఇక చాలు, ప్రమోషన్స్‌ నా వల్ల కాదు: రణ్‌బీర్‌ కపూర్‌

Published Wed, Oct 26 2022 5:59 PM | Last Updated on Wed, Oct 26 2022 6:52 PM

Ranbir Kapoor Refuses To Promote Brahmastra OTT Release - Sakshi

స్టార్‌ జంట రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. అయాన్‌ ముఖర్జీ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీ సెప్టెంబర్‌ 9న విడుదలైంది. విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.425 కోట్లు రాబట్టింది. థియేటర్లలో సందడి చేసిన బ్రహ్మాస్త్ర నవంబర్‌ 4 నుంచి హాట్‌స్టార్‌లోకి రాబోతోంది. సినిమా రిలీజ్‌కు ముందే ప్రమోషన్ల మీద ప్రమోషన్లు చేసింది చిత్రయూనిట్‌. ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు కూడా ప్రమోషన్స్‌ చేయడం నావల్ల కాదంటున్నాడు రణ్‌బీర్‌. ఈ మేరకు ఓ వీడియోను ఆలియా భట్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

ఇందులో హీరో ఓ ఫోన్‌కాల్‌ మాట్లాడుతూ.. 'ఇక నా వల్ల కాదు బ్రదర్‌. బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్‌ చేసేశాం కదా! అయాన్‌ ముఖర్జీతో కూడా పనైపోయింది. ఇప్పుడేమంటావ్‌.. బ్రహ్మాస్త్ర హాట్‌స్టార్‌లో వస్తుందా? అంటే మళ్లీ ప్రమోషన్లు చేయాలా? సినిమాలో కూడా ఆలియా అన్నిసార్లు శివ శివ అని స్మరించలేదేమో.. ప్రతి ఈవెంట్‌లో కేసరియా(కుంకుమలా నువ్వు..) పాట పాడి ఆమె గొంతు పోయింది. పదేపదే స్టేజీ మీద డ్యాన్స్‌ చేసీ చేసీ నేనూ ఓ దెయ్యంలా మారిపోతున్నా.. బ్రహ్మాస్త్ర లోగో లాంచ్‌ చేసినప్పుడు 150 డ్రోన్లతో స్వీట్లు పంచాం.

ఇంకా ఏం చేయాలి? ఇంటింటికీ వెళ్లి సోదరసోదరీమణులారా.. హాట్‌స్టార్‌లో బ్రహ్మాస్త్ర రాబోతోంది, దయచేసి చూడండి అని అడగాలా? అసలు అయాన్‌ ఏమనుకుంటున్నాడు? నాకు బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్‌ కాకుండా వేరే జీవితమే లేదనుకుంటున్నాడా? నేను త్వరలో తండ్రిని కాబోతున్నాను, అది నా జీవితంలోనే గొప్ప విషయం' అని చెప్పుకొచ్చాడు. ఇలా మాట్లాడుతున్న సమయంలో డైరెక్టర్‌ అయాన్‌ నుంచి ఫోన్‌ కాల్‌ రావడంతో లిఫ్ట్‌ చేసిన రణ్‌బీర్‌.. 'హేయ్‌ అయాన్‌.. తప్పకుండా చేద్దాం. ప్రమోషన్స్‌ చేసి తీరాల్సిందే. ప్రతి ఒక్కరూ బ్రహ్మాస్త్ర చూడాలి' అంటూ ప్రమోషన్స్‌ చేసేందుకు రెడీ అయిపోయాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement