బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో బ్రహ్మాస్త్రం పేరిట సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతోంది. నాగార్జున, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలు పోషించగా నాగిని బ్యూటీ మౌనీరాయ్ నెగెటివ్ రోల్ చేసింది. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాను దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దక్షిణాదిలో సమర్పిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానున్న బ్రహ్మాస్త్ర సినిమా ఎలా ఉందనే విషయం అప్పుడే బయటకు వచ్చేసింది. సెన్సార్ బోర్డ్ సభ్యుడినని తనకు తానే ప్రకటించుకున్న ఉమైర్ సంధు రణ్‌బీర్ సినిమాపై సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చాడు.
‘ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌తో కొన్ని సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కనుల విందు చేస్తుంది. కథ, స్క్రీన్‌ప్లే యావరేజ్. ఆలియా భట్, మౌనీరాయ్ నటన అద్భుతం. అమితాబ్ బచ్చన్ కనిపించే సీన్ మామూలుగా ఉండదు, కానీ అతడి పాత్ర నిడివి చాలా తక్కువ. బాలీవుడ్‌లో ఫాంటసీ సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటిది ఆ లైన్‌లో సినిమా తీసిన అయాన్ ముఖర్జీ ధైర్యాన్ని అభినందించాల్సిందే’అని ట్వీట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment