
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కాంబినేషన్‌లో ‘బ్రహ్మస్త్రం’ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందించారు. తెలుగులో ఈ మూవీని దర్శకధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి ప్రమోట్ చేస్తున్నారు. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం రామోజీ ఫిలింసిటీలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో పార్క్ హయాత్ హోటల్‌కి మార్చారు. ఈ కార్యక్రమానికి ‘బ్రహ్మాస్త్రం’ చిత్ర యూనిట్ సభ్యులతో పాటు అక్కినేని నాగార్జున, రాజమౌళి, ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ.. ముందుగా ఇక్కడకు రావాలనుకున్న అభిమానులు రాలేకపోయినందుకు వారికి క్షమాపణలు చెప్పారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎంతో ఆర్భాటంగా చేద్దామని అనుకున్నారని, అయితే గణేష్ బందోబస్తు ఉండడంతో పోలీసులు అనుమతి ఇవ్వలేకపోయారన్నారు. అందుకే అభిమానుల మధ్య కోలాహలంగా ఈవెంట్ జరపడం కుదరలేదని వివరించారు. రాక్‌స్టార్ సినిమా నుంచి రణ్‌బీర్ నటనంటే తనకంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ ఒత్తిడి ఎదుర్కుంటోందని.. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారని, వారికి గుడ్ అండ్ గ్రేట్ మూవీస్‌ను ఇవ్వాలన్నారు. బ్రహ్మాస్త్రం డైరెక్టర్ అయాన్ ముఖర్జీ కి అల్ ది బెస్ట్ చెప్తూ, ఈ చిత్రం పెద్ద విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ఇందులో బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కీలక పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment