SS Rajamouli Shares Brahmastra Pre Release Promo - Sakshi
Sakshi News home page

Brahmastra Pre Release Promo: అంచనాలు పెంచుతున్న ‘బ్రహ్మాస్త్రం’ ప్రీరిలీజ్‌ ప్రోమో

Published Sat, Sep 3 2022 7:19 PM | Last Updated on Sat, Sep 3 2022 7:47 PM

SS Rajamouli Shares Brahmastra Pre Release Promo - Sakshi

బాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ రణ్‌బీర్‌ కపూర్‌-ఆలియా భట్‌లు తొలిసారి జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల కాబోతోంది. బాలీవుడ్‌ డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ అంత్యంత ప్రతిష్టాత్మంగా తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 9న అన్ని భాషల్లో(హందీ, తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం) విడుదల  కాబోతోంది. ఇక ఈ సినిమాను తెలుగులో డైరెక్టర్‌ రాజమౌళి సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తూ ఓ క్రేజీ వీడియోను వదిలాడు రాజమౌళి.

చదవండి: సమంతతో నా ప్రయాణం ముగిసిందనుకుంటున్నా: చిన్మయి

బ్రహాస్త్రం ప్రీరిలీజ్‌ ప్రోమో పేరుతో విడుదల చేసిన ఈ వీడియోలో ట్రైలర్‌లో చూపించని, సినిమాకు హైలెట్‌గా నిలిచే పలు కీలక సన్నివేశాలతో చూపించారు. దీంతో ఈ వీడియో సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. ఇక రాజమౌళి ఈ వీడియోను షేర్‌ చేస్తూ ‘బ్రహ్మాస్త్రం అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభమైంది’ అని తెలిపాడు. కాగా ఈ చిత్రంలో టాలీవుడ్‌ ‘కింగ్‌’ నాగార్జున, బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌లు కీలక పాత్రలు పోషిస్తుండగా.. ‘నాగిని’ బ్యూటీ మౌని రాయ్‌ నెగిటివ్‌ రోల్‌లో కనిపించనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement