
బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఫాంటసీ మూవీ బ్రహ్మాస్త్ర. రెండు రోజులుగా కుంభమేళలో సందడి చేస్తున్న బ్రహ్మాస్త్ర టీం తాజాగా అఫీషియల్ లోగోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. నటీనటులు, పాత్రలకు సంబంధించిన ఎలాంటి స్టిల్స్ రిలీజ్ చేయకుండా కేవలం టైటిల్‌ను లోగో యానిమేషన్ మాత్రమే రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మూడు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ భారీ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో రణబీర్ కపూర్, అలియా భట్‌లు జంటగా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, నాగార్జున, డింపుల్ కపాడియా, మౌనీ రాయ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బ్రహాస్త్ర ట్రయాలజీలో తొలిభాగం ఈ ఏడాది క్రిస్టమస్ కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్‌జోహార్ నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment