Ranbir Kapoor: Bollywood Star Hero Touches Rajamouli Feet At Brahmastra Press Meet - Sakshi
Sakshi News home page

రాజమౌళి కాళ్లు మొక్కిన హీరో రణ్‌బీర్‌ కపూర్‌

Published Sat, Dec 18 2021 3:22 PM | Last Updated on Sat, Dec 18 2021 4:15 PM

Ranbir Kapoor Touches Rajamouli Feet At Brahmastra Press Meet - Sakshi

Ranbir Kapoor Touches Rajamouli Feet At Brahmastra Press Meet: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్, అలియా భట్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మస్త్ర’. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, డింపుల్‌ కపాడియా నటిస్తుండడంతో అంచనాలు మరింత పెరిగాయి. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను శనివారం లాంచ్‌ చేశారు.

ఈ కార్యక్రమానికి ఎస్‌.ఎస్‌ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా రణ్‌బీర్‌ ..రాజమౌళి కాళ్లు మొక్కడం హాట్‌ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రణ్‌బీర్‌ చూపిన వినయానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌ పార్ట్‌ను వచ్చే ఏడాది సెప్టెంబర్‌9న విడుదల చేయనున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను దక్షిణాది భాషల్లో రాజమౌళి సమర్పిస్తున్నాడు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement