touches
-
CSK అభిమానులకు జడేజా భార్య ట్రీట్ ..!
-
టోకు ద్రవ్యోల్బణం తగ్గినా, ‘తీవ్రమే’
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో 12.41 శాతంగా (2021 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. గడచిన 11 నెలలుగా ఇంత తక్కువ స్థాయి టోకు ధరల రేటు నమోదు ఇదే తొలిసారి. గడచిన మూడు నెలలుగా టోకు ధరల స్పీడ్ తగ్గుతూ వస్తోంది. అయితే ఈ సూచీ రెండంకెలపైనే కొనసాగడం ఇది వరుసగా 17వ నెల. దీనితోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యపరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టు వరకూ వరుసగా ఎనిమిది నెలల నుంచి కేంద్రం నిర్ధేశిస్తున్న 6 శాతం ఎగువన కొనసాగుతోంది. ఆయా అంశాలు సామాన్యునిపై ధరల భారాన్ని మోపుతున్నాయి. గణాంకాల్లో కొన్ని కీలక విభాగాలను పరిశీలిస్తే.. ♦ ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం 12.37 శాతంగా ఉంది. జూలైలో ఈ రేటు 10.77 శాతమే. తృణధాన్యాలు (1.77శాతం), గోధుమలు (17.35 శాతం) పండ్లు (31.75 శాతం), కూరగాయల (22.92 శాతం) ధరలు పెరుగుదల బాటన ఉన్నాయి. ♦ టమాటా విషయంలో ధర 43.56 శాతం ఎగసింది. ♦ ఇంధనం, విద్యుత్ బాస్కెట్లో ద్రవ్యోల్బణం 33.67 శాతంగా ఉంది. అయితే జూలైలో ఈ స్పీడ్ 43.75 శాతం. ♦ తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 7.51% ఉంది. ♦ ఆయిల్‌సీడ్స్ విషయంలో రేటు 13.48% తగ్గింది. -
రాజమౌళి కాళ్లు మొక్కిన హీరో రణ్‌బీర్ కపూర్
Ranbir Kapoor Touches Rajamouli Feet At Brahmastra Press Meet: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మస్త్ర’. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, డింపుల్ కపాడియా నటిస్తుండడంతో అంచనాలు మరింత పెరిగాయి. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను శనివారం లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్.ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా రణ్‌బీర్ ..రాజమౌళి కాళ్లు మొక్కడం హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రణ్‌బీర్ చూపిన వినయానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌ను వచ్చే ఏడాది సెప్టెంబర్9న విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను దక్షిణాది భాషల్లో రాజమౌళి సమర్పిస్తున్నాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మహిళ కాళ్లు మొక్కిన రాజ్‌నాథ్ సింగ్
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం పరమవీర చక్ర పొందిన కల్నల్ హోషియార్ సింగ్ భార్య ధన్నోదేవి పాదాలను తాకారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి రాజ్‌నాథ్ సింగ్ హాజరుకాగా అందులో ఈ ఘటన చోటు చేసుకుంది. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో భారత సైనికులు అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిరస్మరణీయ విజయానికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 50వ వార్షికోత్సవాన్ని న్యూఢిల్లీలో విజయ్ పర్వ్ సమపన్ సమరోహ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి 1971 యుద్ధంలో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన బంగ్లాదేశ్ ముక్తిజోద్ధులు, భారత యుద్ధ అనుభవజ్ఞులతో స్నేహపూర్వకంగా కలిసి వారితో సంభాషించారు. ‘భారత సాయుధ దళాలు వారి పరాక్రమ పోరాటంలో ధైర్యవంతులైన ముక్తిజోద్ధులతో కలిసి పనిచేశాయి. యుద్ధ అనుభవజ్ఞుడైన కల్నల్ హోషియార్ సింగ్‌ను 1971 యుద్ధంలో ధైర్యాన్ని ప్రదర్శించినందుకు దేశంలోని అత్యున్నత సైనిక గౌరవమైన పరమవీర చక్రతో సత్కరించారు, ఇది బంగ్లాదేశ్ విముక్తికి దారితీసిందని’ తెలుపూతూ ట్వీట్ చేశారు. Had a warm interaction with the Bangladeshi Muktijoddhas and the Indian war veterans who fought against injustice in 1971 war. The Indian Armed Forces worked together with the courageous Muktijoddhas in their valiant struggle.#SwarnimVijayParv pic.twitter.com/R6LnbUzeZC — Rajnath Singh (@rajnathsingh) December 14, 2021 -
ఈ కార్పొరేట్ దిగ్గజాలకు నెటిజన్లు ఫిదా
సాక్షి, ముంబై : వాళ్లిద్దరూ ప్రముఖ పారిశ్రామికవేత్తలు. వృత్తిపరంగా ప్రత్యర్థులైన ఈ కార్పొరేట్ దిగ్గజాలు వ్యక్తులుగా మంచి స్నేహితులు కూడా. తాజాగా అంతకుమించి తమ మర్యాద పూర్వక ప్రవర్తనతో పలువురికి స్పూర్తిగా నిలిచారు. ఒకరు ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ స్వామి(73) కాగా, మరొకరు టాటా అధినేత రతన్ టాటా (82). మొన్న టాటా ఫోటోకు నెటిజన్లు ఫిదా అవ్వగా, కార్పొరేట్ గవర్నెన్స్‌కు ప్రాణమిచ్చే ఇన్ఫీ నారాయణ మూర్తి ఫోటోలు తాజాగా వైరలవుతున్నాయి. ఈ ఇద్దరు పారిశ్రామికవేత్తలు జనవరి 28 న జరిగిన ట్రైకాన్ ముంబై 2020, 11వ వార్షిక అవార్డుల కార్యక్రమంలో ఒకే వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. రతన్‌టాటాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందించిన వెంటనే తన కంటే వయసులో పెద్దవారైన టాటాకు నారాయణ మూర్తి ఆయనకు పాదాభివందనం చేశారు. గొప్ప స్నేహితుడైన నారాయణ మూర్తి నుంచి అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఆ ఫొటోలను, వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొన్నారు రతన్ టాటా. దీంతో నారాయణమూర్తి మరోసారి నెటిజన్ల ప్రశంసలను అందుకుంటున్నారు. రతన్ టాటాకు పాదాభివందనం చేసి నారాయణమూర్తి తన విధేయతను చాటుకున్నారని కొనియాడుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పలువురిని అబ్బుర పరుస్తున్నాయి. రెండు అతిపెద్ద ప్రత్యర్థి సంస్థలు, ఇద్దరు అత్యంత వినయపూర్వకమైన వ్యాపారవేత్తలు, ముఖ్యంగా నారాయణ మూర్తి రతన్ టాటా పాదాలను తాకడం అపూర్వం. ఇంటర్నెట్లో ఇది ఉత్తమమైందంటూ ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. టాటా ఆశీర్వాదం కోసం ఆయన పాదాలను తాకడం నారాణమూర్తి వ్యక్తిత్వానికి నిదర్శనమని మరొకరు ట్వీట్ చేశారు. పిల్లల్లో ఇలాంటి గొప్ప సంస్కృతిని జీర్ణింప చేయాల్సిన అవసరం చాలా వుందని ఒక తండ్రిగా తాను భావిస్తున్నానన్నారు. కాగా ఇటీవల రతన్ టాటా తాను యువకుడిగా ఉన్నప్పటి అద్భుతమైన ఫోటోను షేర్ చేసి పలువురిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. Life Time Achievement Award to Ratan Tata and Narayana Murthy took Tata's blessings. #RatanTata @RNTata2000 @Infosys_nmurthy #business #WednesdayThoughts #Respect pic.twitter.com/f0NG5TpDeM — Shubham Choudhary (@shub_lakku) January 29, 2020 This picture defines all about humbleness and simplicity, Mr. N R Narayana Murthy touching Mr. Ratan Tata’s feet to seek his blessings. A lesson for all of us. 🙏 #TiEConMumbai2020 #inspirational #RatanTata #NarayanaMurthy pic.twitter.com/NfnGpv4H04 — Arisudan Tiwari (@Arisudan29) January 29, 2020 Two biggest rival company, two most humble businessman. Narayana Murthy touching feet of Ratan Tata is best thing on internet, today. pic.twitter.com/OAjjE6gzba — That Indian girl (@thtsal) January 29, 2020 -
బీచ్‌కు మరిన్ని సొబగులు
ద్వారకానగర్ : బీచ్ సుందరీకరణకు మరిన్ని మెరుగులు దిద్దాలని జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ కొత్తజాలరిపేట, ఓడీఎఫ్ కమిటీ సభ్యులతో మాట్లాడి బహిరంగ మలవిసర్జన అరికట్టాడానికి తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. విశాఖను ఓడీఎఫ్ నగరంగా తీర్చిదిద్దాడానికి ఎంతో కృషి చేస్తున్నామని.... ప్రజలు ప్రజా మరుగుదొడ్లను వినియోగించుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బీచ్‌లోని గోకుల్ పార్కు, రాక్ గార్డెన్స్, జీవీఎంసీ పార్కు, వరుణ్ పార్కులను మరింత ఆకర్షిణీయంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఐఆర్ఎఫ్కు కోట్లాది రూపాయలతో సుందరీకరణించినప్పటకీ తదుపరి నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించలేదని అభిప్రాయపడ్డారు. 15 రోజులకోసారి పుట్‌ఫాత్‌లను నీటితో శుభ్రం చేయాలని సూచించారు. బీచ్‌ను మరింత అందంగా తీర్చిదిద్దాడానికి అనువైన నీడనిచ్చేచెట్లను నాటాలని కోరారు. ఆర్కేబీచ్లో తొలగించిన బెంచీల స్థానంలో మళ్లీ ఏర్పాటు చేసి పరిసరాలను సుందరంగా తీర్చాదిద్దాలన్నారు. ఆయన వెంట జోనల్ కమిషనర్లు నల్లనయ్య, వి. చక్రధర్‌రావు, ఈఈలు రత్నాలరాజు, కష్ణారావు, సుధాకర్, మహేష్, ఎం. దామోదర్, ఏఎంవోహెచ్ డా. మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.