మహిళ కాళ్లు మొక్కిన రాజ్‌నాథ్‌ సింగ్‌ | New Delhi: Rajnath Singh Touches Feet Of 1971 War Veteran Wife | Sakshi
Sakshi News home page

మహిళ కాళ్లు మొక్కిన రాజ్‌నాథ్‌ సింగ్‌

Published Tue, Dec 14 2021 9:34 PM | Last Updated on Tue, Dec 14 2021 10:01 PM

New Delhi: Rajnath Singh Touches Feet Of 1971 War Veteran Wife - Sakshi

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం పరమవీర చక్ర పొందిన కల్నల్ హోషియార్ సింగ్ భార్య ధన్నోదేవి పాదాలను తాకారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరుకాగా అందులో ఈ ఘటన చోటు చేసుకుంది. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో భారత సైనికులు అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిరస్మరణీయ విజయానికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 50వ వార్షికోత్సవాన్ని న్యూఢిల్లీలో విజయ్ పర్వ్ సమపన్ సమరోహ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా రక్షణ మంత్రి 1971 యుద్ధంలో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన బంగ్లాదేశ్ ముక్తిజోద్ధులు, భారత యుద్ధ అనుభవజ్ఞులతో స్నేహపూర్వకంగా కలిసి వారితో సంభాషించారు. ‘భారత సాయుధ దళాలు వారి పరాక్రమ పోరాటంలో ధైర్యవంతులైన ముక్తిజోద్ధులతో కలిసి పనిచేశాయి. యుద్ధ అనుభవజ్ఞుడైన కల్నల్ హోషియార్ సింగ్‌ను 1971 యుద్ధంలో ధైర్యాన్ని ప్రదర్శించినందుకు దేశంలోని అత్యున్నత సైనిక గౌరవమైన పరమవీర చక్రతో సత్కరించారు, ఇది బంగ్లాదేశ్ విముక్తికి దారితీసిందని’ తెలుపూతూ ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement