ఢిల్లీ : లడక్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్- చైనా ఆర్మీ మధ్య తలెత్తిన ఘర్షణలో 20 మంది సైనికుల మృతి చెందిన ఘటనపై దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విటర్ వేదికగా స్పందించారు. ' వారి ప్రాణత్యాగం నన్ను మనోవేదనకు గురి చేసింది. సైనికుల త్యాగాలను, ధైర్యాన్ని దేశం ఎన్నడూ మరిచిపోదు. గాల్వన్ దాడిలో చనిపోయిన సైనికుల కుటుంబాలకు ఇదే నా ప్రగాడ సానుభూతి . క్లిష్ట సమయంలో దేశం అంతా కలిసికట్టుగా ఉంది. భారతీయ బ్రేవ్‌హార్ట్స్ పట్ల గర్వంగా ఉంది. గాల్వన్‌లో సైనికులు చనిపోవడం బాధాకరం. సరిహద్దు విధుల్లో మన సైనికులు అత్యంత ధైర్యసాహాసాలు ప్రదర్శించారు. అత్యున్నత స్థాయిలో సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేశారంటూ' ట్వీట్ చేశారు.(సరిహద్దు ఘర్షణ : రాజ్‌నాథ్ మరోసారి కీలక భేటీ)
The loss of soldiers in Galwan is deeply disturbing and painful. Our soldiers displayed exemplary courage and valour in the line of duty and sacrificed their lives in the highest traditions of the Indian Army.
— Rajnath Singh (@rajnathsingh) June 17, 2020
మంగళవారం గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్- చైనా ఆర్మీ మధ్య తలెత్తిన ఘర్షణలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో ఇప్పటివరకు కల్నల్ సహా 20 మంది భారత సైనికులు మరణించగా, తాజాగా మరో నలుగురి జవాన్ల పరిస్థితి విషమంగా మారడంతో భారత్- చైనా సరిహద్దులో యుద్ద వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా దేశ రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా రాజ్‌నాథ్ మరోసారి విదేశాంగ మంత్రి జై శంకర్, త్రివిద దళాల అధిపతులతో పాటు హోం మంత్రితో సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దులో జరిగిన ఘర్షణలో మృతుల వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గాల్వన్ లోయ ప్రాంతంలో ఇండియా-చైనా సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణపై కీలక సమావేశం జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment