ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో 'బ్రహ్మాస్త్ర' షూటింగ్‌ పూర్తి.. వీడియో వైరల్‌ | Ranbir Kapoor Alia Bhatt Brahmastra Wrap Up Shooting At Varanasi | Sakshi
Sakshi News home page

Brahmastra Movie: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో 'బ్రహ్మాస్త్ర' షూటింగ్‌ పూర్తి.. ఎక్కడంటే ?

Published Tue, Mar 29 2022 4:14 PM | Last Updated on Tue, Mar 29 2022 4:31 PM

Ranbir Kapoor Alia Bhatt Brahmastra Wrap Up Shooting At Varanasi - Sakshi

Ranbir Kapoor Alia Bhatt Brahmastra Wrap Up Shooting At Varanasi: బాలీవుడ్‌ చాక్లెట్‌ బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్, బీటౌన్‌ క్యూట్‌ బ్యూటీ అలియా భట్‌ తొలిసారి జంటగా నటిస్తున్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. ఈ సినిమాలో బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, టాలీవుడ్‌ మన్మథుడు నాగార్జున, మౌని రాయ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ భారతదేశ ఆధ్యాత్మిక క్షేత్రమైన వారణాసిలో పూర్తయింది. 'బ్రహ్మాస్త్ర' చివరి షెడ్యూల్‌ను వారణాసిలో పూర్తి చేసినట్లు ఓ వీడియో ద్వారా దర్శకనిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 'బ్రహ్మాస్త్ర' విజన్‌ను దర్శకధీరుడు రాజమౌలి అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్‌ సౌత్‌లో అద్భుతంగా మొదలైంది. 

చదవండి: ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఈవెంట్‌లో పెళ్లిపై స్పందించిన రణ్‌బీర్‌-అలియా భట్‌

భారతీయ పురాణాలు అలాగే ఆధునిక ప్రపంచం నుంచి ప్రేరణ పొందిన పురాణ సమ్మేళనం 'బ్రహ్మాస్త్ర' సినిమా. 2022లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇది కూడా ఒకటి. ఈ మధ్యే విడుదల తేదీని అనౌన్స్ చేయడంతో పాటు మోషన్ పోస్టర్ కూడా తీసుకొచ్చారు. సెప్టెంబర్‌ 09, 2022న 'బ్రహ్మాస్త్ర' సినిమా విడుదల కానుంది. ఆ రోజు కచ్చితంగా ఇండియన్ సినిమా హిస్టరీలో కొత్త చరిత్ర మొదలవుతుందని నమ్మకంగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. మూడు భాగాలుగా వస్తున్న 'బ్రహ్మాస్త' సినిమా ప్రమోషన్‌లోకి రాజమౌళి చేరడంతో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.  
 


చదవండి: విశ్వంలో అత్యంత పురాతన శక్తి.. ‘బ్రహ్మాస్త్ర’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement