jaswanth
-
అమర జవాన్ జశ్వంత్ రెడ్డి ఫ్యామిలీకి " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
Bigg Boss 5 Telugu: జెస్సీకి సీక్రెట్ టాస్క్.. బకరా అయిన సన్నీ!
బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. వీకెండ్ దాకా కలిసి ఉన్న హౌస్మేట్స్.. నామినేషన్ రాగానే చెలరేగిపోతారు. ఇక టాస్క్‌ల విషయంలో అయితే ఇది మరీ ఎక్కువ. స్నేహితులని కూడా చూడకుండా స్వార్థంగా ఆడుతూ.. టాస్క్ గెలిచేందుకు తీవ్రంగా కష్టపడతారు. ఈ క్రమంలో స్నేహితులను తిట్టేస్తుంటారు. అయితే కొన్నిసార్లు బిగ్‌బాస్ ఇచ్చే షాక్‌కి హౌస్మేట్స్ దిమ్మతిరిగిపోతుంది. నేటి ఎపిసోడ్లో అలాంటి సంఘటననే జరిగినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. జెస్సీకి ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చి మిగిలిప హౌస్‌మేట్స్‌ని బకరాలను చేశాడు బిగ్‌బాస్. (చదవండి: బిగ్‌బాస్: అలా చేస్తే చెంప పగిలిపోద్ది.. సన్నీకి ప్రియ వార్నింగ్) కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇంటిసభ్యులకు బిగ్‌బాస్ ‘బంగారు కోడిపెట్ట’ టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జెస్సీకి బిగ్‌బాస్ ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. దీంతో రెచ్చిపోయిన జెస్సీ.. సన్నీని ఓ ఆట ఆడేసుకున్నాడు. కావాలనే సన్నీని రెచ్చగొట్టాడు. ఇది సీక్రెట్ టాస్క్ అనే విషయం తెలియన సన్నీ.. జెస్సీపై ఫైర్ అయ్యాడు. మరోవైపు సిరికి కూడా ఈ సీక్రెట్ టాస్క్‌లో భాగమైనట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. జెస్సీకి తోడుగా ఉంటూ.. సన్నీకి మరింత కోపం వచ్చేలా చేసింది. ‘ఏం చేస్తే నీకెందుకురా’అంటూ సన్నీని రెచ్చగొట్టగా.. ఇంకోసారి ‘రా’అనకు.. అలా పిలిచే అర్హత నీకు లేదంటూ.. సన్నీ ఫైర్ అయ్యాడు. కట్ చేస్తే.. ఇదంతా సీక్రెట్ టాస్క్ అని బిగ్‌బాస్ అనౌన్స్ చేయడంతో అంతా తెల్లముఖాలు వేశారు. ఇక త్రిమూర్తుల్లో ఒకరైన షణ్ముఖ్ సైతం సీక్రెట్ టాస్క్ గురించి తెలుసుకొని షాకయ్యాడు. నాక్కూడా సీక్రెట్ టాస్క్ ఇవ్వమని బిగ్‌బాస్‌ని రిక్వెస్ట్ చేయగా.. ముందైతే టాస్క్ సరిగా ఆడంటూ రవి సెటైర్ వేశాడు. మరి ఈ సీక్రెట్ టాస్క్‌లో జెస్సీ సక్సెస్ అయ్యాడా లేదా తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
పాఠశాల సమీపంలో ఘర్షణ.. ఏడో తరగతి విద్యార్థి మృతి
సాక్షి, సీతమ్మధార (విశాఖ ఉత్తర): పాఠశాల సమీపంలో విద్యార్థుల మధ్య ఘర్షణలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన గురువారం అక్కయ్యపాలెం దరి లలితానగర్ జ్ఞాననికేతన్ స్కూల్ వద్ద చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వివరాలు ఇన్చార్జి డీసీపీ ఆదినారాయణ, ఈస్ట్ ఏసీపీ హర్షితచంద్ర విలేకరు లకు వెల్లడించారు. పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థుల మధ్య సాయంత్రం 4 గంటల సమయంలో ఘర్షణ జరిగింది. స్కూల్ విడిచిపెట్టిన తరువాత నలుగురు విద్యార్థులు పాఠశాల సమీపంలోకి వెళ్లారు. అందులో ఒక్క విద్యార్థి స్టార్ట్ అని చెప్పగా ఇద్దరు విద్యార్థులు కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో జశ్వంత్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు స్కూల్ యాజమాన్యానికి సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి టీచర్స్ చేరుకుని జశ్వంత్‌ని హాస్పటల్‌కు తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సమీపంలో సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. అందులో విద్యార్థులు కొట్టుకున్నట్లు గుర్తించారు. ప్రిన్సిపాల్, విద్యార్థులను, స్థానికులను విచారించారు. విద్యార్థుల మధ్య కొట్లాట కారణంగానే తమ కుమారుడు మృతి చెందినట్లు విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోర్త్ టౌన్ ఎస్ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ►కైలాసపురంలో నివసిస్తున్న రామలక్ష్మి, రాములకు ఇద్దరు సంతానం. పెద్దవాడు జశ్వంత్(13) జ్ఞాననికేతన్ స్కూల్లో గతేడాది చేరాడు. కొద్ది రోజులుగా తోటి విద్యార్థులు కొడుతున్నట్లు తల్లిదండ్రులకు జశ్వంత్ చెప్పినట్లు తెలిసింది. -
ఆమెను నా గర్ల్‌ఫ్రెండ్ చేయండి.. బిగ్‌బాస్‌కు జెస్సీ రిక్వెస్ట్
బిగ్‌బాస్ హౌస్‌లో జెస్సీ అంటే మిగతా కంటెస్టెంట్స్ అందరికి మంచి అభిప్రాయం ఉంది. అందరికి కంటే చిన్నోడు కావడం, అమాకత్వంగా వ్యవహరించడం అతనికి కలిసొస్తుంది.అయితే సొంతంగా నిర్ణయాలు తీసుకోకపోవడం, షణ్ముఖ్ చెప్పింది చేయడం జెస్సీకి మైనస్ అనే చెప్పాలి. ఇదే విషయంపై హోస్ట్ నాగార్జున కూడా జెస్సీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. నీ నిర్ణయాలు నువ్వే తీసుకో అని సలహా కూడా ఇచ్చాడు. (చదవండి: బిగ్‌బాస్: డేంజర్ జోన్లో ఆ ముగ్గురు, ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..) అయితే కెప్టెన్‌గా జెస్సీ చెప్పే మాటలను కొంతమంది పట్టించుకోవడం లేదు. దీంతో అప్పుడప్పుడు జెస్సీ ఇరిటేట్ అవుతున్నాడు కూడా. ఇదంతా పక్కన పెడితే అమ్మాయిలతో పులిహోర కలపడంలో జెస్సీ తక్కువేమి కాదు. చాన్స్ దొరికితే చాలు.. సిరి, హమిదా, శ్వేతలను ఫ్లటింగ్ చేయడానికి ట్రై చేస్తాడు. తన అమాయకమైన మాటలతో వారిని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తాడు. తాజాగా శ్వేతతో పులిహోర కలిపాడు ఈ అమాయకపు చక్రవర్తి. శ్వేతకు తన గర్ల్‌ఫ్రెండ్ పాత్ర ఇచ్చి ఓ టాస్క్ఇవ్వడంటూ ఏకంగా బిగ్‌బాస్‌కే విజ్ఞప్తి చేశాడు. ‘నేను రిక్వెస్ట్ చేస్తున్నా బిగ్‌బాస్.. మా ఇద్దరిని కలిపి బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్‌గా ఓ రోల్ పెట్టండి. ‘మనోహర.. మనోహర’అనే రొమాంటిక్ సాంగ్ ప్లే చేయండి’అంటూ బిగ్‌బాస్‌కు విజ్ఞప్తి చేశాడు. ఇక జెస్సీ మాటలకు శ్వేత పడిపడి నవ్వింది. మరి ఈ అమాయకపు చక్రవర్తి కోరికను బిగ్‌బాస్ నెరవేర్చాడో లేదో తెలియాలంటే.. నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడేనా?
Bigg Boss 5 Telugu Elimination : బిగ్‌బాస్ అయిదో సీజన్లో మొదటి నుంచి ఆసక్తిగా సాగుతోంది. తొలి రోజు నుంచే కంటెస్టెంట్ల మధ్య గొడవలు ప్రారంభయ్యాయి. చిన్నపాటి విషయాలకు గొడవ పడుతూ వివాదానికి దారి తీస్తున్నారు. ఈ క్రమంలో ఫస్ట్ వీక్ జరిగిన నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా కొనసాగిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లే జాబితాలో జెస్సీ(జస్వంత్), రవి, సరయూ, కాజల్, మానస్, హమీదా ఉన్నారు. తొలివారం, తొలి ఎలిమినేషన్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. చదవండి: RC15 : రామ్‌చరణ్ ధరించిన ఈ కాస్ట్లీ వాచ్ ధరెంతో తెలుసా? ఇంకా ఆదివారం రావడానికి మధ్యలో రెండు రోజులే ఉంది. దీంతో ఏ సభ్యుడు ఇంటి నుంచి బయటకు వెళ్లనున్నాడన్నది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు మోడల్ జెస్సీ(జస్వంత్) ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నాడంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటి వరకు అందరి కంటే తక్కువగా ఓట్లు జెస్సీకే వచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: Bigg Boss 5 Telugu: ఒక్క వారానికే రవి అంత తీసుకుంటున్నాడా? అయితే మోడలింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి హౌజ్‌లో అడుగు పెట్టిన జెస్సీ తొలుత అమాయకంగా వ్యవహరించాడు. నామినేషన్ ప్రక్రియలో ఏడ్చి సింపతి కొట్టేశాడు. ఆ తర్వాత రాను రాను వివాదాస్పదంగా మారుతున్నాడు. అనీ మాస్టర్ అంటే గౌరవం అంటూనే ఆమెతో వాగ్వాదానికి దిగాడు. నిన్న జరిగిన ఎపిసోడ్లో ఆమెను కూర్చోనివ్వకుండా కాలు అడ్డుగా పెట్టి దురుసుగా ప్రవర్తించడంతో ఆమె లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకింది. ఈ విషయంలో తప్పు జెస్సీదే అని అందరూ అనడంతో క్షమాపణలు కూడా కోరాడు. దీంతో నామినేషన్లో ఉన్న వారిలో జెస్సీ ప్రవర్తనే ప్రేక్షకులకి కాస్త విసుగు తెప్పించింది. దీంతో జెస్సీని ఈ వారం ఎలిమినేట్ చేస్తారని, అందులో డౌటే లేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. మరి అందరూ భావించినట్టుగానే ఈ వారం జెస్సీ ఎలిమినేట్ అవుతాడా? లేదా? తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే. కాగా గత సీజన్స్‌లో మోడలింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన కౌశల్, అలీ రెజా రాణించగా.. కౌశల్ అయితే ఏకంగా విన్నర్‌గా నిలిచాడు. కానీ ఈ సారి జెస్సీ మాత్రం తొలి వారమే ఎలిమినేట్ కాబోతున్నాడంటూ నెట్టింట వార్తలు హల్చల్ చేస్తుండటం గమనార్హం. -
బిగ్‌బాస్ హౌస్‌లో పిల్లి లొల్లి.. జెస్సీ కంటతడి
బిగ్ బాస్ షో అంటేనే వివాదాలు.. కాంట్రవర్సీలు.. ఒకరినొకరు అరుచుకోవడం.అయితే ప్రతీసారి సీజన్ మొదలైన తర్వాత కనీసం వారం రోజుల తర్వాత ఈ చిచ్చు మొదలవుతుంది. కానీ ఐదో సీజన్లో మాత్రం రెండు రోజులకే రచ్చ మొదలైపోయింది. నామినేషన్ ప్రక్రియలో జెస్సీ, హమిదా మధ్య పిల్లి లొల్లి మొదలైంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. లోబో గురకతో విసిగెత్తిపోయిన జెస్సీ, హహీదా, శ్వేతా వర్మ.. గార్డెన్ ఏరియాలో కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. (చదవండి: బిగ్‌బాస్: తొలి వారం నామినేషన్లో ఆరుగురు, లిస్ట్ ఇదే!) ఈ సందర్భంగా హమీదా తన పెంపుడు పిల్లి గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. సాధారణంగా పిల్లులు మ్యావ్ అని అరుస్తాయి. కానీ తన పిల్లి మాత్రం మా.. అమ్మా అని పిలిస్తాయాని చెప్పింది. వాటికి చిన్నప్పటి నుంచి బయట ప్రపంచం తెలియకుండా ‘అమ్మా’అనే మాటలను ప్రాక్టీస్ చేయించానని, అందుకే అవి అలా పిలుస్తాయని చెప్పింది. అది విని జెస్పీ షాకయ్యాడు. అంతేకాదు తన వద్ద కుక్క కూడా ఉందని హమీదా చెప్పగా... కుక్కలు ఏమంటాయ్? డాడీ అని పిలుస్తాయా?అని సరదాగా అన్నాడు. ఆ మాటలకు హర్ట్ అయినా హమీదా.. ఈ విషయాన్ని మిగతా ఇంటి సభ్యులతో పంచుకుంది. దీంతో జెస్సీ ఫైర్ అయ్యాడు. నేను సరదాగా అన్నానని, అయినా అక్కడే నేను సారీ కూడా చెప్పాను. మళ్లీ ఎందుకు ఆ విషాయాన్ని ప్రస్తావిస్తున్నావని కోపగించాడు. దీని కారణంగానే హమీదాతో పాటు విశ్వ, యానీ మాస్టార్ అతడిని ఎలిమినేషన్‌కి నామినేట్ చేశారు. ఆ సమయంలో జెస్సీ ఎమోషనల్‌కు గురయ్యాడు. ఇలా మొత్తానికి పిల్లి లొల్లి వల్ల జెస్సీ ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యాడు. ఇక హమిదా పిల్లి వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్ అయిన వారిలో రవి, మానస్, సరయూ, కాజల్, హమీదా, జెస్సీలు ఉన్నారు. మరి వీరిలో ఎమినేట్ అవుతారో తెలియాలంటే వీకెండ్ వరకు ఆగాల్సిందే. -
నవోదయకు దీటుగా ‘ఏకలవ్య’
హైదరాబాద్: జవహర్ నవోదయ పాఠశాలలకు దీటుగా ఏకలవ్య పాఠశాలలను తీర్చిదిద్దుతామని గిరిజన వ్యవహారాల కేంద్ర సహాయమంత్రి జశ్వంత్ సిన్హ్ సుమన్ భాయ్ భభోర్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఈఎం ఆర్ఎస్ (ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్) తొలి ‘ఫస్ట్ నేషనల్ స్పోర్ట్స్ మీట్’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోమవారం ప్రారం భమైన ఈ స్పోర్ట్స్ మీట్ 16 వరకు జరగనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏకలవ్య పాఠశాలలు నెలకొల్పాలన్న దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ఆలోచననే ప్రధాని నరేంద్ర మోదీ ఆచరణలో పెట్టారని తెలిపారు. 2022లోగా 400 ఏకలవ్య మోడల్ స్కూళ్లు ప్రారంభించి, వాటిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దతామన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో కీలకంగా నిలిచిన ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధికి మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. ఏకలవ్యకు నిధులు పెంచాం.. ఈఎంఆర్ఎస్ టలకు 2014–15 బడ్జెట్‌తో పోలీస్తే.. 2018–19 బడ్జెట్లో నిధులు అధికంగా కేటాయించామని వివరించారు. వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదం చేస్తాయని, అందరూ పట్టుదలతో కృషి చేసి క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. గిరిజన యువతలో ఎంతో ప్రతిభా పాటవాలు దాగి ఉంటాయని, అందుకు క్రికెటర్ ధోనీ, బాక్సర్ మేరికోమ్లే నిదర్శనమని అన్నారు. 20 వేల జనాభాకు ఒక గురుకులం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏక్ భారత్ – శ్రేష్ట భారత్ నినాదంతో దేశ అభివృద్ధికి మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఈఎంఆర్ఎస్ విద్యార్థులు స్వచ్ఛ భారత్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం నృత్యాలు, వివిధ రాష్ట్రాల విద్యార్థులు ప్రదర్శించిన కోయ, లంబాడీ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గిరిజన వ్యవహారాల కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బిశ్వజిత్ దాస్, రాష్ట్ర గిరిజన సంక్షేమ కార్యదర్శి డాక్టర్ బెన్హూర్ మహేశ్ దత్ ఎక్క, కమిషనర్ డాక్టర్ క్రిస్టినా జడ్ చోగ్తు, టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ డైరెక్టర్ రాజేంద్ర కుమార్, శాట్స్ చైర్మన్ ఎ.వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థి అదృశ్యంపై ఫిర్యాదు
కళ్యాణదుర్గం : పట్టణంలోని జ్ఞానభారతి ప్రైవేటు పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న జశ్వంత్ అనే విద్యార్థి తప్పిపోయినట్లు తండ్రి లక్ష్మణమూర్తి శనివారం పట్టణ పోలీస్టేన్‌లో ఫిర్యాదు చేశారు. గత బుధవారం ఉదయం 9 గంటల సమయంలో పాఠశాల ప్రహరీ దూకి వెళ్లిపోయినట్లు అక్కడి వార్డెన్ తిప్పేస్వామి సమాచారం ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కళ్యాణదుర్గం ప్రాంతంలో అన్వేషించినా ఆచూకీ లభించలేదన్నారు. తన కుమారుని అచూకీ కనుగొని న్యాయం చేయాలని కోరారు. -
ప్రాణం తీసిన సరదా
ఈత నేర్చుకోవాలన్న సరదా ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీసింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు... బత్తలపల్లి మండలం జలాలపురం గ్రామానికి చెందిన కుమ్మర రామకృష్ణ, సుగుణమ్మ దంపతుల కుమారుడు కుమ్మర సాయికుమార్(13) బత్తలపల్లిలో 8వ తరగతి పూర్తి చేశాడు. ఎరికల గోవిందు, రమణమ్మ దంపతుల కుమారుడు ఎరికల జస్వంత్(7) రెండో తరగతి పూర్తి చేశాడు. తోటి పిల్లలు వెంకటేష్, విజయ్, శివశంకర్, మురళితో కలిసి వీరు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సమీపంలోని దోశలకుంట చెరువులో ఈత కోసం బయల్దేరారు. అయితే వీరిని కుమ్మర గొర్ల పోతలయ్య అనే వ్యక్తి గమనించి చివాట్లు పెట్టి వెనక్కు పంపించారు. వీరంతా మరో మార్గం ద్వారా చెరువు వద్దకు చేరుకున్నారు. సోమవారం రాత్రి భారీ వర్షానికి చెరువులోకి వర్షం నీరు చేరి గుంతలన్నీ నిండాయి. చెరువు కట్ట నుంచి నీటిలోకి దిగే సమయంలో సాయికుమార్ కాలు జారి గుంతలోకి పడిపోతూ అరవడంతో.. అతడిని రక్షించడానికి వెళ్లిన జస్వంత్ కూడా మునిగిపోయాడు. మిగతా నలుగురు పిల్లలు భయపడి ఊరిలోకి వెళ్లి విషయం తెలపడంతో గ్రామస్తులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే సాయికుమార్, జస్వంత్‌లు నీటిలో ఊపిరాడక ప్రాణాలు విడిచారు. దీంతో రెండు కుటుంబాల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. -
అందివస్తారనుకొంటే...కడతేరారు !
తెనాలిరూరల్/కొల్లిపర, న్యూస్‌లైన్: విద్యార్థుల ఈత సరదా మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. చేతికి అంది వస్తున్నారనుకున్న కుమారులను నది రూపంలో మృత్యువు కబళించడంతో తల్లిదండ్రులు పుత్రశోకంతో తల్లడిల్లుతున్నారు. పేద కుటుంబాలకు చెందిన బాధిత తల్లిదండ్రులు కష్ట నష్టాల కోర్చి పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. మరి కొద్ది సంవత్సరాల్లో ఉన్నత స్థితికి చేరుకుని కుటుంబాలకు అండగా నిలుస్తారని ఆశపడుతున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. కొల్లిపర-మున్నంగి గ్రామ పరిధిలో వున్న కృష్ణానది రేవులో శుక్రవారం ఈత కొట్టడానికి దిగిన విద్యార్థులు మురళీధరరెడ్డి, జస్వంత్, అవినాష్‌లు కొద్ది నిమిషాల వ్యవధిలోనే మృత్యు ఒడికి చేరడం ఆయా కుటుంబసభ్యులను, తోటి విద్యార్థులను కలచివేసింది. మృతుల్లో ఒకరైన మున్నంగి గ్రామానికి చెందిన ఔతు మురళీధరరెడ్డి(17) వ్యవసాయ కుటుంబానికి చెందిన వాడు. తండ్రి వేణు మాధవ రెడ్డి వ్యవసాయం చేస్తూ భారమైనా కుమారుడు, కుమార్తెను ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివిస్తున్నాడు. తల్లి మాధవి గృహిణి. మురళీ విజయవాడలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివి, రెండో సంవత్సరం తెనాలిలో చదువుతానంటే కాదనకుండా చేర్పించారు. మరొకరు కమ్మ అవినాష్ చౌదరి(17). తెనాలికి చెందిన ప్లంబింగ్ కార్మికుడు కమ్మ వెంకటేశ్వర్లు కుమారుడు. పెద్దవాడైన అవినాష్‌చౌదరిని తన ఆర్థికస్థితి సహకరించకున్నా ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. పదో తరగతి వరకు తెనాలిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివించి, ప్రస్తుతం హైదరాబాద్‌లోని నెట్టూరు టెక్నికల్ ట్రైనింగ్ ఫౌండేషన్‌లో ఎలక్ట్రానిక్స్ విభాగంలో శిక్షణ ఇప్పిస్తున్నాడు. అవినాష్ తల్లి సుధారాణి గృహిణి.మరో మృతుడు కొండూరు జస్వంత్ అఖిల్(17) తండ్రి వెంకటేశ్వరరావు పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. 2011 వరకు తెనాలి వన్ టౌన్ స్టేషన్లో చేసిన ఆయన ఆ తరువాత రేపల్లెకు బదిలీ అయ్యారు. కుటుంబంతో ఇక్కడి కొత్తపేటలోని పోలీస్ క్వార్టర్స్‌లో నివసిస్తూ ప్రతి రోజు డ్యూటీకి వెళ్లి వస్తుంటారు. ఆయనకు ఇరువురు కుమారుల్లో అఖిల్ పెద్దవాడు, భార్య నాగమల్లేశ్వరి గృహిణి. రెండో కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు. పాఠశాల నుంచి మంచి మిత్రులు మురళీధర్‌రెడ్డి, అఖిల్, అవినాష్ ముగ్గురూ పదోతరగతి వరకు ఒకే పాఠశాలలో చదువుకున్నారు. అప్పటి నుంచి వారి స్నేహం కొనసాగుతోంది. ముగ్గురూ తమ ఇతర మిత్రులతో కలసి సంక్రాంతి సెలవులను ఉల్లాసంగా గడుపుతున్నారు. అఖిల్ అమ్మమ్మ ఊరు మున్నంగి కావడంతో స్నేహితులు మురళీధర్‌రెడ్డి, అవినాష్‌లు కలసి మరో ఐదుగురి మిత్రులను గ్రామానికి ఆహ్వానించారు. సాయంత్రం వరకు గ్రామ పరిసరాల్లో గడిపి, రేవులో ఈతకు దిగారు. మురళీ, జస్వంత్, అవినాష్‌ల ముందు రేవులో గుంత వుండడంతో మునిగిపోయారు. తోటి మిత్రులు బయటకు లాగేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు మృత్యువు పాలయ్యారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున తెనాలి జిల్లా వైద్యశాల మార్చురీకి తరలివచ్చారు. వైద్యశాల ఆవరణలో వారి రోదనలు మిన్నంటాయి. మృతులు ముగ్గురూ మూడు కుంటుంబాల్లోనూ ప్రథమ సంతానం కావడం గమనార్హం.