Bigg Boss 5 Telugu Elimination : బిగ్‌బాస్ అయిదో సీజన్లో మొదటి నుంచి ఆసక్తిగా సాగుతోంది. తొలి రోజు నుంచే కంటెస్టెంట్ల మధ్య గొడవలు ప్రారంభయ్యాయి. చిన్నపాటి విషయాలకు గొడవ పడుతూ వివాదానికి దారి తీస్తున్నారు. ఈ క్రమంలో ఫస్ట్ వీక్ జరిగిన నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా కొనసాగిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లే జాబితాలో జెస్సీ(జస్వంత్), రవి, సరయూ, కాజల్, మానస్, హమీదా ఉన్నారు. తొలివారం, తొలి ఎలిమినేషన్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది.
చదవండి: RC15 : రామ్‌చరణ్ ధరించిన ఈ కాస్ట్లీ వాచ్ ధరెంతో తెలుసా?
ఇంకా ఆదివారం రావడానికి మధ్యలో రెండు రోజులే ఉంది. దీంతో ఏ సభ్యుడు ఇంటి నుంచి బయటకు వెళ్లనున్నాడన్నది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు మోడల్ జెస్సీ(జస్వంత్) ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నాడంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటి వరకు అందరి కంటే తక్కువగా ఓట్లు జెస్సీకే వచ్చినట్లు తెలుస్తోంది.
చదవండి: Bigg Boss 5 Telugu: ఒక్క వారానికే రవి అంత తీసుకుంటున్నాడా?
అయితే మోడలింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి హౌజ్‌లో అడుగు పెట్టిన జెస్సీ తొలుత అమాయకంగా వ్యవహరించాడు. నామినేషన్ ప్రక్రియలో ఏడ్చి సింపతి కొట్టేశాడు. ఆ తర్వాత రాను రాను వివాదాస్పదంగా మారుతున్నాడు. అనీ మాస్టర్ అంటే గౌరవం అంటూనే ఆమెతో వాగ్వాదానికి దిగాడు. నిన్న జరిగిన ఎపిసోడ్లో ఆమెను కూర్చోనివ్వకుండా కాలు అడ్డుగా పెట్టి దురుసుగా ప్రవర్తించడంతో ఆమె లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకింది. ఈ విషయంలో తప్పు జెస్సీదే అని అందరూ అనడంతో క్షమాపణలు కూడా కోరాడు.
దీంతో నామినేషన్లో ఉన్న వారిలో జెస్సీ ప్రవర్తనే ప్రేక్షకులకి కాస్త విసుగు తెప్పించింది. దీంతో జెస్సీని ఈ వారం ఎలిమినేట్ చేస్తారని, అందులో డౌటే లేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. మరి అందరూ భావించినట్టుగానే ఈ వారం జెస్సీ ఎలిమినేట్ అవుతాడా? లేదా? తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే. కాగా గత సీజన్స్‌లో మోడలింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన కౌశల్, అలీ రెజా రాణించగా.. కౌశల్ అయితే ఏకంగా విన్నర్‌గా నిలిచాడు. కానీ ఈ సారి జెస్సీ మాత్రం తొలి వారమే ఎలిమినేట్ కాబోతున్నాడంటూ నెట్టింట వార్తలు హల్చల్ చేస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment